మధుర స్వప్నం

Kameswari Chelluri

Kameswari Chelluri

(తొలి కథ)

రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చింది. స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది.

‘అమ్మమ్మా!జాగర్తగా దిగు’ అంటూ నా చేయి పట్టుకుని ట్రైన్ లోంచి నెమ్మదిగా దింపుతోంది నా మనవరాలు శ్రావణి.

నా మనవరాలు అని కాదుకానీ, నిజంగా శ్రావణి పదహారేళ్ళ బాపూ బొమ్మలా ఉంటుంది. చురుకైన పెద్ద పెద్ద కళ్ళు, సన్నని ముక్కు, పలుచని గులాబీ పెదాలు, రింగుల జుట్టు, చక్కని అంగ సౌష్టవంతో ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చాలా అందంగా ఉంటుంది. దాని మనసు కూడా అంతే మెత్తన.

‘తాతా, తాతా, కేరేఫుల్ ‘ అంటూ వాళ్ళ తాత చేయి పట్టుకుని దింపబోయాడు నా మనవడు ధ్రువ. ‘పట్టుకోకు, నేను దిగగలనులే’ అంటూ ఆయన కూడా ట్రైన్ లోంచి దిగారు. ధ్రువకి పదేళ్ళు కానీ పదిహైనేళ్ళ వాళ్లకి వుండే మెచ్యూరిటీ ఉంది వాడిలో. సన్నగా ,పొడుగ్గా వాళ్ళ నాన్నలానే ఉంటాడు. వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో అమెరికా నించి వచ్చారు. వాళ్లకి నేను పుట్టి , పెరిగిన ఊరుని, మా అమ్మా వాళ్ళని చూపించడానికి హైదరాబాద్ నించి రాజమండ్రి తీసుకొచ్చాము. ట్రైన్ ప్రయాణంలో వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. ఫాంటసీ ఫిక్షన్ గురించిట గంటలు గంటలు మాట్లాడుకున్నారు. కాసేపు మాతో కార్డ్స్ ఆడారు. కాసేపు వాదించుకున్నారు. కాసెపు జోక్స్ చెప్పుకుని నవ్వుకున్నారు. వాళ్ళతో ప్రయాణం చేస్తుంటే మాకు అలసటే తెలీలేదు.

రైలు దిగి, రెండు ఆటోల్లో మా అమ్మగారింటికి బయలుదేరాము. ఐదేళ్ళ క్రితం ఇక్కడ ఆటోలే ఉండేవి కావు. అన్నీ రిక్షాలే. అవి కూడా పెద్దవిగా ఉండేవి. వాటిల్లో కూర్చుంటే కుర్చీలో కూర్చున్నట్టే ఉండేది. అదే హైదరాబాద్ లో ఐతే గూడు రిక్షాలు ఉండేవి. ఎత్తుగా ఉండేవి. వాటిల్లో గువ్వపిట్టల్లా ఒదిగి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు అన్నిచోట్లా ఆటోలే. మనం రిక్షాలో కూర్చుని మనిషి చేత లాగించుకోవడం లేదని సంతోషించాలో, ఆటో లు వచ్చాకా ‘పాపం! కొంతమంది ఆదాయం పోయిందని’ బాధ పడాలో తెలీలేదు.

మా ఇల్లు వచ్చింది. అరుగు మీద నాన్నగారు పడక్కుర్చీ లో పడుకుని ఉన్నారు. మమ్మల్ని చూడగానే ‘ఏమేవ్! అమ్మాయీ పిల్లలూ వచ్చారు’ అని మా అమ్మని కేకేశారు. ఆయనకి తొంభై ఏళ్ళు అయినా ఆ దేవుడి దయవలన ఆరోగ్యంగానే ఉన్నారు. గేటు తీసుకుని మాలతి పందిరి దాటి అరుగు మీదకు వచ్చేసరికి అమ్మ కుంకుమ నీళ్ళు తెచ్చి మాకు దిష్టి తీసింది.

పెద్ద అరుగూ. చుట్టూ పూలమొక్కలూ ,పెద్ద హాలూ సంభ్రమంగా చూస్తున్నారు మా మనవలు. లోపలికి వచ్చాకా ‘సో మెనీ రూమ్స్’ అనుకుంటూ ఎన్ని గదులున్నాయా అని ఇల్లంతా తిరిగి చూసొచ్చాడు ధృవ. ‘అమ్మమ్మా! లెవెన్ రూమ్స్’ అన్నాడు ఆశ్చర్యంగా. అవును మరి! 3 బెడ్ రూమ్, 4 బెడ్ రూమ్ ఇళ్ళు తప్ప, ఇన్ని గదులున్న ఇల్లు చూడలేదు వాళ్ళు. ‘పైన ఇంకో రూమ్ కూడా ఉంది చూడు’ అన్నాను నవ్వుతూ. ‘చూద్దురుగాని కానీ ముందు కాళ్ళు కడుక్కోండి టిఫిన్ తిందురు గాని’ అంది అమ్మ . మేము పెరట్లో కుళాయి దగ్గిరకి వెళ్ళాము. అక్కడున్న పెద్ద పనసచెట్టూ దాని మొదట్లోనే కాసిన పెద్ద పెద్ద పనస కాయల్ని చూసి ఆశ్చర్య పోయింది శ్రావణి, ‘ఇంత క్రింద కాస్తాయా కాయలు’ అంటూ.

పిల్లలు టిఫిన్ తిని, మొక్కలు చూడడానికి నాన్నగారితో కలిసి వెళ్లారు. నాన్నగారికీ, అమ్మకీ మొక్కలంటే ప్రాణం. నా చిన్నతనం లో పంపులు ఉండేవి కావు. బావి లోంచి నాన్నగారు నీళ్ళు తోడిస్తే నేను బిందె చంకనెత్తుకుని మొక్కలకి పోసేదాన్ని. రకరకాల క్రోటన్స్, పూల మొక్కలూ, కాయగూరలూ, పండ్ల చెట్లూ అన్నీ వేశారు. తరువాత తోట మాలిని పెట్టారు. నేను అతని వెనకే ఉండి, మొక్కలకి పళ్ళేలు ఎలా చేస్తున్నాడో, ఇటుక ముక్కల్ని పగులగొట్టి త్రిభుజాకారంలో వాటిని మొక్కచుట్టూ పాతిపెట్టి , వాటికి తెల్ల సున్నం ఎలా వేస్తున్నాడో అన్నీ చూసేదాన్ని. కొన్ని నేను కూడా చేసేదాన్ని. ఆ విశేషాలన్నీ మనవలకి చెప్పాను. చెట్లూ, కాయలూ, పూవ్వులూ చూసి మురిసి పోయారు పిల్లలు.

సాయంత్రం నాలుగయింది. రోడ్డు మీదకి వచ్చిన ముంజికాయల వాడిని పిలిచి, ముంజికాయలు తీసుకున్నారు నాన్నగారు. వాటిని ఎలా చిదుపుకుని, రసం తాగాలో పిల్లలకి నేర్పించారు. పిల్లలు ఇష్టంగా తిన్నారు. పైన గదిలో ముగ్గిన మామిడిపళ్ళు తెచ్చి, రసం తీసి ఇచ్చ్చింది అమ్మ. ‘హాయ్! ఫ్రెష్ మాంగో జ్యూస్’ అనుకుంటూ త్రాగాడు ధృవ. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నాన్నగారూ అమ్మా నాకిలాగే అన్నీ తినిపించేవారు. ఇంట్లో రెండు గేదెలు, ఒక ఆవు ఉండేవి. కమ్మటి పాలూ, గడ్డ పెరుగూ, వెన్న కాచిన కమ్మటి నెయ్యీ ఎప్పుడూ మరుపుకు రావు. పురుగుల మందులు వేయకుండా పెంచిన ఆర్గానిక్ మొక్కలవి. అలాంటి స్వచ్చమైన ఇంట్లో పండిన కూరగాయలూ, పళ్ళూ ఇప్పటి పిల్లలకి పట్నాల్లో పెట్టలేక పోతున్నాము కదా!

అమ్మ పిలుపుతో ఈలోకంలోకి వచ్చాను నేను. ‘వీడిని చూడవే’, అంది అమ్మ ద్రువని చూపిస్తూ. ఏమిటా అని చూశాను. స్టోర్ రూములో పైన కొక్కానికి వేల్లాడగట్టిన అరటిపళ్ళ గెలని నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ధృవ. ‘ఏమిటిరా అక్కడేం చూస్తున్నావ్’ అన్నాను నవ్వుతూ. అమ్మమ్మా! అది అక్కడెందుకు పెట్టారు?’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘అది పళ్ళ గెల. కింద పెడితే, కింద పళ్ళు పాడవుతాయి. అందుకని పైన కట్టారు. పళ్ళు ముగ్గుతుంటే అక్కడ్నించే కోసుకు తినాలి’ చెప్పాను వాడికి అర్థమయేట్లు. అమెరికాలో పుట్టిపెరిగిన వీళ్ళకి మన ఊళ్ళల్లో జరిగే చాలా విషయాలు తెలియవు. ఇవన్నీ చూపించడానికే ఇక్కడికి తీసుకువచ్చాను. నా కోరిక తీరుతోంది. అమ్మా,నాన్నగారికి నా మనవాలని చూపించాలని, వాళ్ళతో సంతోషంగా గడిపితే చూడాలనే ఆశ కూడా తీరుతోంది.

ఇంకో నాలుగు రోజులకి సెలవు తీసుకొని మా అమ్మాయిలూ, అల్లుళ్ళూ వచ్చారు. వాళ్ళని కలవడానికి మా అన్నయ్యా, వదినా, అక్కా, బావగారూ, చెల్లెళ్ళూ, మరుదులూ పిల్లలతో, మనవలతో వచ్చారు. ఇల్లంతా సందడే సందడి. పెరట్లో నీళ్ళ కాగు దగ్గిర వదినా, వంటల దగ్గిర మా అక్క చెల్లెళ్ళం నడుం కట్టాము. పిల్లలకి వాళ్ళ అమ్మలు స్నానాలు చేయించడం, తలలు దువ్వడం పనుల్లో ఉన్నారు. మగవాళ్ళు సరదాగా పేకాటలో పడ్డారు. సరదా కబుర్లూ, ఛలోక్తులూ జోరుగా సాగుతున్నాయి. మా అమ్మా, నాన్నగారూ అందర్నీ చూసుకుని మురిసిపోతున్నారు. ఎంత కన్నుల పండుగగా ఉంది!

దబదబా ఎవరో తలుపు కొట్టిన చప్పుడయింది. చటుక్కున లేచాను. చుట్టూ చూశాను. కాసేపు ఏమీ అర్థం కాలేదు. టైం చూస్తే పొద్దున్న 6గంటలు అయింది. పక్కన మావారు గుర్రుపెట్టి నిద్ర పోతున్నారు. ‘అమ్మా’ పనిమనిషి మళ్లీ తలుపు కొట్టింది. జరిగినదంతా ‘కల’ అని తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. తెలిసాకా చాలా విచారం అనిపించింది. పిల్లలు ఏడాదికి ఒకసారి వస్తారు. పది రోజులకన్నా టైం ఉండదు. ఉన్నావాళ్లకి చూపించడానికి ఇప్పుడు ఏముంది?

అమ్మా, నాన్నగారితో పాటూ ఆ ఇల్లు కూడా కాలగర్బ్హం లో కలిసిపోయింది. దాని స్థానంలో అపార్ట్ మెంటు వచ్చేసింది నాన్నగారు ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కల్లో ఒక్కటి కూడా లేదు. అమ్మ పూజ చేసుకునే తులసికోట కూడా లేదు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఎంత మధురమైన కల వచ్చింది! అది నిజం కాకపోయినా, దాని మాధుర్యం నన్ను వదిలి పోలేదు.

– కామేశ్వరీ దేవి చెల్లూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, తొలి కథPermalink

28 Responses to మధుర స్వప్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో