గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

ఇంత ఇంట్లోనూ మసలేది దంపతులు ఇద్దరే. బంధువులపిల్లల్ని చదువులనిమిత్తం ఇంట్లో వుంచుకుంటున్నారు. వారు అరుగు మీద గదిలో చదువుకొని అక్కడే పరుంటారు. స్నాన భోజనాలకు మాత్రమే వారు ఇంటిలోకి వచ్చేది. కార్యార్థులై కాకినాడ వచ్చిన మిత్రులూ పరిచయస్తులూ, భోజనాలు హోటల్లో కానిచ్చుకొని పడమటి అరుగు మీద వున్న విశాలమైన గదిలో విశ్రమించేవారు. పెరటివైపు వున్న కొంత భాగం తమ వంటి యువ దంపతులకు అద్దెకు ఇచ్చారు శాస్త్రి గారు.

కాసులుకు ఆవు పాల కోసం ఆవును కొన్నారు శాస్త్రి. అది పడమటి ఆవు ఒంగోలు జాతిది. ఒంగోలు జాతి ఆవులు, ఎడ్లు ప్రసిద్ధి అయినవి. ఆవులు ఎత్తుగా తెల్లగా వుంటాయి. కాటుక కళ్లతో, కురచ కొమ్ములతో అవి నందినీ ధేనువును తలపిస్తూ వుంటాయి. ఆ ఆవు వట్టిపోయే సమయానికి కాసులుకు పాలు లోపం రాకుండా మరో ఆవుని కొన్నారు శాస్త్రి. పాత ఆవును తమ రైతుకు చెరిసగం పాలికి ఇచ్చారు. తండ్రి ఆవులనైతే కొన్నారు కాని ఆ పిల్ల చెంచాడు పాలు కూడా తాగేది కాదు. సీతమ్మ గారు చాలా బాధపడి చల్లచిత్త, పెరుగు మీద పేరిననెయ్యి అనే నోములు పట్టి యధావిధిగా ఉద్యాపనలు చేసారు.

చల్లచిత్తనోముకు రోజూ చల్ల చిలికేటప్పుడు క్రిందపడ్డ చల్లబిందువులలో పసుపు కలిపి ఒక ముత్తయిదువుకు ఆ పసుపు బొట్టు పెట్టాలి. పెరుగు మీద పేరిన నెయ్యి నోముకు శేరుంపావు ఆవుపాలు ఎర్రగా కాచి తోడుపెట్టి, ఆ పెరుగుపై ఇంత పేరిన నేతి ముద్ద పెట్టి రవికల గుడ్డ దక్షిణ తాంబూలాలతో ముత్తయిదువుకు వాయినం ఇవ్వాలి. ఈ రెండు నోముల కథ ఒకే విధంగా వుంటుంది. ఒక ఇల్లాలికి ఇంటి నిండా ఎంత పాడి వున్నా పాలు, పెరుగు, వెన్న నెయ్యి సహించేవి కాదు. అందరూ ఆమెను పరిహసించేవారు. ఆమె అర్ధానడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తూంటేకారణం అడిగేరు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై ఆర్చేవారా? తీర్చేవారా? మీకెందుకు మీ దారిన మీరు వెళ్ళండి అంది ఆ యువతి. ఆర్చేవారమూ మేమే. తీర్చేవారమూ మేమే చెప్పవమ్మా అన్నారు పార్వతీ పరమేశ్వరులు. నీవు క్రితం జన్మలో ఇంటి నిండా పాడి వుండి పాలు, పెరుగూ ఎవరికీ పోయలేదు. మురుగపెట్టి పశువుల కుడితి తొట్ట్టిలో పోశావు. అందువలన ఈ జన్మలో నీకు ఇలా వచ్చింది. నీవు ఇంటికి వెళ్ళి, చల్లచిత్త , పెరుగుమీద పేరిననేయి నోములు పట్టి ఉద్యాపన చేయి నీకు పాలు పెరుగు ఇష్టం అవుతాయి. అని చెప్పారు.

ఆ స్త్రీ ఆ విధంగా చేసాక ఆమెకు పాలూ, పెరుగు ఇష్టం అయ్యాయి. సీతమ్మగారు కూతురు కోసం ఆ నోములు పట్టి యధావిధిగా ఆచరించేరు. పశువులకు తమను పెంచే వారితో విశేష అనుబంధం ఏర్పడుతుంది. అవి తమకు అలవాటుగా మేతవేసే వారి చేతి మేతకాని తినవు. రోజు పాలుపిండే వారి చేతనే గాని పాలుచేపవు. శాస్త్రి గారికి గోసేవ చాలా ప్రియమయినది కదా. వారు ఉదయం, మధ్యాహ్నం నిద్ర లేవగానే ఆవులకు స్వయంగా మేత వేస్తారు. చిట్టు తౌడు, ఉలవలు, కుడితి పనివారు పెట్టినా కూడా వుండి పర్యవేక్షిస్తారు. రాత్రి పడకోబోయేముందు చేతి లాంతరు తీసుకొని వెళ్లి స్వహస్తాలతో వాటికి మేత వేస్తారు. ఎప్పుడైనా ఒంటిలో బాగోక శాస్త్రి గారు మేత వెయ్యకపోతే అవి కట్టుకొయ్యవద్ద నిలిచిపోయి మేత మెయ్యవు. శాస్త్రిగారు భార్య సహాయంతో వెళ్లి మేత వేసాకనే తింటాయి. భాగవతంలోలా వారు వారి ఇంటికి వచ్చిన ఇంట పుట్టిన పశువులకు చక్కని పేర్లు పెట్టి ఆ పేర్లతోనే వ్యవహరిస్తారు. పండుగలు, పబ్బాలు వచ్చి ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే వాటిని అత్యాదరంగా ఆవుకు తినిపిస్తారు. మనుష్యులతో పశువులకు గల ఈ అనుబంధం అబ్బురమైనది.

శాస్త్రిగారి ఇంటిలోకి స్వాతంత్ర సమరయోధులు రామ్మోహన్రావు గారు అద్దెకు వచ్చారు. వారు యువకులు ఇంచుమించుగా శాస్త్రిగారికి సమవయస్కులు. సహాయ నిరాకరణోద్యమంలో చదువు మాని పిమ్మట బందరులో జాతీయ కళాశాలలో చదివారు. ఉప్పుసత్యాగ్రహంలోనూ, వ్యష్టి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. తొమ్మిది గంటలకల్లా వారి ఇంట వంట భోజనాలు ముగుస్తాయి. తిరిగి మధ్యాహ్నం కాఫీల వేళ వరకు ఆమెకు వంటింటి ముఖం చూడవలసిన అవసరం లేదు. ఆమె వారి వంట భోజనాలు ముగించుకొని వచ్చేవరకూ సీతమ్మ గారు పసిపిల్లను చంకదింపడానికి వీలు లేదు. తప్పని సరిjైు పిల్లను దింపి, సీతమ్మ ఏ పని అయినను చేయబోతే సత్యవతమ్మకి కోపం వచ్చేసేది. నేను వచ్చేలోగా అంత తొందరా! నన్ను పిలవరాదా! అనేది ఆమె. అస్తమానం ఎత్తుకుంటే పిల్ల అరకాగిపోతుంది. (వేడి చేస్తుంది) అని డాక్టర్ గారు అంటున్నారు. అంటే అయితే ఎత్తుకోను లెండి అని ఆమె కాళ్లు చాపుకొని ఆ కాళ్లపైన ఒత్తుగా బొంతలు వేసి పిల్లను పడుకోబెట్టుకొని కాళ్లు ఊపుతూ, పాటలు పాడుతూ పిల్లను ఆడిరచేది ఆమె.

పిల్లకు మూడవ ఏడు వచ్చేక తమకు మగ బిడ్డ కలగాలనే ఆశ దంపతుల్లో బలపడసాగింది. శాస్త్రి గారు పిల్ల జాతకం పరిశీలించారు. ఈ పిల్లకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కలిగి వర్థిల్లే స్థితి వుంది. పుట్టిల్లు, అత్తిల్లు ఈ పిల్ల వలన సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతుంది. బాలారిష్టాలు బాగా వున్నాయి అవి దాటి పోతే మరి పరవాలేదు. పదకొండు ఏళ్ళు నిండే వరకూ గండాలు కనిపిస్తున్నాయి. 11వ ఏట పెద్ద గండం అది దాటిపోతే 16, 20 సంవత్సరాల్లో ఛాయామాత్రంగా దోషాలున్నాయి. అవి దాటిపోతే మరి పరువాలేదు. సౌభాగ్యవతి, పూర్ణాయుష్కురాలు, సిరి సంపదలూ, సంతానం కలది అవుతుంది. కనిపించిన దేవుని విగ్రహానికల్లా తమ్ముని ఇమ్మని ఆ బాల చేత మ్రొక్కించే వారు తల్లి తండ్రులు. కాసులుకు నిజంగానే తమ్ముడు పుట్టాడు. పుత్రోత్సాహం చేసుకున్నారు దంపతులు. కాసులునూ వాళ్ల అమ్మమ్మని ఎడ్ల బండిలో పంపి తెలిసిని వారికల్లా కాసులు చేతుల మీదుగా మిఠాయి పంచిపెట్టించారు. దశరథ మహారాజుకు శ్రీరాముడు పుట్టినట్లుగా మా డాక్టర్ గారికి వంశోద్ధారకుడు పుట్టాడు. ఇదంతా ఈ శాంతమ్మ చలవ అని ఆప్తులు కాసుల్ని ముద్దు చేయసాగారు. 10వ రోజున ఊళ్లో పురుటి చమురు పంచారు. పంచదార చిలకలు, బుల్లి ఇత్తడి గిన్నెల్లో నువ్వుల నూనె. పసుపు, సున్ని పిండి, కుంకుడు కాయలు తెలిసిన వారికందరికి పురిటి చమురు పంచారు.

 – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో