స్నేహిత అమ్మా, నాన్న అక్కడ లేకపోవటం చూసి, మనవరాలి దగ్గర కూర్చుని ‘‘స్నేహితా! నువ్వు ఈ వయసులో మనిషికి వుండాల్సిన కోరికకి అతీతంగా, కేవం అరోప్ కోసం బయటకి రావటం నాకెందుకో నచ్చటం లేదు. ఇలా వచ్చే ముందు నువ్వు కాస్త ఆలోచించాల్సింది.’’ అంది గోమతమ్మ బాధపడుతూ.
‘‘ కేవం అరోప్ కాదు బామ్మా! అరోహే నా జీవితం! నువ్వన్నట్లు కోరికలనేవి రంపంలా పరపరాకోసి మనిషిని బాధపెడ్తూ, మనసును చీుస్తాయి. కానీ నాలో అలాంటి రంపపు కోరికు లేవు. ఒకవేళ వున్నా వాటిని నేను జయిస్తాను. కడుపు తీపిని మించిన తీపి వుంటుందా? అయినా నా మనసును అర్థం చేసుకోలేని వాళ్ల దగ్గర వుండి నేనెంత బాధపడినా, సర్దుకుపోయినా ప్రయోజనం ఏమిటి చెప్పు!
ఇతయి నా మిాద జాలిపడినా పర్వాలేదు. నా మిాద నేను జాలిపడే విధంగావుండకూడదనుకున్నాను…. అసు కోరిక ఎప్పుడు కుగుతుందో తొసా బామ్మా! మనం ప్రశాంతంగా వున్నప్పుడు, మనసుకినచ్చినప్పుడు, ఇది లేకుండా ఇంత వెలితిని నేను భరించలేను అని అనుకున్నప్పుడు… అంతేకాదు. ఒక కోరిక తీరితేనే ఇంకో కోరిక పుట్టేది. అదేదీ లేనప్పుడు, అది పుపు, ఇది తీపి అని తెలియనప్పుడు కూర వాసన తెలియని గరిటలాగే వుంటుంది. ఎందుకు భాదపడ్తావ్! వూరుకో బామ్మా!’’ అంటూ బామ్మను దగ్గరకు తీసుకొని ఓదార్చింది స్నేహిత.
స్నేహితను చిన్నప్పటి నుండి ఆత్మీయంగా పెంచటం వ్ల గోమతమ్మకి కన్నీళ్లు ఆగటం లేదు.
స్నేహిత అమ్మా, నాన్న అప్పటి వరకు బయట నిబడి ఏం మాట్లాడుకున్నారో ఏమో కూతురి దగ్గరకి వచ్చి కూర్చుంటూ…. ‘‘స్నేహితా! కొద్ది రోజు అరోప్‌ను మేము తీసికెళ్తాం నువ్వు ఈ లోప ఏదైనా పని వెతుక్కో, ఆ పనిలో పడితే నీక్కాస్త ప్రశాంతత వస్తుంది. కాత్యాయని బామ్మ తోడు ఎప్పటికీ వుంటుంది. భయపడకు. అవసరమైతే ఫోన్ చెయ్యి. తమ్ముడు ఇక్కడే వున్నాడు కదా! నీకే మాత్రం ఇబ్బంది అన్పించినా వాడితో ఓమాట చెప్పు, ఇక్కడ నీకు ఏం కావాన్నా వచ్చి ఇచ్చి వెళ్తాడు.’’ అన్నారు.
వాళ్ల మాటు వింటుంటే స్నేహితకి ఇప్పుడు తనొక కొమ్మను ఒక చేత్తో మాత్రమే పట్టుకొని వేలాడుతుంటే ఆ కొమ్మ వంగి ఇంకో చేతికి అందినట్లు అన్పించాయి. వీళ్లు తన వాళ్లు కాబట్టే కదా ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఆత్మస్థయిర్యాన్ని పెంచుతున్నారు. ఇలాంటి మానవ సంబంధాు కావాలి మనిషికి… ఇది లేని జన్మ వృధా! అని మనసులో అనుకుంటూ కృతజ్ఞతగా చూసి….
‘‘అరోప్ లేకుండా నేనుండలేను, నేను ఒంటరిగా కూర్చుని ఏడ్చినప్పుడు ప్రేమతో నా కన్నీళ్లు తుడిచేది వాడే! తుడిచే వాళ్లే లేనప్పుడు కనీళ్లకు కూడా మివ వుండదు. వాడే లేకుంటే ఆ గొడ్రాలి బ్రతుకును ఒక్కక్షణం కూడా కొనసాగించగలిగేదాన్ని కాదు. ఎప్పటికైనా నా అనే మనిషి అరోహే! వాడు నా ఒడిలో పూసిన పువ్వు. అటువంటి అరోప్‌కి అమ్మ ప్రేమను దూరం చెయ్యను. ఇప్పుడు నేనే వాడికి బమైన లిఫ్ట్! ఎక్కినమెట్లు చాు. ఇక నేను ఎక్కగను అనేంత వరకు వాడి చెయ్యి నా చేతిలోనే వుండాలి. అందుకే బయటకొచ్చాను. ఇలా వస్తే వుండే ఒడిదుడుకు, ఇబ్బందు నాకు తొసు. అయినా వచ్చాను అంటే వాడు నాకెంత ముఖ్యమో అర్థం చేసుకోండి! అరోప్ నాకు ఏ విషయంలో కూడా అవరోధం కాడు. అలా నన్ను నేను సంసిద్ధం చేసుకున్నాను…. మన చుట్టూ ఎందరున్నా ఒంటరిగా వుండొచ్చు. ‘ఎక్స్‌క్యూజ్‌మి! నా మనసులోంచి రెండు నిమిషాు బయటకెళ్లి రాగరా! నాకు ఏ కాంతం కావాలి’ అని కూడా అనవచ్చు… కానీ ఇది మనదీ అనుకున్న ఆత్మీయమైన స్పర్శకు, ఆత్మీయమైన ఆలోచనకు దూరంగా వుండటం దుర్భరం….’’ అంది స్నేహిత.
వాళ్లు స్నేహిత మాటల్ని సీరియస్‌గా వింటున్నారు. ఇంకా ఏం చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు.
‘‘అరోప్ పుట్టుక గురించి వస్తున్న ప్రచారాను విని కూడా మిారు కడుపులో పెట్టుకొన్నారు. దానికి కారణం నేను మిా బిడ్డనన్న బమైన ఫీలింగ్. నేను అరోప్‌ని సహజ సిద్ధంగా కనలేదు. ఏ అనుభవం, అనుభూతి అందకుండా వైద్య పరిజ్ఞానం ద్వారా తల్లిని అయ్యాను. ఒక విధంగా వాడికి నేను బైపాస్ మదర్‌ని. అంటే! వెళ్లవసినరీతిలో వెళ్తే గమ్యం రాదని తెలిసి బైపాస్ రోడ్డు మిాద వెళ్లి గమ్యం చేరుకున్నాను. ఇప్పుడు అరోప్ నా గమ్యం. ఒకప్పుడు అనుకునేదాన్ని. ఇది అనుభూతితో చెయ్యని పని కాబట్టి అద్దె పనిలాగే వుంటుందేమో! వీడికి నేను తల్లిని కాలేనేమో అని … కానీ ఇప్పుడు నిజంగానే నేను వీడికి తల్లిని. వీడు నా కొడుకు. అందరు త్లు లాగే నేను ఫీవుతున్నాను.అనుభూతూల్ని చంపుకొని నేను బ్రతుకలేను.’’ అంది స్నేహిత ఆమె మాటల్లో ఆవేశం లేదు. ఆవేదన లేదు. ఇదీ నా జీవితం అని బ్లగుద్ది చెప్పినట్లు స్థిరంగా చెబుతోంది.
చలించి పోయింది గోమతమ్మ…తన కళ్ల ముందే పుట్టి, పెరిగిన తన మనువరాు ఆకాశంలో సగమై కన్పిస్తోంది.
నిజమే! మనిషి జీవితమే అనుభూతు పుట్ట. దాన్నిండా వుండే అనుభూతు పాము కావచ్చు. చలి చీము కావచ్చు అసలేమి లేకుండా కూడా వుండొచ్చు. అంతేకాని అనుభూతు అనేవి అద్దెకి దొరికే వస్తువు కావు. అలా దొరికితే ఈపాటికి ‘‘అద్దెకో అనుభూతి’’ అంటూ కోట్ల రూపాయ పెట్టుబడుతో వ్యాపార సంస్థు వెలిసేవి. సాఫ్ట్‌వేర్ కంపెనీు పుట్టేవి. వేకోట్ల ఆదాయాను గడిరచేవి… అయినా ఆలోచను అత్యుత్తమంగా వుండాలి కాని మనిషిలోని పోలికు మార్గ నిర్దేశాు అవుతాయా? అరోప్ పోలికు గురించి అన్ని చర్చు, అన్నన్ని సమావేశాు అవసరమా? ఏ రకంగా చూసినా స్నేహిత చేసింది తప్పు కాదు. రాజు రాతి పకాపై శాసనాు రాస్తే భగవంతుడు మానవహృదయాపై రాస్తాడు. దాన్ని ఆ భగవంతుడే చదవగడు. ఆ చాతుర్యం ఆయనకే వుంది. మనమెంత? మన శక్తి ఎంత? అని మనసులో అనుకుంటూ ఇక బయుదేరుదామా అన్నట్లు కోడలివైపు చూసింది గోమతమ్మ.
అంతవరకు కూతురు చెప్పేది వింటూ బాధపడ్తూ, కన్నీళ్లు పెట్టుకుంటూ వున్న స్నేహిత తల్లి విజయక్ష్మి ‘‘అత్తయ్యా! నేను ఇక్కడే వుంటాను మిారు, మిా అబ్బాయి వెళ్లి మిా కూతురుని పకరించిరారాదు…’’ అంది. ఆమెలో ఇంకా ఏదో ఆశ మిణుకుమిణుకు మంటోంది.
‘‘ నీవేణి నా పకరించేది? వద్దు! ఈ వేడి మిాద అది మమ్మల్ని చూస్తే నన్ను అమ్మని చూడదు. వాడిని అన్నని చూడదు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. దాన్నిప్పుడు పట్టి వుండే బూతం అంత చిన్నదేం కాదు. ఈసారి వచ్చినప్పుడు వెళ్తాంలే! దేనికైనా కాంతో పాటు వేచివుండడం ఉత్తమం….’’ అంది గోమతమ్మ.
అత్తగారు అలా అనగానే అరోప్‌తో కొద్దిసేపు ఆడుకొని, అడిగినవి కొనిచ్చి, ‘‘ఇక వెళ్లొస్తాం! బాబు జాగ్రత్త స్నేహా!’’ అని చెప్పి, అత్తగారితో, భర్తతో కలిసి వరంగల్ వెళ్లింది విజయక్ష్మి… ఎంతయినా తల్లికదా!.
– అంగులూరి అంజనీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~