ఎనిమిదో అడుగు-32(ధారావాహిక ) – అంగులూరి అంజనీ దేవి

అంతేకాదు మధ్యాహ్నం డైనింగ్‌ టేబుల్‌ దగ్గర రత్నమాల రచ్చ, రచ్చ చేసి పెద్ద చర్చ లేవదీసింది. ఊహించని ఆ గోడవకి బిత్తరపోయాడు అరోప్‌.

…. తింటున్న ప్లేటును కావాలనే కిందపడేసి ‘‘చూడండి అత్తయ్యా! అరోప్‌ా రోజూ ఇంతే! తింటున్న ప్లేటును కింద పడేస్తాడు. రాస్తున్న పుస్తకాలను చింపేస్తుంటాడు. పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు ఒక్కటి కూడా వున్న చోట వుంచటం లేదు. వీడి ఓవర్‌ యాక్టివ్‌తో చచ్చిపోతున్నాం. కావాలంటే అక్కయ్యను కూడా అడగండి! ఆవిడ కూడా వీడితో అదే ప్రాబ్లమ్‌ని పేస్‌ చేస్తోంది…. ఒక్కమాట చెప్పండి అత్తయ్యా! నా కొడుకు నీ కొడుక్కి పుట్టాడా! లేదా? ఈ ఇంట్లో తినే అర్హత వాడికి వుందా! లేదా? మరి రోజూ ఇలా అయితే వాడెలా తినగలడు? మపగలంతా ఆఫీసుల్లో పనులు చేసుకొని, ఇంటికొచ్చాక ఇలాంటి డిస్కషన్‌లో తలపగలగొట్టుకోవటం ఎందుకు? అమ్మ కూడా ఇదే చెప్పింది. నీతో మాట్లాడాలంటే అమ్మ సంశయిస్తోంది. అర్థం చేసుకో…’’ అన్నాడు.

భువనేష్‌ మాట్లాడకుండా, అరోప్‌ాని తన గదిలోకి తీసికెళ్లి పరిశీలనగా చూసుకున్నాడు చేతిగోళ్ల నుండి మొదలు పెట్టి తలవెంట్రుకల వరకు చూసుకున్నాడు. చివరకు ఆ డాక్టర్‌ తనని మోసం చేసిందనుకున్నాడు.

స్నేహిత మాత్రం ఎలాగైనా ఇవాళ అరోప్‌ా గురించి భర్తతో మాట్లాడాలని నెమ్మదిగా చేయి చాపి అరోప్‌ మిాద నుండి భర్త భుజంపై వేసి ‘‘నిద్రపట్టట్లేదా.’’ అంది.

అతను ఏ మాత్రం కదలకుండా అలాగే పడుకొని ఉక్రోషంతో ఉడికిపోతూ ‘‘నువ్వు నాకు నిద్ర పట్టేలా చేశావా? హాయిగా వున్నవాడ్ని,పిల్లలు కావాలని, నేనెంత రానని చెప్పినావినకుండా హాస్పిటల్‌కి తీసికెళ్లావు. ఇప్పుడేమైందో చూస్తున్నావుగా…’’ అన్నాడు.

ఆమె చాలా ప్రశాంతంగా చూస్తూ ‘‘ఏమిా కాలేదు. అంతా మనం ఊహించుకునే దాన్ని బట్టే వుంటుంది. ఉన్నది లేనట్లు కన్పిస్తోంది అంతే!’’ అంది.

‘‘అంటే! మా అందరి కళ్లకి భ్రమలు కమ్మాయంటావా? వాస్తవాన్ని పట్టుకొని ఊహనుకోమంటావా? ఎంతటి నెరజాణవే నువ్వు… పైకి కన్పించవు కాని నువ్వు చేసే సాహసాలు సామాన్యులు చెయ్యలేరు… మనకి పిల్లలు లేరని అనాధ పిల్లాడిని తెచ్చుకొని పెంచుకుందాం అంటే విన్నావా? ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ అవుతాడా అన్నావు. పోనీ వినతి కొడుకును పెంచుకుందాం అంటే కడుపుతీపి చూడాలన్నావ్‌! ఇప్పుడు వీడిని కని నన్ను నవ్వులు పాలు చేస్తున్నావు. మగవాడు కారు లేదన్నా, ఇల్లు లేదన్నా బాధపడడు., కూలీపని చేసైనా ఆత్మతృప్తితో బ్రతుకుతాడు. కానీ ఇలా ఛ.. ఛ.. నువ్వు నా గుండెను దొంగచాటుగా చిల్లుపొడిచి నువ్వు మాత్రం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్నావు. మగవాడు దేన్నైనా భరిస్తాడు కాని భార్య చేసే మోసాన్ని ముఖ్యంగా ఇలాంటి మోసాన్ని తట్టుకోలేడు. నేను కష్టపడి సంపాయించే ఆస్తిపాస్తులకి రేపు వీడే వారసుడా?’’ అన్నాడు ఒక్క వుదుటన లేచి కూర్చుంటూ…బిత్తరపోయింది స్నేహిత. భర్తలో అంత ఆవేశాన్ని, కోపాన్ని ఇంతవరకు చూడలేదు.

అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా ‘‘వినతి కొడుకైనా, లేక అనాధబిడ్డ అయినా మిా వారసుడిగా వుండొచ్చుకాని నాకు పుట్టిన అరోప్‌ అందుకు అర్హుడుకాడా? చూడండి! పిల్లల్ని కనకపోతే ఆడవాళ్లను గొడ్రాలు అంటారు. అలాగే మిమ్మల్ని కూడా నపుంసకుడు అంటారు. ఆ పేరు మిాకు రాకుండా అరోప్‌ను కన్నాను మిాకు వారసుడిని ఇచ్చాను. మిాలో ఎవరికీ నా పట్ల కృతజ్ఞతలేదు అది నా ఖర్మ…..’’ అంది.

‘‘నేను నిన్ను చెట్టు కింద కుక్కలు పంచుకుతినే ఎంగిలి విస్తరాకులా భావించటం లేదు. మహా ప్రసాదం అనే అనుకుంటున్నాను. బహుశా అందుకేనేమో ఎవరెన్ని చెప్పినా నువ్వంటే నాకు ఇష్టం తగ్గలేదు. అనుమానం రాలేదు. ఏదో కోపంలో అలా అన్నాను కాని నువ్వు ఏ తప్పుా చేసి వుండవు. రేపు హాస్పిటల్‌కి వెళ్లి డియన్‌ఎ టెస్ట్‌ చేపిద్దాం… ఇది కూడా నా కోసం కాదు. నిన్ను, అరోప్‌ని రోజు ఇబ్బంది పెడ్తున్న వాళ్ల కోసం….’’ అన్నాడు భువనేష్‌.

స్నేహిత మాట్లాడలేదు. అతను మాత్రం ఆమె వైపు సమాధానం చెప్పు అన్నట్లు చూస్తున్నాడు. అది గమనించి గట్టిగా కళ్లు మూసుకుని పడుకొంది స్నేహిత. ఆమె పడుకుందని అర్థం చేసుకొని అతను కూడా పడుకున్నాడు. అతనికి ఆమె అర్థం కావటం లేదు.

స్నేహిత ఆలోచిస్తోంది….
సృష్టిలో ఎవ్వరూ చెయ్యని తప్పు తను మాత్రమే చేసిందా? లోకంలో ప్రతి ఒక్కరు ఏ తప్పు చెయ్యకుండానే జీవితం మొత్తం గడిపెయ్యగలుగుతున్నారా? నిజంగానే తను తప్పు చేసిందా? ఎంతమంది స్త్రీలకి ఎంబ్రియోను గర్భాశయంలోకి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చెయ్యట్లేదు… భర్తలో ఆ అర్హత లేకపోవటం వల్లనే ఒక ప్రాణికి జన్మనిచ్చే అవకాశం వైద్య రంగం కల్పించటం అందరికీ అమోదయోగ్యం అయినప్పుడు తను చేసింది తప్పెలా అవుతుంది? కానీ తను ఇలా వాదించి, గెలిచి, భువనేష్‌ని అవమానించి సాధించేదేమిటి? భువనేష్‌ అన్నట్లు మగవాళ్లు దేన్నైనా తట్టుకుంటారు కాని తనకి పిల్లల్ని కనే యోగ్యత లేదని తెలిస్తే మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా భవనేష్‌ అయితే ఇప్పటికిప్పుడే చనిపోతాడు. అరోప్‌ని కన్నది భువనేష్‌ని చంపుకోటానికి కాదు అరోప్‌ భువనేష్‌ బిడ్డ కాదని ఇప్పటికే అందరికి తెలిసిపోయింది. ఈ . టెస్ట్‌ వల్ల భువనేష్‌కి కూడా తెలిసిపోతుంది.

అందుకే ఈ  టెస్ట్‌ చేయించుకోకుండానే ఈ ఇంట్లోంచి అరోప్‌ని తీసికొని వెళ్లిపోవాలి…వీళ్లంతా నమ్మకాలతో,సెంటిమెంట్స్‌తో బ్రతికే మనుషులు. తను దాన్ని ఒక్కరోజులో, ఒక్క రాత్రిలో సమూలంగా ధ్వంసం చెయ్యలేదు. కానీ తను ఎక్కువగా భువనేష్‌ గురించే ఆలోచిస్తోంది కాని బయటకెళ్లి ఎలా బ్రతకాలి అన్నది ఆలోచించటం లేదు…. బ్రతకటానికే ఈ కుటుంబ జీవనం అయితే అనుక్షణం ప్రేమ రాహిత్యంతో, వ్యంగ్యమైన మాటలతో,,,అసూయా ద్వేషాలతో, అవమానించటాలతో అనుమానించటాలతో రాజీపడ్తూ బ్రతకడం భూలోక నరకం కాదా! ఇలా మానసిక రోగిలా బ్రతికేకన్నా బయటకెళ్లటమే ఉత్తమం కదా!

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో