ముస్లిం వాదం ` సామాజికత (సాహిత్య వ్యాసం ) – డా॥ఎస్‌.షమీఉల్లా

మనిషిలోని వైరుధ్యాలకీ, వ్యథలకీ, ఆనందానికి ప్రతిస్పందనగా రూపుదిద్దుకొనే కళాత్మకమైన కళే సాహిత్యం. అది కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు… ప్రక్రియ ఏదైనా అది గతాన్ని వెల్లడిరచి వర్తమానాన్ని కోరుకుంటుంది. అటువంటి కోవకు చెందిందే ముస్లిం మైనారిటీ వాద సాహిత్యం.

కులం, మతం, లింగం, తెగ, జాతి, ప్రాంతం వంటి అస్తిత్వాలకు ఆధునిక కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ తమ అస్తిత్వాలను కాపాడుకోవడం కోసం ఉద్యమించారు. ఏ అస్తిత్వ ప్రాతిపదికల మీదనైతే అన్యాయానికి గురయ్యారో ఆ అస్తిత్వ ప్రాతిపదికల మీంచి అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అదే ముస్లిం మైనారిటీ వాద కవిత్వంలో జరిగింది…ఇవాళ జరుగుతోంది.

సమిష్టిలో వ్యక్తి భాగస్వామ్యం పొందలేనప్పుడు వ్యక్తికీ, సమాజానికి మధ్య తరచు సంఘర్షణ ఎదురవుతుంటుంది. ప్రధానంగా అస్తిత్వం గురించిన సందేహాలు అనేకం తలెత్తుతుంటాయి. అటువంటప్పుడు తన ఉనికిని గురించి వ్యక్తి వివిధ రకాలుగా వ్యాఖ్యానించుకొంటాడు. విలువలూ, నాగరికతలూ సంక్లిష్టమై జీవితాన్ని సంక్షోభపరిచే కొద్ది కల్లోల్లాన్ని ఎదుర్కోవడం మొదలవుతుంది. ఆ రీతిన ముస్లిం సాహితీ కారులు ముస్లింవాద కవిత్వంలో వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అలా పుట్టిన కవిత్వమే తెలుగులో ముస్లిం మైనారిటీ వాద కవిత్వం. ప్రారంభంలో మైనారిటీ వాదమని, మరికొందరు ముస్లిం మైనారిటీ వాదమని, పిలిచినా ప్రస్తుతం అది ముస్లిం వాదంగా స్థిరపడిరది.

కన్నబిడ్డని సవతి కొడుకుగా / చిత్రించింది చరిత్ర / అన్నదమ్ముల్నించి చీల్చి / నన్ను ఒంటరి వాణ్ని చేసింది చరిత్ర ` అంటూ 1991లో అకారణ నిందారోపణల మధ్య, అనేక అనుమానాల అపొహల మధ్య ‘‘పుట్టుమచ్చ’’ రూపంలో ఖాదర్‌మొహియుద్దీన్‌ తొలిసారిగా గొంతువిప్పాడు. బాబ్రీ మసీదు విధ్వంసం ముస్లింలలో ఆవేదనను, ఆందోళనను కలిగించింది. తమ ఉనికి ప్రశ్నార్థకమౌతున్న దన్న భావన మరింత ఆగ్రహానికి, ఆవేదనకు దగ్గర చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత భారతదేశంలోని ముస్లింలను రెండవ తరగతి పౌరులమని గుర్తుచేసింది. అందువల్లే ఈ వలయాల్ని ఛేదించాలని ప్రయత్నించారు ముస్లిం రచయితలు. అందులో భాగంగా ‘‘కొన్నేండ్ల ఖబ్జాదారుడు / భూమి స్వంత హక్కు దారుడని చట్టాలు చెబుతున్నప్పుడు / వందల వేల సంవత్సరాల కాపురస్తుడు / ఈ నేలకు పరాయివాడెట్లా అవుతాడు’’ అని హనీఫ్‌ ‘‘ఇక ఊరు నిద్రపోదు’’ లో ప్రశ్నించాడు.

‘‘అలావా’’ అనే కవితా సంపుటంలో ‘‘నీ తాత ముత్తాతలు / నా దాదా పర్‌ దాదాలు / కలిసి మెలిసే బతికారు / మరి నీకున్న హక్కులు / నాకెందుకు లేకుండా పోయాయి.’’ అంటూ ‘‘షమీఉల్లా’’ ‘‘విశ్వాస ప్రశ్న’’ లేవనెత్తాడు.
‘‘పుట్టుమచ్చ’’తో తెలుగు ముస్లిం కవులు అన్ని రకాల ఆధిపత్యాలను ప్రశ్నిస్తూ స్పష్టమైన దృక్పథంతో నిర్దిష్టమైన లక్ష్యంతో ముస్లిం వాదాన్ని ఆరంభించారు. ముస్లిం వాదం మొదట కవిత్వంలో ప్రారంభమై ఆ తరువాత కథ, నవల, నాటక రూపం సంతరించుకుంది.

వైరుధ్యాల మాట ఎలా ఉన్నా ఒక పునాది మీద ఆలోచిస్తున్న సుమారు 60 మంది కవులు, రచయితలు ఒక్క వెలుగు నీడ కిందికి వచ్చారు. అప్పటిదాకా సాహిత్యానికి ఉన్న గంతుల్ని విప్పి సాహిత్యమంటే ఊహల పందిరి కాదని తేల్చారు. ఎవరి గొంతుతో వాళ్ళే పలకాలని, తెచ్చిపెట్టిన గొంతుతో పలకడం… తమని తామే మోసం చేసుకొన్నట్లవుతుందని తీర్మానించారు. విలువలకు ప్రమాణాలకు మధ్యగల వైరుధ్య రేఖలని తొలగించి ఉద్యమ స్థాయిలో ముస్లింవాద కవిత్వాన్ని సృజించారు. 1980 కి పూర్వం వస్తువును ఛేదించారు. జీవించే జీవితాన్ని కవిత వస్తువుగా ఏకరూపత పొందేటట్లు చేశారు. దీనికారణంగా కులమతాల పట్లఉన్న అనుమానాల్ని నిరాకరించే ప్రయత్నం జరిగింది. సమకాలీనతలోంచి ప్రతి అంశాన్ని పునర్మూల్యాంకనం చేయడం మొదలయింది. నిజానికి సాధారణ సాహిత్యంలో కన్పించే వ్యష్టి అనుభవాలను సమిష్టీకరించడం, వ్యష్టి అనుభవాలకే పరిమితమవ్వడంలాంటి ప్రాతిపదికలు ముస్లింవాద కవిత్వంలో ధ్వంసమయ్యాయి. అందువల్లే స్త్రీవాదం కంటే దళితవాదం, దళితవాదం కంటే ముస్లింవాదంలో వస్తురీతులు గుణాత్మకమైన మార్పు పొందాయి.

నిజానికి ముస్లింలు రాయాల్సిన అవసరం ఉందా? ముస్లింలు వ్రాసినా దేన్ని గురించి రాయాలి?!… అంతబాధ, అన్ని సమస్యలు, అంత సంస్కృతి, అంత నేపథ్యం ముస్లింలకు ఉందా?!!…
ఉందనే చెప్పాలి. ఈ దేశంలో ఇష్టపూర్వకంగానే ఉండిపోయిన ముస్లింలు ఇన్నేళ్ళు గడిచినా ఇంకా పరాయి కరింపబడుతూనే ఉన్నారు. మెజారిటీల డామినేషన్‌కు గురికావడం మామూలైపోతుంటే` తమ అస్తిత్వాన్ని వదులుకుని మెజారిటీ మతం ముసుగులో బిక్కుబిక్కు మంటూ జీవిస్తుంటే` మరికొందరు తీవ్రవాదులుగా మారిన సందర్భం కన్పిస్తుంటే ` రాయకుండా ఎలా ఉంటారు?! ముస్లింలు తీవ్రవాదులుగా మారిపోతున్నారంటే సమాజప్రమేయం లేదని చెప్పగలమా! పేదరికం, ఆకలి, కుటుంబానికి సరిపోయే ఆదాయం లేక పోవడం, అధిక సంతానం, పిల్లల చదువులు, చేయడానికి సరిపోయే పని ` జీతం, ఎదుగుబొదుగు లేకుండా తొక్కి పెడుతున్న లోపలి బయటి సామాజిక ఋగ్మతల గురించి… సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడక ఎప్పుడు మాట్లాడుతారు?

ఖిల్వత్తుల్లో, జనానాల్లో, మజీదుల్లో, ముస్లిం వీధుల్లో, ముస్లిం కుటుంబాల్లో, ముస్లిం గొంతుకల్లో పూడుకుపోయిన అనేకానేక బాధల్ని, వాళ్ళ జీవితంలోని కన్నీళ్ళని, కోల్పోయిన గత వైభవాల్ని, స్నేహాల్ని, సంస్కృతిని, సమస్యల్ని ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది.

బయటి ప్రపంచానికి తెలియకుండా మతం అనే పర్దా చాటున ఉన్న విషయాల్ని కథగా, కవితగా వినిపించవలసిన అవసరం ఏర్పడిరది. అందుకే పీడితుల కోసం పీడితులే తాపత్రయపడ్డం మొదలుపెట్టారు. కష్ట సుఖాల్ని తమ అవసరాల్ని అభివ్యక్తం చేస్తూ సాహిత్యం రూపొందిస్తే అందులో నిజాయితీ ఉంటుందని ముస్లిం రచయితలు విశ్వసించారు. అందుకే ముస్లిం కవులు మాట్లాడటం మొదలు పెట్టారు. నా మౌనం / నన్ను నిందార్హుణ్ణి చేశాక / స్వరం సవరించుకోక తప్పింది కాదు ` అంటూ ` సయ్యద్‌ గఫార్‌ ` ‘‘అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి’’ ` అని ముస్లింల పై జరుగుతున్న దాడులను, ప్రచారాలను బహిరంగంగా ప్రశ్నించారు.

‘‘పదిమంది కలిసే చోట / కదలని నౌకలా నా పాన్‌ డబ్బా/ ఉద్యోగ నిరుద్యోగానికి మధ్య/ త్రిశంకు స్వర్గంలా… ఇక్కడ నా చేతులాడితేనే / ఇంట్లో పిల్లల చేతులు కంచాల్లో కదులుతాయి / ప్రతిరోజూ ఎంతోమందికి / నోళ్ళు పండిస్తుంటాను కాని/ నా బతుకే పండట్లేదు’’ (అలీ ` పాన్‌ మరక) అని ముస్లిం వాద కవి వాపోతాడు.సామాజిక రాజకీయ జీవితాన్నే కాకుండా ఆర్థిక సాంస్కృతిక జీవితాన్ని కూడా అక్షరీకరించారు. ముస్లిం ఇండ్లలో పేరుకుపోయిన గరీబిని, ముస్లింలలో ఉన్న అంతరాలను, అంతర్గత వైరుధ్యాలను, చివరకు తమ మతంలో ఉన్న మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను నిక్కచ్చిగా మాట్లాడటం మొదలు పెట్టారు.

మతాన్ని సంస్కృతిలో భాగంగా స్వీకరించి కవితా వస్తువు చేశారు. తమ సాంస్కృతిక వేళ్ళ వెతుకులాటలో మతం నుండి ఎంత గ్రహించాలో అంతే గ్రహించారు. అక్కర్లేదనుకున్న వాటిని నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా గర్హించారు. మతాన్ని వైయక్తిక విశ్వాసంగా గౌరవిస్తూనే సామాజిక స్థాయిలో దాని పాత్రని తీవ్రంగా పట్టించుకున్నారు. అందుకే అక్కడక్కడ ఉద్వేగం కనిపిస్తుంది. చాలా మంది ముస్లిం కవులు మతాన్ని ఒక సామాజిక శాస్త్రవేత్త దృష్టితో విశ్లేషించారని ఆయా కవితల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాంస్కృతిక, మతపరమైన మూలాల్లోకి వెళ్ళి వాటి పూర్వాపరాలను వర్తమానంతో జోడిరచి చెప్పడం వారి విస్తృతమైన అవగాహనను సూచిస్తోంది. తమ పవిత్ర గ్రంథంలోని ప్రతీకల్ని సమకాలిన చైతన్యంతో అన్వయించుకోవడంలో చాలా సందర్భాలలో గొప్ప విజయం సాధించారీ రచయితలు.

సాహిత్యమంటే ఒకరి బాధ కాదు అందరి బాధ. ఒకరి జీవితం కాదు అందరి జీవితం. మరో లక్షణం సార్వకాలిక స్పృహ అని బహుళార్థక నిర్వచనాన్నిస్తుంది మెజారిటీ సాహిత్యం. దీనిని ఖండిస్తుంది ముస్లిం వాద కవిత్వం. సామాజిక వ్యవస్థలో తమ స్థానం ఏఏ పరిధుల మధ్య పరిమితం చేయబడిరదో చెబుతూనే రాజకీయ, ఆర్థిక అసమానతల్ని ఎత్తి చూపడం ముస్లింవాద కవిత్వంలో జరిగింది.

‘‘ నోటికి, అన్నం ముద్దకూ / ఎన్నియుగాల ‘ఫాస్లా’ నో / రక్తసముద్రాలు ఈదిన వాడికే అర్థమౌతుంది / దరిద్రం నన్ను ముక్కలు ముక్కలుగా చేసి మింగుతుంటే / మాంసం ముక్కలు నరుకుతూ బతకడం ఖతర్‌నాకీ అవుతుందా?…. కరుడు కట్టిన మీ కసాయితనం ముందు / నా కాలే కడుపు ‘కటికతనం’ ఏపాటిది?` అంటాడు.

పేరుకు అగ్రవర్ణంగా వ్యవహరించబడుతున్నప్పటికీ అట్టడుగున పడి నలుగుతున్న తమ జాతి జనం నరకయాతనని ముస్లిం మైనారిటీ కవులు చిత్రించారు. చిన్న చిన్న వృత్తులలో స్థిరపడి అస్థిరంగా బ్రతుకీడుస్తున్న వాళ్ళ జీవన దృశ్యాలు ఇవి.
ముస్లింలు ఎక్కువగా పని చేసేది అసంఘటిత కార్మికులు గానే ఉదాహరణకు ` చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, నేత, వడ్రంగీ, జాలరీ, బట్టలుకుట్టడం, ఇస్త్రీ చేయడం, రిక్షాలు`ఆటోలు` జట్కాలు తోలడం, బ్యాండు మేళాలు పట్టడం, మాంసం అమ్మడం, కూరగాయలు అమ్మడం, బేల్దారు పని చేయడం, వర్క్‌షాపుల్లో పని చేయడం, శవాలకు గోతులు తవ్వడం, పాయఖానాలు శుభ్రం చేయడం… ఇవి ఎలాంటి రంగాలంటే ఎంత పనిచేసినా మిగిలేది ఏమి ఉండదు. ఏ పూటకి ఆ పూట వెతుక్కోవడమే. ఇలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చిన తరం ఎలా మాట్లాడుతుందో! ఎలా ఉంటుందో చెప్పనఖ్ఖరలేదు.ముస్లిం యువకుల్లో రెండు రకాల వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మతం పరిధిలో మిగిలిపోయిన వాళ్ళు ` లేదంటే చిన్నవృత్తుల్లో ఎదిగి ఎదగని జీవన భృతి సంపాదించుకుంటున్నవాళ్ళు ` కాస్తో కూస్తో చదువుకున్న మేధోవర్గంలోనో, మధ్యతరగతిలోనో సర్దుకుని జీవిస్తున్న వాళ్ళు అతి తక్కువ.

ముస్లింలు రాయడం మొదలుపెట్టాక తెలుగు కవిత్వం కొత్త సంస్కృతిని, కొత్త భాషని, కొత్త వస్తువుని, కొత్త పదాల్ని పరిచయం చేసుకుంది. దళిత, స్త్రీవాదాల తరువాత భాషా పరిధి ముస్లింవాద కవిత్వం వల్ల మరింత పెరిగింది. దాదాపు 20పై చిలుకు కవితా సంకలనాలు వచ్చాయి. జీహాద్‌, పుట్టుమచ్చ, జల్‌జలా, ఖిబ్లా, ఫత్వా, ఇక ఊరు నిద్రపోదు, సాయెబు.. వంటి సంకలనాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

ముస్లింల విషయాలు తెలుగులోకొచ్చేసరికి ముస్లింలలోంచి ముస్లింల జీవితాల్ని కవిత్వంలో చిత్రీకరించినవాళ్ళు అంతకు మునుపు లేరు. ఆ కారణంగా ముస్లింల జీవిత వస్తువు ఎవరూ స్పశించకుండా మిగిలి పోయింది దాంతో కల్పనలకు, ఊహలకు అవకాశంలేదు. వారి జీవితాల్నే కవిత్వంగా మలచడానికి సాధ్యమైనది. కాబట్టి ముస్లింలు సృష్టించిన కవిత్వం కల్పనో, ఊహో కాదు. అది వారి జీవితం. చివరకు వారు ఉపయోగించిన ‘‘ఇమేజ్‌’’లు కూడా తమ జీవితాల్లోంచే స్వీకరించారు. పర్దాలు, బుర్ఖాలు, గుల్ఫోషీలు, తల్లాఖ్‌, మౌల్వీలు, జాగ్‌నేకి రాత్‌, వలీమాలు… ఇలా ఎన్నో ప్రతీకలు తెలుగు కవిత్వంలో కొత్త వాతావరణాన్ని సృష్టించాయి.

ముస్లింవాద కవిత్వం ఆరంభం` అస్తిత్వాన్ని వెతుక్కోవడం కోసం కావచ్చు, హక్కుల కోసం కావచ్చు, ఆత్మగౌరవం కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు… ఏది ఏమైనా ఒకనాడు ముస్లింలు ప్రారంభించే ఏ పని అయినా ఒక విద్రోహకరమైనదిగా, విచ్ఛిన్నకరమైనదిగా గుర్తించబడేది. ముస్లింవాదం పుట్టడం వల్ల మెజారిటీయులకు ఒక మనిషిని మరోక మనిషి హింసించే, బాధించే, అవమానించే భావజాలాల్ని ఖండిరచి, ఓడిరచి మనిషిని మనిషిగా, ఒక సామాజిక జీవన బంధాన్ని పెంచే సాహిత్యంగా ముస్లిం మైనారిటీవాదం గుర్తించబడుతోంది. ఇది ఈనాటి చారిత్రక అవసరం. అప్పుడే అంబేద్కర్‌ కల నెరవేరుతుంది. అప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరిగినట్లవుతుంది. వారిలో నిరాశ, నిస్పృహ, తీవ్రవాద ధోరణి తుడిచి వేయడానికి వీలవుతుంది. అదేవిధంగా సమాజంలోని రాజకీయ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక వైరుధ్యాలను పారద్రోలడానికి వీలు కలుగుతుంది. సామాజిక ఫలాలు అప్పుడే అందరికి సమానంగా లభిస్తాయి.

ఖాజా, స్కైబాబా, కరీముల్లా, షుకూర్‌, గౌస్‌ మోహియుద్దిన్‌, సికిందర్‌, షేక్‌ మహమ్మద్‌ రఫీ, బాజీ, జావెద్‌…. వంటి యువ కవులు వివిధ సమస్యల్ని విభిన్న కోణాల్లోంచి ఆవిష్కరించగా షాజహానా, రజియాబేగం, మెహజబీన్‌, షహీదా, నస్రీన్‌బేగం, షమీమున్నిసా బేగం… వంటి కవయిత్రులు ముస్లిం మైనారిటీ స్త్రీవాద కవిత్వాన్ని సృష్టించారు. వీరితోపాటు సీనియర్‌ కవులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించక తప్పలేదు. ఏది ఏమైనా గొప్ప సామాజిక దృక్పథం నుంచి బయలుదేరిన సాహిత్యం ` ముస్లిం మైనారిటీ వాద సాహిత్యం. తెలుగు కవిత్వంలో ముస్లిం మైనారిటీ వాదం ఒక మైలు రాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

–   డా॥ఎస్‌.షమీఉల్లా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

వ్యాసాలు, , , , , , , , , Permalink

One Response to ముస్లిం వాదం ` సామాజికత (సాహిత్య వ్యాసం ) – డా॥ఎస్‌.షమీఉల్లా

  1. Pingback: వీక్షణం-136 | పుస్తకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో