నృత్య సంహిత – అరసి

IMG_4257సంప్రదాయ నాట్య ప్రదర్శనలో అరుదైన ప్రదర్శనగా వినిపించే నాట్యం “సింహ నందిని “. ఈ పేరు వినగానే ప్రస్తుత కాలంలో గుర్తుకు వచ్చే పేరు ఓలేటి రంగ మణి . సింహనందిని , మయూర కౌతం , మహాలక్ష్మి ఉద్భవం వంటి అద్భుతమైన ఆలయ నాట్యాలను తండ్రి వద్ద నుంచి అభ్యసించారు రంగ మణి . ఎంతో మంది శిష్యులను తయారు చేసి దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చారు . గజేంద్ర మోక్షం , హరిత భారతి , మానవా ! మానవా !, కుమారసంభవం , తారకాసుర సంహారం , దశావతారాలు నృత్య నాటిక , సమైక్య భారతి మొదలైన నృత్య నాటికలను స్వయంగా రూపొందించి , గత 34 సంవత్సరాలుగా కూచిపూడి నాట్యం లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి , మరెన్నో పురస్కారాలు అందుకున్నారు శ్రీమతి ఓలేటి రంగ మణి . ఆమె రచించిన గ్రంధం “నృత్య సంహిత “.

ఈ పుస్తకం సి . ఆర్ . ఆచార్య గారి జీవిత చరిత్ర . సి .ఆర్ .ఆచార్య పూర్తి పేరు చిలకమర్రి రామా చార్యులు. నాట్యమే ప్రాణంగా బ్రతికిన వారు ఆచార్యులు . ఒక మహా వ్యక్తి అన్నట్లు మానవుడు ఒక సంఘ జీవి . అలాగే ఒక వ్యక్తి జీవిత చరిత్ర చదవడం అంటే కేవలం ఆ వ్యక్తి తాలుకు చరిత్రను తెలుసుకోవడమే కాదు . ఆ వ్యక్తి కి సంఘంతో ముడిపడిన ఇతర విషయాలు , సమాజ స్థితిగతులు పై కూడా అనువంశికంగా సమగ్రమైన సమాచారం అభిన్స్తుంది . సి . ఆర్ . ఆచార్య జీవిత చరిత్రలో భాగంగా కూచిపూడి చరిత్ర , భాగవత మేళ అయిన ప్రక్రియ కూచిపూడి నాత్యంగా మార్పు చెందిందో తెలుస్తుంది .

ఆచార్యులు నాట్యం నేర్చుకున్న విధానం ఆయనకు నాట్యం పైగల తపనను తెలియజేస్తాయి . కూచిపూడికి నడుచుకుంటూ నాట్యంలో శిక్షణ పొందేవారు . తినడానికి ఏమి లేకపోతే అక్కడ చెరువులో నీళ్లు తాగి కడుపు నింపుకున్న సందర్భాలు ఉన్నాయి . వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రీ గారి వద్ద నాట్యంలో శిక్షణ పొందారు . 1930 లో రాజ్యం లక్ష్మి తో ఆచార్యుల వివాహం జరిగింది . ఈ సందర్భంలో అప్పటి నూజివీడు సంగతులు , స్థితిగతులు వివరించారు రచయిత్రి . నాట్యాభ్యాసం అనంతరం ఆచార్య గారు మొదటిగా ఏలూరు లో నృత్యంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు . గుడిమెట్ల కృష్ణ ఆచార్యుల గారి మొదట నృత్య శిక్షణలో చేరిన ప్రధముడు . తరవాత కాలంలో శ్రీ సుబ్బారావు , యామిని కృష్ణ మూర్తి మొదలైన ప్రముఖులు ఆచార్య వద్ద నాట్యం లో శిక్షణ పొందారు .

గుజరాత్ లో స్థిర పడిన మృణాళీని శరభాయ్ ప్రోత్సాహంతో ఆచార్యులు గారు అహ్మదాబాద్ లో కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు . ఆచార్యులు గారి జీవితంలో మద్రాసు కూడా ఒక మజిలి . అక్కడ విశేషాలను రుక్మిణి అరండేల్ , చూడామణి వారి మాటల్లోనే వారి భావాలను అందించారు . పార్వతి , కె .వి . సత్యనారాయణ , నరసింహ మూర్తి , సత్య నారాయణ శర్మ గారు , పసుమర్తి వేణు గోపాల కృష్ణ శర్మ , కేశవ ప్రసాద్ . చైనా సత్యం మాస్టారు , అడయార్ లక్ష్మణ్ , వారి మాటల్లో ఆచార్యుల వ్యక్తిత్వం , నాట్యం పై వారికి గల దీక్ష , పట్టుదల తెలుస్తాయి .

ఆచార్యులు గారు ప్రదర్శనల వైపు ఎక్కువ దృష్టి పెట్టలేదు . థీరిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం , పరిశోధించడం వాటిని శిష్యులకి నేర్పించడం మీదనే దృష్టి పెట్టారు . కరణములు , జావళీలు , పదాలు వాటిపై పరిశోధన చేసారు. 19 50 లో మండోదరి శపథం కీర్తన రాసి అద్భుతంగా నాట్యాన్ని కూర్చారు . శివసప్త తాండవాలు , పార్వతీ లాస్య తాండవాలు , అలిమేలు మంగ విలాసం , త్రిపుర సుందరీ తాండవం , తారకాసుర సంహారం, అర్ధ నారీశ్వరం మొదలైన నృత్య నాటికలను రూపొందించడం ఒక ఎత్తు అయితే , మరొక కోణం ఆలయ నాట్య సంప్రదాయంలో రూపొందించిన ప్రేంఖీణీ నృత్యం .

మొదటగా భారతావర్ణం అనే గ్రంధం నుంచి ఆది భరతం , నంది భరత అంశాలలో సింహ నందిని నాట్యం గురించి తెలుసుకున్నారు . సరస్వతి మహాల్ గ్రంధాలయంలో లభించిన ఆధారాలతో మరికొంత పరిశోధన చేసారు ఆచార్యులు . చిత్ర నాట్యం అంటే కాళ్లతో నాట్యం చేస్తూ బొమ్మలు గీసే వారని తెలుసుకున్నారు . అప్పుడే అమ్మవారి ఆలయాలలో సింహనందిని తాళం , కుమారస్వామి ని తమిళులు మురుగన్ అని పిలుస్తారు . కుమారా స్వామి వాహనం నెమలి . సింహనందిని పద్దతిలోనే నెమలి బొమ్మ గీసేవారని తెలుసుకున్నారు . అనేక గ్రంధాలు చదివి సింహం బొమ్మ గీసే సమయంలో సింహనందనం అనే తాళం వినియోగించి ఉండవచ్చునని తెలుసుకుని ఆ నాట్యానికి రూపకల్పన చేసారు ఆచార్యులు గారు .

ఎంతో మంది శిష్యులకు నాట్యం లో శిక్షణ ఇచ్చిన , నాట్యం లో ఎన్నో విషయాల పై పరిశోధన చేసిన ఆచార్యులు గారు తన చివరి దశలో కాన్సర్ వ్యాధితో బాధపడ్డారు . చివరకు 1998 లో తుది శ్వాస విడిచి ఆ శివునిలో ఐక్యమయ్యారు .

ఈ పుస్తకంలో అనుబంధంలో కూచిపూడి నాట్య కళాకారులు ప్రదర్శించే బాల గోపాల తరంగం , మండోదరి శపథం , సంధ్యా తాండవం , ఆనంద తాండవం , అలమేలు మంగ విలాసం , ఉలూచి – అర్జున నృత్య నాటిక , అర్ధనారీశ్వర , అమృత మధనం , అష్ట పది , త్రిపుర సుందరీ , లాస్య తాండవం , పదాలు , జావళీలు , కూచిపూడి గోపికా గీతం మొదలైనవి ఇవ్వడం జరిగింది . అంతే కాకుండా పుస్తకం లో అవసరమైన చోట ఆచార్యుల జీవితంలో ని ముఖ్య ఘట్టాలలోని అరుదైన ఛాయా చిత్రాలను కూడా రచయిత్రి ఈ గ్రంధంలో పొందుపరిచారు . ఆచార్యుల వారి జీవిత చరిత్రను సమగ్రంగా అందించడంలో రచయిత్రి ప్రయత్నం ఫలించింది . అన్నట్లు రచయిత్రి ఎవరో కాదు ఆచార్యుల వారి కుమార్తె కావడం వలన కూడా ఆచార్యుల వారి జీవిత విషయాలను అన్ని పొండుపరచగలిగారు అనడంలో అతిశయోక్తి లేదు .

సమాజంలో తమ కంటూ ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న వారి జీవిత చరిత్రలను తెలుసుకోవడం అంటే వారి వ్యక్తిత్వంతో పాటు ఆ కాలంలో. ఆయా ప్రాంతాలలోని స్థితిగతులను గురించి కూడా తెలుసుకోవడమే కదా , శాస్త్రీయ నాట్యం లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగిన ఆచార్యుల వారి జీవిత చరిత్ర అంటే శాస్త్రీయ నాట్యం లోని కోణాల్ని దగ్గర నుంచి చూసినట్లే లెక్క .

కేవలం శాస్త్రీయ నాట్యాన్ని అభ్యసించే యువ కళాకారులే కాకుండా , నాట్య ప్రియులు కూడా చదవాల్సిన ఒక మంచి పుస్తకం .

– అరసి

ప్రతులకు :
శ్రీమతి రంగ మణి ,
ఇంటి నెం :103 , V.S.M.Residency
Nallkunta, Hyderabad-44,
Email: voletirangamani [at] gmail [dot] com
Cell:9849141453.

పుస్తక సమీక్షలు, , , , , , , , , , Permalink

One Response to నృత్య సంహిత – అరసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో