నెలద – 5

                                                  ఆంగికం భువనం యశ్యః వాచికం సర్వ వాజ్ఞ్మయం
                                                  ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం ||

sumana koduri

sumana koduri

అందరూ నెలదతో పాటు నటరాజ ప్రార్ధన చేశారు . నెలద వారికి హస్త ముద్రలు చెప్పింది . అలాటి ప్రాధమిక సూత్రాలు, పాఠాలన్నీ ఎప్పుడూ చెప్పినవే అయినా మళ్లీ నాట్యం చేసేపుడల్లా అన్నీ గుర్తు చేయటం ఆమెకు ఒక అలవాటు .

అలాగే కొన్ని స్వయంగా సూక్తులు చెప్తుంది . నాట్యం అనేది మన కుల వృత్తి కాదు . నాట్యం ఒక దైవ కళ . దైవ అనుజ్ఞ లేనిదే ఎవరికీ రాదు . మనం చేసేపుడు కూడా మన అందచందాల ప్రదర్శనలాగానో ఎవరినో ఆకర్షించే నిమిత్తం అనుకుని నాట్యం చేయకూడదు . పద ఘట్టం , హస్త ముద్రలు , ముఖ కవళికలు మాత్రమే నాట్యానికి అర్ధం చెప్పేలా చేయాలి అంతే కాని ఇతర దేహాన్నంతా కదిలిస్తూ చేయటం అశాస్త్రీయం . దుస్తులు శరీరాన్ని కనబడనీయక నిండుగా ఉండాలి . ఏ దైవం గురించో మనం ఒక నృత్యం చేస్తాం అంటే నటరాజో , శివతత్వమో , రామాయణ శబ్దమో , కృష్ణ లీలా తరంగమో శక్తి నటనమో ఇలా ఏ నాట్యం చేస్తుంటే ఆ దైవాన్ని మనసారా తలచుకుంటూ తాదాత్మ్యత తో నాట్యం చేయాలి . మన ఎదుట మహారాజు వారుండవచ్చు . ప్రపంచానికి సర్వం సహా చక్రవర్తి భగవంతుడు . అతని ప్రతినిధి ప్రజలను పాలించే మహారాజు అనుకోవాలి అంతే గానీ రాజా వారి సమక్షంలో నాట్యం చేయటం రాజులను ఆకర్షించుటకో తద్వారా ధనకనక వస్తు వాహనాలు సంపాదించుటకో నాట్యం చేయటం మనవ జన్మకే కళంకం . మనకు నాట్యం ఒక అపురూప వరం , శాస్త్రీయ పరంగా శారీరక వ్యాయామం , మానసిక ఉల్లాసానికీ , మానసిక వికాసానికీ ఉపయోగపడే అద్భుత కళ . చూసే వారికీఅలాంటి మంచి సంభవించాలి అంతేకానీ నాట్య కత్తె ఆటవెలది అంటూ మనలను గురించి కించపరచేలా మాటాడే వారి మాటలు నిజమనేలా మన నాట్యం ఉండకూడదు . అందుకే నాట్యం వేదం అయింది . భరత ముని , సిద్ధేంధ్రుల వంటి వారిచే రచియింపబడింది .

                                      “ కంఠెనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శ యేత్
                                          చక్షు జ్ఞాత్ దర్శయేత్ భావం పాదాబ్జా మ్ తాళం ఆచరేత్ “

ఇవే నాట్యం సమయంలో ప్రదర్శింప బడాలి . మన కంఠం గీతానికి ఆలంబన కావాలి . హస్త ముద్రల ద్వారా అర్ధం ప్రదర్శింపబడాలి . కన్నుల ద్వారా భావాన్ని ప్రకటించాలి . తాళానికి అనుగుణంగా పాదములు నర్తించాలి .
ఇదే నాట్యం యొక్క సమగ్ర అర్ధం . ముఖ్యంగా మనం చేసే నాట్యానికి తప్పక ఉండవలిసిన లక్షణం . ఈ లక్షణాలను అభివృద్ధి చెందించటం మన లక్ష్యం కావాలి అని అందరి వేపు ఒక మారు చూసి ఇక మొదలు పెడదామా అంటూ నవ్వుతూ తనూ నాట్య సాధనకు సమాయత్త మైంది . శారదాంబ నట్టువాంగం ప్రారంభించింది .

                                             రజతాద్రినీ …….తాండవమాడే …….
                                              నటరాజు తాండవమాడెనే…….. అంటూ
నెలద ,రమిత , చంచల , ప్రభవి , శాంభవిలు తాళాను గుణంగా నాట్యం చేయటం ప్రకృతీ మైమరచి చూస్తున్నట్లు పులకించి హర్ష ధ్వానాలు చేస్తున్నట్లు మబ్బులు కమ్మి చిరుజల్లు కురవటం మొదలైంది .

రమిత కు మాత్రం నెలద చెప్పేది అసలు నచ్చలేదు . రమిత రాజమహేంద్రి కి చెందినా వేశ్యల కుటుంబం నుంచి వచ్చింది . తల్లి చనిపోగా తమ ఇంట ఉండి వేశ్యా వృత్తిలో జీవించే సరసి అనే స్త్రీ సరైన పోషణ కరవై పసిపిల్ల అయిన రమిత తో విజయ వాటికి చేరినది .

అప్పటికే శ్రీకాకుళం , స్థాన కోడూరు , మత్స్య పురి , ధాన్య కటకం , విజయ వాటి తదితర వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లే పట్టణాలతో ప్రియం వద , కృష్ణ నీరదలు నర్తకీ మణులుగా బాగా ప్రాచుర్యం పొంది ఉన్నారు . రాజాస్థానాలలో ఆలయ ప్రాంగణాలలో నాట్యం అంటే వీరిద్దరి పేరే విన్పించేది . అందచందాలలో ఆట పాటలందు మేటిగా ఉండేవారు . వారి పంచకు చేరింది సరసి రమితతో సహా ఆదరించి తమతో కలిసి ఉండమన్నారు . అప్పటి నుంచి ప్రియం వద , నీరదల తో కలిసి బ్రతుకు సాగించారు . సరసి అనారోగ్యంతో చనిపోగా రమితకు ప్రియంవదే చూసుకోసాగింది . రమితకు బాగా ధన వ్యామోహం అందచందాలున్నపుడే ధన సంపాదన చేయమని సరసి చెప్పిన సూక్తులు పసి వయస్సులో ఆమె మనసులో నాటుకు పోయాయి . కానీ నెలద ఆమె ఆలోచనలు తప్పు అని పదేపదే చెప్పేది . ఒక్కోసారి కఠినంగా కసురుకునేది కూడా. రమితకు ఆమె అధికారం నచ్చదు . తన ఆశయం తీరక పోవటానికి నెలదే కారణం అనుకుంటుంది . నెలద పెత్తనం లేకుంటే ఈ సమయానికి రాజు గారీ ప్రియమైనదిగా ఈ రమిత ఉండేది . సకల భోగ భాగ్యాలతో మర్యాదలతో తులతూగేది . ఏం చేయాలి కృతజ్ఞత భావం ఒకటుందిగా పెంచి పోషించిన వారు వీరి మాటకు తల ఒగ్గకు తప్పదుగా అనుకుంటూ ఉండేది . కానీ అవకాశం దొరికితే తన నైపుణ్యంతో ఏమైనా సాధించాలని ధనికులను ఆకర్షించాలనీ ప్రయత్నం చేస్తుంటుంది . నెలదకు దొరికిపోయి చీవాట్లు తినటం రమితకు సర్వసాధారణమైపోయింది కానీ ఏదో ఒక రోజున మహారాజో యువరాజో తనను మోహించి ఇక్కడి నుండి తీసుకెళ్లి పోతారని వీళ్లందరి కన్నా భాగ్యవంతంగా బ్రతుకుతానని అనుకుంటూ రోజులు వెళ్లదీస్తోంది .

ప్రభవి ధాన్యకటకం లో ఆలయపు ఆవరణంలో ఎవరో వదలి వెళ్లగా నాట్య మాడేందుకు వచ్చిన ప్రియంవద గమనించి తీసుకు వచ్చి పెంచింది . ప్రభవి చాల మంచిది అణుకువ అందం కల అమ్మాయి . నెలదకు ప్రియసఖి నాట్యం , యుద్ధ విద్యలు అన్నీ నెలదతో పాటు నేర్చుకుంది . ఆలోచనా విధానం కూడా నెలదకు దరిదాపుగా ఉంటుంది . నాట్య మాడే సమయంలో నెలద –ప్రభవి శివ పార్వతులుగా , రాధా కృష్ణులుగా జంట ఏదైనా వీరిద్దరే ఆ పాత్రలు ధరించి నర్తించటం చూసేందుకు అందరూ ఇష్టపడతారు .

రమణ ప్రియంవద తో చర్చిస్తున్నాడు ఉదయం నెలద అన్న మాటలు గురించి . నిజం గానే నెలద నర్తనకు ఆలయానికి వెళ్లక పోతే గురువు గారు వస్తే ఎలా ? పోనీ రావద్దని చెప్పే సమయం లేదు . ఎలాగైనా నెలదను నాట్యానికి వెళ్లేలా చేయాలి ఎలా ? అని ప్రియంవద , రమణ ఇద్దరూ తల బద్దలు కొట్టుకుంటున్నారు . నెలద గోశాలకు వెళ్లింది . విశాలమైన మావిడి , జామ , కొబ్బరి చెట్లున్న తన తోటలో ఓ వేపు గోశాల ఉంటుంది . ఐదు పాడి ఆవులు , నాలుగు బసవన్నలు ఆరేడు తువ్వాయిలూ ఉంటాయి అక్కడ . ఆ తోటను కాపాడేందుకు ఒక కుటుంబం . పాడి పనులు చూసేందుకై గోవిందప్ప కుటుంబం అక్కడ నివాస మేర్పరుచుకుని ఉంటారు . నెలద అపుడప్పుడు వెళుతుంటుంది . ముఖ్యంగా కాయల దిగుబడి అవి ఎక్కడికి పంపాలి వ్యాపారమునకు ఎన్ని ? ఇంటికి ఎన్ని , తన వారు , ఆలయ పూజారి కుటుంబంకు ఎన్ని ఇవ్వాలి ఇత్యాది విషయాలు స్వయంగా నిర్ణయించి తోటమాలి వాళ్లకు ఆయా పంపకాలు ఒప్పగించి వస్తుంటుంది . ఆ ఆపని మీదనే నాట్య సాధనకాగానే గోశాలకు చేరుకుంది . గోవిందప్పా ఇదేనా నిన్న ఈ లోకానికి వచ్చిన సరికొత్త అతిధి అన్నది అక్కడ అమ్మ పక్కనే కూచుని ఉన్న బుజ్జి తువ్వాయి తలపై చెయ్యి వేసి నిమురుతూ . గోవిందప్ప పరుగున వచ్చి అవునమ్మా నర్మడకు పుట్టిన బుజ్జి పాప ఇదే . మంచి పేరు చెప్పండమ్మా అన్నాడు . చేతులు కట్టుకుని వంగి అతను నిలబడి మాటాడే తీరుకు నవ్వి గోవిందప్పా నాకన్నా పెద్ద వాడివి నా దగ్గర అంత బానిసలా ప్రవర్తించక్కర లేదు . నేను ఏ రోజూ నిన్ను ఆ విధంగా అనుకోలేదయ్యా అన్నది . అయ్యో ఎంత మాటమ్మా మీ నిండు మనసు మాకు తెలుసు . మా స్థాయి నెరిగి వర్తించటం మాకు గౌరవం అంతేనమ్మా అన్నాడు . పర్లేదు నీ బిడ్డతో మాటాడినట్లే మాటాడు . మన గోవులన్ని టికీ మన పుణ్య భూమి లో ప్రవహించే నదుల పేర్లు పెట్టాం కదా . గంగ , గోదారి , కావేరి , పినాకిని , కృష్ణవేణి , నర్మద . వాటి పిల్లలకేమో ఉప నదుల పేర్లు అవీ పెడుతున్నాం . ఊ …. దీని పేరు “ సింధు …సింధు అని పిలుద్దాం బాగుందా అనడిగింది . చాలా బావుందమ్మా సింధు బిడ్డా అని తనూ ఆ తవ్వాయిని వంగి నిమిరాడు . అది అమ్మ వొత్తిలి లోకి మరింతగా దూరింది భయం వేసిందేమో .

జున్ను పాలు దీనికే వదలాల్సింది . పాలు కొన్నాళ్లు ఒక పూటే తీయవయ్యా , దాని బిడ్డను తాగానీ తృప్తిగా అన్నది .

“ అంతేనమ్మా మీరెపుడూ చెప్తారుగా గుర్తు ఉందమ్మా “ అన్నాడు .
సరే నేనిక బయలుదేరతాను . ఇంద ఖర్చులు నిమిత్తం ఉంచుకో అంటూ నాణేముల చిత్తి అతనికి ఇచ్చింది . రెండు చేతులతో అందుకుని కళ్లకద్దుకున్నాడు గోవిందప్ప .

గుర్రం ఎక్కి కళ్లెం అదిలించింది . కళ్యాణి పై కాంతి పుంజమై పుర వీధుల వెంట దూసుకెళుతున్న నెలదను చూసేందుకు రెండు కళ్ళు చాలవనుకుంటున్నారు మిగతా మగువలు . హబ్బ ఈ ఆటవెలది ధనాశకు చిక్కదు ఇంత గుబులు రేపి స్వంతమవ్వక తిరిగుతుంటుంది అనుకున్నారు పురుషులు . దేవదాసి అయినా దేవునిలాటి మనిషి మన ఊరికే ఆ క్రూర ధరుని పీడను వదిలించింది అనుకున్నారు పురజనులు . మువ్వలు –డెక్కలు కలిసి వింత శబ్దం సృష్టిస్తుండగా నెలద నివాసం ముందు ఆగింది కళ్యాణి . గుర్రపు రౌతు వచ్చి ఆమె దిగంగానే కళ్యాణిని గుర్రాలశాలలోకి తీసుకు వెళ్ళాడు .

– సుమన కోడూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో