నెలద-7 (ధారావాహిక )- సుమనకోడూరి

ఓ దోటి లాటి పొడవాటి కర్ర వీరి దుస్తులున్న వేపు సాగింది . ఇసుక నుంచి క్రోసెడు దూరంలో నీరు పుచ్చ పంటి తిన్నాయి . రాబోయే వేసంగికి ఆ ప్రాంతంలో అధికంగా పండుతాయి . ఆ పంటలకు కావలిగా ఓ చిన్ని గూడు లాటి గుడిసె బోదతో వేసినది ఉన్నది అది కోడా తలుపు మూసి ఉన్నది అల్లిబిల్లిగా అల్లుకున్న పుచ్చ తీవెలు ఇసుక మధ్యలో కొంతమేర మేటలుగా ఉన్న బంక ఇసుక గట్లు ఉన్నాయి . తుంగ పెరిగి ఉన్నది ఆ గట్టుల మీద ఆ గట్టు మాటు నుంచి వచ్చింది ఆ పొడవాటి దోటి ఎవరు గమనించే స్థితిలో లేరు సులువుగా దోటి కొనకు చిక్కిన వస్త్రాన్ని నెమ్మదిగా తీసుకుని తన చేత ఉంచుకున్నాడు ఆ వ్యక్తి . అక్కడి నుంచి మెరుపులా మాయమై అల్లంత దూరాన ఆపిన తన అశ్వాన్ని చేరుకున్నాడు . నెలద బృందం ఇది గమనించే పరిస్థితిలో లేరు . అంతా తనివి తీరా బాహడా తరగల్లో తనాలాడి తృప్తిగా గట్టు చేరారు .

పాదాలకు ఇసుక అంటుకుంది . మనం స్నానం చేసి ఏం లాభం ఈ ఇసుక మనల్ని పులుముకుని ఇల్లు చేరుతుంది అన్నది శాంభవి . పోనీ పాపం దాని తల్లి రేణువులు మన భవనపు నిర్మాణాలలో ఉన్న వేమో వెదుక్కుంటుంది ఇసుక అన్నది ప్రభవి . నెలద భళీ వింత కవితాత్మకంగా చెప్పావ్ ణీ పోలిక అద్భుతం. కాసింత ప్రయత్నించ రాదడే ఏదేని కావ్యం వ్రాసి ప్రభువుకు అంకితం కూడా చేయుదువు అన్నది . పొండమ్మా మీరు, ఏదో మాట అలా వచ్చేసింది అన్నది సిగ్గుపడుతూ ప్రభవి . మాటల కూర్పు అందంగా ఉంటె కవిత అవుతుంది . కవితల కూర్పు మాటలా ఉంటె కావ్యమవుతుంది . ఇందు నీవు సిగ్గు పడవలసిన దేమున్నది అంటూ తన వస్త్రముల కోసం వంగి చేయి చాచింది . నెలద అందరూ తమ తమ వస్త్రాలు తీసి ధరించుతున్నారు . అరె నా దుస్తులేవీ అన్నది నెలద , అంతా విస్తుపోయారు . చివరగా విప్పింది నేనే మీ దుస్తుల పైనే నావీ ఉండాలి కదా మాయమైనవీ ఎవరైనా చలి వేసి రెండుఏదమ్మా వస్త్రాలు ధరించారా ఏవిటి ? అన్నది అయ్యో లేదమ్మా అన్నారు అందరూ ఏక కంఠం తో మరేమైందే , అపుడే వెలుగు రేఖలు వస్తున్నాయి నా పరిస్థితేంటి ఇల్లు చేరాలి కదా అన్నది నెలద .

అమ్మా మీరు అందరూ యిక్కడే ఉండండి నే క్షణంలో వెళ్లి వేరే దుస్తులు తీసుకువస్తాను అన్నది ప్రభవి . పో మంచి ఆలోచన ఇక్కడున్నట్లు రావాలి సుమా అన్నది నెలద చూపుడు వేలు ఆమె వేపు చూపుతూ . అయ్యో తమరి పై ఆన ఇక్క డున్నట్లే వస్తా అంటూ తమ రధం ఆపి ఉన్న ప్రాంతానికి వెళ్లింది . గుర్రాలు నిలుచుని కునికిపాట్లు పడుతున్నట్లున్నవి . గబగబ రధం ఎక్కి ఒక్క సారిగా కళ్లాన్ని అదిలించింది . రధం పరుగందుకుంది . అరె ఇందరి దుస్తులు ఉండగా నావెలా పోయాయి అన్నది నెలద సందేహంగా . మనం క్రుషుని తలచుకున్నాం కదమ్మా నిజంగా వచ్చాడేమో అన్నది చంచల . ఆ అవునే మనం గోపికల రూపాలమని ఆ కన్నయ్య వెదకుతూ వచ్చినట్లు దెప్పుతూ అన్నది నెలద. మా సంగతి తెలీదు కానీ అమ్మా మీరు మాత్రం రాధికవలెనే గోచరించి ఉంటారు అల్లరిగా అన్నది శాంభవి . కాదు ఇందేదైనా కపటం దాగుందేమో నా దుస్తులే తీయవలిసిన అవసరం ఎవరికుంది . ఈ సమయంలో నేనిక్కడికి జల క్రీడలకు వస్తాననే విషయం ఎరిగిన వారెవరై ఉంటారు ? అన్నది సాలోచనగా నెలద .

అమ్మా క్రూరధరుడు ఏ చేతబడి మంత్రగానికో ఇచ్చేందుకై తీసుకున్నాడేమో గాభరాగా అన్నది రమిత . అయినా చెరలో ఉంటాడు కదా సాధ్యమా అన్నది నెలద అతని అనుయాయులు అతని వంటి మస్తత్వం ఉన్న నేస్తగాళ్ళు బాహాటంగా తిరుగుతూనే ఉన్నారుగా మనం బంధించి పంపింది అతనితో పాటు ముగ్గురు ముఖ్య అనుచరులనే కదా అన్నది ప్రభవి . పర్భా ఇంతకు చేతబడి వంటి మాయ విద్యలు మనుషులను నిజంగా చంపుతాయా అన్నది నెలద . ఏమోనమ్మా మన నగరంలో చాకలి ఓబాలు పై ప్రయోగం జరిగి ఆమె అంతుపట్టని వ్యాధితో తీసుకు తీసుకు చనిపోగా వాళ్లబ్బాయి తూర్పు దేశానికి వెళ్లి తిరగ చేతబడి చేయించగా మళ్లీ బతికిందని చెప్తుంటారు . ఇపుడామె చక్కగా బట్టలు ఉతుక్కుంటూ గాడిదల మేపుకుంటూ ఆరోగ్యంగా ఉన్నదట అన్నది శాంభవి . మనం తప్పక ఆమెను చూడాలి ఓసారి అన్నది నెలద , ఈ మాటల్లో ఉండగానే ప్రభవి పరుగున దుస్తులు తీసుకు వచ్చేసింది . అరె తెచ్చెసిందీ ఏమైనా ప్రభవి నాకు ప్రభ అన్నది నెలద . అందరూ ఆమెను చుట్టూ ముట్టి దడిలా నిలబడగా వస్త్రాలు కట్టుకుని పదండే అన్నది నెలద . తూరుపు తొలి సంధ్య ఎరుపుతో శోభాయమానంగా వెలుగుతోంది . మరి కాసేపటికి భళ్లున తెల్లారిపోతుంది . అమ్మ చివాట్లు పెడుతుంది అంటూ రధం ఎక్కింది నెలద అశ్వాలు పరుగందుకున్నాయి .

– సుమనకోడూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

One Response to నెలద-7 (ధారావాహిక )- సుమనకోడూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో