జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

అతనికి ధన్యవాదాలు తెలిపి తన పర్సులోంచి వందరూపాయలు ఇవ్వబోయింది విద్య. అవి తీసుకోవడానికి నిరాకరించాడు లింగన్న.

” అక్కా మీరేదన్నా సాయం జేయాలనుకుంటే మా కింత ఆసరా ఇయ్యాల్ననుకుంటే నా ఒక్కనికి గాదు, మా పోతురాజులందరికీ జెయిన్రి… జోగోళ్ళకు మదిల బెట్టుకొని ఆలోచన చేసినట్టే మా గురించి జర ఆలోచన చేయండి. చింత చేయున్రి. పోతురాజు తనం మాకు మంచిగ గొడ్తలేదు” అన్నాడు ఆవేదనగా.

”సరే…’అమ్మ’తో మాట్లాడతాను అని లింగన్నకి, లస్మవ్వకి కృతజ్ఞతలు తెలిపి రజని, అంజయ్యలతో బయలుదేరింది మరో గ్రామానికి.
అక్కడ మల్లమ్మది వ్యధాపూరిత గాధ.

ఆ వృద్ధ జోగిని కడుపు కోత వర్ణనాతీతం. జోగినీగా ఎన్నెన్నో కష్టాలు అనుభవించిన ఆమె, ఎన్నో అవమానాలు, అవహేళనలు మౌనంగా భరించిన ఆమె, పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని దక్కించుకోలేక పోయినందుకు ఈనాటికీ కుమిలిపోతోంది. చెట్టంత ఎదిగిన కొడుకుని కళ్ళ ముందే మంత్రగాడనే నెపం వేసి ఆ ఊరి దేశ్‌ముఖ్‌ సజీవదహనం చేస్తే ఏమీ చేయలేక పోయింది. ఊరంతా తప్పు ఎవరిదో తెలిసీ సహించడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతను చేసిన నేరం దొరను, దొరతనాన్ని ప్రశ్నించడమే. మంచె మీద జొన్న కావలి కాస్తున్న నా కొడుకును అట్లనే కాలబెట్టిన్రు. పట్టపగలు రగిలిన కాష్టం సూడలేక జొన్న చేన్ల పిట్టలుకలకల జేసినయ్‌. కొడ్కా నా కొడ్కా… చెట్లమీది కాకులుబగులుతోని ఎగిరిపోయినయి కొడ్కాపానాలు ఆ మంటలకనే మసైపోయినయ్‌ కొడ్కా.. నేనేట్లా బతకాలె కొడ్కా…” అంటూ ఒక శోకం పెట్టింది. వీళ్ళను చూసి కొంగు తీసి కళ్ళు తుడుచుకుంది.

ఈ సంఘటన తెలిసిన ఆ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్‌ కలెక్టరుకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాడు. ఆ కడుపు కోత తట్టుకోలేని ఆ తల్లి ఏదైతే అది అవుతుందని తెగించి తమ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా ఆనాటి జిల్లా కలెక్టర్‌ ఆశామూర్తికి లేఖ పంపింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించింది. ఆ దురాచారాన్ని చూసి తీవ్రంగా చలించింది. స్పందించింది. జోగినీల వివరాలు సేకరించింది. పారుగింటి ఎల్లవ్వ చెప్పింది విద్యతో.

జోగినీలకు ఏదైనా చేయాలని, వారి జీవితంలో మార్పులు తేవడానికి సాధ్యమైనంత కృషి చేయాలని 1986లో అనేక కార్యక్రమాలు చేపట్టిందావిడ. బోధన్‌ డివిజన్‌లో ఉన్నజోగినీలను వాళ్ళ ఇళ్ళనుండి తరలించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కాలనీలలో నివాస వసతి కల్పించారని ఎల్లవ్వ కూడా దాదాపు ఆరు నెలల పాటు ఆ కాలనీలో ఉందని, అప్పడాల తయారీలో శిక్షణ పొందిందని తెల్సుకుంది. కొందరు జోగినీలు టైలరింగ్‌లో శిక్షణ పొందారని, వారికి కుట్టు మిషన్‌లు, కొందరికి పాడిగేదెలు ఇచ్చి, మేకలు ఇచ్చి జీవనోపాధి కల్పించింది ఆనాటి జిల్లా యంత్రాంగం.

జనజీవనంలో నుంచి జోగినీలను విడదీసి ప్రత్యేకంగా నివాసం ఏర్పరచడం వల్ల ప్రభుత్వం, జోగినీలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరు నెలల పాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటు కష్టపడి పని చేయడం అలవాటు లేని తమకు ఇచ్చిన మేకలు, బర్రెల పెంపకం అసలే తెలియని ఈ జోగినీలు వాటిని అమ్ముకున్నారు. మళ్ళీ పాత జీవనానికి అలవాటు పడ్డారు. మరో వైపు నుండి కొందరు ప్రభుత్వాధికారులు, పోలీసులు కూడా జోగినీ స్త్రీలను వాడుకున్నారు. వారి శరీరంతో వ్యాపారం చేసుకున్నారు. తమ పై అధికారుల అవసరాలు తీర్చమని వేధించారు. తప్పని చెప్పిన వాళ్ళే దొడ్డిదారిన తమని ప్రోత్సహించడంతో పాత విధానంకే అలవాటు పడ్డారు. కొందరు జోగినీలు అయితే విటుల వేట, వ్యభిచారానికి అలవాటు పడ్డారు. పండుగలకు ఇనాం మాత్రమే కాకుండా ఊళ్ళోకి వెళ్ళి అడుక్కోవడం విని విస్తుపోయింది విద్య.
ఒక అధికారి చిత్త శుద్ధితో ఉంటే సరిపోదు. మిగిలిన వారంతా ఆ అధికారిని అనుసరించి సవ్యంగా, సక్రమంగా పని చేయాలి. అంటే వారిలో కొంత సేవా దృష్టి ఉంటేనే అది సాధ్యమౌతుంది. లేదంటే స్వార్ధచింతనతో ఆ కార్యక్రమ ఉనికికే మోసం వస్తుంది. ఇలాగే అబాసు పాలవుతుంది అనుకుంది విద్య. ఒక అధికారి చిత్తశుద్ధితో ఉంటే సరిపోదు. అదే గ్రామంలో ఉన్న గంగామణిని కలిసి మరిన్ని వివరాలు సేకరించింది.

గంగామణి మంచి అందగత్తె. వయస్సులో ఉన్నప్పుడు ఊళ్ళో వాళ్ళతో పాటు ప్రభుత్వ అధికారులు అంతా ఆమెను వాడుకున్న వాళ్ళేనంది. అప్పుడు డబ్బుకి తాను బాధపడలేదంది. రోజులు ఆనందంగా గడిపేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన రోగాలతో ముప్పై ఏళ్లకే ముసలి దానిలా అయిపోయానని వాపోయింది.

‘అమ్మ’తో ఉన్న అనుబంధం గురించి తెల్సుకోవాలని ఆ విషయమే అడిగింది విద్య.

”అక్కా.. ఖరా చెప్పాల్నంటే మా ఇంట్లకు ఎవల్లు అడ్గు పెడ్తలేరు. ఆల్లరోగాలు నాకంటిచ్చిన్రు గద. గిప్పుడు నా రోగాలు ఆల్లకేడ అంటుతయ్యేమోననవి, గీ భీమార్లు అయిన కాడికెల్లి నేను ఇంట్లనే ఉంటున్న. అగ్గో… గప్పుడు అమ్మ, అన్నయ్యలు మా ఇల్లు ఎతుక్కుంట అచ్చిన్రు. నిలవెట్టున్న నుల్క మంచం ఆల్చుకుని కూసున్నారు. మా ఇంట్ల మంచినీల్లు అడిగి నాతోని ఇప్పించుకొని తాగిన్రు. ఇక నేనేమంట. ఊర్ల దొరలకు, ఈల్లకు ఎంత ఫరకున్నది..? మా ఇంట్లోల్ల లెక్క అచ్చి మా తోని కూసున్నరు. ముచ్చట బెట్టిన్రు. మా చేతి నీల్లు తాగిన్రు. మేమంటే ఆల్లకు అంటుడు లేదు. ముట్టుడు లేదు. ఆల్లతోటి సమానం చూసిన్రు. గసాంటోల్లు మా కోసరం, మా మంచి కోసరం చెప్తున్నరని ఇనంగఇనంగ మాకు సమజ్‌ అయింది. ఆల్ల మాట ఇని, చెప్పినట్టు జేసి మా బతుకులు దిద్దుకుంటున్నం.’
ఉద్వేగంగా గంగామణి

”గంగామణి నీవేమనుకోకుంటే ఓ విషయం”?
గంగామణినీ అక్కడ ఉన్న వారినీ ఉద్దేశించి చూస్తూ విద్య
”నాకు ఎర్క ఉన్నంతజెప్త… అడ్గక్కా.”

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో