‘‘ఇన్ని సంవత్సరా తర్వాత భువనేష్ వచ్చి ఇలా అడుగుతాడని ఆ డాక్టర్ ముందు వూహించలేదు. ఒక్కక్షణం నమ్మలేనట్లు కూడా చూసింది. ఆ తర్వాత భువనేష్ వైపు చూసి, తను చెప్పేది అతను ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు చెప్పటం తన బాధ్యత అన్నట్లు కాస్త కదిలింది. ‘‘చూడండి! స్నేహిత ఎక్కువ శాతం మిా గురించే ఆలోచించింది. అంటే 80శాతం మిా గురించి ఆలోచించి 20 శాతం మాత్రమే తన గురించి ఆలోచించుకుంది. దీన్ని మిారు ఇంత పెద్ద ఇష్యూ చెయ్యటం నాకేకాదు ఎవరకీ నచ్చదు.’’ అంది.
…తన గురించి స్నేహిత ఆలోచించటం ఏమిటి? తనే స్నేహిత గురించి ఆలోచించాలి కాని అని మనసులో అనుకుంటూ, అసహనంగా చూస్తూ ‘‘విషయం ఏమిటో చెప్పండి మేడమ్?’’ అన్నాడు భువనేష్ కాస్త కటువుగా…
‘‘మిాలో శుక్రకణాు లేవు. అలా షాకింగ్‌గా చూడకండి! మా రిపోర్టులో తేలిన విషయం అది… అది విని స్నేహిత మిా గురించే ఎక్కువగా ఆలోచించింది. ఈ విషయం మిాతో చెప్పొద్దని, చెబితే మిారు బ్రతకరని నన్ను రిక్వెస్ట్ చేసింది. లోకం కోసమైనా మీకు వారసుడ్ని ఇచ్చి, మిమ్మల్ని మగవాడిని చెయ్యాని మా స్టోరేజ్ బ్యాంక్‌లో వున్న సెమెస్‌ని మా ద్వారా యూజ్ చేసుకుంది. ఆ డోనర్ ఎవరో కూడా మాకు తెలియదు. ఇలా చాలా మంది చేస్తుంటారు. అంతేకాని ఆమె ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. తప్పు చెయ్యలేదు.’’ అంది.
ప్రకృతి గర్జించినట్లు ఉలిక్కి పడ్డాడు భువనేష్. తను వింటున్నది నిజమా అన్నట్లు చూస్తున్నాడు.
తనకి ఇక ప్లిు పుట్టరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఇప్పుడు తనేంటి? తనేం చెయ్యాలి? అన్న ఆలోచనలో పడ్డాడు.
బయట పేషంట్లు వెయిట్ చేస్తున్నారన్న ఫీలింగ్‌ని డాక్టర్ గారి ముఖంలో చూసి, వెంటనే లేచి వెళ్లి కార్లో కూర్చున్నాడు.
అలా ఎంత సేపు కూర్చున్నాడో అతనికి తెలియదు.
మనసంతా అంతర్మధనంతో అతలాకుతం అయిపోతోంది.స్నేహిత చేసిన దాంట్లో తప్పేముంది …? తనని మగాడిని చేసింది. ప్రపంచంలో ఏ మగాడైనా తండ్రి అయితేనే కదా మగవాడు అన్పించుకునేది. స్త్రీ కూడా తల్లి అయితేనే కదా! కర్ణ కఠోరమైన గొడ్రాు అన్నపదం నుండి దూరమయ్యేది. అయినా స్నేహితలోకి పంపిన శుక్రకణాు ఎవరివో కూడా తెలియనప్పుడు ఇబ్బంది ఏముంది? బీజం ఎవరిదైనా పెరిగేది తన దగ్గరే కదా! అటువంటప్పుడు అరోప్‌ాని నా బిడ్డగా అంగీకరిస్తే తప్పేంటి? సమాజం అంగీకరించినా అంగీకరించకపోయినా తనొక్కడు అంగీకరిస్తే అరోప్‌ా న్యాయబద్దంగా, ధర్మబద్దంగా తన బిడ్డయిపోతాడు.
తను వృద్ధుడు అయ్యాక తన భారాన్ని మోసేది అరోహే… తోడుగా వుండేది కూడా అరోహే… అరోప్‌ా తన పోలికల్లో లేడని ఇప్పుడు అనుకుంటున్న అన్నయ్యు, వదిను, అమ్మా, నాన్ను ఏ విషయంలో కూడా తన వెంటరారు. ఈ సమస్యను కూడా కొంత కాలానికి మరచిపోతారు. ఈ అనుమానాు, ఈ అవమానాు అండగా రావు. వచ్చేది ఒక్క అరోహే…. ఎవరికౖైెనా తనకేం కావాలో తెలిస్తే చాంటారు. ఇప్పుడు తనకి కావసింది అరోప్‌ా…. ఎవరిలోనైనా మొదటి ఆలోచన ఆవేశంతో, రెండవ ఆలోచన ఆవేదనతో, మూడవ ఆలోచన విచక్షణతో, నాగవ ఆలోచన పరిపూర్ణతతో వుంటుందంటారు. ప్రపంచంలో వుండే దిక్కు నాుగు. మనిషి చనిపోతే మొయ్యాల్సిందినుగురు…అలాగే అరోప్‌ా విషయాన్ని ఒకటికి నాుగు సార్లు ఆలోచించాడు భువనేష్.
ఇంకా ఆలోచిస్తూనే వున్నాడు.
ఆ రోజు స్నేహిత అరోప్‌ాని తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయి నేరుగా కాత్యాయని దగ్గరకి వెళ్లింది. విషయం చెప్పింది.
కాత్యాయని బాధపడ్తూ ‘‘గోమతి ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించి బాధపడ్తూనే మాట్లాడుతుంది స్నేహా!’’ అంది.
స్నేహిత మాట్లాడలేదు. అరోప్‌కి కాత్యాయని ఇచ్చిన పాు తాపుకుంటూ, బిస్కెట్స్ తినిపించుకుంటూ నార్మల్‌గా వింటోంది.
కాత్యాయని స్నేహిత భుజంపై చేయి వేసి నిమురుతూ ‘‘స్నేహా ! నా జీవితం ఇలా అయిందే అని నువ్వు మిా పెద్దవాళ్ల మిాద కోపం తెచ్చుకోకు. ఎవరైనా ప్లిల్ని కనగరే కాని వాళ్ల రాతల్ని కనలేరు. విధిని తప్పించలేరు. వేచి చూడటం మన ధర్మం. నువ్వు ప్రస్తుతం నా దగ్గర వుండు. మా మేనేజ్‌మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ఈ లోప నీకు ఏదో ఒక పని దొరికేలా చూస్తాను. నాకు తెలిసిన వాళ్లతో చెబుతాను.’’ అంటూ ధైర్యం చెప్పింది. ఆశ్రయం ఇచ్చింది.
…. విషయం తెలిసి స్నేహిత తల్లి, దండ్రు, బామ్మ హైదరాబాద్ వచ్చారు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఏ తల్లిదండ్రులైనా కూతుర్ని పరుషంగా మాట్లాడి నిందిస్తారు. చిన్న చూపు చూస్తారు. చావో, బ్రతుకో అత్తగారింట్లోనే చూసుకోవాలి కాని ఇలా రోడ్డున పడటం ఏమిటి అంటారు. ఇంకా చెప్పాంటే ‘నీ కుటుంబ సభ్యు నిన్ను అర్థం చేసుకోకపోతే మాకేంటి? మా పరువు మాకు ముఖ్యం, మా పరువు తీశావుకదే అంటారు. చిన్నపాటి సాయం చెయ్యరు. ఒక బహీనునిపై బవంతుడు విరుచుకుపడ్డట్టు తిట్టి, కొట్టి నానా రభస చేస్తారు… కానీ వీళ్లు అలా చెయ్యలేదు మాట ద్వారా ఆమె పడిన కష్టాను విన్నారు.
– అంగులూరి అంజనీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~