ఒడిసిపట్టిన చిత్రాన్ని నేను!(కవిత) – విజయ భాను కోటే

Olympus Pen E-P1 fitted with a Canon 50mm F1:1.4 SSC lens and Fed viewfinder.

Olympus Pen E-P1 fitted with a Canon 50mm F1:1.4 SSC lens and Fed viewfinder.

అక్షరాలు ఎన్ని భావాలను వ్యక్తీకరిస్తాయో నాకు తెలీదు.
నేను మాత్రం నీ కళ్ళలో మైమరపును నింపడానికే పుడతాను.
ఇంద్రధనుస్సును సవాలు చేస్తూ…
వేల వర్ణాలను నాలో నిక్షిప్తం చేసి…
నీ మనసులో తిష్ట వేసేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను.
నీ ఒక్క నవ్వును…
నీ కంటి నుండి జారే ఒంటరి కన్నీటి చుక్కను…
నీ పెదవి విరుపునూ…
నువ్వు పెంచే మొక్కకు పూసిన మొదటి పువ్వునూ…
ఆకాశంలో ఎగిరే చిన్ని పక్షి రెక్కనూ…
ఒక్కలాగే స్వీకరిస్తాను…
నీ ప్రపంచంలో ఉన్న ప్రతి అందాన్నీ…
నీలో కలిగే మార్పుకు ప్రతీకగా నిలిచే ప్రతి వికృతినీ…
నీ అంతః చేతననూ…
best-photography-2011-1ఒళ్ళు విరుచుకున్న ప్రకృతి రమణీయతనూ…
ఒక్కలాగే స్వీకరిస్తాను…
నిజం!
నన్ను నమ్ము…
ఒక్క కౌగిలి…
ఒక్క బంధనం..
నిజానికి అది నా చుంబనం!
నీ రోమాలు నిక్కబొడుచుకోవచ్చు…
నీ ఆలోచనలు మారవచ్చు…
నీ కళ్ళు  చెమర్చొచ్చు…
నీ చిరునవ్వుకో…
నీలో ఒక విస్ఫోటనానికో…
నేను కారణం కావచ్చు!
నన్ను నమ్ము…
నీ చేతుల్లోనే రూపు దిద్దుకున్న దర్పణాన్నే అయినా…
నా ప్రతిబింబాలకు నువ్వు అచ్చెరువొందక ఉండలేవు!
వైచిత్రిని ఒడిసిపట్టిన చిత్రాన్ని నేను!

(ఫోటోగ్రఫీ దినోత్సవం- ఆగష్టు 19)

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో