ఆర్త గీతి

గగన సీమన షికార్లుచేసే విహంగాలకేం తెలుసు

పరిధుల్ని ప్రేమించడం ఎంత నరకమో
లేలేత ప్రత్యూష కిరణాలతోపాటు ఈదుతూ ఇచ్ఛాలోకాలకు సాగిపోయే స్వేచ్చా విహారులకేం తెలుసు
సంకెళ్ళతో సర్దుకుపోవడం ఎంతటి యాతనో

కాళ్ళు కదపలేని నిస్సహాయతలో
రెక్కలుండీ ఎగరలేని నిస్పృహలో
చీకటిని తోడిపోయడం ఎంత దుర్లభమో తెలుసా?

ఇనుప ఊచల ఇరుకు ప్రపంచాన ఎరిగినవారెవరున్నారని
చివరికి తన నీడకూడా పంజరం ఆవలే
అదీ పంజరంతో అల్లుకుపోయి

పంజరాన పక్షి ఎందుకు కూస్తుందో అసలు తెలుసా మీకు?

బిక్కుబిక్కుమంటూ కనుచూపు మేర సారించిన  బేల చూపులు
కదలలేని కాళ్ళు..ఎగరలేని రెక్కలు..
బయటి ప్రపంచాన్ని చేరగలిగేది
పిలుపు మాత్రమే..
అందుకే గుండె గొంతుకై ఎలుగెత్తి కూస్తుంది
అసహనపు ఊచల సందుల్లోంచి దశాబ్దాల దాహార్తితో..

గుండెల్ని పిండేసే ఆ ఆక్రందనకి దూరాన ఉన్న కొండకోనలూ ప్రతిధ్వనిస్తాయ్ ముక్తకంఠంతో
నేస్తానికై చెట్లు జాలిగా నిట్టూర్పులు విడుస్తుంటాయ్
ఆకాశమంతా తమదేనంటూ స్వైరవిహారం చేస్తున్న స్వేచ్ఛా విహంగాలు మాత్రం ఏ ఝుంఝుం మారుతమో వీస్తుందనుకొని మరింత బలంగా రెక్కలు ఆడిస్తూ  సాగుతుంటాయ్ …

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఊచలమధ్య ఊపిరాడని చిరుప్రాణం
సహజత్వాన్ని శ్వాసించాలన్న చిరు ఆశతో గాయాలే గేయాలుగా స్వేచ్ఛా గానం  చేస్తుంది
లోకమంతా ఉదయించే సూర్యుడితో పయనిస్తుంటే
తను మాత్రం కలల సమాధి అంచున నిలబడి వేకువ కోసం పాడుతూనే ఉంటుంది
ఎంతకీ తెల్లవారని  జీవితాన్ని  ఆర్తిగా ఆలపిస్తూనే ఉంటుంది
ఏ వేగుచుక్కైనా ఆలకించి అక్కున చేర్చుకుంటుందేమోనని..!

 – తోట నిర్మల 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో