నా కళ్లతో అమెరికా-42

                                                         ఎల్లోస్టోన్- చివరి భాగం

ఎల్లోస్టోన్ యాత్రలో తిరిగి వెనక్కి వచ్చే రోజు వచ్చింది.

మేం వెనక్కి వచ్చేటపుడు మేం వెళ్లేటపుడు వెళ్లిన దక్షిణపు దారిలో కాకుండా పశ్చిమపు దారిలో వెళ్లాలని అనుకున్నాం.  కానీ ఆ దారి నోరిస్ మీంచి వెళ్తుంది.

ముందు రోజు నాటి రోడ్డు రిపేర్ వల్ల అయిన ట్రాఫిక్ జాము అనుభవంతో  ఇక ఆ దారి మాని దక్షిణపు దారినే ఎంచుకోవలసి వచ్చింది.

అది ఒక విధంగా మంచిదయ్యింది కూడా. ఎందుకంటే వచ్చేదారిలో మళ్లీ టైటన్ పార్కు మీంచి, జాక్సన్ హోల్ ఊరి మీంచి వచ్చాం. అందు వల్ల్ల ఎన్నో ఇతర విశేషాలుచూడగలిగాం.

మా బసని ఖాళీ చేసి ఉదయం చాలా తీరిగ్గా బయలుదేరాం. ఎదురుగా కనిపిస్తూన్న యెల్లోస్టోన్ సరస్సుని సరస్సు మీద ప్రతిఫలిస్తూన్న వెలుగు కిరణాల్ని మాహృదయాలలో దాచుకుని బయలుదేరాం. ఒక చిన్న అపశృతి ఏవిటంటే ఉదయం లేచేసరికే నాకు జ్వరం మొదలైంది.

ఆ రోజు మేం వెనక్కి మళ్లీ దాదాపు 400 మైళ్లు ప్రయాణించి రాత్రికి సాల్ట్లేక్ సిటీ కి చేరాల్సి ఉంది. ఆ మర్నాడు ఉదయం ఆరు గంటలకు  తిరిగి శాంఫ్రాన్సిస్కో చేరే ఫ్లైట్ఎక్కాలి.

ఇక జ్వరమైనా, ఏదైన ప్రయాణం తప్పదు. నేను కాస్త తిని జ్వరానికి టాబ్లెట్ వేసుకుని సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఆ రోజు పూర్తిగా డ్రెవ్ చేసే బాధ్యతసత్య మీద పడింది పాపం. ఉదయం నించీ సాయంత్రం వరకూ ఏకబిగిన డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు.

లేక్ విలేజ్ లోని మా బస నుంచి సెలవు తీసుకుని ఉదయం 9 గంటలకు బయలుదేరేం. వెస్ట్ థంబ్ ని దాటుకుని మేం తిరిగి గ్రాండ్ టేటన్ పార్కులోకి ప్రవేశించేటప్పటికి మరో గంట పట్టింది. అక్కడి విజిటింగ్ సెంటర్ లో వీడియో ప్రదర్శన జరుగుతూ ఉండడంతో ఆ తర్వాత షోకి కూచున్నాం. శీతాకాలంలో నేషనల్ పార్కు మొత్తం మంచుతోకప్పబడి ఉంటుందని, ఆయా రోజుల్లో అక్కడ ఉండే వన్య ప్రాణుల జీవన విధానం అన్నీ వివరంగా చూపించారు. 

దారిలో కనిపించిన చిరు సెలయేళ్లని పలకరించుకుంటూ, మంచు కొండల వెలుగు నురుగుని కళ్లని అదుముకుంటూ, కొండ దాటి, కోన దాటి, నదిని దాటి త్రోవ వెంబడి మాప్రయాణం సాగింది.

జాక్సన్ హోల్  కి మధ్యాహ్న భోజన సమయానికి చేరుకున్నాం. అక్కడున్న ఒక్కగానొక్క ఇండియన్ రెస్టారెంటు ని వెతుక్కుంటూ వెళ్లేం. డౌంటౌన్ లో కారు పార్కు చేసిదుప్పి కొమ్ముల తోరణాలున్న పార్కుని చుట్టి పక్క వీధిలోకి నడిచేం. ఎండ చక్కగా వెచ్చగా, హాయిగా ఉంది.

“ఇదిగో వచ్చేసాం ఇండియన్ రెస్టారెంటుకి” అనుకుని రెండు మూడు వీథులు తిరిగి దగ్గరకు వెళ్లేసరికి అదెప్పటి నించి మూత పడి ఉందో గానీ “క్లోజ్డ్” బోర్డ్ కనిపీంచింది. మేంవెళ్లినది మంగళవారం. ఇండియన్ రెస్టారెంట్లకు వారాంతాలలోనే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో జనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెస్టారెంటూ  వారాంతాలలోమాత్రమే  తెరచి ఉంటుందనుకుంటా. ఆ ఊర్లో మరో ఇండియన్ రెస్టారెంటు కోసం వెతికే ఓపికా, సమయం లేనందున ఇక తర్వాతి ఆప్షన్ గా చుట్టుపక్కల ఉన్న అమెరికన్రెస్టారెంట్లల్ని చూసుకుంటూ మరో అరగంట తిరిగేం.

అప్పటికే వారం రోజుల నించి బైట ఫుడ్ తింటూ ఉన్నామేమో అసలు ఏ బోర్డు చూసినా ఆకలి వేస్తున్నా ఏవీ తినాలనిపించడం లేదు.

మొత్తానికి రెస్టారెంట్ కం బేకరీ అని కనిపిస్తే కాసిన్ని కేకులైనా తిని కడుపు నింపుకూందామని వెళ్లేం.

పిల్లలకి పాస్తా వంటివి, మాకేదో నచ్చిన సూప్స్ వంటివి దొరికాయి. అక్కడ పిల్లలకు ఆడుకోవడానికి మాత్రం ఎన్నో ఆకారాలు చేయగలిగిన సాగే సాగే తీగెల వంటివి ఇచ్చారు.వాటితో రకరకాల ఆకారాలు చేస్తూ పిల్లలూ, మేం తిన్నదేదో తెలీకుండా తినేసాం.

మధ్యాహ్నం ఇక జాక్సన్ నించి బయలుదేరి తిన్నగా వెనక్కి వెళ్లిపోవడమొక్కటే మిగిలిన సమయంలో, ఆన్లైనులో జాక్సన్ లో చూడవలసిన ఇతర విశేషాలలో  మాకుకనిపించిన గొప్ప ఆకర్షణ ఆ దగ్గరలో ఒక మంచు కొండ మీదకు రోప్ వేలో  ప్రయాణం.

[tribulant_slideshow post_id=”14438″]

ఇక మేం తప్పనిసరిగా చూసి తీరాలని అటు కారు పోనిచ్చాం. తీరా అది చాలా దూరంలో ఉంది.  GPS లో యథావిధిగా  అడ్రసు తప్పు చూపించింది. ఎక్కడెక్కడికో తిరిగిఅసలు దారి పట్టుకుని వెళ్లేసరికి మరింత ఆలస్యమైంది. 

“జాక్సన్ విలేజ్” అని బోర్డు ఉన్న దగ్గర్నించి కొండల మీదకు రోప్ వే లో ప్రయాణం చేసేందుకు కారు పార్కు చేసుకుని పైకి టిక్కెట్లు కొనుక్కునే సరికి సాయంతరం 4 గంటలవేళ అయిపోయింది.

ఇంకా మేం మరో 350 మైళ్ళు వెళ్లాల్సి ఉంది. అయినా పైకి వెళ్ళి త్వరగా వచ్చేద్దామని వెళ్లాం.

బాగా చల్లని గాలి మొదలైంది అంతలో. లేక తాహో జ్ఞాపకం వచ్చింది నాకు . కానీ అంత కంటే చిన్న ప్రయాణమే ఇది.  కిందనెక్కడా మంచు లేదు కానీ పర్వతాల పైన ఉంది.

పర్వతాల నించి కనిపించే కనుచూపుమేర పర్వతాల మీద బాగా ఎక్కువ ఉంది.

రోప్ వే దిగి కాస్త ఎత్తున ఉన్న పర్వత శిఖరాగ్రానికి చేరుకునేసరికి అద్భుతమైన దృశ్యాలతో బాటూ విసురుగా తోసేసే చలిగాలి చుట్టుముట్టింది.

అంతవరకూ ఉన్న వెచ్చదనం ఎటు పోయిందో హఠాత్తుగా వణికించడం మొదలెట్టింది.

అంత గాలి లోనూ ఒక పక్క నించి సిరి ఆ రాళ్ల పైకి ఎక్కి దిగనని పేచీ మొదలెట్టింది. 

అక్కడికి వెళ్ళడం మరపురాని ఒక గొప్ప అనుభవం. ఎప్పుడూ పర్వతాల శిఖరాగ్రాల్లో నిలబడినపుడు ఆకాశం లోకి చేరుక్న్నామన్న ఆనందంతో మనసు పులకరిస్తుంది.అక్కడ మేఘాల మీద ప్రయానిస్తున్న గర్వం కలిగింది. విసురుగా తోసే గాలిలో ఏటవాలుగా లేచి రెక్కలు సవరించుకుని కనిపించిన ప్రతి పర్వత శిఖరమ్మీద వాలాలన్నపులకరింత కలిగింది.

కిందికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. ఇక అప్పుడు మాకు తొందర మొదలయ్యింది.

ఇక ఆ రోజు ఇంకెక్కడా ఆగే సమయం లేదు. అప్పుడు బయలుదేరినా రాత్రి 10 గంటలకు చేరుతాం సాల్ట్ లేక్ సిటీకి.

ఉదయం నించీ మందులతో అదుపులో పెట్టిన జ్వరం చల్లగాలిలో తిరగడం వల్ల జాక్సన్ నించి బయలుదేరేటప్పటికి విజృంభించింది.

ఇక ఆ రోజు ప్రయాణం లో మిగతా సమయమంతా మూలుగుతూ కూర్చోవడమే నా పని అయ్యింది.

ఇక ఎక్కడా దిగే ఓపిక కూడా లేదు. ఎప్పుడు నిద్రపోతున్నానో, ఎప్పుడు మెలకువగా ఉన్నానో నాకే అర్థం కాలేదు. పిల్లలు బాగా నిద్రపోయారు.

వచ్చేటప్పుడు  సీనిక్ రూట్ లో కాకుండా ఐదహో రాష్ట్రం లోని వేగవంతమైన ఫ్రీవే పట్టుకుని వచ్చేసేం. సత్య బాగా వేగంగా డ్రైవ్ చేసి (నిజానికి ఇక్కడి ఫ్రీవేలలో 70 మైళ్ళకంటే ఎక్కువ వేగంతో వెళ్లకూడదు) తొమ్మిదిన్నరకల్లా సాల్ట్ లేక్ సిటీకి తీసుకు వచ్చేసేడు.

మర్నాడు ఉదయ 6 గంటలకే ఫ్లైట్. కాబట్టి నాలుగు గంటల కల్లా లేచి రెడీ అవాలి.  రోజల్లా ప్రయాణంలో నిద్రపోతూ ఉన్నా బాగా అలిసిపోయినందున ఎలా పడినిద్రపోయామో తెలీలేదు.

అన్నిటి కంటే బాగా తమాషా ఆ మర్నాడు తిరుగు ప్రయాణం లో, వచ్చే సమయంలో జరిగింది.

తెల్లారగట్ల గబగబా పిల్లల్ని తయారు చేసి, మేం తయారయ్యి నాలుగున్నర కల్లా హోటలు లో బయలుదేరేం. తీరా విమానాశ్రయంలో ఉన్న కారు రెంటల్ రిటన్ వరకూ వచ్చేకమాకు గుర్తొచ్చింది. కారులో నిండుగా పెట్రోలు పోయించి, కారుని తిరిగి  ఇవ్వాలని.

మరో పది నిమిషాలలో ఆ పని పూర్తి చేసుకు వద్దామని వెనక్కు తిప్పాం.

అదెంత తప్పు పనో అప్పుడు అర్థం కాలేదు.

దగ్గరలో ఎక్కడా పెట్రోలు పంపు లేదు. పెట్రోలు పంపు కోసం వెతుక్కుంటూ వెనక్కి 6 మైళ్ళు వెళ్లాం.

మొత్తానికి  పెట్రోలు పోయించుకుని తిరిగి వస్తూండగా రోడ్డు కన్ష్త్రషన్ వల్ల రోడ్డు బ్లాక్ అయ్యి మరో 15 నిమిషాలు లేట్ అయ్యింది.

ఇక అక్కణ్ణించి తిరిగి ఎయిర్పోర్ట్ కి వచ్చేందుకు మేం పెట్టిన GPS  అడ్రస్ మమ్మల్ని “సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ బేస్”  కు తీసుకుపోయింది.

అక్కణ్నించి సరైన అడ్రసు పట్టుకుని అసలు ఎయిర్పోర్టు కి వచ్చి కార్ రిటన్ ఇచ్చి, పరుగున చెకిన్ లోకి పరుగెత్తాం.

చెకిన్ లో మా హాండ్ బాగులో వాటర్ బోటిల్స్ ఉన్నాయని మరికాస్త లేట్ చేసారు. ఇక ఫ్లైట్ వెళ్ళి పోయే చివరి నిమిషంలో చివరి ప్రయాణీకుల్లా వచ్చి పడ్డాం.

ఎప్పుడూ ఎంతో ప్లాండ్ గా ఉండే మాకు ఇదొక మరపురాని చేదు అనుభవంగా మిగిలింది. ఆ రోజు జరిగిన న్ని సంఘటనలూ మమ్మల్ని ఫ్లెట్ ఎక్కేందుకు నిరోధించేవే.అయినా క్షేమంగా శానోజే కు చేరేం. అది ఆనందకరం.

ఇంటికొచ్చిన మరో నెల రోజుల వరకూ దోమ కాట్ల దద్దుర్లు అలాగే ఉండిపోయాయి.

ఎల్లోస్టోన్ గురించి రాసిన కవిత ఇది-

ఎల్లోస్టోన్!

నువ్వొక సప్త వర్ణ సంగీతివి

అయినా నిన్నెందుకు ఎల్లోస్టోన్ అని మాత్రమే అన్నారో మరి!!

నీ శరీరమ్మీద ఎక్కడ స్పృశించినా

భగ భగా అంతరాంతరాల్లో మండి

గప్పున ఎగిసే పొగల సెగలు

బుగా బుగా ఉడికే మట్టి బుడగలు

ఎటు చూసినా

యుగ యుగాలుగా నీలో దాగి ఉన్న ఆక్రోశం

స్పష్టంగా నీటి బుగ్గలై ఉబికి విస్తరిస్తున్న

సప్త వర్ణ దు:ఖావేశం

ఎటు చూసినా

భూమ్యంతరాళాన్నించి వేల నాలుకల

వాయు సర్పాలు ఒక్క సారి ఆకాశంలోకి దూసుకొచ్చినట్లు

భీకర శబ్దాల దుర్వాసనల గగుర్పొడుపు గంధక జలాలు 

 అయినా

ఎల్లో స్టోన్!

నిన్ను చూస్తే ఆవేశంగా హత్తుకోవాలనిపిస్తుంది

రెండు చేతుల్లో దాచలేని

నీ మార్మిక సౌందర్యాన్ని

కళ్లకి వేళ్లాడదీసుకోవడం తప్ప

ఉవ్వెత్తున ఎగిసే నీ వెచ్చ వెచ్చని బుగ్గల్ని

తడమాలని ఉన్నా

అమాంతం దుమక లేని

నీ రహస్యాంతర గొంతుని

చిత్రపటాలలో బందీ చేయడం తప్ప

ఏం చేయగలను?

ఒక వైపు

భీకర అలల మధ్య ఊగిసలాడించిన

నీ హిమ శీతల సరస్సు

శరీరాన్ని వణికించిన జ్ఞాపకం

అంతలోనే

ఆకాశపుటంచుల మధ్యనించి

హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే

శర వేగపు జలపాతాల జ్ఞాపకం

ఎట్నించెటు తిరిగినా

లయ తప్పే గుండె చప్పుడు తప్ప

తల్చుకున్న క్షణం

గగుర్పొడిచే వింతమడుగుల

మధ్య వివశమయ్యే హృదయం తప్ప

ఎల్లోస్టోన్! ఎల్లోస్టోన్!

నన్నెందుకు మాయని మచ్చల దోమై కుట్టి బాధించావ్?

నీ చెంతకు పసిపాపనై వచ్చిన నన్ను జ్వరమై పీడీంచావ్?

అయినా నువ్వంటే కోపం లేదు నాకు

నువ్వంటే ద్వేషం లేదు నాకు

ఎందుకంటే

నువ్వూ నాలాగే

కాదు కాదు నేనూ నీలాగే

ఏదీ దాచుకోకుండా

–  కె.గీత 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో