ఎనిమిదో అడుగు-35 (ధారావాహిక ) – అంగులూరి అంజనీ దేవి

హేమేంద్ర ఆయన అభిమానానికి ఆనందపడ్తూ ‘‘బాగున్నాను సర్‌! మిారెలావున్నారు?’’ అన్నాడు.
‘‘ఎలా అంటే ఏం చెప్పను హేమేంద్రా! వయసు ప్రభావంతో శరీరం ఏ మాత్రం సహకరించటం లేదు. దానికి తోడుగా బి.పి.,వుంది సుగర్‌ వచ్చింది. నువ్వు ఈ మధ్యన మందు తయారు చేపిస్తున్నావని విన్నాను. నాలో వుండే ఈ రెండు జబ్బుకి ప్రత్యేకంగా రెండు టాబ్లెట్లు తయారు చేయించి ఇవ్వరాదు. అది గనక చేశావంటే నా సర్వీస్‌లో నేను సంపాయించింది మొత్తం నీకే ఇస్తాను. ఎందుకంటే నా ప్లికి నా డబ్బుతో నా జబ్బుతో అవసరం లేదు. అమెరికాలో వున్నారు. నాకెందుకో ఈ మధ్యన వస్తున్న మందుల్ని నమ్మబుద్ది కావటం లేదు. ఇదిగో ఈ పేపర్‌ న్యూస్‌ చూడు…ఇది చూసినప్పటి నుండి బి.పి. టాబ్లెట్లు వేసుకోవాంటేనే భయపడుతున్నాను. ఆ రోజుల్లో ఎలా సంపాయించాలి? అని ఆరాటపడేవాడిని, ఇప్పుడేమో ఎలా తిరగాలి? తిరగాంటే ఏం మందు వాడాలి అని ఆలోచిస్తున్నాను’’ అంటూ తన చేతిలో వున్న పేపర్‌ కటింగ్‌ను హేమేంద్ర చేతికి ఇచ్చాడు చదవమని….

‘‘ చూడండి సర్‌! ఎక్కడో ఒక సంఘటన జరిగి అది పేపర్లో వచ్చినంత మాత్రాన ప్రతిచోట అలాంటి మందులే వుంటాయని అపోహపడకండి! ఇలాంటివి చదివి మిారు బి.పి. టాబ్లెట్లు వేసుకోవడం మానేస్తే మిాకే లాస్‌!’’ అన్నాడు హేమేంద్ర.

‘‘మరి ఇలాంటి న్యూస్‌ చూస్తుంటే ఎవరికైనా భయం కాదా! ఆ మందు మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తాయో ఎలా మారతాయో అని దడగా వుండదా?’’ అన్నారాయన ఈశ్వర్‌ వైపు చూస్తూ భయపడ్తూ….

ఈశ్వర్‌కి ఆయన భయం అర్థమై…..‘‘ఇక్కడ దొరికే మందున్నీ మన దేశపు స్టాండెడ్స్‌ ని అనుసరించే తయారువుతాయి సర్‌! ముఖ్యంగా మనకు కావసింది మనం వేసుకున్న టాబ్‌లెట్‌ జీర్ణాశయంలో కరిగి రక్తంలోకి అతిత్వరగా చేరటం… ప్రస్తుతం మన మార్కెట్‌లో దొరికే అన్ని మందు కూడా ఈ ప్రమాణాకు లోనయ్యే వుంటాయి. కానీ మందుపై పత్రికల్లో వచ్చే ఇలాంటి వక్రభాష్యాను చదివి, అంతవరకు వాడుతున్న మందుల్ని వేసుకోవటం ఆపి, వాళ్లలో వుండే దీర్ఘవ్యాధుల్ని ఇంకా ముదిరిపోయేలా చేసుకుంటున్నారు. అందుకు మిారే సాక్షి…… బ్యాడ్‌క్‌ ఏమిటంటే ఈ రోజు ఒక పేపర్‌ చెత్తమందు అని రాస్తే, రేపు ఇంకో పేపర్‌ నాసిరకం మందుని రాసి మందు మిాద నమ్మకం పొయ్యేలా చేస్తున్నాయి.’’అన్నాడు.
వెంటనే ఆదిత్య ‘‘నువ్వు చెప్పేదంతా నిజమేనా ఈశ్వర్‌?’’ అన్నాడు ఆశ్చర్యపోతూ..

‘‘నిజం సర్‌! ఇంకో విషయం కూడా వుంది. అదేమిటంటే! మందు షాపు వాళ్లు ఎక్స్‌పెయిరీ మందు అమ్ముతారు అని అనుకుంటారు. కానీ అలా జరగదు. ఎందుకంటే వాటిని కంపెనీ వాళ్లకి ఇస్తే తిరిగి అంతే ప్రష్‌ స్టాక్‌ను కంపెనీవాళ్లు ఇస్తారు.’’ అన్నాడు ఈశ్వర్‌.
తెలియని విషయాన్ని వింటున్నట్లుగా ఆసక్తిగా చూస్తున్నారు.

‘‘అంతేకాదు సర్‌! ప్రిజ్‌లో పెట్టటం మరచిపోయిన మందుల్ని కూడా ఒక్కోసారి డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ వచ్చి చూస్తే ` కళ్లముందే వాటిని పగగొట్టి వెళ్తారు. దీన్ని బట్టి మందు షాపు వాళ్లు ఎలాంటి అవకతవకకిప్పాడే అవకాశం లేదు. కానీ సర్‌! బిజినెస్‌ అన్న తర్వాత కొన్ని చోట్ల ఎత్తు వుంటాయి, పై ఎత్తువుంటాయి అన్ని చోట్ల కాకపోయినా ఎక్కడో ఓ చోట చిన్న, చిన్న మిస్టేక్స్‌ జరగకుండా వుండవు.’’ అన్నాడు ఈశ్వర్‌.

ఈశ్వర్‌ ఇంకా మందు కంపెనీ గురించి, మార్కెటింగ్‌ గురించి మాట్లాడుతుంటే అసు విషయం బోధపడి అర్జంట్‌గా బి.పి., టాబ్లెట్‌ వేసుకోవాని ఇంటికెళ్ళారు రిటైర్డ్‌ జడ్జిగారు.

భువనేష్‌కి స్నేహిత గుర్తొస్తుంది. ఎంత తవిధిలించినా కంప్యూటర్‌ ముందు ఏకాగ్రతతో కూర్చోలేకపోతున్నాడు. తను అనుకున్న రీతిలో వర్క్‌ చెయ్యలేకపోతున్నాడు. రావసిన క్ష సంపాదనను వదుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి సంపాదనకన్నా స్నేహితే ఎక్కువగా అన్పిస్తుంది….. నిజంగానే స్నేహిత తప్పు చేసి వుండదు. అందుకే ఆ రోజు తన మాటు గుచ్చుకొని వుంటాయి. ఏ స్త్రీకి అయినా ఆత్మాభిమానం వుంటుంది. స్నేహిత కూడా అంతే కదా!

 తప్పంతా హాస్పిటల్‌లోనే జరిగివుండాలి, వెళ్లి డాక్టర్ని కవాలి. ఏ లాభాన్ని ఆశించి తనిలా చేసిందో నిదీయాలి అని మనసులో అనుకుంటూ తన కారును హాస్పిటల్‌వైపు పోనిచ్చాడు భువనేష్‌.
డాక్టర్‌ గారు బిజీగా వున్నారు. ఓ.పి. నడుస్తోంది. అపాయింట్‌మెంట్‌ తీసుకొని అక్కడే కూర్చున్నాడు భువనేష్‌.
ఒకవేళ అరోప్‌ తన సెమన్‌కి పుట్టలేదని డాక్టర్‌ చెబితే అప్పుడు తనేం చెయ్యాలి? అని ఆలోచిస్తున్నాడు.

అరోప్‌ని ఎక్కడైనా వదిలి, పోషణకి, చదువుకి సరిపడినంత డబ్బును తానే దానం చేస్తే సరిపోతుంది. స్నేహితను మాత్రం దూరం చేసుకోకూడదు. స్నేహిత ఎండిపోయిన బావి కాదు. సరోవరం. ఒకవేళ స్నేహిత అరోప్‌ాని వదుకోనంటే? అనదు. ఎందుకంటే ఏ స్త్రీకి అయినా ఇద్దరు, ముగ్గురు ప్లిు పుడతారు కాని భర్త ఒక్కడే వుంటాడు. తనకోసం అరోప్‌ని తప్పకుండా వదుకుంటుంది. తనతో మళ్లీ ప్లిల్ని కంటుంది. ఆ తృప్తే వేరు. ఇది నాది అనుకుంటేనే ఆ సంతోషం సముద్రంలా పొంగుతుంది. లేకుంటే ఏముంది. ఎడారిలో పొడి ఇసుక సుడిగాలికి సుడు తిరిగినట్లు అంతా శూన్యం. అంతా ధైన్యం….
డాక్టర్‌గారు పిుస్తున్నట్లు నర్స్‌ వచ్చిచెప్పగానే లోపకి వెళ్లాడు భువనేష్‌.

‘నమస్తే’ చెప్పి డాక్టర్‌గారికి ఎదురుగా కూర్చున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా జరిగింది చెప్పి…. ఎలా జరిగిందో చెప్పమన్నాడు.

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో