గౌతమీగంగ(ఆత్మకథ) – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

పల్లవి॥ మది పొంగుచు నీవిట జనుమా దయగొనుమా కృపగనుమా జయా మంగళ హారతీ గొనుమా.

1. భృంగవేణి మృదుసై కత శ్రేణీి। రంగనాయకుని పట్టపు రాణీ
మంగళాంగి తరుణాంగజ జననీ। ఇంగితమెరిగిన కొమ్మా వడిరమ్మా లేలెమ్మా ॥జయ॥
2. నీదు కృపామృత వృష్టియు చేతా। నెగడు జగమ్ముల సృష్టియు మాతా
లేదుమి కన్యా యిభువి సీతా। వాడు లేలనే మాతా శిఖి భూతా
భూజాతా జయ మంగళ హారతిగొనుమా॥
3. తొల్లి దేవతల గర్వముఉడుగా బల్లిదు రావణుగర్వమునణచి పిల్లవైతి వోరామా। ముఖసోమా ।గుణధామా। జయ మంగళ హారతి గొనుమా॥
4. అక్షయ కరుణాకటాక్ష వీక్షణ।దీక్షిత దాసావన శ్రితరక్షకి రాక్షసలోకా నాకవి పోషణి ।
రాజసమేలనె మాత। శిఖిపూతా। భూజాతా॥ జయా॥
అనే నరసాపురవాసుడైన వర్థమాన హరిదాసు పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసుగారి హరికథలోని పాట బాలికలకు నేర్పేవారు.

సూర్యనారాయణ దాసు గారు పురుషోత్తం గారి సహాధ్యాయి నరసాపురంలో. తరువాతి కాలంలో వారు హరిదాసుగా ఆంధ్రదేశంలో బాగా విఖ్యాతి పొందారు. వారి తండ్రి గారు రంగనాయకులు గారు, వీరి తల్లి సీతమ్మ గారు వారిరువురకు అంకితంగా దాసుగారు ఈ పాట వ్రాసారు.

సీతమ్మ గారు తాము చిన్న నాటి పాఠశాలలో నేర్చిన
చిగర్చవే। చిగర్చవే చిగురు మామిడీ।
నేనెట్లు చిగురిస్తూ చిలకల్ల చేత?
చిలకల్లు మాయింట బాలపాపల్లు।
పూయవే।పూయవే పూత మామిడి
నేనెట్లు పూతును కోయిలల చేత?
కోయిలలు మాయింటి బాల పాపల్లు।
కాయవే కాయవే తియ్య మామిడి।
నేనెట్లు కాతును పావురాల చేత।
పావురాలు మా ఇంటి బాల పాపల్లు
పండవే పండవే పండు మామిడి।
నేనెట్లు పండుదును హంసల్ల చేత
హంసల్లు మా ఇంటి ఆడబిడ్డల్లు
అన్న గేయాన్ని తన శిష్యురాండ్రకు నేర్పి

ప॥ గొబ్బియళ్ళో। గొబ్బియళ్ళో। మొక్క మొక్క మొలచిందట
ఏం మొక్క మొలచిందంటా । రాజావారి తోటలోనూ
జామి మొక్క మొలిచిందట।
జౌనటోలక్కల్లారా। చంద్రగిరి భామల్లారా। భావనగిరి గొబ్బిళ్ళు
1. మొగ్గ మెగ్గ తొడిగిందట, ఏం మొగ్గ తొడిగిందట।
చంద్రగిరి భామల్లారా। భామనగిరి గొబ్బిళ్ళు ॥గొబ్బి॥
2. పువ్వు పువ్వు పూసిందట ఏం పువ్వు పూసిందట।
రాజవారి తోటలోన జామి పువ్వు పూసిందట.
జౌనటోలక్కల్లార చంద్రగిరి భామల్లారా
భామనగిరి గొబ్బిళ్ళు।
3. పిందె పిందే వేసిందట। ఏమి పిందె వేసిందట।
రాజమండ్రి కూజలోనా జామి పిందె వేసిందట ॥జౌన॥
4. కాయ కాయ కాసిందట। ఏమి కాయ కాసిందట ॥జౌన॥
రాజావారి తోటలోన జామికాయకాసిందట ॥జౌన॥
5. పండూ పండూ పండిరదట ఏమి పండు పండిదట

రాజమండ్రి కూజలోన జామిపండు పండిరదట ॥జౌన॥ఈ పాటలో ఓ సారి రాజావారి తోటలోన అనీ, ఓ సారి రాజామండ్రీ కూజాలోనా అని రావడం చమత్కారం.
సీతమ్మ గారు ఈ పాట నేర్చుకొని బాలికలతోపాటు తాముపాడేవారు.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో