ఎనిమిదో అడుగు-34(ధారావాహిక ) – అంగులూరి అంజనీ దేవి

అంతేకాదు. ఏదోఒక కేసులో ఇరుక్కుని కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు సంస్థలు నడిపేవాళ్లు, నిర్లక్ష్యంగా సర్జరీలు చేసే డాక్టర్లు, నాసిరకం డ్యాములు కట్టే ఇంజనీర్లు కోర్టుకి వస్తూనే వుంటారు. ఏదో ఒక రకంగా కేసును కొట్టి వేయించుకొని వెళ్తూనేవుంటారు. ఈ హేమేంద్ర కూడా అంతే! వీళ్లకి ఈ కేసులు జైళ్లు లెక్కకాదు.

న్యాయ దేవత కూడా ఇలాంటి వాళ్లను నేరుగా చూడలేక కళ్లకు గంతలు కట్టుకొని ఏమిా చూడనట్లు వుంటుంది. ఎందుకంటే కోర్టుకు వచ్చినంత మాత్రాన ఇలాంటి వాళ్లను ఉత్తమ పౌరులుగా,దేశ భక్తులుగా, యోధులుగా మార్చలేరు. సోమరిపోతుల్ని, పని దొంగల్ని, తాగుబోతుల్ని, చైతన్యవంతుల్ని చెయ్యలేరు. బలవంతంగా ఓ చోట కూర్చోబెట్టి సామాజిక బాధ్యతలను, సిద్ధాంతాలను, ఆదర్శాలను, నైతికతను, వ్యక్తిత్వాన్ని నేర్పలేరు. కనీసం ఆత్మ తృప్తి అంటే ఇలా వుంటుంది. ఇలాంటి పనుల వల్లనే లభిస్తుంది అని చెప్పలేరు. అందుకే న్యాయదేవత అలా పరోక్షంగా చూస్తూ నిశ్చలంగా వుంటుంది.

నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ‘‘నీకు తప్పకుండా జైలు శిక్ష పడ్తుంది హేమేంద్రా! నువ్వు దీన్ని తప్పించుకోలేవు…..’’ అన్నాడు అడ్వకేట్‌.
వెంటనే హేమేంద్ర ఒక కవరు అడ్వకేట్‌ చేతిలో పెట్టి, రిక్వెస్ట్‌గా చూస్తూ ‘‘మిారు ఎలాగైనా నన్ను ఇందులోంచి బయటకు తీసుకురండి! ప్లీజ్‌!’’ అన్నాడు.
ఆయనకు తన కొడుకు ఇంజనీరింగ్‌ చదివేందుకు అయ్యే ఖర్చు గుర్తొచ్చి వెంటనే ఆ కవరు తీసుకొని ‘‘ నేను చెయ్యగలిగింది చేస్తాను హేమేంద్రా! తర్వాత నీ అదృష్టం….’’ అన్నాడు.

హేమేంద్ర కూడా తన సర్వీస్‌లో ఆ అడ్వకేట్‌ లాంటి వ్యక్తుల్ని చాలా మందిని చూసి వుండడం వల్ల నమ్మకం కుదరలేదు. మనిషి ఎప్పుడూ దొంగే. అయినా నమ్మాలి. అదే లేకుంటే మనిషి జీవితం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతుంది.
‘‘కానీ, మిారు ఏ కేసు టేకప్‌ చేసిన ఓడిపోరని బయట టాక్‌ సర్‌! ఆనోటా, ఈనోటా మిాపేరుఓ రేంజ్‌లో విన్పిస్తోంది. ఇకముందు నా పరిధిలో వచ్చే కేసులన్నిటిని మిాకే రికమెండ్‌ చేస్తాను.’’ అంటూ హేమేంద్ర తను ఆయనకి ఇచ్చిన డబ్బు కన్నా బలమైన ‘ఆశ’ను ఆయన వైపు సంధించి సెలవు తీసుకున్నాడు.

…ఎందుకైనా మంచిది. ఒకసారి ఆదిత్యను కలవాలి. ఫోన్లో మాట్లాడే విషయం కాదు ఇది అన్నట్లు నేరుగా ఆదిత్య ఇంటికి వెళ్లాడు హేమేంద్ర.
కారు దిగి లోపలకి వస్తున్న హేమేంద్రను ప్రేమగా ఆహ్వానించాడు ఆదిత్య. చాలా కాలం తర్వాత కలిసినట్లు ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

కొద్ది నిముషాలు గడిచాక, హేమేంద్రను అక్కడే కూర్చోమని చేతన దగ్గరకి వెళ్లి విషయం చెప్పాడు ఆదిత్య.
‘‘…..అతని సంగతి నీకు తెలియదు అన్నయ్యా! ఇది ఒక్కటే కాదు, అతని గురించి బయట నేను చాలా విన్నాను. అతను ఏమాత్రం నిర్లక్ష్యంగా వున్నా అతను సప్లై చేసే మందుల వల్ల ప్రాణాలు పొయ్యే అవకాశాలు వున్నాయి. అతను గతంలో డాక్టర్స్‌కి ఇచ్చే శాంపిల్స్‌ని ఎక్కువ రేటుకి అమ్ముకొని రోగుల్ని ఇబ్బంది పెట్టేవాడు. అదేవిధంగా అతను ఈ మెడికల్‌ ఫీల్డ్‌లో ఎన్ని రకాల లాభాలు వున్నాయో అన్నింటిని యుటిలైజ్‌ చేసుకున్నాడు.’’ అంది చేతన.

‘‘కానీ చేతనా అతను మనకు తెలిసినవాడు. నన్ను నీతో మాట్లాడమని రిక్వెస్ట్‌ చెయ్యటానికి వచ్చాడు. పైగా మన సిరి భర్త. తప్పులు చెయ్యని వాళ్లువుండరు కదా!’’ అన్నాడు ఆదిత్య.
‘‘అలా అని వదిలెయ్యటానికి ఇవి చిన్న తప్పులా అన్నయ్యా! సిరి కూడా నాకు కాల్‌ చేసింది. తనతో ఒక్కటే చెప్పాను. రేపు నీ కొడుకుకైనా ఆ మందులు వాడొచ్చు అని…. తనిక మాట్లాడలేదు.

ఒక ఫ్యాక్టరీలో వచ్చే విషవాయువుల్ని బయట వ్యక్తులే కాదు ఆ చుట్టు పక్కల వున్న తన కుటుంబ సభ్యులు కూడా పీలుస్తారు. ఈ మందుల వ్యవహారం కూడా అంతే! అతను మారాలి. డబ్బు దాహాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడిది చిన్న విషయమే కదా అని వదిలేస్తే అతనిలో నిర్లక్ష్యం పెరిగిపోతుంది. పర్యవేక్షణ తగ్గిపోతుంది. రోగాలు ముదిరి ప్రాణాలు పోతాయి ’’ అంది. ఆమె ఏ మాత్రం రాజీ పడటం లేదు.

నిజమే…. సుడిగాలిలా పర్యటించి కలుపు మొక్కల్ని ఏరి పారెయ్యటమే నా పని అన్నట్లు ఓ యజ్ఞంలా తన వృత్తికి న్యాయం చేస్తున్న చేతనతో ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా ఒక్కమాట మాట్లాడినా తన గౌరవం పోతుందని అక్కడ నుండి లేచి వెళ్లి హేమేంద్ర దగ్గర కూర్చున్నాడు ఆదిత్య. అప్పటికే ఈశ్వర్‌ వచ్చి హేమేంద్ర పక్కన కూర్చుని వుండటం చూసి విష్‌ చేశాడు ఆదిత్య. వాళ్లు ముగ్గురు కలసి మాట్లాడుకుంటుండగా ఎదురింట్లో వున్న రిటైర్డ్‌ జడ్జిగారు చేతికర్రను ఊతగా చేసుకొని, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్లకి ఎదురుగా కూర్చున్నాడు. ఆయన పసుపురంగులో బాగా పండి, వడలిన మామిడి పండులావున్నాడు.

‘‘బాగున్నావా హేమేంద్రా? చాలా రోజులయిందయ్యా నిన్ను చూసి… బయట నీ కారు చూసి పిల్లలు చెప్పారు నువ్చొచ్చావని….’’ అన్నాడు. ఆయన చేతిలో ఓ పేపరు వుంది. దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొనివున్నాడు.

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో