అస్పృశ్య ప్రశ్న

పంచభూతాల సాక్షిగా యుగయుగాలుగా ఈ మట్టి గడ్డపై మట్టిని నమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారు మూలవాసులు. సువిశాలమైన, సుసంపన్నమైనా ఈ భారతవనిలో సనాతన ధర్మాన్ని స్థాపించడంకోసం అనేకమంది ఋషులు, మునులు, పండితులు, కవులు, మొదలగు వారు భిన్న, విభిన్న ప్రయత్నాలు చేశారు. వీరు చేసిన ప్రయత్నాలలో మూలవాసులైన వారు అంటరానివాసులు అయిపోయారు. ఇది ఆరంభం కాబోలు ఆ జాతి జనజీవనం వినాశనానికి! నాగరికత భావజాలాన్ని అలవర్చుకున్న మేధావులు తమ తోటి స్వజాతీయులను మాత్రం మానవులు (మనిషి) గా గుర్తించలేదు! వీరు పురాణాలు రాసినా, పూజలు చేసినా తమ చెమట చుక్కలు నేల రాలకుండా పొట్టగడుపుకోవాడానికి మూలవాసులను బానిసలుగా మార్చేందుకు ఈ వర్గం ప్రజలు చేసిన ప్రయత్నాలు. ఇది అంతా ఇంతా కాదు!
స్మ ృతులు, పురాణాలు, వేదాలు మానవ సముహాన్ని కులాల, వర్గాల సముహంగా వర్గీకరించి అస్పృశ్యులు, శూద్ర, అతిసూద్ర, చండాలురుగా చిత్రీకరించి మూలవాసులైన వారిని, వారి మూలాల్ని చరిత్ర పుటల నుండి త్రుంచి, తొలగించి హీనంగా ఈ సామాజిక వ్యవస్థ నుండి బహిష్కరించారు.
శ్రీ కృష్ణభగవానుడు నాలుగు వర్ణాలను తాను సృష్టించానని చెప్పినట్లుగా భగవద్గీత పురాణ కథనం, ప్రధానంగా మనిషి గుణాన్ని బట్టి ఈ విభజన చేసినట్లుగా గీతలో చెప్పబడినట్లుగా డా॥ కె.అరవిందరావు రిటైడ్డ్‌ డి.జి.పి ఆంధ్రప్రదేశ్‌ గారు ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వర్ణం` కులం శీర్షికతో రాసిన వ్యాసం లో పేర్కొన్నారు. కేవలం ఒక్క భగవద్గీతలోనే కాక మహాభారతం, వేదాలలో కూడా ఈ వర్ణ ప్రస్థావన కన్పిస్తుంది.
క్షమాగుణం, అహింస, సత్యం, సంతుష్టి, విద్యపట్ల ఆసక్తి, తపస్సు, శౌర్యం, ఇతరుల్ని శాషించే స్వభావం, అధీకారం పట్ల, ధనంపట్ల కోరిక, సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తిలేకపోవడం, సోమరితనం, పట్టుదల, స్ఫూర్తి లేకపోవడం వంటి గుణాలు సహజంగానే ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా దాగివుంటాయి. తాను నివశించే ప్రాంతాన్ని, వాతావరణాన్ని, అవకాశాన్ని, అవసరాన్ని బట్టి ఏదో ఒక సందర్భంలో వాటిని బహిర్గతం చేస్తూ వుంటాడు.
ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషిలోనూ కన్పిస్తాయి. కాని ఈ లక్షణాలనే ప్రధాన కేంద్రంగా చేసుకుని మానవ సముహాన్ని నాలుగు వర్ణాలుగా విభజించి, భగవంతుని పేరిట ఆపాదించడమన్నది మానవ తప్పిదం. చింతచెట్టు పులుపు స్వభావాన్ని, వేపచెట్టు చేదు స్వభావాన్ని కలిగివున్నట్లుగానే సహజసిద్ధంగా మానవుడు సందర్భానుసారంగా, కాలానుగుణంగా ప్రతిస్పందించే స్వభావాన్నీ, గుణాన్నీ కలిగి ఉంటారు. ఆదిమకాలంలో మనిషి ఆకులు తిన్నాడని, ప్రస్తుతం మనం కూడా ఆకులు తినలేం కదా! ప్రాచీనకాలం నాటి మనావునికి, ఆధునిక కాలం నాటి మానవునికి మధ్య సారుప్యత కన్పించదు. అటువంటి తరుణంలో ప్రాచీనకాలం నాటి అసమానత్వపు భావజాలాన్ని అనుసరిస్తూ ఆధునిక యుగంలో కూడా మానవుని మధ్య అంతరాలను సృష్టించడం భావ్యం కాదు!. కాలానుగుణంగా మార్పూ చెందని ఏ సమాజం అయినా అంతంకాక తప్పదు! చరిత్ర కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తుంది.
శ్రీకృష్ణ పరమాత్ముడు నాలుగు వర్ణాలను సృష్టించినట్లుగా భగవద్గీత పేర్కొంటున్న విషయం వాస్తవం ( సత్యాంశం అయితే ఈ భారతీయ సమాజంలో నేటికి కన్పిస్తున్న, ఆచరిస్తున్న వర్ణ, కుల వ్యవస్థలు ఇతర ప్రపంచదేశాల సమాజాలలో ఎందుకు కానరావు? ఇక్కడ మరోక విషయం ఆలోచించాల్సి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం భారతదేశంలో మాత్రమే నాలుగు వర్ణాల ప్రజలను సృష్టించాడా? శ్రీకృష్ణుని గీతాబోధన సమస్త మానవ సముహానికా? లేదా భారతీయ మానవ సముహానికి మాత్రమేనా? అసలు నాలుగు వర్ణాల ప్రజలను సృష్టించడానికే శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడా? భగవంతుడు భూమండలమంతటికి యాజమాని అవుతాడు. కాని, భారతదేశానికి మాత్రమే ఎట్లౌతాడు? ఈ విషయాన్ని పాఠకులు ఆలోచించాలి మరి.
‘‘ స్వధర్మో బ్రాహ్మణస్య అధ్యయనమ్‌, అధ్యాపనమ్‌, యజనమ్‌, యాజనమ్‌, దానమ్‌, ప్రతిగృహశ్చేతి.
క్షత్రియస్య అధ్యయనమ్‌, యజనమ్‌, దానమ్‌, శస్త్రాజీవః భూతరక్షణం చ.
వైశ్యస్యాధ్యయనమ్‌, యజనమ్‌, దానమ్‌, కృషిపాశుపాల్యే, వాణిజ్య చ.
శూద్రస్య ద్విజాతి శుశ్రూషా, వార్తా, కారుకుశీలవ కర్మ చ. ’’.
( కౌటిల్యుని అర్థశాస్త్రం ` ఆంధ్రవాఖ్య బాలానంది)
వేదాధ్యయనం, వేదాలు బోధించడం, యజ్ఞులు చేయడం, యజ్ఞాలు చేయించడం, దానం ( ఇవ్వడం ) ఎవరైనా ఇస్తే తీసుకోవడం ఇది బ్రాహ్మణుని స్వధర్మం. వేదాధ్యయనం, యజ్ఞాలు చేయడం, దానం చేయడం, ఆయుధాలు జీవనోపాధిగా చేసుకొనడం, ప్రజలను, ఇతర ప్రాణులను రక్షించడం క్షత్రియుని స్వధర్మం. వేదాధ్యయనం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం, వ్యవసాయం, పశుపోషణ, వర్తకం ఇవి వైశ్యుని స్వధర్మం. ద్విజుల ( బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ) కు సేవ చేయడం, వార్త, శిల్పాలు, గాన, నటనాదులు శూద్రుని స్వధర్మం. ఈ ధర్మాల ప్రస్థావన భారతీయుల వారసత్వ సంవదలుగా పరిగణిస్తున్న వేదాలు, పురాణాలు, ఇతిహాస గ్రంథాలన్నింటిలోను కన్పిస్తుంది.
‘‘ సర్వేత్ర సఖినఃసన్తు సర్వేసన్తు నిరామయాః
సర్వేభద్రాణి పశ్యన్తు మాకశ్చిద్దుఃఖమాప్నుయాత్‌ ’’’
` మహాభారతం
మానవులందరూ సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందరికి శుభాలే కలగాలి. ఏ ఒక్కరికే దుఃఖం కలగకూడదు అన్న మాటలు కూడా మహాభారతంలో కన్పిస్తాయి.
సత్త్వం, రజస్సు, తమస్సు గుణాలాధారంగా మానవ సమూహాల్ని విభజించిన నేపథ్యంలో ‘ ద్విజులకు ’ నిత్యం సేవల చేస్తూ, శూద్రులుగా పరిగణింప బడుతున్న వారికి సుఖం ఎక్కడిది? ఆరోగ్యం ఎక్కడిది? అంతకన్నా శుభాలెక్కడివి? వీరి బతుకులు నిత్యం దుఃఖసంద్రాలే! బానిస రోదనలే! పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ మనస్సుతో ఒకరిని ఒకరు ప్రేమించుకుని సమసమాజాన్ని రూపొందించాల్సిన చోట ఇలా అహింసకు బదులు హింసను నెలకొల్పడం దేనికి నాంది? ఏది పునాది? స్వజాతిని గౌరవించలేని ధర్మం, ధర్మమా? మానవసేవే మాధవసేవ అన్న సూక్తికి పరమార్థం ఏమిటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులైన మాకు బానిసలుగా సేవచేయడమే మీ స్వధర్మం అని బోధించేది సనాతన ధర్మమా?!
తోటి మానవుల స్వేచ్ఛను హరించి, వారిపై అజమాయిషిని చెలాయించడం కోసం వారిని బానిసలుగా చిత్రించారు. మీరు ఇలా సేవకులుగా మారడానికి పూర్వజన్మలో మీరు చేసుకున్న ‘ కర్మ ’ లే కారణమంటూ కర్మసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంతటితో ఆగకుండా బ్రహ్మపాదం నుండి పుట్టిన అయిదవ జాతిగా, వీరి సముహాన్ని పంచములుగా వర్గీకరించారు. అంతేగాకుండా హిందువులు పవిత్రంగా భావించే గోవుల మాంసాన్ని పంచములు తింటారని, వాటి చర్మాలతో చెప్పులు తయారు చేస్తారని, వీరు చేపట్టిన వృత్తులను నీచంగా పరిగణించి వారిని జనజీవన స్రవంతి నుండి దూరంగా ఉంచారు.
ఈ సృష్టిలో అంతా బ్రహ్మమయం అయినప్పుడు గోమాంసాన్ని తింటున్న వారిని ( పంచములు ) ఎందుకు నీచంగా చూడాలి! అసలు విషయానికొస్తే పాల ( క్షీరం ) రూపంలో అను నిత్యం గోవుల రక్తాన్ని తాగుతున్న వాళ్ళనేమనాలి? ఆ తెల్లని రక్తాన్ని వేడి చేసి దాని నుండి పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను తయారుచేసుకుని హాయిగా, ఆనందంగా, నిర్భయంగా, నిర్మోహామాటంగా, బహిరంగంగా తింటున్న వారినేమనాలి? అలా పాల నుండి సేకరించిన వాటితో దైవప్రతిమలను అభిషేకం చేస్తున్నారు. నెయ్యిలాంటి పదార్థాల్ని యజ్ఞాలలో సైతం వాడుతున్నారు. మరి దీనిని ఏమని పిలవాలో!
చనిపోయిన జంతుచర్మాలను సేకరించి, వాటితో చెప్పులు తయారు చేసే వృత్తివారు పంచములు, మాల మాదిగలైతే! అదే నీచపు నిర్జీవ జంతువుల చర్మాలతో తయారుచేసిన చెప్పులను మరి ఇతర వస్తువులను ధరించి హుందాగా షీకార్లు కొట్టే వారినేమనాలి? హిందువులకు పవిత్రమైన గోవు, అదే హిందువులు నీచంగా పరిగణించే పంది ( వరాహం ) వంటి జంతువుల నుండి సేకరించిన క్రొవ్వు పదార్థాలను సమ్మిళితం చేసి తయారు చేసిన చూయింగ్‌గమ్‌లను తింటున్న వారినేమనాలి? ఓ మనువాదులారా? ఓ వేద చాణుక్యుల్లారా! మీరే ఆలోచించండి? వీరిని ఏమని సంభోదించలో? కుటీల లౌక్యం మీ సొంతమే కదా!
ఋగ్వేద కాలం నాటికే నిర్ధాక్షిణ్యంగా, నిర్ధయగా ఆపాదించబడ్డ అస్పృశ్య జీవితం ఈ వర్ణవ్యవస్థ. ఇలా యుగయుగాలుగా, తరతరాలుగా తమను అంటరానివారుగా, పంచములుగా మార్చి తమ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన అసమానతల ఈ సామాజిక సాంస్క ృతిక వ్యవస్థలో నేటికి మా స్థితి ప్రశ్నార్థకమే?
‘‘ మా కన్నులు చూపేరుగవు
మా చెవులకు వేదాలు సోకావు
మా చేతులు దానాలు గర్హించవు
మా కాళ్ళు మందిరాల్లో అడుగిడవు
మా పెదాలు మంచినీళ్ళ ముంతెరగవు
మా ముక్కులు సువాసనలెరుగవు
మా గొంతులెప్పుడు గర్జించలేవు
మా శ్వాసకోశాలు స్వేచ్ఛావాయువులెరగవు
మా నాలుకలు షడ్రుచులు రుచించవు
మా ముఖఛాయలు రూపమెరగవు
మా శరీరాలు నూలుపోగుల స్పర్శ పొందలేవు
మా గుండెలెప్పుడు లబ్బుడబ్బులనలేవు
ఎందుకంటే!
మావి రక్తమాంసాల దేహాలు కావండి!!
యుగ యుగాలుగా, సజీవంగా
ఈ పుడమిపై తిరగాడుచున్న మానవ కళేబరాలు!!!
అస్పృశ్యమైన మా దుర్గంధాలచే
అటుదేవుళ్ళు! ఇటు పంచభూతాలు!
సమస్తం ఏ వర్ణాన్ని నోచుకొని మా
రక్తపు చెమట చుక్కలచే తడిబారిపోయింది!
అరే బాబూ! అసలు ఈ మానవ సమాజంలో
అస్పృశ్యత సోకని వస్తువే లేదనుకోండి!
మరి!…….
ఇవేవి తమకు పట్టనట్టు……..
రాతి బండరాళ్ళను దేవుళ్ళను చేసి
కలియుగ దేవలోకాన్ని సృష్టించారు కొందరు
సాటి మనుషుల్లో చూడలేని దైవత్వాన్ని
రాతిబండలలో చూస్తూన్నారంటే
ఎలా నమ్మాలో మరి!
ఈ విడ్డూరాన్ని చూసి దేవుళ్ళు సైతం
ఆశ్యర్యపోక మానరు!
సనాతన ధర్మం పేరిట
తరతరాలుగా మమ్మల్ని
అచేతునులుగా చేసిన
నల్లదొరల దుర్మార్గపు
ఆచారాల బంధ విముక్తికై
నా జాతి జనులకు చైతన్య పరుచుటకై
మళ్ళీ మళ్ళీ కలం పడుతూనే ఉంటా!
నా గళాన్ని వినిపిస్తూనే ఉంటా ’’
ఓ సైద్ధాంతిక కర్తల్లారా! ఓ శాసనకర్తల్లారా! వేదాలేరిగిన వేద పండితుల్లారా! ఆలోచించండి! మరీ మరీ ఆలోచించండి! ఈ విశ్వజగత్తులో ఏ మతం సృష్టించని, ఏ వర్గం స్పృశించని అస్పృశ్య భావజాలాన్ని హిందూమతం పేరిట నూతన సృష్టిగావించి సత్యం, అహింస, శాంతి, ప్రేమతత్త్వాలను లోకాన్ని బోధిస్తూ, మరోక వైపు లోపాయికారంగా అసత్యాన్ని, హింసను, అశాంతిని నెలకొల్పుతూ మానవత్వాన్ని నిర్వీర్యం పరిచారు. అలా చేసిన కుల, వర్ణ భావనలు ఈ రోజు మనిషిలో పరకాయ ప్రవేశం చేసి రాజ్యమేలుతున్నాయి. ఈ సనాతన సంస్కృతి ఎంత విషపూరితమైపోయిందో తెలియకనే తెలుస్తోంది. నేడు మనిషి మనిషిగా గుర్తించబడలేదు. మనిషి కులం పేరుతో గుర్తించబడుతున్నాడు. ఇది సాంస్కృతిక జీవనాన్ని దహిస్తున్న దహన కాండ.స్వచ్చ భారత పాటిస్తున్న నేటి భారతావనిలో స్వచ్చత పరచాల్సింది . పరిసరాలతో పాటు యుగ యుగాలుగా , తర తరాలుగా కల్మషమై సామాజిక స్వచ్చత పాటించని కుల , మత రాగద్వేషాల మానవుని మనో హృదయా మాలిన్యాల్ని లేని పక్షంలో భౌతిక స్వచ్చతను ఎంత పాటించినను ప్రయోజనం శూన్యం . నేడు ఆచరణలో ఉన్న సాంఘిక , అసమానతల భావజాలం బంధాల నుండి హిందువులు బయట పడి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాక్షించేంత వరకు పంచములుగా పరిగణింప బడుతున్న వారందరు హైందవ సంస్కృతి సంప్రదాయాలను వీడి పర మతాలను ఆశ్రయిస్తూనే ఉంటారు . దీనికి కారకులు మన స్వదేశీయులే గాని , విదేశీయులు కానే కారు !… ఇదీ అక్షర సత్యం ! . దీనిని గుర్తించిన నాడే సమసమాజ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది .

-డా. దుంగావత్ నరేష్ కుమార్ నాయక్
తెలుగు అధ్యాపకులు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కాలమ్స్, కృష్ణ గీతPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో