గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

gouthami gangaఅప్పుడు కుంపటి అంటించి నలుగురికీ అన్నం, కూర చేసి వడ్డించింది సీత. పులిహోర ఆవకాయ తల్లి వద్ద నేర్చుకొని సీత పెట్టేది. మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి ఉప్పుకారం కలిపి, అందులో పులిహోరపోపు, నువ్వుల పొడి కలుపుతారు. భోజనాలు చేస్తూ శాస్త్రి బాబయ్యా! మీ కోడలు పులిహోర ఆవకాయ పెట్టింది. ఎంత బాగుందో చూడు అన్నారు. ఏం బాగురా నల్లి కంపు కొడుతుంది అన్నాడు వచ్చిన బంధువు. భోజనం చేస్తున్నంతసేపూ ఎక్కడ వుండవలసిన వాళ్లని అక్కడే వుంచాలి. ఆడవాళ్లు గడప దాటి బయటకు వస్తే అనేక అనర్థాలు కలుగుతాయి. అంటూ నాటి సంఘంలో విద్యావంతులైన స్త్రీల కుటుంబాల్లో వచ్చే అపార్థాలు, కలతలు ఎకరువు పెట్టి, సనాతన సంప్రదాయ బద్ధులు వారి వలన ఎదుర్కొంటున్న అవమానాల్ని వివరించారు. శాస్త్రిగారు ఏమి చెప్పలేక పోయారు. నలుగురు నడిచేదే బాట. లోకాచారానికి విరుద్ధంగా పోతే అవమానాలూ, అనర్థాలు ఎదుర్కోవాలి. సబబైనదే అయినా సంఘం వ్యతిరేకించే మార్గంలో పల్లేరు ముళ్లూ, పాములు, తేళ్లు వుంటాయి. ఎందుకొచ్చిన గొడవ లోకమార్గానే అనుసరిద్ధాం అనిపించిందాయనకు. సీత వినోద కాలక్షేపాలన్నీ కట్టుబడ్డాయి. ఆమెకు ఎంతో ఇష్టంగా కోరి చెప్పించిన సంగీతం నలుగురిలో పాడటానికి వీలు లేదు. వివాహాది శుభకార్యాల్లో నోరు మెదపరాదు.

మధ్యాహ్నపు వేళ మగవారు ఆఫీసులకు వెళ్లాక వారు తిరిగి వచ్చే వరకూ మాత్రమే ఆమెకు పాటుల పాడుకొనే స్వేచ్ఛ. అప్పటికే ఏర్పాటు అవుతున్న భజన కార్యక్రమాలకు ఆమె గడపదాటడానికి వీలు లేదు. వారు ఆడవారు వచ్చి శాస్త్రిగారిని అడిగినా అప్పటికి వూరుకొని తరువాత నీవు వెళ్లడానికి వీలు లేదు. నలుగుర్లో బాగోదు అనేవారు. ఆ విధంగానే విద్యార్థినీ సమాజం వారు ఆమెను గౌరవ సభ్యురాలుగా ఎన్నుకొన్నా ఆ సమావేశాలకు ఆమె హాజరుకావడానికి వీలు లేదు. ఈ విధంగా ఓ తరుణ కోయిల గొంతు సాంఘిక కట్టుబాట్ల చేత బలవంతంగా అదమబడిరది. అయినా తనకేమి అడ్డు. ఆమె పానీయంబులు త్రావుచున్‌,కుడుచుచున్‌ అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా గృహ కృత్యాలు నిర్వహించుకుంటూనే తన గాన వ్యాసాంగాన్ని కొనసాగించేది. ఆసక్తి కల ఇరుగు, పొరుగు స్త్రీలనూ, బాలికలనూ చేర్చి వారికి పాటలు నేర్పేది. పారమార్ధికపు జడ్జిమెంటు అనే వేదాంత పరమైన కోర్టు వ్యవహారాలు చెప్పే ఉపాఖ్యానం మొదలు భజన పాటలు, జానపద గేయాల వరకు అన్ని ఆమె రసనాగ్రంపై నాట్యమాడేవి. ఆ ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరి ఇంట వున్న ఓ సమీప బంధువు ఈమె పాటల్ని చాలా పరిహసించేవారు. అయినా ఈమె ఉత్సాహానికి భంగం కలుగలేదు.

ఆ రోజుల్లో స్త్రీలు రెండు వర్గాలుగా విభజింపబడ్డారు. ఇంటి గడప దాటకుండా గృహకార్య నిర్వహణతోనే కాలం గడిపేవారు. వారికి సంఘంలో మన్నన ఎక్కువ. వినోదాలు, వికాసాలు వారికి ఆమడ దూరం. అవి అంటే వారికి తేలిక భావం కూడా. నృత్య గీతాది వినోదాలకు అంకితమైన వారు వారాంగనలు. వారిని భోగాలు అని కూడా అంటారు. సంగీత సాహిత్యాలు బాల్యంలో ఆసక్తిగా నేర్పించినా పెళ్ళి అయి అత్తవారింటికి వచ్చాక అవన్నీ బంద్‌. ఆడువారిని ఈ విధంగా సంప్రదాయపు శృంఖాలాలతో బంధించి మగవారు మాత్రం భోగపు స్త్రీలతో తమ వినోద కాంక్షను తీర్చుకొనేవారు. వేశ్య ఇంట పది మంది ఆడ, మగ వారు కలిసి పెట్రోమాక్స్‌ లైటులో పేకాడి వందలు నష్టపోయి వచ్చిన భర్త మధ్యాహ్నం వేళ తీరిక సమయంలో సాటి స్త్రీలతో కాలక్షేపంగా పందేల ప్రమేయం లేకుండా పేక ఆడుతున్న భార్యను తీవ్రంగా మందలించడమే కాదు. కొట్టడానికి కూడా వెనుకాడేవాడు కాదు. పేక ముక్కలు పరమ పవిత్రమైనవనీ తాను తన స్నేహితురాళ్లేకాని ఆమె తాకరాదని అతడి అభిప్రాయం కాబోసు. కావలిస్తే ఏ గవ్వలో చింత పిక్కలో ఆడుకో, పేక తాకావంటే చేతులపై వాతలు పెడ్తా అనేవాడు ఆ ప్రభుద్ధుడు. శాస్త్రిగారికి మాత్రం పుష్కలంగా డబ్బు వస్తున్నా ఇటువంటి వ్యాసాంగాలు ఎప్పుడూ ఇష్టపడలేదు.

శృంగార నాయకల్ని ఆ కాలంలో మూడు విధాలుగా విభజించారు. స్వయం, పరకీయ, సామాన్య, స్వీయ ధర్మబద్దంగా స్వీకరించిన భార్య. ఈమెతోటి శృంగారం సంప్రదాయాలకు ఒదిగి ప్రమాదరహితంగా, ధర్మబద్ధంగా వుంటుంది. పరకీయ ఇది ప్రమాద భరితం, ఉత్కంఠ, వేదన భయంతో కూడి (ప్రహారాలు (దెబ్బలు) మరణం కూడా తెచ్చి పెడుతుంది. అయితే ఈ మోజులో పడ్డ వాళ్లు వివేకశూన్యులై తమను తాము అదుపు చేసుకోలేరు. మధ్య యుగంలోనే అహల్యా సంక్రందనం, తారాశశాంకం వంటి నాటకాల ద్వారా ఎందరో కవులు ఈ పరకీయ శృంగారంలోని ప్రమాదాన్ని హెచ్చరించినా జరిగేవి జరుగుతూనే వుంటాయి. సామాన్యలు వేశ్యలు వీరి పొందు బ్రహ్మానందసబ్రహ్మచారి స్వర్గం చూపిస్తారు వీరు. ఎంత సౌందర్య రసికత వున్నా వీరి లక్ష్యం ధనమే కాని రస సిద్ధి కాదు. శ్రవణానందం, కంఠాభరణం, రంగూన్‌ రౌడి వంటి నాటకాలెన్నో వచ్చాయి. రసికులు తమ ధన, మాన ప్రాణాల్ని, వేశ్యల పాదాల ముందు వుంచి తమ రస పిపాస తీర్చుకొని కొసకు దారిద్య్రం, అనారోగ్యం, సంఘ నిరాదరణకు  ‘వేశ్య పొందు వలదు వలదు’ అనుకునేవారు. ఈ విధంగా వేదాలలో నీతో సమానమైన గుణం, విద్యాకల స్త్రీని, నీ వయస్సుకు తగిన దానిని పెండ్లి యాడి స్నేహబంధాన్ని దృఢతరం చేసుకొని బతుకు పండిరచుకో అని చెప్పబడి వుండగా, కాళీదాసు, మహాకవి’ గృహిణీ, సచివో మిధస్సఖీ ప్రియ శిష్యాలలితే కళాష్వః’ అని చెప్పగా షట్కర్మ యుక్తాకుల ధర్మపత్ని అని మనువు చెప్పగా పారాయణ చేసిన పెద్దలు ఆడదాన్ని వంటింటి కుందేల్ని చేసారు. గడపదాటి స్త్రీలు కాలు బయట పెట్టరాదు. ఆమె ధరించే చీరలు కొనాలంటే మగవారు బట్టల షాపులకు వెళ్లి పది రకాలు చూచి, తమకు నచ్చినవి 10 మూట కట్టించి షాపులో మనిషిచేత ఇంటికి తెప్పిస్తే అందులోంచి తమకు నచ్చిన చీరలు స్త్రీలు ఎంచుకోవాలి. నగలు చేయించాలంటే కంసాలి నాలుగు రకాలు ఇంటికి తెస్తాడు. అందులో తనకి నచ్చినవి ఆమె ఎన్నుకుంటే ఆ రకాలు చేసి తెస్తాడు. మద్రాసు నుంచి వచ్చే రవ్వల ముక్కు పుడకలు ఆ రోజుల్లో ప్యాషన్‌, సీతమ్మగారి కోరిక విని పైకి మందలిస్తూనే మేలి రకం రవ్వలతో ఆమె కోరిన నిమ్మగుత్తి బేసరి, చేయించారు. శాస్త్రి ఆ రవ్వలు కాసు బంగారం ఖరీదు చేసేవి.

నేటి కాలంలో సర్వ విధాల మగవారితో సమానంగా కాదు వారిని మించి స్త్రీలు వుంటున్న ఈ రోజుల్లో నాటి పరిస్థితి ఆ విధంగా వుండేదని చెప్పాలనే ఈ ప్రయత్నం.

భావకవితకు ఆద్యులైన వారిలో దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రిగారు ఒకరు వారిది కాకినాడ సమీపంలో పిఠాపురం వద్ద నున్న చంద్రపాలెం. సంస్కృత భాషా కోవిదుల ఇంట పుట్టిన కృష్ణశాస్త్రిగారికి సహజంగానే సంస్కృతాంధ్రాల పట్ల మక్కువ, ప్రావీణ్యం అలవడ్డాయి. మొదట్లో ఆయన కాకినాడలో పి.ఆర్‌.కాలేజీలో అధ్యాపకులుగా వుండే వారు. జన్మతః అబ్బిన భాషా పాండిత్యానికి ఆంగ్ల కవులు కీట్సు, షెల్లీ, బైరన్‌ల భావ కవితల ప్రభావం బంగారానికి తావి అబ్బినట్లుగా అయ్యింది. నూతన స్పూర్తి కలిగింది. వారు తొలి రోజుల్లో రచించిన కవితల్ని వారి మేనకోడళ్లు, శ్రీమతులు వింజమూరి సీత, అనసూయలు (అప్పటికి వారు పి.ఆర్‌. కాలేజీలో విద్యనభ్యసిస్తూ వుండేవారు) తమ మృదు మధుర కంఠాలతో ఆలపిస్తూ భావుకలోకానికి పరిచయం కావించేవారు. కాళాశాలాధ్యక్షుడైన రఘుపతి వేంకటరత్నం నాయుడి గారి వలన బ్రహ్మ మత ప్రభావం కళాశాల ఆవరణలో కూడా వ్యాపించి యుండేది. వంగ సాహితీ, సంస్కృతుల ప్రభావంకూడ అక్కడ కొంత నెలకొని వుండేది. ఆ రోజుల్లోనే కృష్ణశాస్త్రిగారు జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి। జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రీ। అనే జాతీయ గీతాన్ని రచించి వారి మేనకోడళ్ళ చేత ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో ప్రార్థనాగీతంగా పాడిరచారు. అది చాలా కాలం జాతీయ గీతంతో సమానమైన గౌరవాదరాల్ని కలిగివుంది. ఆంధ్రులలో సాంస్కృతిక చైతన్యాన్ని వికసింపచేయడానికి కళాశాల తరపున ఈ ఆంధ్రాభ్యుదయోత్సవాలు నిర్వహింపబడేవి. విజ్ఞాన ఖగోళ, సాహిత్య, సంస్కృతీ రంగాల్లో నిష్ణాతులైన వారెందరో దేశం నలుమూలల నుండీ వచ్చీ ఈ సభల్లో పాల్గొని సభ్యుల్ని చైతన్యవంతుల్ని చేసేవారు. విజ్ఞాన శాస్త్రంలో వసంతరావు వేంకటరావు, ఖగోళ శాస్త్రంలో గొబ్బూరి వేంకటానంద రాఘవరావు, ఆర్ష ధర్మాన్ని గూర్చి జటావల్లభుల పురుషోత్తం, ఆర్థిక శాస్త్రాన్ని గూర్చి జటావల్లభుల సత్యనారాయణ, సాహిత్యాన్ని గూర్చి విశ్వనాధ సత్యనారాయణ, అడవి బాపిరాజు, చిత్ర లేఖనాన్ని గూర్చి బొడ్డు బాపిరాజు, మొక్కపాటి నరసింహమూర్తి వంటి వారు కొందరు. వీరిలో చాలా మంది కళాశాల పూర్వ విద్యార్థులు కావడం విశేషం.

( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
241
ఆత్మ కథలు, గౌతమీగంగ, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో