నర్తన కేళి – 26

ప్రస్తుతం జరుగుతున్నసామాజిక పరమైన విషయాలతో రూపకాలను చేయాలనీ ఉంది . అలాగే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందంటున్న“ శ్రీమతి అనుపమ శివ ” తో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి ……..

*నమస్కారం అనుపమ గారు ?
నమస్కారం రండి , కూర్చోండి .

*మీ తల్లిదండ్రులు గురించి , మీ స్వస్థలం ఎక్కడ ?
మా నాన్న పేరు వెంకటేశ్వరరావు వ్యాపారస్తులు . మా అమ్మ పేరు లక్ష్మిరాజ్యం గృహిణి . మేము ముగ్గురు. ఇద్దరమ్మాయిలు , ఒక అబ్బాయి . నేను మొదటి అమ్మాయిని . మా స్వస్థలం దెందులూరు .

*మీ తొలి గురువు ?
శ్రీమతి లక్ష్మి ప్రసన్న గారి వద్ద కూచిపూడి నాట్యం లో శిక్షణ ప్రారంభించాను. తరవాత హైదరాబాద్ నృత్య కళాశాలలో కూచిపూడి లో సర్టిఫికేట్ చేసాను .

*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ జరిగింది ?
నా ఏడవతరగతి పరీక్షలు అయిన తరవాత ఏలూరులో నా అరంగేట్రం జరిగింది .

*మీ కుటుంబం గురించి చెప్పండి ?
మా వారి పేరు శివరాం . వ్యాపార వేత్త . మాకు ముగ్గురు పిల్లలు . అమ్మాయిలు పేరు సౌజన్య, సాత్విక , అబ్బాయి పేరు కార్తీక్ .

* మీ నృత్య శిక్షణా సంస్థ పేరు , ఎప్పుడు ప్రారంభించారు ?
“శృతి లయ నృత్య అకాడమి” 2003 లో మొదలుపెట్టాను .

*మొన్న జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గురించి మీ అభిప్రాయం ?
అంత మంది కళాకారులు ఒకచోట కలవడం మంచి పరిణామం . నేర్చుకునే పిల్లలకి మరింత ఆసక్తి పెరుగుతుంది . కొత్త కొత్త మెలుకువలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది .

*మీ నృత్య అకాడమి ద్వారా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ?
మా నృత్య అకాడమి నుంచి సుమారుగా 1200 ప్రదర్శనలు ఇచ్చాము . ధనుర్మాసం , దసరా, మహాశివరాత్రి ఇలా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రతి ఏటా చేస్తున్నాము .

*మీ శిష్యులకి ఇచ్చే శిక్షణ ఏ విధంగా ఉంటుంది ?
మా శిష్యులకి ప్రదర్శన అడుగులు , జతులు , ముద్రలు నేర్పించడంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా వచ్చేలా శిక్షణ ఇస్తాను . అంటే శిరోభేదాలు , దృశ్య భేదాలు , కరణాలు,ఇంకా సంగీత పరిజ్ఞానం పై కూడా అవగాహన వచ్చేలా శిక్షణ ఇస్తాను .

*శిరో భేదాలు అంటే ఏమిటి ?
నాట్య ప్రదర్శనలో శిరస్సు కదలించడం ద్వారా మన అభిమతం , అభిప్రాయాలను , అభినయం చేయండం జరుగుతుంది . దానికి సంబంధించి సమ శిరస్సు , ఉద్వాహిత శిరస్సు , అధో ముఖ శిరస్సు ,ఆలోలిత శిరస్సు , ధుత శిరస్సు , కంపిత శిరస్సు ఇలా తొమ్మిది ఉంటాయి .

*మరి దృష్టి భేదాలు అంటే ఏమిటి?
నాట్య ప్రదర్శనలో కను గ్రుడ్డు , కను బొమ్మలు కదిలించే తీరు , వాటిని ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేవి దృష్టి భేధాలు అంటారు . సమ దృష్టి , ఆలోకిత దృష్టి ,సాచీ దృష్టి ,నిమీలిత దృష్టి , అవలోకిత దృష్టి , ప్రలోకిత దృష్టి .

*కరణాలు అంటే ఏమిటి ?
నాట్య శాస్త్ర కర్త భరతముని చెప్పిన కరణాలు 108 . కరణములు అంటే అంగ విన్యాస భంగిమలు . నృత్య చేయడానికి ప్రధాన ఆధారం కారణములే .

*మీ భవిష్యత్ ప్రణాళిక ?
ప్రస్తుతం జరుగుతున్నసామాజిక పరమైన విషయాలతో రూపకాలను చేయాలనీ ఉంది . అలాగే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది . దానిని చాటి చెప్పేలా ఒక నృత్య రూపకాన్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాను .

*మా విహంగ చదువరులకి మీరిచ్చే సలహా ?
కళలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి . ఆ ప్రస్తుత కాలంలో పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు . దాని నుంచి బయటకి రావడానికి కళలు ఎంతగానో ఉపయోగపడతాయి . మీ పిల్లలకి ఏదో ఒక కళ ని తప్పకుండా నేర్పించండి .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో