నర్తన కేళి -28

పరాయి రాష్ట్రంలో తెలుగు వారి సంప్రదాయమైన కూచిపూడి నాట్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ , వారికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్న శ్రీమతి సాహితీ ప్రకాష్ గారితో ఈ నెల నర్తన కేళి ………

*మీ పూర్తి పేరు ?
నా పేరు సాహితీ ప్రకాష్

*మీ స్వస్థలం ?
ఆంద్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా యానం .

* విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ?
నా చదువు అంతా అక్కడే సాగింది . మా నాన్నగారి వ్యాపారం రీత్యా ఇక్కడకి (ఖరగ్ పూర్ ) రావడంతో ఇక్కడే స్థిర పడిపోయాం . అమ్మ గృహిణి .

*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ జరింగిది ?
నేను నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది నాకు పడి సంవత్సరాల వయస్సులో కాకినాడ లో , ప్రారంభించిన మూడు నెలలకే నా పట్టుదల చూసి మా గురువు గారు అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో చేయించారు , దసరా ఉత్సవాల్లో చేసాను .

*మీరు చేసిన వాటిలో బాగా గుర్తున్న ప్రదర్శనలు?
తరంగం , శివ తాండవం , శివ పంచాక్షరి స్త్రోత్రం , జతి స్వరం ఇవే కాకుండా అన్నమయ్య , రామదాసు కీర్తనలు .

*మీ వైవాహిక జీవితం గురించి చెప్పండి ?
నాకు 1989 లో వివాహం అయ్యింది . మా వారు బ్యాంక్ ఉద్యోగి . నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి సంయుక్త ,అబ్బాయి సంజయ్ కుమార్ .

*నృత్యంలో శిక్షణ ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టారు ?
నేను డిగ్రీ చదువుతుండగానే మొదలు పెట్టాను .

*మీ శిష్యులు చేత చేయించిన ప్రదర్శనల గురించి చెప్పండి ?
ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలకి మా శిష్యుల ప్రదర్శన ఉంటుంది . అలాగే నవరాత్రులకి , నా నృత్య సంస్థ తరుపున ప్రతి సంవత్సరం నాట్య వేడుకలు నిర్వహిస్తాము . సిలికానాంధ్ర కూచిపూడి నాట్య సమ్మేళనంలో కూడా పాల్గొన్నాము .

* సిలికానాంధ్ర కూచిపూడి నాట్య సమ్మేళనం మీకు గురించి మీ అభిప్రాయం ?
నాట్య కళాకారులందరూ ఒక చోట కలవడం అనేది మంచి పరిణామం . అటు వంటి సందర్భంలో తెలియని విషయాలు చాల వరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది .

*మీకు ఇంకా ఏ శాస్త్రీయ నాట్యాలలో ప్రవేశం ఉంది ?
ఇక్కడికి వచ్చిన తర్వాత భరత నాట్యం నేర్చుకున్నాను . నా శిష్యులకి కూచిపూడి , భరత నాట్యం రెండిటిలోను శిక్షణ ఇస్తున్నాను .

*భరత నాట్యం , కూచిపూడి రెండింటిలో మీరు గమనించిన వైవిధ్యం ఏమిటి ?
కూచిపూడి అభినయానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది . భరత నాట్యం లో అంత ఎక్కువ ఉండదు . అలాగే రెండింటికి ప్రదర్శన విధానంలోను తేడా ఉంది . కాని రెండింటికి భరత ముని నాట్య శాస్త్రమే మూలం .  

*భరత నాట్యం కళాకారులకి , కూచిపూడి కళాకారులు అంటే చిన్న చూపు ఉంది అంటారు ? మీరు ఎప్పుడైనా అటువంటి సంఘటన ఎదుర్కొన్నార?
అవునండి . నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో గమనించాను . కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి . నేను వాళ్లకి అర్ధమయ్యే విధంగా వివరించి చెప్పగలను . నేను రెండు నాట్యాలను నేర్చుకున్నాను . నా శిష్యులకి నేర్చించి ప్రదర్శనలు ఇస్తున్నాము .

*మీ భవిష్యత్ ప్రణాళిక ?
ఎప్పటికైనా నా పుట్టిన ప్రాంతం యానంలో స్థిర పదాలని , ఆ గోదావరి ఒడ్డున నాట్య శిక్షణ ఇవ్వాలని ఆశ . అక్కడే నా జీవితం గడపాలని కోరిక .

* నాట్యం నేర్చుకోవాలి అనుకునే వారికి మీరిచ్చే సలహా ?సూచనలు ?
నేర్చుకుంటున్నప్పుడు త్రికరణ శుద్ధిగా నేర్చుకోండి . నాట్యంలో సరైన శిక్షణ , పట్టు సాధిస్తే మిగిలిన వాటిలాగే ఈ రంగంలో కూడా మీకు మంచి భవిష్యత్ ఉంటుంది .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో