అఘాతం

కృష్ణ వేణి

కృష్ణ వేణి

మంగళవారం- 27న, జూలై నెలలో- సుప్రీమ్ కోర్ట్ ఒక 14 ఏళ్ళ రేప్ విక్టిమ్‌కి ఆశాకిరణాన్ని కనపరిచింది.
ఈ అమ్మాయి ఫెబ్రవరీ నెలలో టైఫాయిడ్ చికిత్స కోసం డాక్టర్ వద్దకి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆమెకి మత్తుమందిచ్చి, రేప్ చేసేడని ఆమె తండ్రి పెట్టిన పెటిషన్లో ఉంది. ఆమె విపరీతమైన కడుపునొప్పితో బాధ పడుతున్నా కూడా గర్భం అని ఎవరూ అనుమానించలేదు. అప్పటికే అమ్మాయిని డాక్టర్ బెదిరించడం వల్ల తను ప్రెగ్నెంట్ అని తనకి తెలియనంతకాలమూ ఆమె నోరు విప్పలేదు. అప్పుడు ఆమె 23 వారాల గర్భంతో ఉంది.
డాక్టర్ని అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టేరు.
పదవ తరగతి చదువుతున్న ఈ పిల్ల మొదట గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించింది. Medical Termination of Pregnancy Act, 1971 చట్టం ప్రకారం, తల్లి ప్రాణానికి ముప్పుంటే తప్ప 20 వారాల తరువాత medical termination of pregnancy కుదరదనీ ఆమె గర్భం మోసే తీరాలనీ హైకోర్ట్ తేల్చి చెప్పింది.
                                                     వీడియో చూడండి.
తన తల్లితండ్రుల ద్వారా అమ్మాయి వేసిన పిటిషన్లో, హై కోర్ట్ తనపట్ల “సానుభూతి” వ్యక్తపరిచింది తప్ప తనపైన జరపబడిన పైశాచిక చర్య వల్ల కలిగిన గర్భాన్ని అబార్ట్ చేయడానికి అనుమతి నిరాకరించిందని ఆమె పేర్కొంది. కోర్ట్ ఆమె ఆహారానికీ, పోషణకీ, మెడికల్ మరియు విద్యాసంబంధమైన అవసరాలకోసం నష్టపరిహారంగా లక్ష రూపాయలు గ్రాంట్ చేసింది.
“ఇది క్లిష్టమైన పరిస్థితి. బిడ్డ ఏ పరిస్థితుల్లో గర్భంలో పడినా కానీ, ఈ అమ్మాయి వేదన ఏదయినాకానీ- బిడ్డ కడుపులో పడిన బాధ్యత బిడ్డది కాదు. అమ్మాయీ, బిడ్డా ఇద్దరూ అమాయకులే.“ అని జడ్జ్ అభిలాషా కుమారి ప్రకటించేరు.
ఒకవేళ కనుక విక్టిమ్ పుట్టబోయే బిడ్డని పెంచి పెద్ద చేయలేకపోయినా లేక చేయదలచుకోకపోయినా, బిడ్డ దత్తతకి ఏర్పాట్లు చేయమని అధికారులకి ఉత్తరువు జారీ చేయబడింది.
‘ఇది అన్యాయం. తొమ్మిది నెలల గర్భం తరువాత ఆఖరికి బిడ్డని సరిగ్గా పెంచలేకపోయే నిస్సహాయ పరిస్థితిని భరించే ఈ కఠినమైన భౌతికమైన/ఎమోషనల్ గాయాన్ని తను ఎదుర్కోలేనని’ విక్టిమ్ చెప్పింది.
తన ఎడ్వొకేట్‍ అయిన కామినీ జైస్వాల్ ద్వారా పెట్టిన తన పి టిషన్లో ఆర్టికల్ 21 కింద ప్రత్యుత్పత్తి కరమైన ఎంపికలు కూడా వ్యక్తిగత స్వేచ్చకి ఒక పరిమాణమే అన్నవి ఆ అమ్మాయి మాటలు. “జీవితం” అంటే గర్భవతి యొక్క భౌతిక ఆరోగ్యం మాత్రమే కాక తన జీవితాన్ని సుఖంగా జీవించడానికి అవసరం అయిన సామాజిక/ఆర్థిక పరిస్థితులు, భౌతిక శ్రేయస్సు, భవిష్యత్తులో తన జీవితం మరియు మానసిన స్వస్థతా కూడా లెక్కలోకి తీసుకోవాలని ఆమె వాదించింది.
అప్పుడు తలెత్తిన ప్రశ్నలు-
చట్టబద్ధమైన అబార్షన్ కి సమయం అయిపోవడం వల్ల సెక్స్ నేరానికి గురైన అల్పవయస్కురాలు గర్భం మోసి బిడ్డకి జన్మనిచ్చి తీరాలని బలవంతం చేయడం సమంజసమైనదేనా?
ఒక పద్నాలుగేళ్ళ చిన్నపిల్లకి బిడ్డని కనమని చెప్పడం తీవ్రమయిన భౌతిక/మానసిక వేదనని కలిగించదా? అలాంటప్పుడు అమ్మాయి కనుక ఏ తీవ్ర నిర్ణయమో తీసుకుని ఏదైనా చేస్తే!
అవివాహితురాలు బిడ్డని కన్నదన్న కంళంకాన్ని ఆమె ఎందుకు మొయ్యాలి?
ఆ వయస్సులో అమ్మాయి శరీరం పిల్లలని కనడానికి సిద్ధంగా ఉందా? ఇప్పుడిక్కడ జరుగుతున్నదేమిటి? నైతిక నమ్మకాలని ఆ పిల్ల మీద రుద్దడమే కదా! ఇది మతం మీద ఆధారపడిన సిద్ధాంతాలు కాదా!
అప్పుడీ అమ్మాయి చదువాపేసి పిల్లని చూసుకుంటూ జీవితం గడిపేయాలా? పోనీ తండ్రి సహాయపడగలడా- అంటే అతను సైకిల్ టైర్లు రిపెయిర్ చేసుకుంటూ బతుకు వెళ్ళదీస్తున్నవాడే.
పదవ తరగతి చదువుతున్న అమ్మాయికి పెద్ద ఉద్యోగాలెవరిస్తారు? ఏ పాచిపనో చేసుకుంటూ గడపాలి తప్పితే!

ఆ తరువాత పిల్ల మొండిపట్టు పట్టి తన తండ్రి ద్వారా సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. అనేకమైన సున్నితమైన కేసులతో డీల్ చేసే సుప్రీమ్ కోర్ట్ సందిగ్ధావస్థలో పడింది.
రోజులు గడిచే కొద్దీ విక్టిమ్ ఎదుర్కునే ప్రమాదం కూడా ఎక్కువవుతోందని ఆమె అడ్వొకేట్ చెప్పేరు-28 జూలైన .
A R Dave మరియు జోసెఫ్ కురియన్ ల బెంచ్ ‘చట్టానికి ప్రతికూలంగా చేయడం ఏదీ ఇష్టపడం’ అని మొదటిసారి చెప్పేరు. అప్పటికా అమ్మాయి 23 వారాల గర్భంతో ఉంది.
కానీ మంగళవారం నాడు పిటిషన్ని విన్న తరువాత- గైనకాలజిస్టులూ, క్లినికల్ సైకాలజిస్టులూ కనుక అనుమతిస్తే ఆవశ్యకమైన సర్జరీ చేయవచ్చని ఆజ్ఞ జారీ చేసి నలుగురు సీనియర్ గైనకాలజిస్టుల పానెల్ ఏర్పాటు చేసింది సుప్రీమ్ కోర్ట్.
వారిలో ఒకరు అమ్మాయిని ముందు పరీక్షించిన డాక్టరే.
“నేను ఆమెని పరీక్షించి, తనతో మాట్లాడినప్పుడు అమ్మాయి మానసికంగా, సైకలాజికల్‌గా క్రుంగిపోయి ఉంది. బిడ్డని కనడానికి ఈ పిల్ల భౌతికంగా, మెడికల్‌గా కూడా సిద్ధంగా లేదు. చాలా బలహీనంగా ఉంది. ఈ వయస్సులో, ఈ పరిస్థితిలో- ఈ గర్భం ఆమె జీవితానికి తీవ్రమైన ముప్పు కలిగించవచ్చు. “- అన్నది జూలై 25న ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ . అప్పటికి అమ్మాయికి 24 వారాల గర్భం.
సుప్రీమ్ కోర్ట్ ఒక flexible ఆర్డర్ జారీ చేస్తూ అబార్షన్ అమ్మాయి జీవితానికి హితకరమైనదైతే కనుక ఆమె అబార్షన్ కి అనుమతిని ఇవ్వమని డాక్టర్ల టీముకీ, మానసిన వైద్యుడికీ నిర్ణయాన్ని వదిలిపెట్టింది.
చట్టప్రకారం తల్లి జీవితానికి ప్రమాదం అంటూ లేకపోతే కనుక 20 వారాల తరువాత అబార్షన్ అనుమతించదు చట్టం. అయితే అబార్షన్ కి ఉన్న లీగల్ టైమ్ బార్‌కీ, అమ్మాయి పడుతున్న మానసిక వేదనకీ మధ్య ఉన్న సంఘర్షణ వల్ల ఆమెని ఈ సామాజిక అపకీర్తినుంచీ బలవంతపు తల్లితనంనుంచీ ఎలా తప్పించాలా అని దవే మరియు కురియన్ల బెంచ్ ఆలోచించింది. అమ్మాయి కనుక బిడ్డకి జన్మనిస్తే, తనూ తన బిడ్డా ఎదుర్కోవలిసి వచ్చే పరిస్థితి గురించీ మరియూ తన జీవితం నాశనం అవుతుందన్న ఆ అమ్మాయి మాటలతోనూ బెంచ్ ఏకీభవించింది. తనకీ తన పుట్టబోయే బిడ్డకి ఎదురయే మృగ్యమైన భవిష్యత్తు గురించి అమ్మాయికి బాగానే తెలుసునన్నట్టుగా కనిపించింది.
“అమ్మాయి శ్రేయస్సే మాకు ముఖ్యం. ఆమెలో ఒక జీవం రూపుదిద్దుకుంటోందని మాకు తెలుసు. ఏదైనా చేయాలని అనుకున్నాం కనుకే, దారేదైనా దొరుకుతుందేమోనని మేమూ చూస్తున్నాం. అమ్మాయి మానసిక ఆరోగ్యం కూడా పరిగణించబడుతుంది కనుక ఒక క్లినికల్ సైకాలజిస్ట్‌ని కూడా పానెల్లో చేర్చాం” అని న్యాయమూర్తుల బెంచ్ చెప్పింది.
“ఈ అమ్మాయికి కూడా చదువుకుని తన కలలని నిజం చేసుకుని రాబోయే కాలంలో, మిగతాగా పిల్లలలాగే తనకీ ఒక కుటుంబం అంటూ ఉండే హక్కుందనీ మానవజాతీ, సమాజమూ కూడా ఈమెకీ ఇలాంటి ఏ అమ్మాయి/యువతికైనా తోడ్పడాలనీ న్యాయవాదులు చెప్పేరు.
కనీసం తనపైన జరిగిన అత్యాచారాన్ని వెనక్కి నెట్టి తన జీవితంలో సక్రమంగా ముందుకు సాగేలా అబార్షన్ సహాయపడుతుంది.
ఈ సంఘటన అనేకమైన ప్రశ్నలని లేవనెత్తుతుంది. సమాజంలో వ్యక్తి యొక్క జీవితం/స్వేచ్ఛకీ ఎదురుగా చట్టం యొక్క పాత్ర, సమాజపు నైతిక విలువలు-ఇవన్నీ కూడా. ఒక ఆధునిక సమాజంలో ప్రతీదీ ఒక వ్యక్తికి తనకిష్టం వచ్చినట్టుగా జీవించే విధంగా సహాయపడాలి. ఈ సందర్భంలో ఏర్పాట్లూ, నియమాలూ, డాక్టర్లూ అందరూ/ అన్నీ కూడా అమ్మాయికి సహాయపడ్డానికి సానుకూలపడ్డాయన్నది ఆహ్లాదకరమైన విషయం .

“Childhood should be carefree, playing in the sun; not living a nightmare in the darkness of the soul.”
― Dave Pelzer, A Child Called “It”

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, వ్యాసాలుPermalink

17 Responses to అఘాతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో