జీవస్తరం

 
నేను
ఆమె పక్కనలా  ఒంటరిగా కూర్చోవడం
ఇప్పటికి ఎన్ని రాత్రులో
 
ఆహ్లాదకరమైన గాలి ఆమె మంచం చుట్టూ అల్లుకొని
సన్నజాజి పూలు, ఇంకా
ఆ చెట్టుకు పండుతున్న అరటిగెల వాసనని
పెరట్లోని కొత్తచిగుర్ల నవ్వుని మోసుకొస్తున్నా
ఆమె చూపులు నా నుంచి కదలనే కదలవు
 
ఒక్కో రాతిరి సువాసన మూలికలుగల తైలంతో
ఆమె జుట్టుకు మర్దన చేసేప్పుడు
చేతుల్లోకి రాలిన తెల్లజుట్టును చూసి
ఆమెతో ఏదో చెప్పాలని అనుకుంటాను
కాని ఒలికిపోతున్న కాలంతో పాటు నా మాటలతో ఇంకా తనకి
బాధనివ్వలేను
 
మంచం పక్కనే టేబుల్ పైన తనకి కనబడేట్టు ఉండే
మా పెళ్లిఫోటో వైపు నా వైపు చూస్తూ
తన కళ్ళు ఏం మాట్లాడతాయో నాకు తెలుసు
ఆ నిర్జీవస్థితి ఆమె నన్ను ప్రేమించకుండా
నేను ఆమెను ప్రేమించకుండా ఆపలేదు కదా
వక్రరేఖలుగా మారిన తన పెదవులు నవ్వేప్పుడు
ఆ గదంతా నీలాకాశంగా మారి మేమిద్దరం
వలసవెళ్ళే కొంగల్లాగే అనిపిస్తాం
నా చేతితో ఆమె చేయిపట్టుకుని
తన కిష్టమైన పుస్తకం చదువుతూ
నేను చెప్పే కబుర్లతో
ఆమెలోకి కొంత జీవం వొంపుతున్నప్పుడు
తను నా మాటలకి ఊకొడుతూ వింటున్నప్పుడు
తనతో పాటు నేను

తన పక్షవాతాన్ని ఓడించినట్టే

– అన్వీక్ష

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలు, , , Permalink

One Response to జీవస్తరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో