జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

shaanthi prabodha

shaanthi prabodha

ఆదరించి నీడ చూపిస్తున్న చల్లని అమ్మ” ఆ పేపర్స్‌ చూశాక ఈ జోగినీ దురాచారం గురించి ప్రజలలోకి తీసుకెళ్తున్నాయి పత్రికలు. అంతే కాదు జోగినీ ఆచారాన్ని దురాచారంగా గుర్తించి ఓ పుణ్యమూర్తి అక్కున చేర్చుకుంటున్నారనీ,”అమ్మ” ద్వారా జోగినీ దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు అనీ తెల్సుకుంది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ దగ్గరలో ఆ సంస్థ కార్యాలయం కూడా ఉండడం.
స్వాతంత్య్రానికి పూర్వమే 1942లో జోగినీ ఆచార నిర్మూలనకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుసుకుని ఆశ్చర్యపడింది.

ఆనాడు తెలంగాణా ప్రాంతం నిజాం నవాబుల పాలనలో ఉండేది. నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న మీర్‌ అలీ అక్బర్‌ అనే పరిపాలనాధికారి సంఘంలో పాతుకుపోయి ఉన్న జోగినీ ఆచారాన్ని దురాచారంగా గుర్తించాడు. అంతే కాకుండా ఈ దురాచారాన్ని వ్యతిరేకించాడు. దాన్ని రూపుమాపాలని తన శాయశక్తులా యత్నించాడు.
ఆ తర్వాత 1946లో ఐ.ఎ.ఎస్‌. ట్రైనీ ఆనందకుమార్‌ జోగినీల గురించి పరిశోధించి ఈ దురాచారాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాడు.

ఈ తర్వాత కాలంలో జరిగిన ఎన్నెన్నో మార్పులు. కానీ జోగినీ ఆచారం నిర్మూలన గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఏభైఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వం జోగినీ వ్యవస్థపై దృష్టి సారించింది. ఆనాటి కలెక్టర్‌ సమస్యని గుర్తించి, జోగినీల జీవన విధానాన్ని చూసి తీవ్రంగా స్పందించి వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.
విషయాల్ని తెల్సుకున్న విద్యకి చాలా ఆనందం కల్గింది. సిరిపురంలో జోగినిల పరిస్థితి చూశాక వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని తెగ బాధపడిపోయింది. కానీ ఫర్వాలేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలూ తమ వంతు కృషి ప్రారంభించాయన్న మాట అనుకుంది విద్య.

ఆ తర్వాత జోగిని సమస్యపై ప్రొ… భారతి, ప్రొ. నారాయణ, విద్య ముగ్గురూ కాసేపు చర్చించుకున్నారు.
”ఓహ్‌ా… తొమ్మిది అవుతోంది. హాస్టల్‌ గేట్‌ మూసేస్తారు వస్తాను మేడం వస్తాను సర్‌. అంటూ లేచి నిలబడింది.
”విద్యా… నాకో సందేహం” తానూ కుర్చీలోంచి లేస్తూ భారతి
”అడగండి మేడం”

”ఆహా… ఏం లేదూ… నీవు పి.హెచ్‌.డి.లో చేరేలోగా ఏదైనా మంచి సంబంధం సిద్ధం చేస్తే ఏం చేస్తావ్‌…?
నాకయితే పి.హెచ్‌డి చేయాలని బలంగా ఉంది మేడమ్‌. అబ్బాయి నచ్చితే, కాదనడానికి ఏ కారణం లేకపోతే, ముఖ్యంగా నా అభిరుచులకు, విధానాలకు అనుగుణంగా ఉంటే మా నాన్న మాట విని పెళ్ళి చేస్కుంటాను. పెళ్ళి అయినా సరే, నా పి.హెచ్‌డి మాత్రం వదలను. నిర్లక్ష్యం చేయను. కంటిన్యూ చేస్తాను. ప్రొ|| భారతి కళ్ళలోని భావాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ స్థిరంగా చెప్పింది విద్య

విద్య సమాధానం కోసం ఆత్రుతగా చూసి, శ్రద్ధగా ఆలకించిన నవీన్‌ అంతా విన్న తర్వాత ”ఊ” అంటూ రిలీఫ్‌గా ఒక దీర్ఘశ్వాస విడవడం అతని అక్క గమనించకపోలేదు. అందరికీ బై చెప్పి వెళ్ళిపోయింది విద్య.
అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న ఆ ప్రదేశం ఏదో కోల్పోయినట్లుగా…
నిశ్శబ్ధంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు…

”విద్యపై నీ అభిప్రాయం ఏమిటీ? ఆ నిశ్శబ్దాన్ని, ఆ ఆలోచనల్ని ఛేదిస్తూ భారతి సూటిప్రశ్న. పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. తను ఇంత వరకూ ఎంతో మంది అమ్మాయిల్ని చూశాడు. బి.టెక్‌లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్స్‌ కొందరు తన స్నేహం కోసం, తనతో మాట్లాడ్డం కోసం చొరవ తీసుకునేవారు. తానెప్పుడూ వాళ్ళని అంత దూరంలోనే ఉంచేవాడు.
తన ఫ్రెండ్స్‌ అంతా అమ్మాయిల్ని ముఖ్యంగా హోమ్‌సైన్స్‌ అమ్మాయిల్ని తెగ ఏడిపిస్తూ ఉండేవారు. ఇంజనీరింగ్‌లో అమ్మాయిలు తక్కువగా ఉండడం వల్లనో, హోమ్‌సైన్స్‌లో అబ్బాయిలు లేకపోవడం వల్లనో కానీ వాళ్ళు, వీళ్ళు తెగ కామెంట్స్‌ చేసుకునేవారు. ఒకసారి తిరుపతి వచ్చిన కొత్తలో, తన ఫ్రెండ్‌ తేజతో కలిసి పద్మావతీ యూనివర్శిటీకి వెళ్ళాడు వాళ్ళ కజిన్‌ కోసం. అసలు అక్కడ ఉండేది అమ్మాయిలా… కాదు గడుగ్గాయిలు. అమ్మాయిలు ఒక్కళ్ళే ఉన్నప్పుడో లేదా మామూలు అప్పుడు కూడా తలొంచుకుని తమ దారిన తాము పోవడం, మగపిల్లలు కామెంట్స్‌ చేసినా, టీజ్‌ చేసినా లోలోన నవ్వుకుంటూనో, తిట్టుకుంటూనో, ఎంజాయ్‌ చేస్తూనో ఉన్నా. కానీ ఏమీ ఎరుగనట్లే, ఏమీ విననట్లే వెళ్తుంటారు. కానీ ఇక్కడ తమదే రాజ్యం అనుకుంటారేమో తమ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన అబ్బాయిల్ని ఎంతలా ఏడ్పించాలో అంతలా కామెంట్స్‌తో ఏడ్పించి వాళ్ళు మాత్రం నవ్వుతూ, తుళ్ళుతూ… ఆ గడుగ్గాయిలు. అప్పటి నుండీ మళ్ళీఆ ఛాయలకు వెళ్ళాలంటేనే భయం… వెళ్ళనే లేదు. అని గతాన్ని ఆ సంఘటనల్ని తలచుకుని తనలో తానే నవ్వుకున్నాడు నవీన్‌.

అమ్మాయిలంటే ఆమడ దూరాన ఉంచే తనేనా ఈ అమ్మాయితో అంత ఎక్కువగా మాట్లాడింది అనుకుంటూ తనకు ఆమెతో కలిగిన పరిచయం తలచుకుని తనే ఆశ్యర్యపోయాడు నవీన్‌. ఆ…ఆ అమ్మాయిలో ఏముంది.? అందమా…? గొప్ప అందగత్తేం కాదు. అలాగని అనాకారీ ఎంతమాత్రం కాదు. మరి ఏమిటి ఆమెలో తనని ఆకర్షించింది.

ఆమెతో ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్లు ఎలా మాట్లాడగలిగాడు.? అంటూ తనలో తానే గత రెండు రోజుల్లో ఎన్నో మార్లు ప్రశ్నించుకున్నాడు. ఇది అని ఖచ్చితంగా చెప్పలేని భావన. ఇప్పుడు అకస్మాత్తుగా అక్క అడిగితే ఏమని చెప్పగలడు?
మొత్తం మీద విద్య తనకు నచ్చింది. తనకు తెలియకుండానే తన ఆలోచనల్లోకి చొచ్చుకు వచ్చేస్తోంది. చోటు చేసేసుకుంటోంది. తను ఆమెను ప్రేమిస్తున్నాడా..? ఛ…ఛ.. ప్రేమ… ఆమెకీ తనకీ ఉన్న పరిచయం వయసెంత…? రెండు రోజులు. రెండురోజుల్లోనే ప్రేమా… ఆమె గురించి తనకేం తెల్సనీ… అంతా ట్రాష్‌… అని తనకు తానే చెప్పుకుని ఆ ఆలోచనలోంచి బయట పడ్డం కోసం టి.వి. ఆన్‌ చేశాడు.

అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నవీన్‌కి. మరో రెండు నెలల్లోపు ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి.

మధ్య మధ్యలో విద్య చాలా సార్లు గుర్తొచ్చినా, అమెరికా వెళ్ళడం కన్‌ఫర్మ్‌ అయ్యాక ఆమె మరీ మరీ తన తలపుల్లో చేరి అల్లరి చేస్తోంది. ఆమె తన వెంట ఉంటే బాగుండుననీ, ఇద్దరూ కల్సి కబుర్లు చెప్పుకోవాలనీ,…అలా….అలా…అడ్వెంచర్స్‌ చేయాలనీ మరీ మరీ అన్పిస్తోంది. తన ఆలోచనలు అక్కతో ఎలా చెప్పాలా అని తనలో తానే మదనపడిపోతున్నాడు నవీన్‌. అసలు తనంటే విద్య అభిప్రాయమేమిటో సూచన ప్రాయంగానైనా తెలీదే….ప్చ్‌… కనీసం ఆమె ఫోన్‌ నెంబర్‌ లేదు. అడ్రస్‌ తెలియదు. ఎలా తెల్సుకోవడం..?

ఆమెను కల్సుకోవడం? తన మనసు విప్పడం..? ఆలోచిస్తూండగా భారతి ఓ ఫోటోల కట్ట తీసుకొచ్చి నవీన్‌ ముందుంచింది.
”ఒరేయ్‌ నవీ…అమ్మా, నాన్నలకు ఇక నేను నచ్చజెప్పలేను. ఈ ఫోటోల్లో ఏదో ఒకటి సెలక్ట్‌ చెయ్‌. ఆమెరికాకి ఎగిరిపోతున్నావని తెలియగానే నీ రేటు మరింత పైకి లేచింది. అమ్మాయి తల్లిదండ్రులు అమెరికా అల్లుడి కోసం పోటీలు పడ్తూ… వెంట పడ్తూ ఆ ఒత్తిడి తట్టుకోలేక అమ్మా నాన్న ఒత్తిడి… నీకు నచ్చచెప్పమని… ఒరే అమ్మకి మరో భయం కూడా ఉన్నట్లుందిరా… అంటూ వచ్చి తమ్ముడి పక్కనే కూర్చుంది. ప్రొ|| భారతి.
”భయమా..? ఎందుకక్కా..!
”ఎందుకేవిట్రా…! నీ గురించే..”
”నా గురించా..” ఆశ్చర్యంగా నవీన్‌.
”అవును, నీ గురించే, ఇన్నాళ్ళూ మా మధ్యన ఉన్నావ్‌. అక్క బావల మధ్య ఉన్నావ్‌లే అని సరిపెట్టుకున్నారు. మద్రాస్‌లో నువు జాబ్‌లో జాయిన్‌ కాగానే అమ్మ బెంగపడిపోయింది. శని, ఆదివారాల్లో తిరుపతిలో వాలిపోయే నిన్ను చూసి అమ్మ మనసు కుదుట పడింది. మరిప్పుడేమో దేశంకాని దేశం వెళ్ళబోతున్నావ్‌. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నీవు కన్నతల్లి లాంటి మన దేశాన్ని, మన సంస్కృతిని, ఆచారాల్ని మర్చిపోతావేమోననీ? అన్నింటికీ మించి అక్కడి అలవాట్లతో పాటు అక్కడి అమ్మాయిని కావాలనుకుంటే..?
”అందులో తప్పేముందక్కా…? నీవూ అమ్మలాగే ఆలోచిస్తున్నావ్‌.
”నేను అనడం కాదురా అమ్మ భయం అది. అందుకే నీ పెళ్ళి నిశ్చయం చేయాలని వాళ్ళ తొందర. అంతగా అయితే పెళ్ళి కొన్నాళ్ళ తర్వాత చేసుకోవచ్చు అని అమ్మ ఆలోచన” వివరంగా చెప్పింది భారతి.
”అక్కా… నేనొకటి అడగనా..? అంటూ ఫోటోల కట్ట చూడకుండానే టీపాయ్‌ పైకి విసిరాడు.
”అడగరా..?”
”ఆ… అదే..”

 – శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

42
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో