బోయ్‌ ఫ్రెండ్‌ – 11(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఒక పట్టు పురుగు లాలాజలం నుండి ఎంత అందమైన పట్టు బట్టలు తయారవుతున్నారు!” అని ఆశ్చర్యపోరుంది కృష్ణ.
”ఛ.ఛ” అసహ్యించుకుంటూ వెనక్కు జరిగింది అరుణ అసంకల్పితంగా.

”మిరు కట్టుకునే చీరలు అందులో నుండే వచ్చారు అరుణా!” నవ్వారు ప్రసాదరావు.

”ఇరవై ఒక్క రోజుల్లో పురుగు ఈ దారాలను తెంచుకోవడానికి ప్రయత్నించి బయట పడ్తుంది. ఆ లోపల వాటిని మరగబెట్టి దారం తీసుకోవాలి. అని చెప్పి కొద్ది దూరంలో దారం తయారవుతున్న చిన్న కుటీరానికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక చిన్న మిషన్ సహాయంతో ఒక చిన్నకుకూన్ నుండి ఇంత ‘బండిల్’ దారాన్ని తీసి దేనికదే విడిగా పెడ్తున్నారు. ఉడకబెట్టాక తెల్లదనంపోరు ఒక రకం క్రీమ్ కలర్ వచ్చింది. దారాలంతా కట్టలు కట్టి ప్రక్కరూములో పడేస్తున్నారు. ఇంకొక ప్రక్క పెద్ద పెద్ద మూకుళ్ళలో’ కుకూన్స్’ మరుగుతున్నారు.

ఈ సందడిలో అందరూ మర్చిపోరునా, మల్బరీ తోటల గురించి, చైతన్య మటుకు మర్చిపోలేదు.
తిరిగి క్వార్టర్స్ వైపు వెళ్ళిపోతున్న రామారావు నుద్దేశించి అన్నాడు-

”మల్బరీ తోట చూపిస్తా నన్నారు”
”అరే! మర్చిపోయాను.” అని నొచ్చుకుంటూ అందరినీ వెనక్కు తిప్పి తోటలోకి తీసుకెళ్ళారు.
ఇంచుమించు పది పన్నెండడుగల ఎత్తులో వున్నారు ఆ చెట్లు. ఐదారు అడుగుల దూరంలో వరస క్రమంగా వున్నారు. వాటి ఆకులను మాత్రమే పట్టు పురుగుల ఆహారానికి గాను ఉపయోగించుకుని, పండ్లను పారేస్తారట. ద్రాక్ష గుత్తులలా ఒక అంగుళం పొడవులో వున్న ఆ నేరేడు రంగు పళ్ళగుత్తి చూడడానికి చాలా అందంగా వుంది. రుచికి కూడా బాగుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా సరదాపడి కోసుకుని తిన్నారు.

ఒక ఎత్తైన చెట్టు క్రింద నిల్చుని చెయ్యెత్తి పళ్ళ గుత్తి నందుకుంటున్న కృష్ణ దగ్గర కొచ్చాడు చైతన్య.
”అమ్మో ! మి పెదాలు ఎంత ఎఱ్ఱగా పండి పోయాయో! నావీ అలాగే వున్నాయా?” అతను అతి సాధారణంగా అన్నట్టు నటించినా అతని మాటల వెనకున్న భావాన్ని గ్రహించిన కృష్ణ ఒక్కక్షణం తెల్లబోరు, సర్దుకుని సన్నగా నవ్వి కదిలి గుంపులో కలిసిపోరుంది.
గులాబి రంగు ఛాయలో గులాబి రంగు దుస్తులతో క్రొత్త ఉత్చాహాన్ని తెచ్చుకుంటూ తోటంతా తానే అరు తిరుగుతున్న అరుణను చూస్తూ అనుకున్నాడు భాను-

”ఎంత అందమైన అమ్మారు అరుణ!” ఆ తర్వాత మురళికి పళ్ళుకోసివ్వడంలో మునిగిపోయాడు.
చింతపల్లి అడవులను సర్వే చేసి వచ్చేసరికి సీలేరు వెళ్ళడానికి ఒక వేన్, ఒక కారు రెడీగా వున్నారు.
మిట్ట మధ్యాహ్నమరునా ఆ కొండ మిద మేఘాల నీడలో, కారు చల్లగా కదిలిపోరుంది. షుమారు మూడువేల అడుగుల ఎత్తులో వున్న చింతపల్లి నుండి కారు ఇంకా ఎత్తు ఎక్కిపోతోంది. ఈ మారు డ్రైవింగ్ రామారావు గారు తీసుకున్నారు. దోవపొడుగునా ఆయన అడవి జాతి మనుష్యుల జీవిత చరిత్ర గురించి చెప్తూనే వున్నారు. కారు కెదురుగా కొందరు అడవి వాళ్ళు. చెంబూ తప్పేలాలతో సహా భార్యా పిల్లలతో తరలిపోతూ కన్పించారు.

”ఎక్కడి కెళ్తున్నారు వీళ్ళు?” కృష్ణ ఆశ్చర్యంగా అడిగింది.
”ఇన్ని రోజులుగా వున్న చోటునుండి మరో చోటు వెతుక్కుంటూ సంసారాలు తరలించుకుపోతున్నారు.”
”ఎంత హాయరున బ్రతుకులు” నిర్మల అంది.

”ఏమి హారు పిన్నీ ! ఒక చోట స్థిరంగా బ్రతక్కుండా ప్రతి చెట్టు నీడనా కాసింత సేపు గడిపి మరో చెట్టును వెతుక్కుంటూ వెళ్ళే ఈ నిర్భాగ్యుల బ్రతుకుల్లో ఏమి హారు వుంటుంది?” అక్క కూతురుతో వాదం పెంచకుండా, చిరునవ్వు నవ్వి ఊర్కుంది నిర్యల.
ఒక చోట కారు ఆపి అన్నారు రామారావు గారు. మనం ఇప్పుడు మూడువేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో వున్నాం. అక్కడ నుండి సీలేరుకు దిగాల్సి వుంటుంది.” అని ఆగి ”ఈ దారంబడే పైకి వెళ్తే ఒక గోపురం కన్పిస్తుంది.” అక్కడకు వెళ్ళి కాసేపు నిలబడి రండి సరదాగా వుంటుంది.
కృష్ణ అనిందే తడవు దిగేసింది. వెంటనే చైతన్య ఆమెను అనుసరించాడు.

”నువ్వూ రాకూడదా పిన్నీ!”
”నేను చాలాసార్లు చూచానులే నాకు కాళ్ళు నొప్పులుగా వున్నారు. మిరు వెళ్ళిరండి”భానుమూర్తి కారు దిగి ”రారా నేస్తం” అని మురళితో ఒక్కడుగు ముందుకేసి ఆగి వెనక్కు తిరిగి చూసాడు. వెళ్తున్న తమ వైపే చూస్తూ దిగులుగా, ముడుచుకుని కూర్చొనుంది అరుణ. ఆ భయస్తురాలిని పిలిచి తనతో తీసుకుపోనందుకు కృష్ణ పరవశం మిద కోపం వచ్చింది భానుమూర్తికి.

‘ఈ కృష్ణ కేం తెలియదు’ మనసులో అనుకుని ”మీరూ రండి అరుణా!” అని పిలిచాడు. అతని పిలుపు కొరకే ఎదురు చూస్తున్నట్టు ఆమె సంతోషంగా దిగి, అతని ప్రక్కనే నడవసాగింది.
నాలుగుడుగులు వేసాక కృష్ణను ఉద్దేశించి అన్నాడు భానుమూర్తి.

”కాస్త ఆగకూడదూ? ఈమె కూడా వస్తున్నారు”

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , Permalink

One Response to బోయ్‌ ఫ్రెండ్‌ – 11(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో