అసంఘటిత రంగం! (కవిత )- విజయ భాను కోటే

‘మే’ డే ప్రత్యేక కవిత

Vijaya bhanu

Vijaya bhanu

శక్తి అపారం
అనుభవం ఆకాశం
అసంఘటిత రంగం!

పాదాలను నేలలోనే పాతి
రెక్కల డప్పులను వాయించుకుంటూ
అవలీలగా అసాధ్యాలను సుసాధ్యాలు చేసే జీవం
అసంఘటిత రంగం!

శ్రామిక జీవన సౌందర్యాన్ని
భుజాల యాంత్రికతతో మమేకం చేసి
పూలను, ముళ్ళను ఒకేలా ఆదరించే స్వరం
అసంఘటిత రంగం!

భూమిని నమ్మి
చెమటను చిందించి
నెత్తుటి అరుణోదయాలు సృష్టించే సైన్యం
అసంఘటిత రంగం!

కార్మికత్వంలో మార్మికత్వం మచ్చుకైనా కనిపించనివ్వక
శ్రమలోనే దైవాన్ని కొలుస్తూ
నిత్యం దేశ మనుగడకు ఆసరాగా నిలిచే వర్గం
అసంఘటిత రంగం!

భద్రత కరువై
ప్రపంచాన్ని పురోగమనం వైపు నడిపిస్తూ…
తానూ మాత్రం తిరోగమనంలో తల్లడిల్లుతున్న 70% ప్రజాస్వామ్య భాగం
అసంఘటిత రంగం!

శక్తి అపారం
అనుభవం ఆకాశం
అసంఘటిత రంగం!!
( శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు)

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

One Response to అసంఘటిత రంగం! (కవిత )- విజయ భాను కోటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో