ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

                              1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా  బ్రాంట్            

బాల్యం –విద్య –దేశ సేవ:

18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్  దగ్గర హీల్దేల్ బెర్గ్ లో  జన్మించిన జోహన్నా వాన్ వార్మెలో ఆఫ్రికా జాతీయతను ,దక్షిణాఫ్రికా ప్రచారాన్ని చేస్తూ ,బోయర్ యుద్ధం లో గూఢచారిగా పని చేసిన సాహసురాలు .ఆరోగ్య విషయాలపై వివాదాస్పద రచనలు చేసి ,ప్రాఫేసీ కూడా రాసిన రచయిత్రి .తండ్రి నెదర్లాండ్ కు చెందిన డచ్ రిఫార్మేడ్ మినిస్టర్ .తల్లి పూర్వీకులు ఎప్పుడో దక్షిణాఫ్రికా వచ్చి స్తిర పడిపోయారు .  కేప్ టౌన్ లో యువ విద్యార్ధినుల కోసం ఏర్పడిన గుడ్ హాప్ సేమిటరి  స్కూల్ లో రెండేళ్ళు చదివింది .జోహన్నా జన్మించిన ఆరేళ్ళకే తండ్రి చనిపోగా తల్లితో యూరప్ లో ఆరునెలలు పర్య టించింది .1899లో రెండవ బోయర్ యుద్ధం ప్రారంభమైంది .సోదరులతోకలిసి సైనికులకు నర్స్ గా  సేవలు చేసింది .ట్రాన్స్ వాల్ రాజధాని ప్రిటోరియను బ్రిటన్ ఆక్రమించింది .అయినా బోయర్లు వెంటనే లొంగిపోకుండా పోరాడారు .దీర్ఘకాలం గొరిల్లా యుద్ధం కొనసాగింది . ప్రిటోరియాలో ఉంటున్న బ్రాంట్ బోయర్ కు న్యాయం జరగాలని  తీవ్రంగా  ప్రచారం చేసింది .బ్రిటిష్ అధికారులపై నిఘా కోసం మహిళా దళాన్ని ఏర్పరచి గూఢ చారి గా తన దేశానికి విలువైన సమాచారాలను అంద జేసింది .ఖైదు నుండి తిరిగి వచ్చిన వారికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది .రివ్యు ఆఫ్ రివ్యూస్ పేపర్ లో డబ్ల్యు .టి స్టేద్ అనే ఆయన ఐరీన్ కాన్సేన్త్రేటెడ్ కాంప్ లో ఖైదీల దీనస్తితిని గురించి రాస్తే క్రమంగా బ్రిటిష్ వారు చేస్తున్న బోయర్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తి రగులోక్కోన్నది  .

 స్వంత ఇంట్లోనే పరాయితనం:

 యుద్ధం పూర్తీ అయిన తర్వాత జోహన్నా బ్రాంట్ తానె స్వయం గా ఐరీన్ కాంప్ గురించి సమగ్ర వివరాలతో’’పెట్టికోట్ కమాండో ‘’పేరున  పుస్తకం రాసింది .ఇందులో తానూ ,తన తల్లి బోయర్ యుద్ధం లోఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులను ,అవమానాలను రాసి ప్రపంచం దృష్టికి తెచ్చింది .పుస్తకాన్ని తల్లికి అంకితమిస్తూ ‘’నా కోరికలకు,ఆలోచనలకు  విరుద్ధం గా బ్రిటన్ చేస్తున్న అరాచకాలను ప్రజా దృష్టికి తీసుకు రావటానికి చేసిన ప్రయత్నం ఇది ‘’అన్నది .వీరి గృహమైన ‘’హార్మని ‘’బ్రిటిష్ సైనికులకు విడిదిగా మారిపోయింది .హన్సి అనిపిలువబడే జోహన్నా ను తల్లిని బ్రిటిష్ సైనికులు అపకారులుగా భావించలేదు .క్రమంగా వారిద్దరిని ఎవరితోనూ కలవనీకుండా ఎవరితోనూ మాట్లాడనీయకుండా ఆంక్షలు విధించారు .దీనితో నిస్సహాయం గా ఉండిపోవలసి వచ్చింది. తమ దేశ ప్రజలకు ఏ మాత్రమూ సాయపడలేక పోయారు తల్లీ ,కూతురు .

  బ్రిటిష్ సైన్యం లో ఉన్నతాధికారులు వీరింటి ప్రక్కనే కాంప్ లలో ఉన్నారు .వీరిద్దరిని అపాయం లేని వారుగా భావించ టానికి జోహన్నా  అక్కభర్త క్లోటే ఒకప్పుడు  బ్రిటిష్ వారికి దక్షిణాఫ్రికాలో ఏజెంట్ గా ఉండటమే కారణం .విక్టోరియా మహారాణి నుండి ‘’ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ ‘’పురస్కారం పొందటం కూడా కొంత సాఫ్ట్ కార్నర్ గా పని చేసింది .ఈ సౌకర్యాన్ని తల్లీ కూతురు గొప్పగా కాష్ చేసుకొన్నారు .వారితో సఖ్యంగా ఉంటూసైనికుల ఆనుపానులు తెలుసుకొంటూ ,ఆయుధ సామగ్రి వివరాలు గమనిస్తూ అన్ని విషయాలను తమ దేశ సైనికులకు రహస్యం గా’’ నిమ్మ రసం ఇంకు ‘’తో పైకి కనిపించకుండా కాగితం పై రాసి చేరవేసేవారు. తమ దేశ భక్తిని ప్రదర్శించుకొనే వారు .1902 లో జోహన్నా లూయీ ఎర్నెస్ట్ బ్రాంట్ ను వివాహం చేసుకొనగానే అనేక దేశాల నాయకులు ప్రజలు  అసంఖ్యాకం గా  ఆమెకు అభినందన సందేశాలను  పంపి కృతజ్ఞతను ఆనందాన్ని తెలియ జేశారు .

 నేషనల్ వుమెన్ పార్టీ సెక్రెటరి: 

   మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో జోహన్నా దక్షిణాఫ్రికా జాతీయుద్యమం లో చురుకుగా పాల్గొన్నది .లెఫ్టి నెంట్ కల్నల్ మెనీ మార్తిజ్ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని దక్షిణాఫ్రికా కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు .కాని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తిరుగుబాటును పూర్తిగా అణచి వేసింది .ఆరు నెలల తర్వాత ‘నేషనల్ వుమెన్ పార్టీ ‘’ట్రాన్స్ వాల్ లో ఏర్పడింది .విప్లవ కారులను విడుదల చేయటం ,వారి కుటుంబాలను ఆదుకోవటం,నేషనల్ పార్టీకి అండగా నిలబడటం అనేవి వీరి ధ్యేయాలు .జోహాన్స్ బర్గ్ లో జరిగిన మొదటి పార్టీ సమావేశానికి జోహన్నా కార్య దర్శిగా పని చేసింది .

 ఆరోగ్య సూత్రాలపై రచనలు:

  సాధారణ ఆరోగ్య సమస్యలపై ఇరవై దాకా  కరపత్రాలను రాసి ప్రచురించింది జోహాన్నా .’’ద్రాక్ష వైద్యం ‘’ ఆమెకు అభిమానమైనది .అందుకే ‘’గ్రేప్ క్యూర్  అండ్ ఫాస్టింగ్ బుక్ ‘’రాసింది .తనకే వచ్చిన ‘’ స్టమక్ కేన్సర్ ‘’ను గ్రేప్ క్యూర్ ట్రీట్ మెంట్ తో పూర్తిగా నయం చేసుకొన్న తర్వాతే ఆ పుస్తకం రాసింది .దీన్ని మొదట బోధించిన వాడు’’లివ్ ఆన్ ఫ్రూట్ ‘’పుస్తక రచయిత దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్నార్డ్ ఎహ్రేట్ .చాలామంది గ్రేప్ క్యూర్ ను అసంబద్ధం అన్నారు .

 ప్రాఫేసీ రచన :

 జోహన్నా తల్లి ప్రిటోరియాలో  7-12-1917న మరణించిన రోజున  బ్రాంట్ కు కొన్ని విచిత్ర విశేష అనుభూతులు కలిగాయని తెలుసుకొని వాటిని అక్షర బద్ధం చేసింది . వీటిని ‘’ది మిలీనియం ‘’పేరుతొ 1918 లో ప్రచురించింది .మరొక మత గ్రంధం గా ‘’పార్టికల్స్ ఆర్ కమింగ్ హోమ్ మదర్ ‘’రాసి 1936 లో విడుదల చేసింది .దక్షిణాఫ్రికా భవిష్యత్తు గురించి చెప్పేది .వారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పింది .దాదాపు పది పుస్తకాలు రాసింది .88 ఏళ్ళు జీవించి 1964 లో జోహన్నా బ్రాంట్ మరణించింది .ఆమెపేర దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2000 సంవత్సరం లో  1.30 రాండ్ ల విలువగల పోస్టల్ స్టాంప్  ను విడుదల చేసి బోయర్ యుద్ధం లో ఆమెచేసిన  సేవకు గుర్తింపు కల్గించి గౌరవించింది .

   2-లిప్ స్టిక్ ఆర్టిస్ట్ –సారా జేన్ బ్రిటేన్

దక్షిణాఫ్రికా రచయిత్రి ,లిప్ స్టిక్ ఆర్టిస్ట్ సారా జేన్ బ్రిటేన్1974 ఆగస్ట్ 31 న జోహాన్స్ బర్గ్ లో జన్మించింది .అక్కడే .బ్రియాన్ స్టన్ ప్రైమరీ స్కూల్ లోను ,రెడ్ హిల్ హైస్కూల్ లోను చదివింది .విట్స్ యూని వర్సిటి లో డ్రామా కోర్సు చదివి డ్రమాటిక్ ఆర్ట్ లో బి ఏ ఆనర్స్ డిగ్రీ 1996లో సాధించింది .తర్వాత కమ్యూనికేషన్ స్టడీ లో మాస్టర్ డిగ్రీ పొందింది .అప్లైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ లో2005లో పి హెచ్ డి .చేసింది .యూని వర్సిటి లో జాతీయ అస్తిత్వం ,హాస్యం లపై పరిశోధన చేసి దక్షిణాఫ్రికా హాస్యం ను ప్రత్యెక విషయంగా మాస్టర్స్ రిసెర్చ్ ‘రిపోర్ట్ తయారు చేసింది .’’మేడం అండ్ ఈవ్ కామిక్ స్ట్రిప్ ‘’పై ప్రత్యేక కృషి చేసింది .పి హెచ్ డి .పరిశోధనా వ్యాసంగా ‘’వన్ నేషన్ ,వన్ బీర్ ,ది మైధాలజి ఆఫ్ ది న్యు సౌత్ ఆఫ్రికా ఇన్  అడ్వర్ టైజ్ మెంట్ ‘’రాసి పేరు పొందింది .

  ఫ్రీలాన్స్ కమ్యూనికేషన్  స్ట్రాట జిస్ట్   గా పని  చేయటానికి  ముందు జర్నలిజం లో  అడ్వర్ టైజ్ మెంట్ లోనుపట్టు సాధించింది .స్థానిక అవమానాలపై రెండు యువ నవలలు ,మూడు నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాసింది .’’నా జాతి  ఏది ?నా అస్తిత్వం ఎక్కడుంది ?అని తెలుసుకోవటానికే దక్షిణాఫ్రికాలో జనం పొందిన అవమానాలను సేకరించి గ్రంధస్తం చేశాను .ఈ అవమాన మచ్చలు నా జాతి సమస్త అస్తిత్వానికి దారి చూపుతుంది ‘’అని సారా తెలియ జేసింది .జాతీయతను తెలుసుకోవటానికి  ఈ అవమానం   పట్టకం (ప్రిజం )లాగా పని చేస్తుందని విశ్వసిం చింది .

వెబ్ సైట్ రచయిత్రి:

 మెయిల్ అండ్ గార్డియన్ న్యూస్ పేపర్ వారి ‘’థాట్ లీడర్ ‘’అనే వెబ్ సైట్ లో నిత్యం వార్తలు ,అభిప్రాయాలను సారా రాస్తుంది .ఆమె రాసిన విభాగాలలో ‘’హౌ నాట్ టు ఎమిగ్రేట్ ఇన్ ,షుడ్ ఐ స్టే ఆర్ షుడ్ ఐ గో ‘’,టు లివ్ ఇన్ ఆర్ లీవ్ సౌత్ ఆఫ్రికా ‘’వంటివి ఎన్నో ఉన్నాయి .ఈ వెబ్ సైట్ సంపాదకుడు ముందుమాట రాస్తూ సారా అనుభవించిన ప్రవాస జీవితానుభవాలు ,ఆమె వివాహ జీవితాన్నే విచ్చిన్నం చేశాయి  అని తెలియ జేశాడు .సారా నిర్మొహమాటం గా సూటిగా అభిప్రాయాలను తెలియ జేస్తుంది .ప్రవాస జీవితం కుటుంబాలను దూరం  చేసి  చేదునే మిగిల్చింది ఆమె కు .’’థాట్ లీడర్ ‘’బ్లాగ్ లో వీటిని ప్రత్యేకించి రాసి తన క్షోభను అందరితో పంచుకోన్నది .దీనికి  ‘’గోండ్వానాలాండ్ ‘’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టుకొన్నది .

 లిప్ స్టిక్ ఆర్టిస్ట్:

  నగర దృశ్యాలను ,ఇతర విషయాలను ,నిశ్చలన దృశ్యాలను లిప్ స్టిక్ తో చిత్రించటం సారా బ్రిటేన్ ప్రత్యేకత .స్టాక్ మార్కెట్ యాడ్స్  గా ఆమె చిత్రించిన ఎలుగు బంటి ,కుక్కలు , పిల్లులు ,గుర్రాలు షార్క్ చేపలు ,మొసళ్ళు ,ఖడ్గ మృగాలు ఆమె లిప్ స్టిక్  పెయింటింగ్ లో జీవం పోసుకొంటాయి .,దీనికి ఆమెకు  ప్రేరణ నిచ్చింది దక్షిణాఫ్రికా సైన్స్ ఫిక్షన్ రచయిత రాసిన ‘’జూ సిటీ ‘’నవల . జంతు లక్షణాలను నగర జనులలో ప్రతిబింబించే ట్లు చేసింది .అందులో న్యునిస్ అనే జంతువు  తనను ఎక్కువగా ఆకర్షించింది అంటుంది సారా .సారా బ్రిటేన్ తన మొట్ట మొదటి లిప్ స్టిక్ ఆర్ట్ ఎక్సి బిషన్ ను ‘’పల్స్ ఆఫ్ ది సిటి ‘’పేరుతొ నిర్వహించింది.దీనిని 2012జూలై లో బ్రాం ఫార్టీన్  నగరం వేలో గాలరీలో లో ఏర్పాటు చేసింది .ఆమెకు ఉత్తేజం కలిగించినవాడు లాండ్ రోవర్ అనే మార్కెటింగ్ ఏజెంట్ .

   ‘’  ది వరష్ట్ యియర్స్ ఆఫ్ మై లైఫ్ సో ఫార్ ‘’అనే రచనకు 2010 లో సన్ లాం  సిల్వర్ ప్రైజ్ ఫర్ యూత్ లిటరేచర్ ‘’కు సారా పొందింది .మళ్ళీ అదే సంస్థ 2002లో ‘’వెల్కం టు ది మార్టిన్  టుద్ హాప్ ‘’ నవలకు సిల్వర్ ప్రైజ్ అందజేసి గౌరవించింది . ఆమె రచనలు జెర్మని మొదలైన భాషలలోకి అనువాదం పొందాయి .’’ది  ఆర్ట్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికన్ ఇన్సల్ట్ ‘’నవల జగత్ ప్రసిద్ధమైంది .

     –  గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో