రేపటి బంగారు తల్లులు (సంపాదకీయం)

రేపటి బంగారు తల్లులు

1416570517-0653ప్రతి తల్లీ తన కూతుర్ని బంగారు తల్లిలాగే భావిస్తుంది . పిలుచుకుంటుంది కూడా .
కానీ లేడి పిల్లల్ని వేటాడే పులులున్న మన సమాజంలో ఎన్ని పసి మొగ్గలు నేలరాలుతున్నాయో చూస్తుంటే మన ఆడపిల్లల్ని బయటకి పంపటానికే భయపడే రోజులొచ్చాయి .
ఎంతో మంది బంగారు తల్లుల జీవితాల్ని చీకటి కూపాల్నుంచి బయటకు తీసుకు వస్తున్న సునీతా కృష్ణన్ అభినందించ తగ్గవారు . ఈ మధ్య ప్రత్యేకంగా ఆమె రూపొందించిన “ బంగారు తల్లి “ అందరికీ ప్రీతి పాత్రమైంది . ఏ బిడ్డకీ ఇటువంటి పరిస్థితులు రాకూడదనీ ,యువతుల్ని ధైర్య సాహసాలతో పెంచాలీ అనే ఆలోచన కలిగించింది ఈ సినిమా . ఒక సమాజ సేవకుడి కూతురు, పైగా చదువుల్లో తెలివైన అమ్మాయి దుర్గ.పై చదువుల కోసం హైదరాబాదు వెళ్లిన దుర్గ వ్యభిచార గృహానికి తరలించబడటం , ఆమె ఎదుర్కొన్న కష్టాల ఆధారంగానే ఈ సినిమా రూపొందించారు సునీతా కృష్ణన్ . హ్యూమన్ ట్రాఫికింగ్ అనే సమస్య మన దేశంలో ఎన్నో చోట్ల, ఎన్నో రూపాల్లో జరుగుతూనే ఉంది . అది చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది .

సునీతా కృష్ణన్ చెప్పిన వాస్తవ గాధ ఆధారంగా ఆమె ఆలోచనలకి రూపాన్నిస్తూ దర్శకత్వం వహించాడు ఆమె భర్త రాజేష్ టచ్ రివర్ . ఈ సినిమాకి మూడు జాతీయ పురస్కారాలు , రెండు అంతర్జాతీయ పురస్కారాలులభించాయి . ఈ సినిమా విడుదలకు ముందే అవార్డులు గెలుచుకోవడం విశేషం . తెర పైకి ఎక్కింది ఒక్క దుర్గ కథే కావచ్చు కాని ఇలాంటి గాధలు నిత్యం ఎన్నో జరుగుతూనే ఉన్నాయి . సునితా కృష్ణన్ “ప్రజ్వల” సంస్థ ద్వారా సుమారు 1200 లకు మందికి పైగా అమ్మాయిల్ని వ్యభిచార గృహాల నుంచి విముక్తి కల్పించింది . ఆమెతో పాటు అనేక స్వచ్చంద సంస్థలు ఈ యాగంలో పాలుపంచుకుంటున్నాయి. ఒక సినిమా చూసి నేర ప్రవృత్తి వున్నా వారు మనసు మార్చేసుకుంటారని , తప్పులు చేయరని భావించటం అత్యాశ అయినా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కనీసం తమ పిల్లలకి ముందు జాగ్రత్తలు సూచనలు అందించగలిగితే ప్రయోజనం నెరవేరినట్లే .

ఈ సందర్భంగా బీహార్ యువతి ఫాతిమా ఖాతూన్ దైర్యసాహసాలు వింటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది . క్రితం సంవత్సరం అమితాబ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో పాతిక లక్షల బహుమానాన్ని గెలుచుకుంది ఈమె . 29 ఏళ్ల వయస్సులోనే సుమారుగా 35 మంది అమ్మాయిలని వ్యభిచార గృహాల నుంచి రక్షించి ఆ గృహ నిర్వాహకులను పోలీసులకి అప్పగించింది . ఈమె జీవితమే ఒక అంధకారంలోకి దిగిపోయిన క్షణంలో తనను తాను ఆ సమస్య నుంచి బయట పడటానికి తెగువ చూపించింది . 9 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది . తన భర్త , అత్తమామలు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకుని ఇంటి నుంచి పారిపోయింది . అత్తమామలు మళ్ళీ వెతికి పట్టుకుని ఈమెను కూడా ఆ కూపంలోకి లాగడానికి బలవంతం చేశారు . కాని ఫాతిమా “అప్నే ఆప్” అనే మహిళా స్వచ్చంద సంస్థ సహాయంతో ఈ ముఠా లని పోలీసులకి అప్పగిస్తూ ఎన్నో వ్యభిచార గృహాలని సాధారణ గృహాలుగా మార్చగలిగింది . చివరకి తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది . ఇటువంటి విజయ గాథలు వింటే ప్రతి మహిళకి తాను దేనినైనా ఎదుర్కోగలననే ధైర్యం వస్తుంది , ఉత్తేజం కలుగుతుంది .
ఆడపిల్లల్ని కనటానికే భయపడుతున్న ఈ సంఘటనలు ప్రభుత్వాన్ని సైతం ఆలోచింపజేసేలా చేసింది అనటానికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించబడ్డ “బంగారు తల్లి పథకం”. గ్రామాల్లో కూడా కొడుకుల్ని కనటానికే ఉత్సాహం చూపిస్తూ ఆడపిల్ల పుడితే తమకు ఒక భారంగా తయారు అవుతుంది అనే ఉద్ద్యేశ్యం తో ఎక్కువ మంది అబార్షన్ చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బంగారు తల్లుల కోసం బంగారు తల్లి పథకం ప్రారంభించారు . ఈ పథకం ప్రకారం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తి చేసే వరకు ఆర్ధిక సహాయం అందేలా ఈ పథకం రూపొందించబడింది . కేవలం ఆర్ధిక కారణాలతోనే చదువుకోలేకపోతున్న ఎంతో మంది చిన్నారులకు ఈ పథకం చేయూత నిచ్చింది . .అయితే ప్రభుత్వ పథకాలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయో చెప్పలేం .
చదువు మనిషికి విజ్ఞానాన్ని ఇస్తుంది .ఆలోచనను ఇస్తుంది.తన పై జరిగే అన్యాయాన్ని ,దాడులని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి మానసిక శక్తిని ఇస్తుంది . మన బంగారు తల్లులు రేపటి ఆదర్శ మహిళలు కావాలని కోరుకుందాం …………..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

– హేమలత పుట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to రేపటి బంగారు తల్లులు (సంపాదకీయం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో