కృష్ణగీత(కాలమ్) –లైసెన్స్ టు రేప్ – కృష్ణ వేణి

 

కృష్ణ వేణి

Marriage and Morals అన్న పుస్తకంలో బెర్ట్రాండ్ రస్సెల్ ఇలా రాసేరు –“Marriage for a woman is the commonest mode of livelihood, and the total amount of undesired sex endured by women is probably greater than in prostitution”

మారిటల్ రేప్ మీద కొన్ని రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకి రసెల్ కోట్ పూర్తిగా అన్వయిస్తుంది.

ఫిబ్రవరి 2015 లో ఒక మారిటల్ రేప్ విక్టిమ్ సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. Human Rights Law Network ఆమె పిటిషన్ని ఫైల్ చేసింది. కానీ అది నిరాకరించబడింది.

ఆమె మొహమ్మదీయుల కుటుంబానికి చెందిన అమ్మాయి. భర్త హర్యానాకి చెందిన బ్రాహ్మణ కులం అతను అవడం వల్ల తన మతం మార్చుకుందామె. అత్తగారింట్లో ఈమెని వంటింట్లోకి రానిచ్చేవారు కారు. అంటరానిది అనేవారు. తను అనారోగ్యంగా ఉన్నాకానీ భర్త సెక్స్ కావాలనేవాడు. కాదంటే తలగడా మొహం మీద పెట్టి వత్తి హింసించేవాడు. ఒక్కో రాత్రీ కనీసం అయిదారుసార్లు చెంపలు బద్దలు కొట్టేవాడు. ఎన్నోసార్లు ఆ దెబ్బలకి తాళలేక హాస్పిటల్లో చేరిందామ్మాయి. ఎనిమిది- తొమ్మిది నెల్లు ఓర్చుకుంది.

”నా తప్పేముందని మీరిలా హింసిస్తున్నారు? ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నాం కదా!” అని ఆమె అడిగిన రాత్రి భర్త ఆమె తలమీద కర్రతోనూ, టార్చ్ లైట్తోనూ 18 సార్లు కొట్టేడు. ఆ తరువాత ఆ టార్చ్ లైట్ని భార్య వెజైనాలోకి దూర్చి ఆమె బాధతో విలవిలలాడుతుండగా, ఆమె మణికట్టుమీద కత్తి పెట్టి కోసేడు. రెండు చోట్లనుండీ రక్తస్రావం జరిగి రెండు నెల్లు హాస్పిటల్లో ఉందామె.

ఇంక సహించలేక ఆ అమ్మాయి సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. అప్పుడు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయకుండా, ఆమెని CAW  సెల్లో ఉంచేరు. ‘ఎలాగో అలాగ రాజీపడి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా ఉండమని’ CAW ఆమెకి సలహా ఇచ్చింది. ‘ఈ కాలపు ఆడపిల్లలకి సర్దుకుపోయే గుణం లేదు. ఓరిమి తక్కువ’ అని ఆమెని దెప్పేవారు ఆ సెల్లో. భర్త కోర్టుకొచ్చినప్పుడల్లా ఆమె భయపడుతూ గడిపేది. భర్తేకాక అతని మొత్తం కుటుంబం వచ్చేది కోర్టుకి.

ఈ కేసులో మెడికల్ రిపోర్టులున్నాయి. అన్నిటికీ రుజువులున్నాయి. అయినా కోర్ట్ – ‘నీది ఇండివిడ్యువల్  కేస్, జనహితైకమయిన వ్యాజ్యెం కాదు. పెళ్ళి అనేది పవిత్ర బంధం “- అంటూ ఆ ఫిర్యాదుని త్రోసిపుచ్చింది.

వీడియో చూడండి.

ఇలాంటి మరెన్ని కేసులు రావాలో పార్లమెంట్ /ప్రభుత్వమూ, సుప్రీమ్ కోర్టూ మేలుకోవాలంటే!

నిర్భయా రేప్ కేస్ తరువాత భారతదేశపు ప్రభుత్వం రేప్ చట్టాలని ధృడపరచి, శిక్షలు ఎక్కువ చేసిన సరిగ్గా ఒక సంవత్సరం తరువాత వెలువడిన తీర్మానం ఇది.

జస్టిస్ వర్మా కమిటీ- మారిటల్ రేప్‌ని కూడా నేరంగా పరిగణించమంటూ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భర్త భార్యని రేప్ చేసిన సందర్భంలో అతనికి శిక్ష పడాలని యునైటెడ్ నేషన్స్ సహితం సలహా ఇచ్చింది. ‘వివాహ వ్యవస్థ నాశనం అయే అవకాశం ఉందంటూ’ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనని త్రోసిపుచ్చింది.

గజియాబాదులో ఒక వ్యక్తి తన భార్యకి మత్తు పదార్థం తినిపించి రేప్ చేసిన సందర్భంలో, ఇండియన్ రేప్ చట్టాలు పెళ్ళయిన జంటలకి వర్తించవని సుప్రీమ్ కోర్ట్ తేల్చి చెప్పింది.

భార్యని చెంపదెబ్బ కొట్టి, ఆమె కనుక ఫిర్యాదు చేస్తే భర్తని అరెస్ట్ చేస్తారు కానీ భార్యని రేప్ చేస్తే మాత్రం శిక్షేదీ పడదు మన చట్టప్రకారం. హాస్యాస్పదంగా లేదూ!

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం భర్తల వల్ల రేప్‌లకి గురయే స్త్రీలకి ఏ రక్షణా కల్పించలేదు కానీ గృహహింస కేసుల్లో అయితే జోక్యం కలిగించుకోగలదు. ‘స్త్రీలకి అపాయం కలిగే చోటు ఇళ్ళల్లోనే ఎక్కువ. సలహా అడగండి. సహాయం తీసుకోండి. ఆలస్యం అయేవరకూ ఆగకండి. కనీసం గృహహింసకి ఐపిసి 498 A కింద కొద్దిపాటు శిక్షైనా పడుతుంది.”–అంటారు కవితా క్రిష్ణన్.

ఇటీవలె అనేకమైన దేశాలు భర్త భార్యని బలాత్కారం చేయడం నేరం అన్న చట్టాన్ని రూపొందించేయి. నేపాల్, ఘనా వంటి దేశాలు కూడా మారిటల్ రేప్‌ని చట్టవిరుద్ధం చేసేయి. మనమెందుకు ఇంకా వెనకబడే ఉన్నాం అని అడగడం కూడా నిరర్థకమేనేమో!

అపరిచిత పురుషులనుంచి ఎదురుకునే లైంగిక దాడుల కన్నా భర్తలు చేసే బలాత్కారాలే 40 శాతం ఎక్కువ భారతదేశంలో. అయినప్పటికీ వైవాహిక బలాత్కారం చట్టబద్ధమైనదే. క్రిమినల్ (ఎమెండ్‌మెంట్ ) ఏక్ట్ 2013- భర్త తన భార్యతో( పదేహేనేళ్ళ వయస్సు ఉన్నదయితే) జరిపే బలవంతపు లైంగిక సంభోగం లేక లైంగిక చర్య రేప్ కాదని చెప్తుంది.  బలవంతం జరిగిందన్న ఏ శారీరిక గుర్తులూ కనపడకపోతే- చట్టప్రకారం ఆమెకి ఏ అవలంబం ఉండదు.

భర్తనుండి వేరుపడి జీవిస్తున్న స్త్రీలకి ఉన్న భయాలని వాక్యాంగం  376B  సంబోధిస్తుంది. నిజమే. కానీ ఒక చట్టబద్ధమైన, ప్రామాణికమైన వివాహబంధంలో ఉంటూ, రోజూ ఈ లైంగిక అగౌరవాలని ఎదురుకుంటున్న స్త్రీలకి అది ఏ విధంగా సహాయం చేయగలదు?

నిజానికి, పాశ్చాత్య దేశాల్లో కూడా మారిటల్ రేప్ గురించి భర్తల మీద ఈ నేరారోపణ చేసే మహిళలకి పరిష్కారం విడాకుల రూపంలోనే దొరుకుతోంది.

భర్త భార్యని హింసించమని ఏ చట్టమూ చెప్పదు. నిజమే, కానీ జరుగుతున్న హింసని ఆపను కూడా లేకపోతోంది మన న్యాయవ్యవస్థ.

నాలుగ్గోడల మధ్య జరిగే సంఘటనని బయటకి వచ్చి ఎంతమంది నిరూపించగలరు? ‘మారిటల్ రేప్ నేరం’ అన్న చట్టం అమలులోకి వస్తే, అది దుర్వినియోగం అవుతుందంటూ ఆలస్యం చేస్తూ ఉంటే, జరుగుతున్న అనర్థాలకి అంతం అంటూ ఉండదు. నిజానికి, ప్రతీ ఒక్క చట్టమూ దుర్వినియోగం అవుతోంది. అలా అని చట్టమే ఉండకూడదంటే ఎలా! తప్పుడు కేసులు వేసేవాళ్ళకి శిక్ష పడే వెసులుబాటేదైనా ఉన్నప్పుడు, అబద్ధపు ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేయడానికి స్త్రీలు ముందుకి రావడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ముందే నిర్ణయించుకునే కేస్ వేస్తారు. కాబట్టి విశదంగా బై లాస్‌ని అమలుపరచాలి.

రేప్ రేపే. ఒక స్త్రీ మీద లైంగికదాడి చేసిన ఎవరైనా ఒక రేపిస్టే. అది ఒక అపరిచితుడైనా, తెలిసినవాడైనా లేక భర్తైనా కూడా.

రేప్‌ని నేరంగా పరిగణించాలా వద్దా అన్న వివాదం ఇండియాలో అనేక సంవత్సరాలుగా నడుస్తోంది. లా కమిషన్ 2000 లో కూడా మారిటల్ రేప్‌ని  గుర్తించింది. కానీ 2015 వరకూ కూడా, మనం ఇంకా ముందుకి కదల్లేదు.

ప్రభుత్వం ఇచ్చిన తీర్పు సంగతికి వస్తే, మన దేశ సంసృతిలో విడాకులే సాంప్రదాయమైనవి కావు. మరి అలాంటప్పుడు వాటికోసం సంవత్సరాల తరబడి జనులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాదా! విడాకులు మంజూరు చేయబడతూనే ఉన్నాయి.

ఎవరికీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడమూ, కేసుల్లో చిక్కుకోవడమూ ఇష్టం ఉండదు. కాకపోతే ఎంత హింస- అదీ ఎన్నాళ్ళు- భరిస్తే స్త్రీ బయటకి వస్తుంది! ఎవరికీ కాపరాలు కూల్చుకోవాలనీ, ఛిన్నాభిన్నం చేసుకోవాలనీ ఉండదు.

స్త్రీ తన హక్కుల గురించి మాట్లాడిందంటే తన బాధ్యతలని విస్మరించిందని అర్థం కాదు.

‘నేను తాళి కట్టేను కనుక నేను చెప్పినట్టే చేయాలి, నా భార్య- తను నా ఆస్థి’ అన్న అహంకారం పోవాలంటే మారిటల్ రేప్‌ని చట్టబద్ధం చేయవలిసిన అవసరం ఉంది. లేకపోతే వైవాహిక మానభంగాలకి పెళ్ళి అనేది ఒక లైసెన్స్ అన్నట్టే కాదా!

ICRW సర్వే ప్ర్తకారం పెళ్ళయిన పదిమంది స్త్రీలలో కనీసం ఒకరు లైంగిక దాడిని ఎదురుకుంటున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు భౌతికమైన దాడికి గురవుతున్నారు.

పునాదులే లేని ఇలాంటి కాపురాలు నిలబడి మాత్రం ప్రయోజనం ఏముంది? ఇలాంటి పెళ్ళిళ్ళు ఎలాంటి ధరైనా చెల్లించి నిలుపుకునే అవసరం ఉందా! పాదాన్ని కరిచే జోడుని విసిరి పారేస్తేనే నయం కాదా! భార్య ఇష్టానికి విరుద్ధంగా “నీవు సెక్సులో పాల్గొనే తీరాలి” అని బలవంతం చేయడం ఎంత న్యాయమైనది! ఒక వివాహబంధంలో హింసా, పీడా, మానభంగం- ఇవన్నీ ఉన్నప్పుడు, అదింక పవిత్రమైనది ఎలా అవుతుంది/అవగలదు?

ఒక స్త్రీకి తన స్వంత ఇచ్ఛా, కోరికా, ఒప్పుదలా ఉంటాయి. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందన్న తీర్పు అర్థం లేనిది. స్త్రీలు ఇలాంటి బాధలని సహిస్తూ ఉండాలని హిందూ మతం ఎక్కడా చెప్పలేదు. ఇలా అని చెప్తున్నది మన ప్రభుత్వం.

వీడియో చూడండి.

ఈ అభిప్రాయం పల్లెల్లో అయితే మరీ లోతుగా పాతుకుపోయి ఉంది. అక్కడ నివసించే స్త్రీలకి మారిటల్ రేప్ అంటే ఏమిటో, లైంగిక సంబంధంలో సమస్యలెందుకు తలెత్తుతాయో కూడా అర్థం కాదు. ఈ అత్యాచారాన్ని  సహించడం తప్ప వారికి గత్యంతరం లేదు. చదువు/ఉద్యోగావకాశాలు లేకపోవడం వల్లా, సమాజం హర్షించనందునా వారికి దీన్ని తప్పించుకునే దారీ లేదు.
ఎక్కడైనా కానీ ఈ నేరాన్ని నిరూపించే మార్గం ఏది? దీనికి జవాబుదారీ మళ్ళీ స్త్రీయే.

ఈ ముస్లిమ్ అమ్మాయి విషయమూ, నిర్భయా సంగతీ భిన్నవైనవేమీ కావు. కాకపోతే ఇక్కడ జరిగినది గాంగ్ రేప్ కాదు. అక్కడ నేరస్థులంటూ ఉన్నారు. ఇక్కడ భర్త స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రేప్ విక్టిమ్స్‌కి నష్టపరిహారం దొరుకుతుంది. మారిటల్ రేప్ విషయాల్లో దానికి ఆస్కారం కూడా లేదు.

భారతదేశంలో మారిటల్ రేప్ చట్టబద్ధం కాదనడంలోనే స్త్రీల స్థితి అర్థం అవుతుంది. స్త్రీలు భాగస్వాములుగా కాక వివాహంలో దానంగా ఇవ్వబడుతున్నారు. యాజమాన్యం ఉన్నది పురుషుడికి. పెళ్ళి తరువాత భర్త ఏమిటి చేసినా అది అమోదయోగ్యమే.

ఈ సంవత్సరం ఇలా తీర్పు వచ్చింది. ఏమో- రాబోయే కాలంలో మారవచ్చేమో! కాలంతో పాటు మనం కూడా మారాలి. మార్పుని అంగీకరించాలి. మారిటల్ రేప్ క్రిమినలైస్ చేయబడాల్సిన అవసరం వచ్చింది. అలా చేస్తే కనుక, దానికి జడిసి, కొంతమందైనా ఈ బలవంతం ఆపుతారేమో – చట్టమూ శిక్షా గుర్తుకొచ్చి!

క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , Permalink

20 Responses to కృష్ణగీత(కాలమ్) –లైసెన్స్ టు రేప్ – కృష్ణ వేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో