ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను. మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాను. మా గైడ్ మునిరత్నం. అతనికీ తిరుమల తిరుపతి శేషాచలం కొండలు, వెంకటాచలం కొండలూ కొట్టినపిండి. ఈ అడవుల్లో ఆయన తిరగని ప్రదేశం, చూడని చోటు లేదేమో!
మేం కోనలోకి వెళ్తుంటే నేనున్నది ఎక్కడా… మానవలోకంలోనా… దేవ లోకంలోనా… అని ఓ సందేహం. సున్నపురాయి నిక్షేపాలున్న సన్నని దారి ఉన్న గుహలో ప్రయాణం నడుము వంచుకునే… మధ్య మధ్యలో నీటి చుక్కలు మా మీద పడ్తూండగా ఆ నీటి చుక్కలు పడడంవల్లనేమో దారి అంతా పాచిపట్టింది. ఎలాగైతేనేం చివరికి కోనలోకి చేరుకున్నాం. టెర్రకోట మట్టి బానలు మాకు స్వాగతం పలుకుతారు. అక్కడికి తొట్టి ఎలా వచ్చిందో… ఎపుడు పెట్టారో… ఎందుకో గానీ సిమెంటు తొట్టి కన్పించింది. అటవీ శాఖ వారికీ, పోలీసు శాఖ వారికి, ఎక్సైజ్ శాఖ వారికీ తెలీకుండా దొంగ సారా కాసేవారని మునిరత్నం చెప్పాడు.
రవికిరణాలు కోనను తాకినప్పుడల్లా రాతి గోడలు బంగారు రంగులో ధగ ధగ మెరిసిపోతూ… జీవితంలో ఒక్కసారైనా ఆ మహాద్భుతమైన కోనను చూసి తరించాల్సిందే. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే…ఎవరి కళ్ళతో వాళ్ళు చూసి అనుభూతిస్తే తప్ప..” ట్రాన్స్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు నవీన్.
అతను చెప్తున్న తీరు వింటున్న అందరిలోనూ ఆ కోన చూడాలన్న తపన కల్గించింది. అలా మాటల్లో ‘ సహజశిలాతోరణం’ చేరుకున్నారు. ”ఇదిగో ఇదే సహజ శిలాతోరణం. ఇది ప్రపంచంలోనే రెండవదట. మొదటిది అమెరికాలోని ఆరిజోనా ప్రాంతంలో ఉంది. తిరుమలకు పశ్చిమాన ఉన్న ఈ పర్వతం పేరు నారాయణగిరి. శ్రీ మహా విష్ణువు వైకుంఠం నుండి ఈ పర్వత శిఖరాగ్రం మీదనే పాదం మోపాడట. దీనికి నిదర్శనంగా అక్కడ ఆయన పాదముద్రలు కూడా ఉన్నాయి.” అంటూ ఉత్తరం వైపు చూపించాడు నవీన్. అంతా అటుకేసి నడుస్తూండగా ఇక్కడే మహా విష్ణువు నివసించాడట. ఇటు చూడండి తిరునామాల శంఖు, చక్రం వరద హస్తం ఆకృతులు, ఇవి సహజంగా ఏర్పడ్డాయట. దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని శాస్త్రజ్ఞులు అంచనా. ఇక్కడికి ఉత్తరం వైపుకి వెళ్తే మూడు కిలో మీటర్ల దూరంలో వేద విజ్ఞాన పీఠం ఉంది.
మాటల మధ్యలో మరో రెండ్రోజుల్లో ” బూచోళ్ళ వేటు” ప్రయాణం పెట్టుకున్నానని నవీన్ చెప్పాడు. నవీన్‌తో కలిసి మిగతా వాళ్ళు ” బూచోళ్ళ వేటు” చూడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడతను వారికి కొత్త వ్యక్తిలా అన్పించడంలా… ఎప్పటి నుండో తెల్సి ఉన్న ఆత్మీయుడిలా.. మంచి స్నేహితుడిలా…
కవితని, సరస్వతిని పంపడానికి వార్డెన్ ఒప్పుకోలేదు. హాస్టల్‌లో కొందరు మిత్రులు విషయం తెల్సుకొని నవీన్‌తో వెళ్ళవద్దన్నారు. మగవాళ్ళు మన ఆసక్తిని గమనించి, మనని ఆ దారి నుండి తమ ట్రాప్‌లోకి లాగాలని చూస్తారు. వెళ్ళ వద్దు వాళ్ళతో అని సలహా ఇచ్చారు. ఆ ఊరూ పేరూ లేని వాళ్ళతో మీరు వెళ్ళేది కొండల్లోకి కోనల్లోకి అంటున్నారు. ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయారా? ఎగతాళిగా అంది ఓ సుందరాంగి. అయినా విద్య, వలసమ్మ ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు బయలుదేరేది నవీన్ ఒక్కడితోనో, అతని ఫ్రెండ్స్‌తోనో మాత్రమే కాదు కాబట్టి. ట్రెక్కింగ్‌లో పాల్గొనే వాళ్ళు మొత్తం పాతిక మంది. వారిలో లక్కీగా ఛాన్స్ దొరికింది విద్య, వలసమ్మకి. నవీన్ చొరవ వల్ల. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున్న దుర్గమమైన శేషాచలం అరణ్యాల్లోని మసాల రేవు అనే ప్రదేశం నుండి చూస్తే…
పూలు మాలగా గుచ్చినట్లున్న కొండలు వరుసలూ….. ఆయస్కాంతం వైపు ఆకర్షింపబడే ఇనుప రజనులా…. అందరి కళ్ళూ ఎదురుగా కన్పిస్తున్న పెను పర్వతం వైపే….. దృష్టి మరల్చ లేకుండా… రొమ్ము విరుచుకుని, జబ్బచరుచుకుని నిలుచున్నట్లున్న ఆ నిలువాటి పర్వత శిఖరాన్ని ప్రకృతి శిల్పులు అతి జాగ్రత్తగా రక రకాల డిజైన్లలో అందంగా చెక్కినట్లుగా… పెద్ద పెద్ద గోనె సంచులు వేలాడదీసినట్లుగా తేనె తుట్టలు, గాలికి బరువుగా ఊగుతూ… రకరకాల వృక్షాలు… లతలూ… అల్లి బిల్లిగా సాగిన ఊడలూ… అంతా విఠలాచార్య సినిమాలో మాయా జగత్తులా లేదూ….. అంది విద్య పక్కనే ఉన్న వలసమ్మతో. ఆ పర్వతాన్ని చేరడమే ప్రస్తుతం నా లక్ష్యం అన్నాడు నవీన్.
వారి అదృష్టమో, దురదృష్టమో కానీ, అప్పటి వరకూ ఉన్న పసిడి కాంతుల స్థానే ఆకాశంలో పల్చని మేఘాలు ఆవరించుకున్నాయి… ఆ తర్వాత మరి కొద్ది నిముషాలకే కారు మబ్బులుగా మారిపోతూ… వర్షం వచ్చే సూచననిస్తూ… జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ…
ఆ దుర్గమ ఆరణ్యంలో ఇక ముందుకు సాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్న వాతావరణాన్ని కాదని ముందుకు సాగడం ఎవరికీ క్షేమకరం కాదని ముందుకు వెళ్ళే సాహసం చేయలేదు ఎవరూ… ఇక చేసేది లేక అందరితో పాటే వెనుదిరిగారు నవీన్, విద్య, వలసమ్మలు. ఆ మరుసటి రోజే విద్య విజయవాడ వెళ్ళి పోవాలి. నెక్ట్స్ టైం అంటే పి.హెచ్‌డిలో చేరిన తర్వాత మళ్ళీ ” బూచోళ్ళ వేటు” ప్లాన్ చేయాలనుకుంది. రెండు రోజులుగా భారతి మేడంని కలువలేదు. మరుసటి రోజే ప్రయాణం కావడంతో విషయం చెప్పిరావడానికి క్యాంపస్‌లోకి ఈ మధ్యే షిఫ్ట్ అయిన ప్రొఫెసర్ భారతి గారి ఇంటికి వెళ్ళింది విద్య.
”ఓహ్‌ా… మీరా? రండి…రండి…” చిరునవ్వుతో ఆహ్వానించాడు నవీన్. ”వాట్ ఎ సర్‌ప్రైజ్? మీరు ఇక్కడ! ఇది ప్రొఫెసర్ భారతి గారి క్వార్టరే కదా…!” ఆర్థోక్తితో అడిగింది. ఎదురుగా కన్నిస్తున్న నేమ్ బోర్డు చూసి. ”మీరు కరెక్ట్‌గానే వచ్చారు. ఆ… ఏమిటీ మీ మేడం దగ్గరకు వచ్చారా…. కూర్చోండి” కుర్చీ చూపుతూ అదే చెరగని చిరునవ్వుతో. ఆ… చిరునవ్వే… ఆ… మిల మిల మెరిసే నక్షత్రాల్లాంటి చిన్ని కళ్ళే విద్యని ఆకర్షించేది. ”అక్కలేదు. అక్కా బావా బజారుకెళ్ళారు. వచ్చేస్తుంటారు కూర్చోండి” అంటూండగానే భారతి గారు వచ్చారు. ఆ వెనకే ట్రైన్‌లో విద్యతో వాదన పెట్టుకొన్న అతను.. ఆయన్ని చూసి ”మీరు… ” సందేహంగా అంటోన్న విద్య మాటని మధ్యలోనే ఆపేసి ”అవును… మీ భారతీ మేడం లైఫ్ పార్టనర్‌ని నేనే.” అన్నారాయన నవ్వుతూ… ”గత రెండేళ్ళుగా నేను లండన్‌లో ఉండడంతో నిన్నెప్పుడూ చూడలేదు” అన్నారాయన మళ్ళీ తానే. ”అరె… ఆశ్చర్యంగా ఉందే… విద్య మీకెలా తెల్సు” మరింత ఆశ్చర్యంగా అన్నారావిడ. ”అక్కా… నిన్న ఒకడైనమిక్ అండ్ ఎంతూసియాస్టిక్ లేడీ అని చెప్పానే.. ఈవిడే విద్య” అన్నాడు నవీన్. ”భారతీ సస్పెన్స్ తట్టుకోలేక పోతున్నావ్ కదూ?” అంటూ రైల్లో పరిచయం చెప్పారు. ఎలా జరిగిందో చెప్పారు ఆయన. తిరుమల కొండపై జరిగిన విషయాలు చెప్పాడు నవీన్. అంతా మనసారా నవ్వుకున్నారు. పెళ్ళి ఊసెత్తితే చాలు, ఇప్పుడే పెళ్ళికి ఏం తొందర? పెళ్ళి..పెళ్ళి… అంటూ నన్ను కట్టిపడేయకండి. నేను ప్రపంచం అంతా చుట్టి రావాలి. అందుకు పెళ్ళి అవరోధం కాకూడదు. నా మనసు పెళ్ళి వైపు మళ్ళితే నేనే చెప్తాగా అనే నవీన్ మద్రాసులోని ఓ ప్రముఖ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. అమ్మాయిల గురించి పట్టించుకోని వీడు ఇప్పుడు ఈ అమ్మాయిని డైనమిక్ లేడీ, ఎంతూజియాస్టిక్ పర్సన్ అంటూ పరిచయం చేస్తున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు భారతి దృష్టిని దాటిపోలేదు. విద్య నా స్టూడెంట్. తన గురించి నాకే చెప్తున్నారా… అని నవ్వేసి విద్యని కూర్చోమని చెప్పి లోనికి వెళ్ళారు ప్రొఫెసర్ భారతి. ”విద్యా ఈ రోజు పేపర్ చూశావా…?” అంటూ వచ్చారు చేతిలో పేపర్‌తో… ”లేదు మేడమ్” ”అయితే ఇది చదువు” అంటూ రెండు పేపర్లు అందించారు. ఆ పేజీ మొత్తం నిజామాబాద్ జిల్లాలోని జోగినీల గురించి ప్రత్యేక వ్యాసాలే.
ఎప్పుడైనా అతను ఆఫీసు నుండి రాగానే తల్లి ఇచ్చిన కాఫీ తాగుతాడు. డ్రస్ మార్చుకొని, ఫ్రెషప్పవుతాడు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత తలకింద … Continue reading →
ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ సి.హెచ్.మన్మథ రావు గారు విచ్చేసి విద్యార్థులు తెలుగు భాష పైన సంస్కృతి పైన అభిమానాన్ని పెంచుకోవాలని, తెలుగు … Continue reading →
బ్రెజిల్ మరియు ఇటలీకి చెందినయుద్ధవీరుడు సైన్యాధ్యక్షుడు ,దేశభక్తుడు ,రిపబ్లికన్ , అసాధారణమైన శారీరక మరియు మానసిక ధైర్యాన్ని కలిగి ఉన్నవాడు , దక్షిణ అమెరికా మరియు ఇటలీలో … Continue reading →
నేను ముందా?! నువ్వు ముందా!! తెలియదు కదూ! నేనే ముందు! నేను సజీవం అప్పుడూ ఇప్పుడూ నేను వున్న చోటే వున్నా!! నన్ను నేను కాపాడుకుంటూ!! నేనేమీ … Continue reading →
ఆదివారం ఆగస్టు 27వ తారీఖున 11 గంటలకు మలక్‌పేట్ లో బ్రహ్మానందనగర్ లో ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్వగృహంలో ఆవిడ పుస్తకం అనుభవాలు-జ్ఞాపకాలు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. … Continue reading →
దాగడం, దాచడం చేతకాని నన్ను వెన్ను తట్టి…. నీకు బలాన్ని నేనంటూ లోకంలో నలుగురిలో వినపడేలా చేసింది నాలో “నిజం”… కానీ అసత్యాలరుచిలో లోకానికి నిజం అరాయింపు … Continue reading →
ఎప్పుడైనా అతను ఆఫీసు నుండి రాగానే తల్లి ఇచ్చిన కాఫీ తాగుతాడు. డ్రస్ మార్చుకొని, ఫ్రెషప్పవుతాడు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత తలకింద … Continue reading →
ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ సి.హెచ్.మన్మథ రావు గారు విచ్చేసి విద్యార్థులు తెలుగు భాష పైన సంస్కృతి పైన అభిమానాన్ని పెంచుకోవాలని, తెలుగు … Continue reading →
బ్రెజిల్ మరియు ఇటలీకి చెందినయుద్ధవీరుడు సైన్యాధ్యక్షుడు ,దేశభక్తుడు ,రిపబ్లికన్ , అసాధారణమైన శారీరక మరియు మానసిక ధైర్యాన్ని కలిగి ఉన్నవాడు , దక్షిణ అమెరికా మరియు ఇటలీలో … Continue reading →
నేను ముందా?! నువ్వు ముందా!! తెలియదు కదూ! నేనే ముందు! నేను సజీవం అప్పుడూ ఇప్పుడూ నేను వున్న చోటే వున్నా!! నన్ను నేను కాపాడుకుంటూ!! నేనేమీ … Continue reading →
ఆదివారం ఆగస్టు 27వ తారీఖున 11 గంటలకు మలక్‌పేట్ లో బ్రహ్మానందనగర్ లో ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్వగృహంలో ఆవిడ పుస్తకం అనుభవాలు-జ్ఞాపకాలు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. … Continue reading →
దాగడం, దాచడం చేతకాని నన్ను వెన్ను తట్టి…. నీకు బలాన్ని నేనంటూ లోకంలో నలుగురిలో వినపడేలా చేసింది నాలో “నిజం”… కానీ అసత్యాలరుచిలో లోకానికి నిజం అరాయింపు … Continue reading →