ఎనిమిదో అడుగు-38 (ధారావాహిక ) – అంగులూరి అంజనీ దేవి

స్నేహితకి ఉద్యోగం దొరికింది.
అదేమిటంటే వివిధ కారణాల చేత పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులు ‘‘అమ్మకడుపు’’ను అద్దెకు తీసుకొని, ఆ అద్దె కడుపు అమ్మాయిని ఒకమంచి గార్డియన్‌ దగ్గర వుంచుతుంటారు. అలాంటి వాళ్లకు గార్డియస్‌గా వుండడమే స్నేహిత ఉద్యోగం. మంచి జీతం ఇస్తున్నారు. ఎక్కువగా విదేశీయులే హైదరాబాద్‌ వచ్చిపిల్లల్ని పుట్టించుకొని తీసికెళ్తుంటారు. అలా పిల్లల్ని కని ఇచ్చే తల్లుల్ని సర్రోగేట్‌ మదర్స్‌ అంటారు. స్నేహిత వాళ్లకి తోడుగా వుంటూ, బిడ్డను వాళ్లు కడుపులో మోసినన్ని రోజు జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్లు టైంకు తినేలా చూసుకుంటు వుంటుంది. అంతేకాదు. మందు, పోషకాహారం, మెడికల్‌ చెకప్పులు ప్రసవ సమయం వరకు సరిగ్గా అందుతున్నాయా లేదా అని చూసుకుంటుంది. ఈ పని ఆమెకు చాలా తృప్తినిస్తోంది.

అందుకే ఒకరోజు కాత్యాయనితో ‘‘బామ్మా! పిల్లలు కావానుకునేవాళ్లు మానసికంగా ఎంత బాధపడ్తారో ఆ బాధ నాకు తెలు సు. అలాంటి వాళ్లకు నా సహకారం ఏ మాత్రం అందినా సంతోషమే… అదీ కాక వాళ్లు నాకు, నా బిడ్డకు షెల్టరిచ్చి, పోషించి, తగినంత జీతం ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు! ఇదంతా నీ వల్లనే వచ్చింది.’’ అంటూ కృతజ్ఞతలు తెలుపుకొంది స్నేహిత.
చేతన, స్నేహితకి ఏదో ఒక సమయంలో కాల్‌ చేసి మాట్లాడుతోంది.

ఆదిత్య మాత్రం స్నేహితను ఒంటరి తనంలో ఇరుక్కోకుండా చెయ్యాలని ` దాశరధి రంగాచార్య రాసిన 4 వేదాలు , బాబా రాందేవ్‌ రాసిన యోగా, ప్రాణాయామం బుక్స్‌, రవిశంకర్‌ రాసిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ బుక్‌, ఇంకా భారతం, భాగవతం బుక్స్‌ని కొరియర్‌లో పంపి చదవమంటున్నాడు. ఖాళీ సమయంలో ఆమెకు ఆ పుస్తకాలను చదవటం గొప్ప వూరట నిస్తోంది.

… కొద్దిసేపు కాత్యాయని బామ్మతో మాట్లాడి వద్దామని ఓల్డేజ్‌హోంకి వెళ్లింది స్నేహిత. ఎదురుగా రామేశ్వరి కన్పించటంతో ఆమె దగ్గరకి వెళ్లి కూర్చుంది. రామేశ్వరికి స్నేహిత అంటే పడకపోవడం వల్ల ముఖం అదోలా పెట్టుకొంది…. కనీసం పకరించలేదు. కొద్దిసేపు కూర్చుని విసుగు పుట్టి….

‘‘రామేశ్వరి బామ్మా! నన్ను పల =కరించవా?’’ అంది స్నేహిత ఏ మాత్రం మొహమాటం లేకుండా
రామేశ్వరి స్నేహిత వైపు వెక్కిరింపుగా చూసి ‘‘ఎలా పల కరించాలి? మహాభారత యుద్దానికి ముందు పోరులో తమ పక్షాన వుండమని కోరటానికి వచ్చిన దుర్యోధనుడిని ఉద్దేశించి, ‘బావా ఎప్పుడొచ్చావు? నీ తమ్ముళ్లు, పిల్లలు , చుట్టాలు నిన్ను రాజుగా కొలిచే కర్ణుడూ, మహారాజు దృతరాష్ట్రుడు, మీ వంశ క్షేమాన్ని కోరే భీష్మాచార్యు వారు మిా మంచి కోరే ద్రోణాది గురుదేవు అందరూ క్షేమమేనా అని శ్రీకృష్ణుడు పలకరించినట్లా! అయినా నీకు ఎవరున్నారు పల కరించటానికి? వున్న ఆ ఒక్కడు ఎవరికి పుట్టాడో తెలియదు. మొగుడ్ని వదిలేసి బయటపడ్డావ్‌!’’ అంది ముఖం మిాద కొట్టినట్లు.. ఆ తర్వాత కుర్చీలోంచి లేవబోయింది.

‘‘టకీ, టకీ మని మాటతో ఎంత బాగా కొడతావే బామ్మా! లేవకు కూర్చో! నీతో మాట్లాడాలి….’’ అంటూ ఆమె రెక్కపుచ్చుకొని కుర్చీలో కూలేసింది.
ఏముంది నీ దగ్గర నాతో మాట్లాడటానికి అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది రామేశ్వరి.

‘‘బామ్మా! నీది ఒక మారుమూల పల్లెటూరు. పిల్ల సంపాదన పయి కావటంతో, వాళ్లమిాద కేసు వేసి డబ్బు గెలుచు చుకొని ఆ డబ్బుతో హాయిగా ఈ ఓల్డేజ్‌ హోంలో వుండగలుగుతున్నావ్‌! ఈ వయసులో నీ గురించి నువ్వు ఇంత బాగా ప్లాన్‌ చేసుకోగలిగినప్పుడు ఎవరైనా నీలాగే వుంటారని ఎందుకు అనుకోవు? ప్రతి దాన్ని విమర్శిస్తూ ఎందుకు ఆలోచిస్తావు?’’ అంది స్నేహిత.
‘‘నేనెప్పుడైనా విమర్శించానా? ఎవర్ని విమర్శించానో చెప్పు? వుత్తుత్తి అభాండాలు నా మిాద వెయ్యకు’’. అంది ఉరిమి చూస్తూ రామేశ్వరి.

‘‘మిా స్నేహితురాలు నాగరాణి 1970లో వీరక్ష్మిని ఎలా కన్నదో మిా అందరికి తెలుసు. అప్పుడు అందరికన్నా నువ్వే ఎక్కువగా నాగరాణిని పొడిచేదానివట, విన్నాను. పాపం! ఆమె చేసిన తప్పేంటి? ఒక మారుమూ పల్లెటూర్‌లో వుంటూ భర్తతో తనకి పిల్లలు కలగక, గొడ్రాలు అన్పించుకోలేక పక్కింటి మార్తాండునితో ఒక్క రోజు కలిసి ఓ బిడ్డను కంటే మిారంతా బుగ్గలు నొక్కుకున్నారు. అంత మాయరోగం ఎందుకే మిాకు? అలా అని ఆమెను నేను సపోర్టు చెయ్యటం లేదు. కానీ ఒక స్త్రీ మాతృత్వం కోసం ఎంతగా తపిస్తుందో తెలియదా మిాకు? పైగా నైతికత అంటూ ఓ పెద్ద లెక్చర్లిస్తారు.

నైతికత అంటే కొందరు ప్రభుత్వ అధికారులు అవినీతిపరుల్ని సస్పెండ్‌ చేసి వెంటనే పోస్టింగు ఇవ్వటమా? ఎక్కడ ఏ అవకాశం దొరికినా అందినంత లాక్కుంటూ రికవరీలు లేని ఇళ్ల కుంభకోణాల మిాద నామమాత్రపు తనిఖీలు చేస్తూ కోట్లు మెక్కి లక్షలు కక్కటమా? సత్తాను బయట పెట్టేందుకే పరీక్షలు అయినప్పుడు కోట్ల రూపాయల కు అమ్ముడు పోయి, వాటి తాలుకు ప్రశ్నా పత్రాలను లీక్‌ చెయ్యటమా? పిల్లల చదువు కోసం నిర్మించిన బడులు క్రమంగా అక్రమార్కుల చేతిలో అంతర్థానం కావటమా? తల్లిదండ్రుల చెడు అవాట్లుకు బానిసలై పిల్లల్ని పనికి మాలిన వాళ్లను చెయ్యటమా ఏది నైతికత? నేను చెబుతా విను.

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో