సమకాలీనం- మనకు స్థిరత్వo ఉందా? – విజయ భాను కోటే

        Vijaya-bhanu ప్రపంచం మొత్తం భారతదేశపు మూర్ఖత్వానికి ముక్కున వేలేసుకున్నా, లెస్లీ ఉడ్విన్ అనుకున్నది సాధించింది. మరిగి మరిగి ఉన్న మహిళల రక్తం మళ్ళీ మరిగింది. ఇండియాస్ డాటర్ మళ్ళీ ఒకసారి నివురు గప్పిన నిప్పును మంటల్లోకి నెట్టింది. చర్చ మొదలైన చోటే ఆగిపోవడం మనకు అలవాటే! మనకు టీవీ చానెళ్ళు అన్ని ఎందుకు అని నేను ఎన్నో సార్లు విసుక్కుంటూ ఉంటాను. వీధికో ప్రైవేట్ స్కూలు ఉన్నట్లే, వాటిని పుట్టగొడుగులు అని మనం అన్నట్టే, ఈ చానెళ్ళను ఎందుకు అనమో కదా! లెస్లీ ఉడ్విన్ గురించి మాట్లాడుతూ ఈ చానెళ్ళ సంగతి ఎందుకు నాకు? అవును. మనకు చానెళ్ళు మార్చడం ఒక దురలవాటు గా మారలేదూ? దీనివల్ల స్థిరత్వం తగ్గిపోతోంది మనుషుల్లో. ఈ స్థిరత్వం తగ్గిపోవడం వల్ల, అదే అలవాటు జీవితపు అన్ని కోణాల్లోనూ తన దుర్లక్షణాన్ని చూపిస్తుంది. బోడిగుండుకీ మోకాలికీ లంకె పెడుతున్నాను అనిపిస్తుంది కదా? అందరూ డాక్యుమెంటరీ గురించి, జరిగిన/జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడుతూ ఉంటే, నేను స్థిరత్వం గురించి మాట్లాడితే ఎలా?

         అవును! తప్పు ఇక్కడే ఉంది. న్యూస్ చానెళ్ళకు, మీడియాకు రోజుకో క్రొత్త వార్త కావాలి. రోజుకో సెన్సేషనల్ సంఘటన కావాలి. ఒక విషయం మీద పూర్తిగా ఏకాగ్రత చూపించే అవకాశం లేదు వాళ్లకు. అత్యాచారాల మీద కొన్నాళ్ళు చర్చా కార్యక్రమాలు, నేరాలు ఘోరాలు లెవెల్లో కార్యక్రమాలు చూపించేస్తారు. ఈ లోపు ఇంకో సెన్సేషనల్ న్యూస్ మీద ఫోకస్ చేస్తారు. ఇదంతా ఎవరి కోసం? మన కోసమే! మనకు స్థిరత్వం లేదు. క్రొత్త వార్తలమీద ఉన్న ఆసక్తి పాత వాటిపై ఉండదు. “అబ్బా! లెక్చర్ ఇవ్వకు. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను వాటి గురించి తెలుసుకోవద్దా? సాయంత్రం ఆఫీసునుండి వచ్చి కాళ్ళు బారచాపుకుని, సోఫాలో జారబడి ప్రపంచపు వార్తలు వినొద్దూ?”  అనాలనిపిస్తోంది కదా?

      “ఉదయం నుండి ఎన్ని కార్యక్రమాలు? ఎన్ని సీరియళ్ళు? ఎన్ని “పట్టుకుంటే పట్టుచీర” టైపు ప్రోగ్రాములు! ఇవన్నీ వదిలేసి ఒక విషయాన్నే పట్టుకుని ఉండమంటే ఎలా?” అని అడగాలనిపిస్తుంది కదా?

       అవును. అలా స్థిరంగా ఒకే అంశం మీద ఎలా ఉండగలం? సమాజంలోని మౌలిక భావనలు, బండరాళ్ల వంటి మెదళ్ళలో మహిళల పట్ల ఉన్న అసమాన్యతను అమరశిల్పి జక్కన చెక్కిన శిల్పాల్లా పోషిస్తున్నంత కాలం మహిళల జీవన విధానంలో, సమాజ అసమానత్వపు పోకడలలో మార్పు ఎందుకు వస్తుంది? నేను ఏ వ్యాసం రాసినా, ప్రభుత్వానికి ఒకటే చెప్తాను. “క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యం.” ఇది కూడా అంతే! మీ కుటుంబాన్నే తీసుకోండి. ఏ అంశాల్లో మీ కుటుంబం ఇటువంటి సాంఘిక నేరాలకు దగ్గరగా ఉందో చూడండి. నెగెటివ్ ఆలోచనలను ముందు మీ కుటుంబాల్లో నుండి పారద్రోలండి. మీరు అత్యాచారాలు చేసే కొడుకులను పెంచుతున్నారు అనడం లేదు. మహిళల పట్ల ముకేష్ సింగ్, ఆ ఇద్దరు లాయర్లు  కలిగి ఉన్న అభిప్రాయాలను మీ కుటుంబాల్లో కలిగి ఉన్నారంటే సామాజిక అసమతౌల్యతలొ మీకు కూడా భాగం ఉన్నట్టే! ఎక్కడికక్కడ ఇటువంటి విషయాలకు చెక్ పెట్టండి.

     మీ స్థాయిలో ఇటువంటి విషయాలపై చర్చించండి. మార్పుకు మీ ఒక్క మాట, ఒక్క చేత కారణం కావచ్చు. మను స్మృతిని తగలబెట్టడం కాదు కావాల్సింది. మన మనస్సులో పేరుకుపోయిన చెత్తను తగులపెట్టాలి! మార్పు వచ్చేవరకూ మీ వంతు పాత్ర మీరు పోషించండి! రేప్ సెన్సేషనల్ సంఘటన కాదు. సమాజపు సెన్సిటివిటీని ప్రశ్నించే చర్య!

 – విజయ భాను కోటే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, సమకాలీనం, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to సమకాలీనం- మనకు స్థిరత్వo ఉందా? – విజయ భాను కోటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో