లలిత గీతాలు – స్వాతీ శ్రీపాద

ఈ రేయి ఇలా ఆగిపోనీ
ఈ క్షణం ఇలా నిలిచిపోనీ
అలసిపోని వెన్నెలతో అలా తిరిగి వచ్చేందుకు
వెలసిపోని వెలుగులతో మనసుమాట చెప్పేందుకు
ఈ రేయి ఇలా ఆగిపోనీ ……..

విరిపూలై విరబూసిన విప్పారిన అందాలను ’కనురెప్పలార్చి చూడాలని’
చెప్పలేని సోయగాల నిశ్సబ్దపు నిమ్నగలను మౌనం
మునివేళ్ళతో తాకాలని
అలల తుళ్ళింతల పులకరింతలు కళ్ళారా తనివిదీర దోసిళ్లతొ తాగాలని
గాలి తలల గమకాలతొ చుక్కలకే బాట వేసి
చూపుల తపనల కధ విప్పాలని
ఈ రేయి ఇలా ఆగిపోనీ……………

ఏనాడో చిన్ననాడు ఎగరేసిన పతాకాల రెపరెపలూ
ఎండ కూడ చల్లననీ ఏమార్చిన అనుభూతులు
ఏర్చికూర్చి మధురమైన మాలలల్లుకుందామని
మధురమైన జ్ఞాపకాల మనికి మరచిపోదామని
ఈ రేయి ఇలా ఆగిపోనీ……………….

– స్వాతీ శ్రీపాద 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

లలిత గీతాలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో