సంపెంగ పూలవాన (కొత్త కాలమ్)

తొక్కుడు బిళ్ళాట అనగానే రెండు జడలు వేసుకొని పరికిణి కట్టుకొని వున్న ఆడపిల్లలు గుర్తొస్తారు.

online_digital_watermark_textమొట్ట మొదటసారి తొక్కుడు బిళ్ళ ఆడుకున్నప్పుడు మేం ఆడపిల్లలం వాళ్ళు మొగపిల్లలు అనే స్పృహ వుండి వుంటుందా?!  మగ పిల్లలు, ఆడపిల్లలు ఆడుకొనే ఆటలు వేరువేరుగా వుంటాయి… వుండాలి అనే  ఆలోచన యెక్కడ నుంచి వస్తుంది? అలా ఆ ఆటల మధ్యన వుండే సరిహద్దులని దాటితే యేమవుతుంది? దాటకుండా స్త్రీ పురుషుల మధ్య  సమానత్వాన్ని సాధించటం సాధ్యమవుతుందా?మగ పిల్లలు సహజంగా దూకుడుగా వుంటారా? ఆడపిల్లలు సహజంగా మృదువుగా వుంటారా? యిం దులో యేది యెంత వరకు నేర్చుకుంటే వచ్చింది. 

వీడియో గేమ్స్ కంప్యూటర్ గేమ్స్ వచ్చి వుండొచ్చు.  కాని యీ ఆటల్లో కూడా ఆడ పిల్లలవి మొగ పిల్లలవి అని వేరువేరు ఆటలుంటాయా?  వంటరితనం పెరిగుండొచ్చు. యీ వంటరితనంలో కూడా ఆడ వంటరితనం మగ వంటరితనం వుంటాయా?

చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని దించిన తల యెత్తకుండా గంటలుగంటలు గడిపే రుగ్మతలు రావొచ్చును. ఆడ రుగ్మతలు మగ రుగ్మతలు వేరువేరుగా  వుంటాయా? 

సహజంగా ప్రకృతిపరంగా వచ్చే మార్పులు  మాత్రమే జీవితాన్ని శాసిస్తాయి అనుకుంటే సమాజంలో మార్పులు రావాలని, మార్పు వస్తుందని  అనుకోవటం సాధ్యం  కాదు. అలా కాకుండా సమాజంలో మార్పు సమాజం నుంచే పుట్టుకొస్తుందనుకొనేటటైతే మన  ప్రవర్తనలు ఆకాంక్షలు యెంతో కొంత మన చేతుల్లో వుంటాయని  నమ్ముకోవాలి.  ఆ నమ్మకమే లేకపోతే స్వేచ్ఛా సమానత్వంతో  ఆడపిల్లలు మగ పిల్లలు కలసి సామరస్యంగా బతకవచ్చు అనుకోలేం. 

ఆడపిల్లలు మగపిల్లలు కలసి వొక యింట్లో పెరుగు తున్నప్పుడు,  చదువుకోవటంలో, కలసి పనిచేసే చోట, పబ్లిక్ ప్లేసెస్ లో యిలా  అనేక  చోట్ల  యిద్దరూ వొకరి నుంచి మరొకరు  యెదురుకొంటున్న సంఘర్షణ యేమిటి…  స్నేహం యేమిటి… అడుగడుగునా మొలుస్తున్న అనేకానేక సందేహాలు సమస్యలు యేమిటి?  

ఆకాశంలో సగం అన్నది  పరస్పరం అంగీకరిస్తున్నామా లేదా…  అది వొక మానవీయ ఆకాంక్ష అని హృదయపూర్వకం వొప్పుకుంటున్నామా లేదా …  తప్పకుండా రోజువారి జీవితంలోకి నింపు కోవలసిన అందమైన పరిమళమని  నిక్కచ్చిగా నమ్మి తీరాల్సిందే కదా…  సందేహం యేమైనా వుందా ?!!!.   

     –కుప్పిలి పద్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

2 Responses to సంపెంగ పూలవాన (కొత్త కాలమ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో