బోయ్‌ ఫ్రెండ్‌ – 18 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

ఉలిక్కి పడింది కృష్ణ. గబుక్కున లేచి ‘కాఫీ తెస్తానుండండి’ అంటూ లోపలికెళ్ళింది. పది నిముషాల్లో తిరిగొచ్చిన కృష్ణ చాలా మనో నిబ్బరాన్ని తయారు చేసుకుని రావల్సి వచ్చింది. అతను ఆమె గడపలో కన్పించింది మొదలుకుని, వచ్చి కూర్చునేవరకు ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. ఆమె అదేం లెక్క చెయ్యనట్టు, అతనికోకప్పు ఇచ్చి తను ఒక కప్పు తీసుకుని కాఫీ త్రాగసాగింది నిర్లక్ష్యంగా. అతను ఆమె నిర్లక్ష్యాన్ని గుర్తించ లేదు. తన జేబులోనుండి ఒక ఫోటో తీసి ఆమె చేతికిచ్చి

”ఎప్పుడు తీసానో చెప్పుకోండి చూద్దాం” అన్నాడు.
అది కృష్ణ ఒంటరిగా వున్న ఫోటో. సెలయేరు దగ్గర పరిచయం వృద్ధి పొందింది మొదలుకుని ఆమెను ఒంటరిగా ఫోటో తీయాలని అతను చేసిన ప్రయత్నాలన్నిటినీ, ఆమె వ్యర్ధం చేస్తూనే వచ్చింది. కానీ ఆమెకు తెలియకుండానే అతను తీయనే తీసాడు. అది సీలేరు బ్రిడ్జ్‌ మిద తన్మయత్వంలో నది వెనగ్గా తాటి చెట్ల వెనక కొండల మాటున అస్తమిస్తున్న సూర్యుణ్ణి, ఆకాశాన్ని అలుముకున్న అరుణ కాంతిని చూస్తున్నప్పటి తన చిత్రం. లైట్‌ లేకపోవడంతో కాస్త నల్లగ పడింది. ముఖంలో పోలికలు స్పష్టంగా లేకపోరునా, ఆమె నిల్చున్న తీరు, ఆ తన్మయత్వం, ఆ మెరిసే కళ్ళూ, సన్నటి చిరునవ్వు, చాలా అందంగా వుంది ఆ ఫోటో.

”మీకు తెలియకుండా తీసానని కోపమొచ్చిందా?” చాలా తగ్గు స్వరంతో అడిగాడు.
”దానిదేముంది? ఫరవాలేదు.” తనకు అదేమంత పెద్ద విషయంగా అన్పించనట్టు నటించడానికి చాలా అవస్థలు పడుతోంది కృష్ణ.

”అప్పటి మి ఫోటో తీయకుండా వుండలేకపోయాను కృష్ణా! ఏమనుకోకండి.”
అతని స్వరంలో మార్పుకు చలించి పోరుందామె. ఆమె శరీరమంతా కంపించింది. అతని చేత పదే పదే ఆకర్షింపబడుతూనే, అతని సముఖంలో తను ఎందుకింత అశాంతిని అనుభవిస్తోందో ఆమెకు బొత్తిగా అర్ధం కావడం లేదు.
ఆమె మానసిక స్థితి తెలుసుకున్నట్లే కృష్ణ తల్లిదండ్రులు బయట నుండి రావడంతో చైతన్యకు సెలవు తీసుకోక తప్పలేదు.

”రేపు వస్తాను మికేం అభ్యంతరం లేదు కదా!” కాస్త దూరాన వున్న వర్ధనమ్మకు వినపడకుండా అన్న చైతన్య ప్రశ్నకు ఏదో లోకంలో వున్నట్టు తల ఊపింది కృష్ణ. అతను వెళ్ళిపోరునా కూడా అక్కడే నిలబడున్న కూతుర్ని చూస్తూ అడిగింది వర్ధనమ్మ.

”ఎవరతను కృష్ణా?”
”భానూ తమ్ముడు.”
మరి భానూ రాలేదేం? అని ప్రశ్నించి

”శివమాల కన్పించింది. ఎందుకోనిన్నొకసారి ఇంటికి రమ్మని చెప్పమంది” అనేసి లోపలికెళ్ళిపోరుందామె.
ఆ చిన్న రూమ్‌లో మెత్తటి పరుపు మిద పడుకుని తెలుగు నవల చదువుకుంటున్న కృష్ణ హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్టు నవల మూసేసి ఆలోచించసాగింది.

కృష్ణకు ఈ హాస్టలు జీవితం చాలా నచ్చింది. ‘ఎవరో ఎక్కడో దేశంలో ఏమూలనుండో వచ్చి చేరి ఒకరికొకరు ఆత్మీయులై కలసి జీవించడం, ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవడం, చదివినంతసేపు చదివినా, తిరిగినంతసేపు తిరిగినా, నిశికాంత చీకటి ముసుగు ధరించాక తలుపులు బిగించుకుని నిశ్శబ్ధంగా ఎంతో ఫ్రీగా పడక మీద వాలిపోరు కోరిన ఊహల్లోకి జారి పోవడం ఎంత హారుగా వుంటుందీ !’ ఇంట్లో ఒక్కొక్కమారు ఇలాటి ఒంటరితనాన్నే కోరుకునేది కృష్ణ. కానీ అమితంగా ప్రేమించే తలిదండ్రుల మధ్యగా ఆమెకు ఆ అవకాశం లభించేది కాదు. ఒంటరిగా ముడుచుకుని పడుకుంటే అమ్మ హడావిడి చేసేది. మనస్సులో విసుగ్గా వున్నా పైకి నవ్వాల్సి వచ్చేది. కాకపోతే కోపాలు, ద్వేషాలు ఒక్క స్నేహితుల్లోనే కాదు ‘నేను’ అనేది ప్రతి వ్యక్తి వద్దనుండీ ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే.

హఠాత్తుగా ఒక వింత అర్థమరుంది కృష్ణకు. అమ్మను మొదటి మారు వదిలి వచ్చేసి, కొన్ని నెలలు గడచిపోయారు అరునా అమ్మను చూడాలని పెద్ద కోరిక కలగడం లేదు. అమ్మ దగ్గర నుండి మాత్రం ఉత్తరాల మిద ఉత్తరాలు వస్తున్నారు. ‘ఇదేమిటీ? తల్లీ బిడ్డలలో ఆత్మీయత అనేది ఇంతవైరుధ్యంగా వుంటుందా. అమ్మ నన్ను ప్రేమించి నంతగా అమ్మను నేను ప్రేమించలేకపోతున్నానా?’

తలుపు చప్పుడవడంతో, ఆమె ఊహల తాలూకు ముత్యాల సరం తెగిపోరుంది. మెల్లిగా లేచి తలుపు తీసింది. ఎదురుగుండా విద్యోదయ నిల్చొనుంది. ఆమెను చూస్తే ఎప్పుడూ మామిడి చిగురు గుర్తుకొస్తుంది కృష్ణకు. కానీ ఈ రోజది కమిలి పోరునట్లుగా వుంది. తనకు కావలసిన పుస్తకమేదో తీసుకుని వెళ్ళిపోరుందామె.

తను ఈ హాస్టలు కొచ్చిన కొద్ది వ్యవధిలో ఎన్ని రకాల మనస్తత్వాలను చూడగలిగింది!’ మరలా ఆమె ఆలోచనా పరిధి తనకు పరిచితమైన వ్యక్తుల చుట్టూ తిరగనారంభించింది.

విద్యోదయ తెల్లగా, సన్నగా కోమలంగా మొత్తానికి చాలా అందంగా వుంటుంది. తనకంటె సీనియర్‌ అరున ఆ పిల్ల తనకంటె రెండేళ్ళు చిన్నది. చదువులో చురుగ్గా ఒక్కొక్క మెట్టే గబగబ ఎక్కిపోయే విద్య అంటే అమితమైన అభిమానం మధ్యగ తనను దేవుడు ఇంత బుద్దిలేని దానిగా ఎందుకు సృష్టించాడో అర్థంగాని కృష్ణకు ఆ పిల్ల పట్ల కించత్‌ అసూయ కూడా కలిగేది. విద్యోదయ ప్రియ స్నేహితుడు సుధాకర్‌. అతను నిలువెత్తు మనిషి . ఎదుటి వ్యక్తిని, ఎన్ని గంటలరునా ‘బోర్‌’ కొట్టకుండా ‘ఎంగేజ్‌’ చేయగల అతని వాక్పటిమ చాలా గొప్పది. అతని కంఠం చాల మధురంగా వుంటుంది. అతను స్నేహశీలి. ఏ అమ్మారుూ అతనితో స్నేహం చేయడం తప్పు అనుకోదు. కారణం అతను దేనినీ రహస్యంగా వుంచడు. ఆ గుణమే విద్యోదయని ఆకర్షించి, సన్నిహితుణ్ణి చేసింది. అతని పుట్టుక పరారు దేశంలో పరారు మనుష్యుల మధ్య జరిగింది. జన్మత: అతను భారతీయుడే అరునా తెల్ల దొరల ఆచారాలు వాళ్ళ సంస్కృతి అతనిలో జీర్ణించుకుపోయారు.

మొదట సుధాకర్‌, విద్యోదయ ఇద్దరూ ఈ స్నేహాన్ని స్నేహంగానే వుంచాలనుకున్నారు. తన తల్లిదండ్రుల మిద పరుచుకోనున్న సాంప్రదాయాల మూర్ఖత్వం తెలుసుకున్న విద్యోదయ నిగ్రహించుకోగలిగింది గాని పాశ్చాత్యుల పద్ధతులను జీర్ణించుకున్న సుధాకర్‌ ఆమెను జీవితాంతం దూరం

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో