నెలద – 4

sumana koduri

sumana koduri

ఆలయానికి బయలు దేరారు జుబేదా , చంచల , సుహిత , రోష్ని . ఏటవాలుగా ఉన్న చిన్ని గుట్టకు నెమ్మదిగా ఒకరి నొకరు పట్టుకుని నడుస్తున్నారు . మిగతా సైనిక బృందం వారిని అనుసరిస్తున్నారు . ఎక్కడి నుంచో ఏనుగు ఘీంకారం విన్పించింది . జుబేదా ఉలిక్కిపడి వెనక ఉన్న రోష్ని మీదకు పట్టు తప్పి వాలింది . రోష్ని జారుతూ ఆ పక్కనే అందుబాటులో ఉన్న శ్రీ గంధపు మానును పట్టుకుని ఆగింది . రాకుమారికి ఏం ఆపద వాటిల్లిందో అని మిగతా సైనికులు కంగారుగా తుప్పలు పొదలు తొక్కుకుంటూ పరుగున వారిని చుట్టుముట్టారు . జుబేదా ఎద పై చేయి ఉంచుకుని హా అల్లా .. అన్నది . మిగతా వారంతా ఏమీ జరగనందుకు ఆనందంగా నిశ్చింతగా నిట్టూర్చారు . అక్కడ ఉన్నది మన మజీద్ కాదు మేం సాబ్ ఇంత కష్టం ఎందుకూ అన్నాడు ఒక ముస్లిం సైనికుడు . నీకు ఇష్టం లేకపోతే రావద్దు . నాకు చూడాలని ఉన్నది అని మళ్లీ పైకి నడవ సాగింది జుబేదా ఆమెను అనుసరించారు చెలికత్తెలు . అందరూ ఆలయం చేరుకున్నారు , ప్రశాంత వాతావరణంలో నాపరాతి కట్టడపు ఆలయం చూడ ముచ్చటగా ఉన్నది . ఆలయ మంటపంలోకి చేరగానే గమ్మత్తుగా మంచి పరిమళంతో ఉంది అన్నది జుబేదా . అది అత్తరు కాదమ్మా దేవునికి ప్రతి రోజూ అలదే చందనం పచ్చ కర్పూరం తులసీ పసుపు కుంకుమలు కలిసిన పరిమళం అది వివరించింది సుహిత . అందరూ ముఖ మంటపం చేరుకొని అష్ట దళ పద్మ ఆకృతిలో మలచబడిన పై కప్పి నుంచి గొలుసుతో ఉన్న ఘంటను మ్రోగించి అరమోడ్పు కన్నులతో కైమోడ్చారు . సుహిత చంచల ఎలా చేశారో తనూ అలాగే గంటను తన స్వర్ణ తంత్రుల వంటి వేళ్లతో సున్నితంగా మ్రోగించి చేతులు జోడించింది జుబేదా . గర్భాలయం నుండి అర్చక స్వామి ఒక పళ్లెం లో పువ్వులు కుంకుమ తీసుకుని వారి వద్దకు వచ్చాడు . పచ్చని ఛాయ తెల్లని తల వెంట్రుకలు వెండి తీగల్లా మెరుస్తున్న గడ్డం ఊర్ధ్వ పుండ్రాలు (నామాలు ) ధరించాడు . కాషాయ రంగు వస్త్రాలతో త్రేతాయుగం నాటి వశిష్ట మహర్షి మారు వేషంలో వచ్చాడా అన్నట్లున్నారు . చూడగానే అన్నీ మరచి పాదాభివందనం చేయాలన్పించే దైవత్వం ఆయన వదనంలో ద్యోతమవుతోంది . అందరూ నమస్కారం స్వామీ అన్నారు . చిరంజీవ చిరంజీవ అంటూ ఆశీర్వదించి పళ్లెం వారి ముందుంచి గోత్ర నామాలు తెలుపండమ్మా అన్నాడు . అందరూ ఆ పళ్ళేన్ని ముట్టుకుని పేరూ గోత్రం , కుటుంబీకుల పేర్లు చెప్పారు . జుబేదాకు గోత్రం అంటే ఏం చెప్పాలో సందేహం వచ్చింది . అది గమనించిన సుహిత జుబేదా గారు మంత్రాలు వల్లిస్తూ లోనికి వెళ్లాడు . పూజ పూర్తయ్యాక అందరికీ హారతి అందించి , తీర్ధము , శఠగోపం ఇచ్చారు అర్చక స్వామీ . మిగతా వారంతా ఎలా స్వీకరించారో గమనించి తనూ అలాగే చేసింది జుబేదా . అందరికీ ప్రసాదం అందచేశారు . అందరూ వెలుపలికి వచ్చి విశాలమైన మెట్లపై కూర్చుని ప్రసాదం ఆరగిస్తున్నారు . జుబేదాకు ప్రకృతి ఒడిలో కూచుని అద్భుతమైన రుచిగల పదార్ధాన్ని ఆరగించటం చాలా బాగుంది .

పూజ గదిలో అమ్మవారి విగ్రహం ముందు ధ్యానంలో కూచుని ఉన్నది నెలద . పూజ ముగించి అందరికీ హారతి అందచేసే నెలద ఈ వేళ అలా చాలా సమయం ధ్యానంలోనే ఉండటం అందరికీ ఆశ్చర్యంగా అన్పిస్తోంది . వివిధ సందేహాలు పుర్రె కొకటిగా పుట్టుకొస్తున్నాయి .

పలకరిస్తే అన్నది గుసగుసగా రమిత . వాసంతి నోటిపై వేలుంచుకుని వద్దన్నట్లు తల ఊపింది . ప్రభవి వద్దకు చప్పుడు చేయకుండా నడిచి నువ్వే ఇందుకు సమర్దురాలివి అమ్మ గార్ని పిలు అన్నట్లు సైగ తో వివరించింది రమిత .

రమిత జబ్బ పట్టుకుని కొంత దూరం తీసుకెళ్లిన ప్రభవి . అమ్మగారు అలా కూచున్నారంటే ఏదో దీర్ఘంగా యోచిస్తున్నారని అర్ధం . ఆమె ఏదో బాగా మధన పడుతున్నారు . కానీ మన నుంచి ఏమీ దాచరు . తప్పక ఏదో సమయంలో చెప్తారు . అపుడే విందాం ఈ లోగా నెలదమ్మ ను విసిగించటం భావ్యం కాదు అన్నది సన్నగా . రమిత అలాగే అన్నట్లు తలూపింది .

అపుడే ఆవుల కాపరి ఏదో గోవు ఈనిందంటు జున్ను పాలు చెంబుతో తెచ్చి అమ్మగారు అమ్మగారు …….అని పిలిచాడు రమణ . వేగంతో వచ్చి ఆ చెంబు అందుకుని అమ్మ పూజలో ఉన్నారు . గోశాలలో ఆ గోమాతకు ప్రస్తుతం అవసరమయినవన్ని ఉన్నాయా ? అనడిగాడు(గింది) . చిత్తం .అన్నీ నిన్ననే అమర్చాము . అమ్మగారు చెప్పినారు అన్నాడు గోవిందప్ప . అవన్నీ మా తల్లికి బాగా తెలుసు , సరే తర్వాత మాట్లాడతాం వెళ్లిరా అని రమణ ఆనతివ్వగా నమస్కారం చేసి బయలుదేరాడు గోవిందప్ప .

నెలద పూజ ముగించి హారతి పళ్లెంతో పూజ గది వెలుపలకి వచ్చింది . చెలికత్తెలంతా హారతి తీసుకున్నారు . రమణ కూడా హారతి తీసుకుంటూ నెలద ముఖం వైపు చూశాడు (సింది) . ఎప్పటిలా దివ్య తేజంతో మెరుస్తున్న కన్నులలో అలసట నిద్రలేమి స్పురిస్తున్నాయి . ఏదో సందిగ్ధంగా ఉంది . ఆనక అడిగి తెలుసుకోవాలి అనునయించి అనుకున్నాడు (న్నది ) రమణ . పూజ గది తలుపులు మూస్తూ అక్కా పెద్దక్కా ఆగు అన్నది నెలద . పని ఉందని గుర్తు వచ్చి వెడుతున్న రమణ ఆ అమ్మా అన్నాడు (న్నది ). నీతో మాటాడాలి వంటశాలలో పని నందకు ఒప్పగించిరా అన్నది నెలద . ఆ తప్పక అంటూ వేగంగా వంటింటి వేపు వెళ్లి నెలద వద్దకు అంతే వేగంగా వాలిపోయాడు (యింది) రమణ . ఆమె ఏం చెప్పా బోతుందో అనే ఆతృతతో .

అలా రా అంటూ తన గదిలోకి తీసుకెళ్లి తిన్నగా తిన్నగా తన గదిలోంచి విశాలంగా పరచుకున్న పూల మొక్కలున్న చిన్న తోటలోకి తీసుకెళ్లింది నెలద . అక్కడున్న రాతి చెప్టా పై తనుకూచుని రమణను కూచోమన్నట్లు సైగ చేసింది . రమణ ఏంటి తల్లీ అనడిగింది .
నిన్నటి నుంచి ఆమను గమనిస్తున్నా చాలా విచారంగా ఉన్నారు . సరిగా భోజనం చేయలేదు . నేను ఆ విషయం అడగాలని సమీపిస్తే నిద్దుర నటిస్తున్నారు .అం ఏంటి నా వలన ఏం పొరపాటు జరిగిందీ తెలియక బాధగా ఉన్నది పెద్దక్కా అన్నది నెలద ఆమె గొంతు గద్గదమైంది . కళ్ల వెంట నీరు తిరిగాయి .

అరెరె అదేం లేదమ్మా మీరు క్రూరధరుని వీరోచితంగా ఎదిరించటం బంధించటం హేముడు రాజుగారికి ఒప్పగించటం తెలుసుకుని ప్రభువుల ఆగ్రహానికి గురి అవుతారేమోనని భయపడుతున్నారు .

నెలద తల పంకించి అంతేనా అన్నది . ఇంకేవైనా ఉందా అనే సందేహం ఆ ప్రశ్నలో .
అంటే మనం రాచరిక వ్యవస్థలో భాగస్వామ్యులం కాలేము తల్లీ తీరా ఎంతో శ్రమించి ఎన్ని ఘన కార్యాలు చేసినా దేవదాసి నర్తకి ఆమెకేల అంటారు . అంతటితో ఊరుకోరు వెలయాలికేందుకు పరిపాలన విషయాలంటు చులకన చేసి వాగుతారు . నెలద ఆపమన్నట్లు చేయి చూపింది . రమణ ఆర్దోక్తితో ఆగగా పుట్టినప్పటి నుండి నన్నెరిగిన పెద్దక్కవు ధనం కోసం అమ్ముడు పోవటం చూశావా ? ఆ దైవ సంకల్పం వలన మ అమ్మకు మహరాజా వీర నరసింగ భూపాలురు సమకూర్చిన ఈ ఆస్తిని నా స్వయం కృషితో వ్యాపారములందు భాగస్వామ్యం పొంది ఇంతకింతగా పెంచాగాలిగాను . నా ప్రాణం ఉన్నంత వరకూ నన్ను ఆశ్రయించి ఉన్న వారు . పశు పక్ష్యాదులతో సహా ఏ కోరతా లేక బతకాలి నా ఊరు నా ప్రజలు నా నాట్య కళను ఆదరించు కళ హృదయాలు చల్లగా జీవించాలి అదే నా ఆశయం . నాకు తెలియదా తల్లీ నా నెలద మనసు ఇంతగా ఆలోచించి మనసు పాడు చేసుకోవలసిన విషయం ఏమీ లేదు అన్న రమణ మాటలకు సంతృప్తి చెందినట్లు తల ఆడించి పెద్దక్కా రేపు నర్తన కేళికినే రాలేను . చంచల , వాసంతి మిగతా వాళ్లచే ఆ కార్యక్రమం ఆపకుండా కొనసాగించవా నీ ఆధ్వర్యంలో అన్నది అర్ధింపుగా .

ఎపుడూ నెలద తన చెలులతో కలిసి వెళ్లి నర్తించి ఏ అర్ధ రాత్రికో ఇల్లు చేరుతుంది . అదే సమయంలో ఆచార్యులు వచ్చి ప్రియంవదతో మాట్లాడి వెళతారు . ఇపుడు మెదటి సారిగా నెలద ఇంటి పట్టున ఉంటానంటోంది . స్వామి విచ్చేస్తే ఎలా ? రమణ పరిస్థితి అడకత్తెరలో పోకలా ఉన్నది . కాదంటే నెలద బాధ పడుతుంది . ఔనంటే ప్రియంవదమ్మకు ఇబ్బంది . ఎలా నటరాజా ఈ స్థితి నుంచి నువ్వే కాపాడు అనుకున్న్నాడు మనసులోనే . నెలద ఏంటి పెద్దక్కా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నావ్ అనడిగింది . అదేం లేదమ్మా రాజావారు నీ నాట్యం లేని ఆలయ మంటపాన్ని దర్శించలేనంటారు కదా అది గుర్తుకు వచ్చి అంటూ నసిగాడు చూద్దాం . తప్పదని అనుజ్ఞ వస్తే వెళ్లి తీరాలి కదా . ఫర్వాలేదు వీలయితేనే నీపై భారం పెడతా లేకుంటే ఎప్పటిలా నా తంటా నేనే పడతా నవ్వుతూ అన్నది నెలద . వాతావరణం తేలిక పడినట్లన్పించి లేచి ఇంటిలోకి దారి తీసింది రమణ . అనుసరించింది నెలద . రమిత ఎదురొచ్చి అమ్మా సాధన చేయటానికి అన్ని సిద్ధం అన్నది . వూ పద అంటూ ఆమెతో కలిసి నాట్యకుటి వైపు నడిచింది . విశాలమైన స్థలంలో ఒక పూరింటి లాంటిది ఉన్నది . దాని పేరు నాట్యకుటి లోపల పెద్దనటరాజ విగ్రహం , తాండవ కృష్ణుని , తాండవ గణపతి విగ్రహాలు ఉన్నాయి . గంధం విబూది వాసనలతో అగరు ధూపంతో పవిత్రమైన పరిమళం చుట్టుముడుతుంది . ఆ నాట్యకుటిలోకి అడుగిడగానే అప్పటికే అక్కడ చంచల , ప్రభవి , వాసంతి సిద్ధంగా ఉన్నారు కాళ్లకి మువ్వులు ధరించి , చెంగు నడుమ చుట్టూ చుట్టి , నడుమ పై మోచేతులుంచుకుని నర్తించేందుకు నిలబడి ఉన్నారు . నెలద వారిని చూసి నవ్వుతూ మీ వరస చూస్తుంటే పౌర్ణమి రాకకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లుంది అన్నది .

అదేం కాదమ్మా మీ శిక్షణలో నాట్య కత్తెలమైన మేము ప్రదర్శన కోసం వేగిర పడుతుంటాం అంతే . మీ ప్రతిభకి సరి సమానంగా నర్తించలేకున్నా మీతో కలిసి నర్తించే అవకాశం మహద్భాగ్యం మాకు అన్నది చంచల ఆనందంగా నవ్వుతూ నటరాజమూర్తికి ధన్యవాదములు ఈ జన్మకు నాట్యమనే భాగ్యం మనకిచ్చాడు అంటూ పువ్వులు దోసిట నింపుకుని అక్కడున్న దేవతామూర్తుల కందరికీ అర్పించింది . మిగతా వారూ అలాగే చేశారు .

ప్రార్ధన ప్రారంభించింది నెలద …

– కోడూరి సుమన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో