ఊపిరి పోసుకున్న క్షణం నుంచీ
ఆకృతిని దాల్చేవరకు…
ఉమ్మనీటి సంద్రంలో……
గర్భకోశ కుహరంలో…
మాయఅనే రక్షకభట
సంరక్షణలో…
అహరహరము కాపాడుతుంది…
పదినెలలు నిను
తన కడుపున మోస్తూ…
నీ జనన సమయంలో..
తాను మరణాన్ని ఆహ్వానిస్తూ…
మృత్యుముఖాన్ని కాలదన్నుతూ…
నీ లేత నవ్వులు చూసి
మురిసిపోయే అమ్మ …
అనుభందమే కాదు…
పెగును పంచిన అమ్మ ..
అనేక కణాల సముదాయాన్ని
నీ కందించిన అమృత మూర్తి..
అమ్మ నుంచి వేరయినా గానీ..
పదిల పరుచుకున్న బొడ్డుపేగు..(స్టెమ్ సెల్)
నీకే కాదు..నీ వారినందరికీ..
తన కణాలనందించి…
సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది…
చైతన్య వంతమై…
ప్రజలు మేలుకొని…
వైద్య విజ్ఞానం అందించిన
ఈ మహద్వకాసాన్ని సద్వినియోగం చేసుకుంటూ…
అమృత పానాన్ని ఆస్వాదించండి…
ఆ బ్రహ్మే కాదు…
మా అమ్మ కూడా…
“ఓ బ్రహ్మ ” అని నిరూపిస్తూ….!!
– సుజాత తిమ్మన
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`