మొగుడా! నీకు ధన్యవాదాలు – శ్రీ నాగ తేజస్విని

గౌరీ గుణదల కొండమీద ఉన్న గుడిసెలలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. రంగు చామనచాయ అయినా కనుముక్కు తీరు బాగుండి చూడగానే అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. తండ్రి సూరయ్య రోజువారి కూలి. సంపాదించిన దానిలో కొంత మద్యానికి ఖర్చు పెట్టి మిగతాది ఇంట్లో ఇచ్చే వాడు. తల్లి వెంకమ్మ నాలుగిళ్ళల్లో పనిచేస్తూ భర్త ఇచ్చిన డబ్బులతో కలిపి ఇంటిని గుట్టుగా నడిపేది. గౌరిని బాగా చదివించి గొప్పదానిగా చేయాలనీ వెంకమ్మ సంకల్పం. కాని గౌరీ పదో తరగతికి వచ్చే సరికి వాళ్ళ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి తినడానికి తిండి కూడా లేని స్ధితికి వచ్చేసింది. దాంతో గౌరీ చదువు ఆపేసింది. వెంకమ్మ కూడా గౌరికి చదువు చెప్పించ లేకపోతున్నాననే బాధతో వుండేది.

అమ్మాయి బాగుంది, కట్నం లేకపోయినా ఫరవాలేదంటూ మధ్యవర్తి గౌరికి ఒక సంబంధం తీసుకొచ్చాడు. కట్నం ఇవ్వనవసరం లేదనితెలియగానే గౌరీ తండ్రి సూరయ్య మంచిచెడులు ఆలోచించకుండా “నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను చదువుకొంటా నాన్నా” అని బతిమలాడినా వినకుండా గౌరికంటే పెద్దవాడయిన కోటేశుకిచ్చి పెళ్లి చేశాడు.

గౌరి అత్తవారింట్లో అడుగు పెట్టిన రోజే తన భర్త తాగుడికి చెడు తిరుగిళ్ళకి బానిసని తెలిసింది . అతని అన్నదమ్ములు కూడా అదే బాపతు. వాళ్ళందరి మీద పోలీస్ స్టేషన్లలో దొంగతనం, తాగి రోడ్ల మీద గొడవ చెయ్యటం, ఆడవాళ్ళని లైంగికంగా వేధించటం, అత్యాచారాలు మొదలగు కేసులు చాలా వున్నాయి. కోటేశు రోజూ తాగివచ్చి గౌరిని తిట్టేవాడు, కొట్టేవాడు. రకరకాలుగా హింసించేవాడు. కంచం ముందు అన్నానికి కూర్చుంటే అన్నంలోనికి అదిలేదని, ఇదిలేదని గొడవ చేసి, కాళ్ళతో తన్నేవాడు. చేతిలో ఏదుంటే అది, కత్తైనా, కర్రైనా గాజు సీసా అయినా ఎక్కడ తగులుతుందో అని కూడా ఆలోచించకుండా విసిరేసేవాడు. ఒక విధంగా చెప్పాలంటే, గౌరీ కాపురం కన్నీళ్ళ కాపురం. నిత్య నరకం.

భర్త ప్రవర్తనతో విసిగి పోయిన గౌరి భర్త దగ్గర ఉండలేక పుట్టింటికి వెళ్లిపోదాం అనుకున్నది. కాని తల్లిదండ్రులు “నువ్వు వచ్చేస్తే మాపరువు పోతుంది. నువ్వు రావద్దు. అక్కడే ఉండు. కొన్నాళ్ళు ఓపికపట్టు. నీ మంచితనంతో అతన్ని మార్చుకొ. ఎవరైనా ఎప్పుడూ ఒకేరకంగా ఉంటారా?

ఎప్పటికైనా మారకపోతారా? నువ్వు ఇక్కడకు వచ్చేస్తే నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవటం కష్టమౌతుంది. కాబట్ట్టి నువ్వు ఇక్కడకు రావద్దని” చెప్పారు. దాంతో గౌరికి పుట్టింటి ఆశ కూడా అడుగంటి పోయింది.

గౌరి కన్నీళ్ళు దిగమింగుకొని, తల్లి చెప్పినట్లుగా భర్తని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. భర్త మారకపోగా, చర్మం కంది పోయేలా కొట్టేవాడు. వీపు తాటలు తేలేవి. భర్త పెట్టే బాధలు భరాయించ లేక ఏదయితే అదయిందని గృహ హింస కింద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్నిసార్లు కేసులు పెట్టినా పోలీసులకు లంచం ఇచ్చి బయటకు వచ్చి ఇంకా తీవ్రంగా హింసించేవాడు.
ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినా కోటేశులో ఎటువంటి మార్పు రాలేదు. పిల్లల్ని దగ్గరకు తీసుకొనేవాడు కాదు. ముద్దు చేశేవాడు కాదు. పిల్లల్ని బడిలో చేర్చలేదు. తనకు పట్టనట్లుగా ఉండేవాడు. భర్తని నమ్ముకుంటే, పిల్లలు ఎటూకాకుండా పోతారని, తెలిసిన వారింట్లో వంటపనితో సహా అన్ని పనులు చేయటానికి కుదిరింది. పిల్లలను బడిలో చేర్పించింది. పిల్లల అవసరాలు, ఇంటి ఖర్చులకు పోను మిగుల్చుకున్న డబ్బును కోటేశు తాగుడుకు ఖర్చు పెట్టేవాడు. ఇలా చాల కాలం కష్టాలు భరాయించింది. ఇక తనవల్ల కాదనుకుంది.

ఒక రోజున కోటేశు తాగిన మైకంలో, ఆడుకుంటున్న పక్కింటి ఐదేళ్ళ పాప మీద అత్యాచారం చెశాడు . ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కోటేశుని పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తన భర్తకు శిక్ష పడేలా చూస్తున్నారని తెలిసి సంతోషించినా ఒక పసిదాని జీవితాన్ని నాశనం చేశాడని కుమిలి పోయింది.

తన భర్త తరఫు వాళ్ళు, అబద్ధం చెప్పి కోటేశుని విడిపించమని చెప్పినా, గౌరి ఒప్పుకోక పోవటంతో ఇంట్లోనుంచి వెళ్ళగొట్టారు. అప్పుడు గౌరి తను పనిచేస్తున్న వారింట్లోనే ఆశ్రయం పొందింది. తన యజమానురాలితో గౌరి తన గోడు వెళ్ళపోసుకుని “ఇప్పుడు తనకు వచ్చే డబ్బులు చాలటంలేదని పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఉందని తనకు సహాయం చెయ్యమని” వేడుకొంది. ఆవిడ సలహాతో దూరవిద్యలో పదోతరగతికి డబ్బు కట్టింది. ఖాళి దొరికినప్పుడల్లా తన సహోపాధ్యాయులతో పాఠాలు చెప్పించుకొని పదవ తరగతి పరీక్ష ప్యాసయ్యింది. ఒకసారి కోటేశు పెరోల్ మీద జైల్లోనించి బయటకి వచ్చి, గౌరిని కత్తితో పొడవబోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుపడి రక్షించారు. తన పిల్లలు కూడా “పోలీసులకు నిజమే చెప్పమ్మా ఇటువంటి నాన్న మాకొద్దు” అనడంతో గౌరికి కొత్తబలం వచ్చినట్లయింది.

తనను తాను కాపాడుకొంటూ చిన్నారులకు జీవితంమీద కొత్త ఆశలు చిగురింప చేయాలనుకొంది. వంటపని చేస్తూనే దూరవిద్యలో బి. ఎ చదివి ప్యాసయింది. ఒకరోజున దినపత్రికలో, “జాతీయస్థాయిలో, పర్యావరణానికి హానికలిగించే క్యారిబ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగులు, కాకుండా ఏవైనా వెరైటీ బ్యాగులు తయారుచేసిన వారికి నగదు బహుమతి ఉంటుందని” ప్రకటించింది. గౌరీ తన సృజనాత్మకతను జోడించి, అందంగా, హుందాగా ఉండే ఒక పేపర్ బ్యాగును తయారుచేసి పోటీకి వచ్చింది. గౌరీ తయారు చేసిన బ్యాగుకు మొదటి బహుమతి వచ్చింది. నగదు బహుమతి ఐదు లక్షలు ఇచ్చి సన్మానం చేశారు.

పోటీలో నగదు బహుమతి వచ్చిన తరువాత, గౌరికి తానే ఒక పేపర్ బ్యాగుల తయారి పరిశ్రమ ఎందుకు పెట్టకూడదనిపించింది. చిన్నతరహా పరిశ్రమల వారిని కలుసుకొని తన ఆలోచన వారికి చెప్పి సహాయం చేయమని కోరింది. వాళ్ళు ఆ పేపర్ బ్యాగుల పరిశ్రమకు కావలసిన కావలసిన సమాచారం ఇవ్వటమే కాకుండా తయారీలో అవసరమైన సాంకేతికమైన సలహాలు కూడా ఇస్తామని చెప్పారు. పేపర్ బ్యాగు పరిశ్రమ ప్రారంభించటానికి మూడు లక్షలు కావాలి. ఇంకా ఏడువందల యాభై చదరపు అడుగుల స్థలం కావాలని చెప్పారు. ఎలాగు తన చేతిలో బహుమతి తాలూకు నగదు వుంది కాబట్టి పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంది. వెయ్యి చదరపు అడుగులలో కట్టిన ఇల్లు కొని, పరిశ్రమకు కావలసిన స్థలం కేటాయించి, మిగితా దానిని పిల్లలతో తను ఉండటం కోసం అట్టేపెట్టుకున్నది. పేపర్ బ్యాగుల తయారికి కావలసిన పేపర్ క్రీజింగ్ మెషిన్, స్క్రీన్ ప్రింటింగ్ మెషిన్, షేప్ హేండిల్ మెషిన్, పేపర్ రీల్ కటింగ్ మెషిన్, ప్రింటింగ్కి కావలసిన రంగులు తెప్పించింది.

రోజుకు వెయ్యి బ్యాగుల తయారీ మొదలు పెట్టింది. నెలకు ఇరవై యైదు పనిదినాల చొప్పున నెలకు పాతిక వేలు, సంవత్సరానికి మూడు లక్షల బ్యాగుల చొప్పున తయారు చేస్తూ నెలకు షుమారుగా లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నది. అంతే కాకుండా ఒక పది కుటుంబాలను తన పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తున్నది. గౌరి తయారు చేసే బ్యాగులు అందంగా, ఆకర్షణీయంగా ఉంటూ, పిల్లల బర్త్ డే పార్టీలు, పెళ్లి రిసెప్షన్లు, వ్రతాలు, నోములు,కిట్టి పార్టీలు కొరకు ఉపయోగపడుతున్నాయి. గౌరీ తన సృజనాత్మతకు మెరుగులు దిద్ది , రంగురంగుల పేపర్ బ్యాగులు తయారు చేయటమే గౌరీ ప్రత్యేకత. ఇప్పుడు గౌరీ పదిమందికి ఆశ్రయ మిచ్చే ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త. గౌరీ తన పిల్లలకు మంచి చదువు చెప్పించి ప్రయోజకులని చేసింది.

” నా భర్త మంచి వాడయి ఉన్నట్లయితే, సంసారం చేసుకుంటూ మామూలు గృహిణిగా ఉండేదాన్ని. నా మొగుడు చేసిన నిర్వాకం వల్లగదా ఒక పారిశ్రామిక వేత్తను , సంఘంలో పేరు, పదిమందికి అన్నం పెడుతున్న అన్నపూర్ణను అయినాను కదా అనుకొని “మొగుడికి ధన్యవాదాలు” అర్పించింది మనసులో”.

-ఏ. శ్రీ నాగ తేజస్విని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , Permalink

One Response to మొగుడా! నీకు ధన్యవాదాలు – శ్రీ నాగ తేజస్విని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో