కాలాతీత వ్యక్తులు

 

రచయిత్రి: డా. పి.శ్రీదేవి

మాలా కుమార్

మాలా కుమార్

కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలుగా పేరు తెచ్చుకున్న రచయిత్రి, డా. పి.శ్రీదేవి.అతి పిన్నవయసులోనే కన్ను మూసిన వీరు నవలగా వ్రాసింది,”కాలాతీత వ్యక్తులు” ఒక్కటే.గోరాశాస్త్రి గారి సంపాదకత్వం లో వెలువడిన తెలుగు స్వతంత్ర లో 7-9-1957 నుండి 25-1-1958 వరకు ధారావాహికగా వెలువడి పాఠకుల మన్ననలను అందుకున్నదీ నవల.

ఇందిర ఈ నవలకు నాయిక. ఒక విశిష్టమైన స్త్రీ. బలమైన వ్యక్తిత్వము కలది. ఎవరికీ జడవదు.హాయిగా బతకాలి అనుకునే స్త్రీ.తన లక్ష్యం చేరుకోవటం లో ఏది అడ్డువచ్చినా లెక్క చేయదు. పక్కకు తోసేసి ముందుకు వెళ్ళిపోతుంది. పురుషాదిక్య సమాజం ఏర్పరిచిన చట్రాలలో ఇమడటానికి ఇష్ట పడదు.పాతివ్రత్యం, ప్రేమ, అర్పించుకోవటాలు అన్నీ లెక్క చేయదు. నచ్చదు. “ఏ పని చేసినా నేను కళ్ళు తెరిచి చేస్తాను.ఏడుస్తూ ఏదీ చేయను.ఏం జరిగినా ఏడవను.నాకూ తక్కిన వాళ్ళకూ అదే తేడా.”అంటుంది ఇందిర! ఇదీ ఆమె వ్యక్తిత్వము!

unnamed (1)ఇందిరకు పూర్తి వ్యతిరేకము రెండో నాయిక కళ్యాణి. చాలా సున్నితమైన మనసు. అభిమానవంతురాలు.అందం ఆత్మాభిమానం వున్న అమ్మాయి. జబ్బుపడ్డ తండ్రి, చాలా కష్టాలు , డాక్టర్ చదువుదా మనుకొని చదవలేక పోవటం లాంటి వాటి తో గంభీరంగా మారిపోతుంది.టైఫాయిడ్ వచ్చి నప్పుడు సేవ చేసిన ప్రకాశం ను ఇష్టపడుతుంది. అతనూ ఇష్టపడతాడు. కాని తండ్రి పోయి కష్టాలల్లో వున్నప్పుడు సాయం రాడు.కళ్యాణి కి దూరం జరుగుతాడు.ప్రకాశాన్ని తన వైపు తిప్పుకొని ,తనకు అన్యాయము చేసి ఇంట్లో నుంచి వెళ్ళ గొట్టిన ఇందిర మీద కోపం తెచ్చుకోదు. తన దురదృష్టం అనుకుంటుంది అంతే.అన్ని విధాలా నష్టపోయాను అనుకొని దిగులుగా పక్కకు తప్పుకుంటుంది.అంతటి సుకుమారమైన మనస్తత్వం కలది కళ్యాణి!

ప్రకాశం కు ఉద్దేశాలు , ఇష్టా ఇష్టాలు వుంటాయి కాని అవి బయట పెట్టే ధైర్యం లేదు.చిన్నతనము లో నే తండ్రి చనిపోతే మామ  ప్రాపకం లో పెరుగుతాడు. తనను మామ డాక్టర్ చదివించటమే ఎక్కువ అనుకుంటాడు.మామ మాటను కాదనే ధైర్యం లేదు. చాలా బలహీనుడు.కళ్యాణికి సన్నిహితుడై సాయం చేస్తానని చేయలేక పోతాడు. ఏమాత్రం కష్టపడకుండా జీవితం చేతిలోకి రావాలి అనుకునే అవకాశవాది.

 ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి.తండ్రి పంపుతున్న డబ్బు తో ఖుషీ గా కాలం గడిపేస్తూ వుంటాడు.పెద్ద ఆదర్శాలు లేవు.ఎవరి మీదా కోపం లేదు . అందరినీ ప్రేమించగలడు.హాయిగా గడిపేయటమే అతని పద్దతి.

ఇంకా ,ఇందిర తండ్రి ఆనందరావు, డా;చక్రవర్తి, రామినాయుడు, వసుంధర మొదలైనా పాత్రలు వున్నా ఈ నలుగురి చుట్టూ అల్లిన అందమైన కథ నే “కాలాతీత వ్యక్తులు.”ఇది చాలా సాధారణమైన కథ . ఎలాంటి మలుపులు లేవు. ముఖ్యంగా ఇందిర, కళ్యాణి లు ఎలా ప్రయాణించారు అన్నదే కథ. కళ్యాణి లాంటి సుకుమారమైన అమ్మాయిని ఆదరించగలరు ఎవరైనా కాని ఇందిర లాంటి వ్యక్తిత్వం కల అమ్మాయిని ఈ కాలం లో కూడా సమాజం అంతగా హర్షించదు.ఇందులో కాలాతీత వ్యక్తులు ఎవరు? ఏమో అది పాఠకులకే తెలుసుకోవాలి.

– మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

7 Responses to కాలాతీత వ్యక్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో