ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ! – మాలా కుమార్

ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ!
రచయిత్రి;పొల్కంపల్లి శాంతాదేవి

20150520_171435 (1)పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవలలలో ” చండీప్రియ ” వకటి . ఇది ముక్కోణపు ప్రేమకథ . అంతే కాదు కథలో ఇంకోకోణము లో కూడా ప్రేమకథ వుంది . కాబట్టి ముక్కోణపు ప్రేమకథ అనలేము . నాలుగు కోణాల ప్రేమకథా ? ఏమిటీ అంతా గజిబిజి గా వుందా ? నవల చదువుతుంటే సాదా సీదా ప్రేమకథలాగే వుంటుంది . కాని హీరోకి ఓ రెండు ప్రేమ కథలు , , , హేరోయిన్ కు ఓ రెండు ప్రేమకథ లు , , , హీరోతమ్ముడికో రెండు ప్రేమకథ లు , , , వాకే . . . వాకే
. . . అసలు కథ చెపుతున్నాను తికమక పడకండి .

దుర్గాప్రసాదరావుగారిది జమిందారీ ఫాయీ కి చెందిన కుటుంబము . ఇప్పుడు జమీందారీ లేకపోయినా ఆ వైభవము , ఆ దర్పము , ఆయనలో , ఆయన బంగళాలో , బంగళాలో ప్రతివస్తువులో చూడవచ్చు . వారి ఇలవేలుపు చండీ పేరు కలిసేలా ” చండీప్రియ ” అని ఆయనకూతురు కు పేరుపెట్టుకున్నారు . రెండేళ్ళ వయసు లో తల్లి నిపోగొట్టుకున్న చండీప్రియ అంటే ఆయనకు ప్రాణము . ఆమె ప్రస్తుతము బి. యే ఫైనల్ పరీక్షలు వ్రాయబోతున్నది . ఆయన స్వతహాగా దయార్ద్ర హృదయులు . అయన బంగళాకి వకవైపుగా కొన్ని పెంకుటిళ్ళు వున్నాయి . వాటిల్లో ఆయన వద్ద పనిచేసే సిబ్బంధి కొద్దిపాటి అద్దె ఇచ్చి వుంటున్నారు . వారిలోనే , ఆయన వద్ద పని చేసి , రెండు సంవత్సరాల క్రితము చనిపోయిన నారాయణ రావు కుటుంబము , ఆయన రెండో భార్య శారదమ్మ , కొడుకు అనిల్ , కూతురు కృష్ణప్రియ కూడా వుంటున్నారు . చండీప్రియ చిన్నప్పుడు వారి ఇంటిలోనే ఎక్కువగా గడిపేది . ఆ పిల్లల తో స్నేహముగా వుండేది . కాని పెద్దది అవుతున్నా కొద్దీ వారి మద్య వున్న అంతరాలు తెలుసుకొని దూరంగా వుండిపోయింది . ఆయింటివారు కూడా దూరముగా వుండిపోయారు కాని అనిల్ మటుకు ప్రియ అంటే ప్రేమ కలిగి చిన్న నాటి స్నేహితాన్ని మర్చిపోలేకుండా వున్నాడు .

చండీప్రియ స్నేహితురాలు శోభ . శోభ అనిల్ ను ప్రేమిస్తూవుంటుంది . ఎలాగైనా అనిల్ తన దగ్గరకు రవాలని , చండిప్రియ కు దూరము కావాలని ఓ ప్లాన్ వేస్తుంది . చండిప్రియ అనిల్ ను ప్రేమిస్తోందని , చెప్పేందుకు సిగ్గుపడుతోందని అనిల్ కు చెపుతుంది . ఆమె మాటలు నమ్మి , ఆమె సలహా తో చండీప్రియకు ప్రేమలేఖ వ్రాస్తాడు అనిల్ . ఆ లేఖ చూసి మండిపడుతుంది ప్రియ . వాళ్ళకు తండ్రి ఇచ్చిన అప్పును వెంటనే వసూలు చేయాలని లేదా వాళ్ళను తక్షణము ఇల్లు ఖాళీచేయించాలని తండ్రి దగ్గర పట్టుపడుతుంది . కూతురు పెళ్ళి కుదిరిందని , పరిస్తితులు చక్క పడ్డాక చిన్నగా అప్పు తీరుస్తామని శారదమ్మ ఎంత వేడుకున్నా వినదు . వారి సామానులు బయటపడేసే సమయానికి వస్తాడు ఇంద్రనీల్ , శారదమ్మ సవితి కొడుకు . ప్రసాదరావుగారి అప్పు తీర్చి , చెల్లెలి పెళ్ళి ఘనముగా జరిపిస్తాడు . అతనికి ఆస్తి ఎలా వచ్చింది అన్నదానికి రక రకాల కథలు ప్రచారములో వుంటాయి . అతను వక మార్వాడి దగ్గర పనిచేస్తూ , ఆ మార్వాడి రెండో భార్య ప్యారిని ప్రేమించాడని , ఆమె సహాయముతో మార్వాడీనీ హత్య చేసి , ఆస్తి దక్కించుకొని ప్యారీ నికూడా ఆక్సిడెంట్ లో చంపేసాడని అంటారు . కాని ఇంద్రనీల్ కవిత అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు . కవిత అచ్చము చండీప్రియ లా గే వుండటముతో మొదటి సారి చండీప్రియను చూసి ఆశ్చర్యపోతాడు ! అతనిని మొదటి చూపులోనే ప్రేమిస్తుంది చండీప్రియ . కాని ఆ ప్రేమను మనసులోనే దాచుకుంటుంది . శోభ అనిల్ తిరస్కారము తో పిచ్చిది అవుతుంది .

బాంబేలో ఇంద్రనీల్ తో కలిసి ఫాక్టరీ పెట్టేందుకు వూరిలోని తమ ఆస్తులన్నీ అమ్మేస్తాడు ప్రసాదరావు . ఆ డబ్బు తీసుకొని వస్తుండగా కొంతమంది దుండగులు ప్రసాద్రావు మీద హత్యా ప్రయత్నము చేసి , ఆ డబ్బును ఎత్తుకెళుతారు . ఆ సమయములో ఇంద్రనీల్ ప్రసాదరావును ఆదుకుంటాడు . వైద్యము చేయిస్తాడు .
ఆస్తులు పోగొట్టుకున్న చండి తండ్రి వైద్యము కోసము పాటలు పాడి సంపాదిస్తూ వుంటుంది . రక రకాల మలుపుల తరువాత , తండ్రి మరణము తో వంటరిదై ఇంద్రనీల్ పంచన చేరుతుంది . ఇక చెప్పేందుకు కేముంది చివరలో తనమీది ప్రేమతో పిచ్చి ఎక్కిన శోభను అనిల్ వివాహము చేసుకుంటాడు . తనను ప్రేమించిన చండీప్రియను ఇంద్రనీల్ పెళ్ళి చేసుకుంటాడు . ఇదీ క్లుప్తముగా ” చండీప్రియ ” నవల కథ .

కోట్లు విలువచేసే ఆత్మవిశ్వాసం,పట్టువిడవని కార్యధీక్ష,అభ్యుదయ పథంలోకి చొచ్చుకుపోయే ఉత్షాహం అతడి సొంతం! ఇంద్రనీల్ వ్యక్తిత్వాన్ని చాలా బాగా మలిచారు. జమిందారిణిగా పొగరుగా , అన్నదమ్ముల మీద పగ తీర్చుకోవాలని ప్రయతించే యువతిగా, ఆ తరువాత నిస్సహాయస్తితిలోనైనా తలవంచని యువతిగా చండీప్రియ పాత్ర ను బాగా చూపించారు. మామూలు ముక్కోణపు ప్రేమకథను చాలా చక్కగా వ్రాసారు రచయిత్రి.సులభమైన శైలి , చదివించే నేర్పు ఈ చండీప్రియను ఏకబిగిన చదివిస్తాయి.

ఇన్ని ప్రేమకథలు ,మలుపులు వున్న చండీప్రియ నవలను 1980 లొ అంజలీ పిక్చర్స్ వారు సినిమా గా తీసారు . ఇందులో , శోభన్ బాబు , జయప్రద , చిరంజీవి , సువర్ణ , అంజలిదేవి , గుమ్మడి , అల్లురామలింగయ్య మొదలైనవారు నటించారు . మాటలు సత్యానంద్ వ్రాయగా , పాటలు , దేవులపల్లి కృష్ణశాస్త్రి , సి . నారాయణ రెడ్డి , వేటూరి సుందరరామమూర్తి వ్రాసారు . పి. సుశీల , యస్.పి బాలాసుబ్రమణ్యం , యస్.పి శైలజ పాడారు . నిర్మాత ఆది నారాయణ రావు , డైరెక్టర్ వి. మధుసూధనరావు .

– మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, , , , , , , , , , Permalink

3 Responses to ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ! – మాలా కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో