బెంగుళూరు నాగరత్నమ్మ

వి.శ్రీరామ్

వి.శ్రీరామ్

”సమాధి దగ్గర వుత్సవం జరపాలని సంకల్పించాను” అని రాసుకుంది నాగరత్నమ్మ. ”స్త్రీలకి ఈ వుత్సవాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడమే దీనికి కారణం. ‘సద్గురువు’ ఆజ్ఞతో 1927 లో పెరట్లో వుత్సవం మొదలుపెట్టాను. ‘అల్పారంభ క్షేమకః’ అని నానుడి, (నమ్రతతో చేసిన ప్రారంభం శుభాన్ని జయాన్ని ఇస్తుంది.) దేవదాసీల పాటలు (అప్పట్లో మద్రాసులో ప్రఖ్యాతి పొందినవి)పాడేవారు, కచేరీలు చేసేవారు. తంజావూరు పండితులూ, ఎందరో స్త్రీలు భక్తిశ్రద్ధలతో నాకు సాయం చేశారు. తంజావూరు రాజు బంధువు శ్రీ రాజారాం సాహెబ్‌ సాయం వల్ల ముందు వైపు వున్న స్థలం, తోట నాకు లభించాయి. ఈ దాసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొద్ది కాలానికే నాలుగు గదులు, చుట్టూ గోడ కట్టగలిగాం. విశాలమైన ఆ స్థలంలో బ్రహ్మాండంగా ఆరాధన జరిగేది.2” కొన్ని సంవత్సరాల్లో జరిగిన సంఘటనల సంక్షిప్త నివేదిక ఇది.

త్యాగరాజు సమాధి మిద గుడి కట్టాక నాగరత్నమ్మ జీవితం తిరువయ్యారుతో మరింత ముడిపడింది. ఆరాధన ఖర్చులకోసం కచేరీలు ఇస్తూ వుండే నాగరత్నమ్మ కొంచెం ఖాళీ దొరికితే తిరువయ్యారు వచ్చేసి సమాధి దగ్గర గడిపేది. నాగరత్నమ్మ వారసురాలు బన్నీబాయి బాధ్యత తంజావూరులో ప్రముఖుడు, తననేస్తం టి.ఎ రామచంద్రరావు తీసుకున్నాడు(1931). బన్నీబాయి తంజావూరులో రామచంద్రరావు సాయంతో వివిధ శిక్షకుల దగ్గర హరికథల మెళకువలు నేర్చుకుంది.
డిసెంబరు రావడంతోనే నాగరత్నమ్మ ఆరాధన పనుల్లో తలమునకలయ్యేది. ఆహ్వాన పత్రాలు అచ్చువేయించి ముఖ్యులకి మనిషినిచ్చిపంపేది. ఉదా:- పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు, కలెక్టరు, ఇతర ప్రభుత్వ వుద్యోగులు, మేజస్ట్రేటులు, తంజావూరు పోలీసు సూపరింటెండెంట్‌, తిరువయ్యారు ఇన్‌చార్జి డిప్యూటీ సూపరింటెండెంట్‌ వంటివారు. భూరి విరాళాలిచ్చే దాతలని తనే స్వయంగా ఆహ్వానించేది. తిరువయ్యారులో వుండే వర్తకుల్నీ, అంగడియజమానులని కూడా ఆహ్వానించేది. వాళ్ళతో సరదాగా మాట్లాడేది. వీళ్ళని రెండు కచ్చి వర్గాల వారూ కూడా పట్టించుకునే వారు కాదు. నాగరత్నమ్మ చేసే ఆరాధనకి కావలసినవన్నీ వర్తకులు తక్కువ ఖరీదుకి ఇచ్చేవారు. కిరాణా వర్తకులు అరువు కూడా ఇచ్చేవారు. దుకాణదారుల్లో కంసాలి వెంకటరామ చెట్టి ధారాళంగా విరాళమిచ్చేవాడు. ఉత్సవ నిర్వహణకి అవసరమైన సరుకులన్నీ పొన్నుస్వామి చెట్టి, రామచంద్ర చెట్టి దుకాణాల నుంచి వచ్చేవి. చుట్టుపక్కల వున్న తిలై స్ధానం, గణపతి అగ్రహారం , పుదు అగ్రహారం, తిరుప్పళనం, అమ్మాళ్‌ అగ్రహారం నుంచి బియ్యం వచ్చేవి. ఆంధ్రపత్రిక, అమృతాంజనం యజమానులు కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులు కుటుంబం, నగల వ్యాపారి సూరజ్‌మల్‌ లల్లూభాయ్‌లు మద్రాసు నుంచీ విరాళాలు పంపేవారు.

ఆరాధన దగ్గరవుతున్నకొద్దీ తిరువయ్యారు లో ఏర్పాట్లు ముమ్మరంగా జరిగేవి. చిన్నకచ్చి వాళ్ళు అయిదు రోజులు ముందు వచ్చి పనులు మొదలెట్టడంతో మరింత హడావుడిగా వుండేది. నాగరత్నమ్మ దగ్గర పనివాళ్ళు సమాధి వెనకాలంతా శుభ్రం చేస్తారు. ఆరాధన రోజున త్యాగరాజు విగ్రహానికీ, స్మారకచిహ్నానికి మూడు సార్లు అభిషేకం, పూజలు జరుగుతాయి. ముందుగా వేకువన 4.30కి నాగరత్నమ్మ, మిగిలిన స్త్రీలు సమాధి దగ్గరకి వచ్చేవారు. తన గురువు రామనాథపురం ‘పూచి’ శ్రీనివాసయ్యంగార్‌ త్యాగరాజుని ప్రశంసిస్తూ రాసిన రీతిగౌళరాగకృతి ‘సద్గురుస్వామికి’ నాగరత్నమ్మ పాడేది. అప్పుడు రాముడు భాగవతార్‌ పూజ చేస్తాడు. ఆడవాళ్ళందరూ నాగరత్నమ్మ త్యాగరాజు మిద కట్టిన అష్టోత్తర నామావళి పఠించి తమకి వచ్చిన కీర్తనలు పాడతారు. దేవదాసి అమ్మపెట్టెచెల్లమ్మాళ్‌ ఆరాధనకి తనవంతుగా సమర్పించిన పూలతో రాముడు భాగవతార్‌ విగ్రహాన్ని అలంకరిస్తాడు. పద్మాసినీ బాయి పంపిన పూలు, పళ్ళు సమర్పిస్తారు. 6 గంటలకి తమ పూజ మొదలు పెట్టేందుకు పెరియకచ్చివాళ్ళు అక్కడికి చేరుకుంటారు. తర్వాత గంటలకి చిన్నకచ్చి వాళ్లు పూజ చేస్తారు.
సాయంత్రం కల్యాణ మహల్‌ విద్యుద్దీపాలతో అలంకరించి పెరియకచ్చివాళ్ళు ఆరాధన మొదలు పెడతారు. అప్పుడే సమాధి వెనక వైపు స్త్రీల కచేరీలు మొదలవుతాయి. ఈ ప్రాంతం కూడా విద్యుదలంకరణతో వెలిగిపోతూంటుంది.

ఈ ఆరాధనలో పాల్గొనేందుకు మైసూరు నుంచి బి.ఎస్‌. రాజయ్యంగార్‌ లాంటి వాళ్ళుకూడా వచ్చేవారు. హిందుస్తానీ కాపి రాగంలో ‘జగదోద్ధారణ’ అనే పురందరదాసు కృతి 78 ఆర్‌.పి.ఎం. రికార్డుగా పాడిన రాజయ్యంగార్‌కి అప్పటికే మంచి పేరొచ్చింది. అతని కచేరి ఎప్పుడూ ఆకర్షవంతంగా వుండేది. ఆఖరి రోజు బన్నీబాయి హరికథ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ప్రతి ప్రదర్శనకీ ముందు నాగరత్నమ్మ ఆయా కళాకారుల పరిచయం క్లుప్తంగా శ్రోతలకి వివరించేది. ఈ విషయంలో చిన్న కచ్చివాళ్ళ శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌నే ఈమె అనుసరించేది. సంగీతంతో పాటు వీళ్ళిద్దరి వాక్చాతుర్యాన్ని కూడా శ్రోత్రలు బాగా ఇష్టపడేవారు. వీళ్ళని ‘స్త్రీకచ్చి’ అనేవారు. వీణధనం పెద్ద కూతుళ్ళిద్దరూ-రాజలక్ష్మి, లక్ష్మీరత్నం, తంజావూరు రంగనాయకి, వాలాడి రుక్మిణి, కుంభకోణం చెల్లప్పమ్మాళ్‌ తప్పనిసరిగా పాడేవారు వీళ్ళందరూ పాటతో పాటు హార్మనీ కూడా వాయించేవారు. వీళ్ళందరికీ వయొలిన్‌ వాయించేందుకు శివ సుబ్రమణ్య అయ్యర్‌ అన్ని రోజులూ ఇక్కడే వుండేవాడు. అతను నాగరత్నమ్మకి మామూలుగా పక్కవాద్యగాడు. వీళ్ళ ఆరాధనలో మలైకోట్టై రాజు నాగస్వరం వాయించేవాడు. నాగైనల్లూర్‌ నటరాజ అయ్యర్‌ అనే వంటతను కళాకారులకి భోజన ఏర్పాట్లన్నీ చూసుకునేవాడు. నాగరత్నమ్మ ఏర్పాటుచేసిన కచేరీలకి జనం బాగా వచ్చేవారు. మధురైకి దగ్గర్లో వున్న బట్టల గుండు అనే వూరి నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే సంగీత రసికులే దీనికి వుదాహరణ. ఆ ఊరు మధురైకి దగ్గరగాకొడైకెనాల్‌ వెళ్ళేదారిలో వుంది. తంజావూరు జనం ఇష్టపడే తమలపాకులు ఈ ఊరినుంచే సరఫరా అవుతాయి. మంచి సంగీత జ్ఞానమున్న శ్రోతలకి ఈ ఊరు ప్రసిద్ధి. ఆరాధన కచేరీలకి వీళ్ళు తప్పకుండా హాజరయ్యే వాళ్ళు. ఎవరన్నా పాడేటప్పుడు తప్పులుగానీ, అపస్వరాలుగాని వస్తే వెంటనే పసికట్టేవారు. చిన్నగా కరతాళ ధ్వనులు మొదలెట్టి క్రమంగా పెద్దగా చప్పట్లు చరిచేవారు-ఆ గాత్రం గానీ, వాయిద్యం గాని వినపడకుండా పోయేటంత వరకూ. ఆ కళాకారుడు వేదిక దిగిపోయే వరకు అదే వరస. వీళ్ళు మొదట పెరియ కచ్చి వాళ్ళవైపు వుండేవారు. తర్వాత నాగరత్నమ్మ పక్షం వహించారు. వీళ్ళ కచేరీల్లో మాత్రం మర్యాదగానే వుండేవారు.

కళారంగం విషయంలో వున్న పురుషాధిక్యతని దెబ్బ కొట్టిన నాగరత్నమ్మ గృహిణుల విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచించేది. తనలాగా వివిధ రంగాల్లో నిపుణులైన స్త్రీలకి తప్ప, మిగతా ఆడవాళ్ళకి స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి వుండనవసరం లేదని ఆమె అభిప్రాయం. ‘గృహలక్ష్మి’లో ఈ విషయమై వాదించింది కూడా. ఈ పత్రికని డా|| కె.ఎన్‌. కేసరి 1929 నుంచి మద్రాసు నుంచి ప్రారంభించాడు. వి. సరస్వతి అనే విలేఖరి ఇంటి విషయాల్లో భారతీయపురుషుడి స్వార్ధపరత్వం గురించి రాసింది. దాన్ని తీవ్రంగా నాగరత్నమ్మ ఖండించింది. ”భారతపురుషుడు స్వార్ధపరుడు అని రాశావు. భారత పురుషుడు భార్యని అర్ధాంగిగా అంగీకరించాడు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోను అలాగే వుంటాడు. ఈ విషయంలో పురాణాలు అతనికి దిశానిర్దేశం చేశాయి. అడగరాని వాళ్ళని సాయమడిగీ, అర్హత లేని వాళ్ల కాళ్ళా వేళ్ళాపడీ, నానాగడ్డికరిచి ఇంటికి అవసరమైన వన్నీ సమకూరుస్తాడు. ఇంటికి గృహిణి రాణి కాదా? ఆడదానికి మగవాడేమి లోపం చేశాడు? ఎవడో ఒకడు వెధవ్వేషాలేస్తే అందర్నీ ఒకేగాట కట్టెయ్యడం ఏమిటి? భర్త పడే అవస్థలు అర్ధం చేసుకోకుండా కొత్తచీరెల కోసం వేధించే ఆడవాళ్ళు నాకుతెలుసు. కొనకపోతే పుట్టింటికి వెళ్ళి పోతారు. వీళ్ళని ఉదహరించి ఆడవాళ్ళంతా యింతే అనడం సరికాదు. రెండు జాతుల్లోనూ (ఆడ,మగ) మంచీ, చెడు వుంటుంది. ఒకళ్ళని వెనకేసుకొచ్చి, మరొకళ్ళని తీసిపారెయ్య కూడదు. దీని గురించి ఆలోచించి స్పందిస్తారని ఆశిస్తాను” అని రాసింది. సంసారంలో పురుషాధిక్యతని ఆమె గుర్తించలేక పోవడం వల్ల, దాని వునికిని నిరాకరించడమే ఆమె విజయానికి కారణమేమో.

నాగరత్నమ్మ నిర్వహించే ఆరాధన పట్ల ఇరు కచ్చీలకి అనుమానాలున్నాయి. చిన్న కచ్చి వాళ్ళ కంటే పెరియకచ్చి వాళ్ళకి మరీను. ఈవిడ చేసే ఆరాధన వాళ్ళు చేసే వేళలోనే కావడంతో వాళ్ళెంత ఖర్చు చేసినా ప్రేక్షకులు ఆవిడ కచేరీలకే ఎక్కువ వచ్చేవారు. అంతేకాక ఆరాధనలో తమకి అవకాశమివ్వక పోవడంతో 1930 నాటికి నాగస్వరకళాకారులు తిరిగి నిరసన ప్రారంభించారు. స్త్రీ కళాకారుల విజయమే వీళ్ళకి స్ఫూర్తిని కలిగించింది. దాంతో కొంతమంది నాగస్వరం వాళ్ళు రెండు కచ్చి వర్గాల నుంచి వేరుపడి విడిగా ఆరాధన నిర్వహించడం మొదలు పెట్టారు. మలై కోట్టై గోవిందస్వామి పిళ్ళైకి సంభవించిన తీవ్రఅనారోగ్యం ఆరాధన కార్యక్రమాలకి అన్నిటికన్నా పెద్ద దెబ్బ. పెరియ కచ్చి వర్గానికి చాలా కాలం పాటు మూలస్తంభంగా వుండిన పిళ్ళై పాత తరహా కళాకారుడు. అందుకనే డబ్బు యావ అస్సలులేదు. అనారోగ్యంవల్ల కచేరీలు తగ్గించు కోవడంతో చాలా చిక్కుల్లో పడ్డాడు. అతని శిష్యుడు ‘పాపా’ కె.ఎస్‌. వెంకట్రామయ్య శ్రద్ధగా చేసిన సేవలవల్ల కాస్త తేరుకున్నాడు. 1930లో 6నెలలు గడిచేసరికి చాలా మంచి మార్పు వచ్చింది. నడిచేందుకు సాయంకావలసి వచ్చినా కూడా రెట్టించిన వుత్సాహంతో 1931లో ఆరాధన కోసం పెద్ద ఎత్తున విరాళ సేకరణ మొదలు పెట్టాడు. మద్రాసు ఆర్మేనియన్‌ స్ట్రీట్‌ లో గోఖలే హాల్లో కచేరీలు ఏర్పాటు చేశాడు. వాటిలో ఆయనే పక్కవాయిద్యం వాయించేవాడు. తన వంతుసాయం అలా కూడా అందించాడు. ఆఖరి రోజున ఆయన్ని వేదిక మిదకి మోసుకు వెళ్ళాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆ వేదిక మిదే పులిలా తిరిగిన ఆయన్ని అలా చూడడం చాలా విచారకరం. అదే వేదిక మిద 1918లో దక్షిణామూర్తి పిళ్ళై, అజగనంబి పిళ్ళైలతో పాటు గోవిందస్వామి పిళ్ళైకూడా మద్రాసు శ్రోతలకి యువకళాకారుడు చెంబైవైద్యనాథ భాగవతార్‌ని పరిచయం చేయడం ఆయన గుర్తు చేసుకుని వుండాలి. ఇప్పుడు తన రూపానికి తానే నీడ అయ్యాడు. మైకు దగ్గరకి దేక్కుంటూ వెళ్ళి, ఆ నాటి కళాకారుడు పాల్ఘాట్‌ రామభాగవతార్‌కి తన ఆహ్వానాన్ని మన్నించి ప్రదర్శన ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఆదృశ్యం చూసిన శ్రోతలకీ, భాగవతార్‌కి కూడా కన్నీరు ఆగలేదు.

ఈ కచేరీలు అయిపోయాక, శ్రీసుదర్శన సభ అనే తంజావూరు నాటక కంపెనీ వాళ్ళని నాటకప్రదర్శనలిచ్చి ఆ సొమ్ము ఆరాధనకి విరాళంగా ఇమ్మని కోరాడు. నాటక ప్రియుడైన పిళ్ళై ఉచ్ఛథలో వున్నప్పుడు ఈ సంస్థకి చాలా అవకాశాలిచ్చాడు. ఆనాడు దీనస్థితిలో వున్న ఆ సంస్థకి ఆ రకంగా వూపిరి పోశాడు. ఆయన కోరగానే వాళ్ళు స్పందించి వెంటనే పెద్ద మొత్తం పోగుచేసి ఇచ్చారు.

1931లో జరిగిన ఆరాధన పిళ్ళైకి హంసగీతం. 1930నాటి ఆరాధన లో శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌. అద్భుతంగా పాడి శ్రోతలని ఆకట్టుకున్నాడు. 1931లో శ్రీనివాసయ్యర్‌కి పక్క వాద్యకారుడిగా పాపాకి మొదటి సారి పిళ్ళై అవకాశమిచ్చాడు. ఇక వచ్చే సంవత్సరం ఆరాధనకి తాను వుండననే దృఢ నిశ్చయంతో పిళ్ళై తిరువిళిమిళవై సోదరులకి త్యాగరాజు పటం అప్పగించాడు. అది ఆయనకి 1911లో నరసింహభాగవతార్‌ ఇచ్చినది. అలా ఆరాధన బాధ్యతని ఆ నాగస్వర సోదరుల చేతిలో పెట్టాడు. వైద్యం కోసం కుంభ కోణం వెళ్ళి పిళ్ళై అక్కడే 1931 మార్చి 13న మరణించాడు. సంగీత కారులందరూ చాలా విచారించారు. తమలో తమకి వున్న విభేదాలు పక్కన పెట్టి అందరూ తమ సంతాపాన్ని తెలియజేశారు. చిన్నకచ్చికి మూలస్తంభంగా వున్న మంగుడి చిదంబర భాగవతార్‌ ‘హిందూ’లో ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ సుదీర్ఘ లేఖ రాశాడు. స్త్రీల పట్ల సంకుచిత భావాలున్న వాడైనా, ఆరాధన కోసం పిళ్ళై చాలా కష్టపడిన వాడని నాగరత్నమ్మ కూడా బాధపడింది. ఆ సంవత్సరమే ఆమె మరో దుర్వార్తకూడా వినక తప్పలేదు. ఎన్నో సన్మాన సత్కారాలు పొందిన ఆమె గురువు బిడారం కృష్ణప్ప మైసూరులో జులై 30న నిర్యాణం చెందాడు. త్యాగరాజుకి ఇష్టదైవమైన రాముడికి మైసూరులో ఆలయ నిర్మాణం చెయ్యాలని గట్టి సంకల్పంతో వున్నవాడాయన. ఆమె లాగానే ఆలయం కోసం చాలా కష్టపడ్డాడు. ఆమె లాగానే తన ఆస్తినంతా సీతారామ మందిర నిర్మాణం కోసం వెచ్చించాడు. ఈనాటికీ మైసూరులో ఆయన చెక్కు చెదరని భక్తి విశ్వాసాలకి గుర్తుగా నిలిచివుందా మందిరం.

గురువు రామాలయం నిర్మిస్తే, శిష్యురాలు రాముడి పరమ భక్తుడు త్యాగ రాజుకి గుడి కట్టించడం సముచితమే మరి. పిళ్ళై మరణానంతరం పెరియకచ్చి ఆరాధన నిర్వహణ బాధ్యత తిరువిళిమిళవై సోదరుల మిద పడింది. వాళ్ళు ఆరాధన నిర్వహణని అంది పుచ్చుకునే సందర్భంలో తంజావూరులోని రావు బహద్దూర్‌ రామనాథన్‌ చెట్టియార్‌ హాల్లో పెద్ద కార్యక్రమం జరిగింది. శూలమంగళం వైద్యనాథ భాగవతార్‌తో అప్పటికి విరోధమున్న మంగుడి చిదంబర భాగవతార్‌ ఆనాటి ముఖ్య అతిధి. అతన్ని తమవైపు తిప్పుకోవాలన పెరియ కచ్చి వాళ్ళ వుద్దేశం. కాని అతను వీళ్ళతో చేరలేదు. పైగా మరోసారి త్యాగరాజు పటాన్ని తిరువిళిమిళవై సోదరుల్లో పెద్దవాడైన సుబ్రహ్మణ్య పిళ్ళైకి ఇచ్చాడు. గోవిందస్వామి పిళ్ళైకి గతంలో మద్రాసులోని గోపీనాథ టాకర్‌ అనే నగల వ్యాపారి ఇచ్చిన బంగారు కంకణం కూడా అతనికి ఇచ్చాడు. ఈ సంబరానికి తప్ప పెరియకచ్చి వాళ్ల ఆరాధనకి శ్రోతల సంఖ్యా తగ్గింది, వీళ్ళలో వుత్సాహమూ తగ్గింది. అళగనంబి పిళ్ళై మరణంతో వాళ్ళకి మంచిదన్నూ పోయింది. కంచీపురం నయనాపిళ్ళై మరో రెండేళ్ళు వ్యవహారాలు చూశాడు. కానీ 1933లో క్షయ, మధుమేహం రావడంతో అతను తన ఊరిలో మంచాన పడి 1934లో చనిపోయాడు. గోవిందస్వామి పిళ్ళై స్నేహితుడు మరుంగపురి గోపాలకృష్ణ అయ్యర్‌ అనే వైలిన్‌ విద్వాంసుడు కూడా కొద్దికాలం సాయం చేశాడు . కాని ఆయన శ్రీరంగంలో త్యాగరాజ ఆరాధన నిర్వహించడం మొదలెట్టాక తిరువయ్యారు రావడం మానుకున్నాడు. ‘నవాజ్‌’ రాజ మాణిక్కం పిళ్ళై అనే రంగస్థల నటుడు నాటకాలు వేసి ఆ సొమ్ము విరాళంగా యిచ్చాడు.

శూలమంగళం వైద్యనాధ భాగవతార్‌ ఆదేశాల ప్రకారం చిన్నకచ్చి వాళ్ళ ఆరాధన యధాప్రకారం జరిగేది. నాగస్వర కళాకారులని ఆరాధన వేదిక మిద ప్రదర్శించనివ్వకూడదనే విషయంలో మాత్రం ఆయన చాలా పట్టుదలగానే వున్నాడు. బీదలకి జరిగే అన్న సంతర్పణ కులాల వారీగా చేసేవాడు. విద్యుద్దీపాలతో అలంకరణ ఆధునిక మైనదిగా భావించి, దాన్ని కాదని మునుపటి లాగానే గాస్‌లైట్లతోనే అలంకరించేవారు. అక్కడ కార్యక్రమంలో ప్రదర్శన యివ్వదలచుకున్న వాళ్ళకి అతని అనుమతి వుండాల్సిందే. ఆయన ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌కి అవకాశమైతే ఇచ్చాడు కానీ మామూలుగా ఇవ్వాల్సిన 3గంటలు కాకుండా గంటన్నర మాత్రమే ఇచ్చాడు. అంత తక్కువ సమయంలో నెమ్మదిగా, భావయుక్తంగా సాగే ముసిరిశైలి శ్రోతల మిద పెద్దగా ప్రభావం చూపలేదు. ముసిరి రంగస్థల కళాకారుడిగా ఇంతకన్నా బాగా రాణిస్తాడని భాగవతార్‌ వ్యంగ్యంగా అన్నాడు. ఇంక ఎన్నడూ ముసిరి ఆ ఆరాధన వుత్సవాల్లో పాల్గోలేదు.

శూల మంగళం వైద్యనాధ భాగవతార్‌ గురుకుల వాసంలో తన దగ్గరే (1935-36) నేర్చుకున్న స్వామిమలై జానకి రామన్‌ కచేరి చేసే స్థాయికి ఇంకా రాలేదని భావించాడు శూలమంగళం. శిష్యుడు ఎంత బతిమాలినా అవకాశమిచ్చేందుకు ఒప్పుకోలేదు. దాంతో జానకి రామన్‌ విసిగిపోయి ఒక మధ్యాహ్నం నాగరత్నమ్మ దగ్గరకి వెళ్ళాడు. అతను శూలమంగళం శిష్యుడని తెలియగానే పాట వినిపించమంది. విని, సాయంత్రం తను నిర్వహించే ఆరాధనోత్సవాల్లో అవకాశమిస్తానని మాట ఇచ్చింది. సాయంత్రం పెద్ద కచేరిలో పాడించింది. కచేరి ఆసాంతంవిని, అతన్ని శూలమంగళం వైద్యనాథ భాగవతార్‌ శిష్యుడిగా శ్రోతలకి పరిచయం చేసింది. హర్షధ్వానాలతో అతన్ని ప్రోత్సహించమని కోరింది. జరిగిందంతా మర్నాడు భాగవతార్‌కి తెలిసింది. కానీ నాగరత్నమ్మ వైఖరితో అతనికి చిరాకు వచ్చినా ఏమి వ్యాఖ్యానించలేదు. ఆమె పనివిధానం పట్ల అతను ఎప్పుడూ ఆసక్తి చూపించ లేదు సరిగదా ఆమె నిర్వహించే ఆరాధన గురించి ఎగతాళి చేసేవాడు. కానీ శూలమంగళం భాగవతార్‌ చిన్న కచ్చివాళ్ల ఆరాధన కోసం వయస్సుని సైతం లెక్కచేయకుండా కష్టపడడాన్ని నాగరత్నమ్మ ప్రశంసించేది. ఒక్కోసారి ఆయన్ని త్యాగరాజు అపరావతారంగా పేర్కొనేది.

సమాధి చుట్టు పక్కల వున్న భూముల్ని నాగరత్నమ్మ కొనడం(1933-35)మొదలు పెట్టింది. ఈ పని పూర్తి అయేందుకు చాలా కాలం పట్టింది. త్యాగరాజ మందిరం కట్టించేందుకు అవసరమైన పనులకోసం కచేరీలు తగ్గించుకుంది. దాంతో ఆమె ఆదాయం తగ్గిపోయింది. టాకీ సినిమాలు మొదలై కొత్త రకం పాటలూ, సంగీతధోరణులు వచ్చాయి. కానీ నాగరత్నమ్మ తన ఆదర్శాల్ని ఒక పట్టాన ఒదులుకునే రకం కాదు. గ్రామఫోను రికార్డింగులన్నా ఆమెకి నచ్చేది కాదు. అక్కడి ఇంజనీర్ల ఆదేశాల ప్రకారం పాడడం బలమైన వ్యక్తిత్వంగల నాగరత్నమ్మకి అసలు నచ్చేది గాదు. భారీకాయం వల్ల దూర ప్రయాణాలు చెయ్యడం ఇబ్బందిగా వుండేది. దానివల్ల పై వూళ్ళకి కచేరీలకి మానేసింది.

నాగరత్నమ్మకి త్యాగరాజు సమాధిని అప్పగించిన మన్నప్ప సాహెబ్‌ అనే సంపన్నుడు చనిపోయాక, అతని కొడుకు రాజమన్నాజి సూర్వే ధర్మకర్త అయ్యాడు. తన తండ్రి చివరికోరిక ప్రకారం చుట్టూ వున్న భూముల్ని మార్చుకోవడానికి ముందుకొచ్చాడు. అంతకు ముందు సారవంతమైన భూముల్ని కొని వాటిని సమాధి దగ్గర భూముల కోసం సూర్వేకి మార్పిడి చేసింది. తిరువయ్యారులో గవర్నమెంటు ప్లీడరు సి.వి.రాజగోపాలా చారి, నాగరత్నమ్మ అభిమాని. ఈ భూముల వ్యవహారంలో దస్తావేజుల రాతకోతలూ వగైరాలన్నీ అతనే చూసి పెట్టాడు. దీని కోసం 2,000రూ||లు అవసరమయ్యాయి. నాగరత్నమ్మ తన నగలు ఒక్కొక్కటీ అమ్మడం మొదలులెట్టింది. అంతకుముందు సూరజ్‌మల్‌ లల్లూ భాయ్‌ షాపుకి నగలుకొనేందుకి వెళ్ళినామె ఇప్పుడు అమ్ముకోవడానికి వెళ్ళింది. వయసు వుడుగుతూన్న కళాకారిణీ, వృద్ధ వ్యాపారవేత్తకీ పరస్పర గౌరవం వుండడం వల్ల అతను ఒక్కొక్క నగకి సరైన విలువే కట్టాడు. ఆమె దగ్గరున్న వజ్రాల నెక్లెసే 3,500రూ||ల విలువకలదని చిక్కవరం జమిందారిణి సరస్వతీదేవి తన చివరిరోజుల దాకా చెప్తూండేది. కుంకుడుకాయంత వజ్రంపొదిగిన ఉంగరం ఒకటి నాగరత్నమ్మ దగ్గర వుండేది. ఆమెకి నగలంటే (వజ్రాలంటే మరీను) వున్న ఆపేక్ష తెలిసినవారందరికీ అవి అమ్ముతూన్నప్పుడు ఎంతో నిర్వికారంగా కూర్చున్న ఆమెని చూస్తే ఆశ్చర్యంగా వుండేది. మిగిలిన సొమ్ముతో తిరువయ్యారులో ఒక ఎకరం భూమి కొన్నది. ఇంకా మిగిలిందాంతో దానధర్మాలు చేసింది. త్యాగరాజుకి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వెంటనే విరాళాలిచ్చేది. త్యాగరాజు శిష్యుడు వాలాజపేట కృష్ణస్వామి భాగవతార్‌ కొడుకు కె.కె. రామస్వామి భాగవతార్‌ త్యాగరాజు జీవిత చరిత్రరాయడానికి సంకల్పించి నాగరత్నమ్మని దాని ప్రచురణ ఖర్చు గురించి సాయమడిగాడు. శ్రీ త్యాగ బ్రహ్మోపనిషత్‌ పేరుతో 1935లో అది అచ్చయింది. ఉదారంగా విరాళమిచ్చిన నాగరత్నమ్మకి కృతజ్ఞత తెలియజేశాడందులో.

సమాధి చుట్టూ వున్న భూములు కొనేశాక నాగరత్నమ్మా, మిగిలిన స్త్రీలు నిర్వహించే ఆరాధన వెనకవైపు నుంచీ ముందుకి మారింది.53 రెండు కచ్చి వర్గాల వారూ లోపలికి వెళ్ళాలంటే ఈమె కార్యక్రమాల్ని దాటుకుని వెళ్ళాలి. నాగరత్నమ్మే విజయం సాధించిందని, శూలమంగళం తప్ప, అందరూ అనుకున్నారు. ఆరాధనలో ఆడవాళ్ళు పాల్గొంటున్నందుకు, తప్పని సరి అయ్యి, శూలమంగళం ఒప్పుకున్నాడు. సమాధి విషయాల్లో అన్ని విధాలా అతన్ని అధిగమించగలిగింది. కాని శ్రాద్ధకర్మ మాత్రం స్త్రీలు నిర్వహించగూడదని అతను స్పష్టం చేశాడు. ఇది ఆరాధనలో ముఖ్యమైన ఘట్టం. చనిపోయిన వారి ఆత్మకి ప్రతినిధులుగా 16 మంది బ్రాహ్మలకి, ఉంఛవృత్తి వూరేగింపుగా వెళ్ళి అన్న సంతర్పణ చెయ్యాలి. దానిలో మాత్రం స్త్రీలకి ప్రవేశార్హత లేదు.

ఈ సంగతి తెలుసుకున్న నాగరత్నమ్మ, ఇది భాగవతార్‌ తనకి విసిరిన సవాల్‌గా భావించింది. వైలిన్‌ విద్వాంసుడు శివ సుబ్రమణ్య అయ్యర్‌ మేనల్లుడు సీతాపతిని శ్రాద్ధ కర్మలు చేసే బ్రాహ్మల కోసం కబురంపింది. దేవదాసి చేతి వంట తినేందుకు, వాళ్ళెవరికీ ఇష్టంలేదు. ‘అలాకాదు, బ్రాహ్మడి చేతే వండిస్తాననీ, శ్రాద్ధకర్మ, అన్న సంతర్పణ పూర్తి అయ్యేదాకా గదిలోంచి రానని’ హామి ఇచ్చింది. కార్యక్రమం అంతా అయ్యాక ఆమె తలమిద వాళ్ళు అక్షింతలు వేస్తే చాలునని కోరింది. దీనివల్ల శ్రాద్ధకర్మ నిర్వహించిన ఫలం తనకి దక్కుతుందని ఆమె విశ్వాసం. వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. ఉంఛవృత్తి కూడా చేస్తేనే ఆరాధన సంపూర్ణ మవుతుందనే వుద్దేశంతో ఆమె దానికి కూడా ఏర్పాటు చేసింది. వూరేగింపు మంగళవారం సత్రం నుంచి బయలు దేరింది. నీలకంఠ భాగవతార్‌ ఇంటింటికీ పోయి బియ్యం పోగు చేశాడు. అమ్మపెట్టై బాలసుబ్రమణ్య అయ్యర్‌, పట్టు కొట్టై రాజగోపాల భాగవతార్‌ పాడుతూండగా, కిజపరూర్‌ లక్ష్మీ నరసింహన్‌ మృదంగం వాయిస్తూ వుండగా, మరొకాయన తంబుర వేస్తూ వూరేగింపులో పాల్గొన్నారు. శూలమంగళం భాగవతార్‌ ఆశ్చర్యంగా వూరేగింపుని చూశాడు. తిరువయ్యారు వీధులన్నీ వాళ్ళు చుట్టివచ్చేసరికి అన్నదురై భాగవతార్‌ సంప్రదాయబద్ధంగా వంట ముగించేవాడు. ఇచ్చిన మాటప్రకారం నాగరత్నమ్మ వీటిలో పాల్గొనేది కాదు. చివరికి ఆశీర్వచనం వేళకి మాత్రం కచ్చితంగా హాజరయ్యేది. ఆమె వారికి బహూకరించిన బట్టలూ, పాత్రలు చూసి ఎంతో సంతోషంతో ప్రతి సంవత్సరం వచ్చి కర్మకాండ నిర్వహిస్తామని బ్రాహ్మలు మాట ఇచ్చారు. దీంతో ఆమె నిర్వహించే ఆరాధన, ఎవరూ వేలెత్తి చూపడానికి వీల్లేని విధంగా, పరిపూర్ణమయ్యింది.

త్యాగరాజు కీర్తనల స్ఫూర్తిని అవహేళన చేసే తీరులో మూడు ఆరాధనలు విడివిడిగా జరపాల్సి రావడం గురించి నాగరత్నమ్మ చాలా బాధపడేది. పెరియకచ్చి బృందం క్షీణించి పోవడం, తిరువిజిమిళవై సోదరులు వాళ్ళ ఆరాధనని కొనసాగించడం కోసం తమ సొంతడబ్బు వాడాల్సిరావడం అందరి దృష్టికి వచ్చింది.55 విలీనం గురించి ఆమె ఒక్క మాట అంటే చాలు. కాని సమాధి దగ్గర స్త్రీలు ప్రదర్శన లివ్వకూడదనే విషయంలో మాత్రం వైద్యనాథ భాగవతార్‌, చిన్నకచ్చి బృందం మాత్రం చాలా పట్టుదలగా వున్నారు. దాంతో, ఇక విలీనం గురించి బాహాటంగా ఆమె ఏ ప్రయత్నాలూ చెయ్యలేదు.56 నాగరత్నమ్మ 1937,38ల మధ్యకాలంలో తన ఆస్తిని ఇంకొంత అమ్మి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా గుండ్రంగా కట్టించింది. సమాధి, దాని చుట్టూవున్న ప్రాంతమంతటికీ ‘త్యాగరాజు ఆశ్రమం’ అని పేరు పెట్టింది. కావేరి నది ప్రవహిస్తున్న ఆ పరిసరాలు ఆమెని కట్టి పడేశాయి. మద్రాసులో వుండడంలో అర్థం లేదనిపించింది. అక్కడి ఇల్లు అమ్మేసి తిరువయ్యారుకి మకాం మార్చెయ్యాలని నిశ్చయించుకుంది. కాని దీనివల్ల తన స్నేహితురాలు ధనంని మధ్యాహ్నాలు ఆనందంగా కలిసే అవకాశంవుండదు. కానీ ఆ తర్వాత ధనం ఎక్కువ కాలం బతకలేదు.

తిరువయ్యారులో నాగరత్నమ్మ రకరకాల తగాదాల్లో మునిగివుండగా స్నేహితురాలు ధనం క్రమంగా తనలోకి తాను ముడుచుకుపోవడం మొదలయింది. అయినా ఆమె జీవితంతో పెనవేసుకు పోయిన సంగీత రసధుని ఎందరో అభిమానుల్ని దగ్గర చేసింది. ప్రఖ్యాత పత్రికాధిపతి కస్తూరి శ్రీనివాసన్‌, పారిశ్రామిక వేత్త టి.టి కృష్ణమాచారి, లాయరు ఎన్‌.డి. వరదాచారి, ఐసియస్‌ ఆఫీసరు ఎస్‌.వై. కృష్ణస్వామి లాంటివారు.58 ప్రతిశుక్రవారం గుడికి వెళ్ళినట్టు, ధనం ఇంటిలో జరిగే కచేరీలకి హాజరయేవారు.59 దృష్టిలోపం, రకరకాల అనారోగ్యాలతో ఆమె బాధపడినా, ఈ అభిమానుల ఔదార్యం, తన కూతుళ్ళ పోషకుల సాయం వల్ల ఆమె జీవితం బాగానే సాగింది.

1938 మధ్యలో, రామకృష్ణ చెట్టి వీధిలోవున్న తన ఇల్లు ఖాళీ చేసి తన మనుమరాలు, ప్రముఖ నాట్యకళాకారిణి టి. బాల సరస్వతి దగ్గరికి మకాం మార్చింది వీణధనం. ఆవిడ ఇల్లు ఎగ్మూరులో అరవముడు గార్డెన్స్‌లో వుండేది. సెప్టెంబరు చివర్లో నవరాత్రివుత్సవాలు యధావిధిగా జరిపించింది ధనం. ప్రతి సాయంత్రం పన్నీటితో స్నానం చేసి, మల్లెల పొదరింట్లో కూర్చుని వీణ వాయించేది. కుటుంబ సభ్యులందరూ చేరి ముందు సరస్వతి ప్రార్థనగా ముత్తుస్వామి దీక్షితుల వేగవాహిని రాగకృతి ‘వీణాపుస్తక ధారిణిం’ పాడేవారు. చూసేవాళ్ళకి అది ధనంకి ప్రార్థన చేస్తున్నట్లనిపించేది. ఆ సంవత్సరం వర్షాకాలం ముందుగానే వచ్చేసింది. విజయథమి వుత్సవాల తర్వాత ఆ బడలికతో ధనం మంచం పట్టింది59. అక్టోబరు 15న ఆమె చనిపోయింది.60 ఆఖరి క్షణాల్లో ఆమెకూతుళ్ళు ఆమె కిష్టమైన కీర్తనలు ముక్త కఠంతో పాడారు. ఆమె అభిమానుల్లో పుర ప్రముఖులు చాలా మంది వున్నారు. జోరున వాన కురుస్తూన్నా వాళ్ళంతా అంతిమయాత్రలో పాల్గొన్నారు.

చాలా చోట్ల సంతాప సభలు జరిగాయి. అన్నిటికన్నా మద్రాసు యూనివర్సిటీ సెనేట్‌ హౌస్‌లో జరిగినది ప్రముఖంగా వుంది.62 అక్టోబరు 24న త్యాగబ్రహ్మభక్త జనసభ పార్క్‌ టౌన్లో ఏకాంబరేశ్వర అగ్రహారంలో జరిగిన సభకి అరియక్కుడి రామానుజ అయ్యంగార్‌ అధ్యక్షత వహించాడు. ఆనాడు నాగరత్నమ్మ ”దక్షిణ భారతదేశంలోని సంగీత ప్రియుల మిద ధనమ్మాళ్‌ చెరగని ముద్ర వేసింది” అంది. అప్పట్లో నాగరత్నమ్మ ఎవరిగురించి అయినా, దేని గురించి అయినా మాట్లాడేందుకు త్యాగరాజే సందర్భంగా వుండేవాడు అందుకని ”ధనమ్మాళ్‌కి త్యాగరాజు పట్ల అతని రచనల పట్ల వున్న గౌెరవాభిమానాలు ఆమె సంగీతంలో స్పష్టంగా కనిపిసా”్త యంది.

ధనం చనిపోయాక నాగరత్నమ్మ జార్జిటౌన్‌, శ్రీనివాసయ్యర్‌ వీధిలో వున్న తన ఇంటిని అమ్మేసింది. అత్యవసరమైన సామగ్రి కొద్దిగా మాత్రం వుంచుకుని మిగిలిన వాటిని అమ్మేసింది. పూజ సామగ్రి తిరువయ్యారు తీసుకెళ్ళి భక్తి శ్రద్ధలతో త్యాగరాజ సమాధి ఆలయంలో ఎడమపక్కన వుంచింది. రాముడు భాగవతార్‌ వాటిని పూజకి వాడేవాడు. తన పూజ గదిలోని దీపాన్ని తిరువాయూరు తీసుకొస్తూ ఆరిపోకుండా దారి పొడుగునా నూనె పోస్తూ జాగ్రత్తగా తెచ్చింది.
ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుని సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు కట్టిన కట్టడానికీ, తిరువయ్యారు చుట్టు పక్కల సారవంతమైన భూమి మరి కొంచెం కొనడానికి వుపయోగించింది.65 మిగిలిన నిర్మాణాలన్నీ 1938 నవంబరుకి పూర్తయ్యాయి. వాకిలి పక్కన పాలరాతి ఫలకం అంటించారు. మద్రాసులోని జె.లీస్‌ అండ్‌ కో వాళ్ళు దీన్ని తయారుచేశారు. దాని మిద
శ్రీరామజయం
ఈ ఆలయం, ఆశ్రమం
ప్రఖ్యాత సంగీతకారుడు, భక్తుడు
శ్రీ త్యాగరాజ స్వామికి
అంకితం చేసిన వారు
ఆయన విధేయురాలు, భక్తురాలు
విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మాళ్‌,
మైసూరుకి చెందిన
పుట్టలక్ష్మీ అమ్మాళ్‌ పుత్రిక .

కుంభాభిషేకం నిర్మాణ పరిసమాప్తి
7-1-1925 నవంబరు, 1938

అని చెక్కారు. దీంతో త్యాగరాజు అవశేషాలకి ఒక ఆలయం ఏర్పడింది. కాని ఇన్ని ఏర్పాట్లు త్యాగరాజుకి చక్కగా చేసినావిడ, తనుమాత్రం మంగళవారం సత్రంలో వుండకుండా తిరువయ్యారు ప్రధాన వీధిలో అద్దె ఇంట్లో దిగింది.
నాగరత్నమ్మ త్యాగరాజు కృతులు పాడుకుంటూ వుండేది. అవి వినేందుకు చాలా మంది ఆమె ఇంటికి వచ్చేవారు. పాటలో ఆమె పూర్తిగా లీనమై పోయినప్పుడు ఆమెలోని అభినయ కౌశలం బయట పడేది. ఇతరులు వున్నారనే సంగతి కూడా పట్టించుకోకుండా పాట అర్థానికి తగినట్టుగా కళ్ళూ చేతులూ, మొహం భావ యుక్తంగా కదుపుతూ పాడేది. తెలుగులో ఆమెకున్న జ్ఞానం వల్ల అన్వయలోపం ఎన్నడూ జరగలేదు.66 ఒకోసారి భావావేశం పొంగినప్పుడు పాడలేక పోయేది. అప్పుడు సాహిత్యం గురించి గొప్పగా వివరించేది. చివరకి త్యాగరాజు గొప్పదనం గురించి ఒకటి రెండు వాక్యాలు చెప్పేది.67 తిరువయ్యారులో మహిళా సంఘం వుండేది. అక్కడి వైద్యుడు సేతురామయ్యర్‌ భార్య శకుంతల (స్నేహితులు జుజుమామి అనేవారు), కమల మామి దాన్లో ముఖ్యులు. కమల, నాగరత్నమ్మ ఎదురింట్లో వుండేది. వీళ్ళు ముగ్గురూ మంచి స్నేహితులయ్యారు. శకుంతల చెల్లెలు జానకికి అప్పుడు ఏడేళ్ళు. నాగరత్నమ్మ ప్రేమతో జానకికి చాలా పాటలు నేర్పింది.

ఇప్పుడు బెంగుళూరులో వుంటూన్న జానకి నిజానికి నాగరత్నమ్మ శిష్యురాలినని చెప్పుకోవచ్చు. 1939లో స్త్రీలు నిర్వహించిన ఆరాధనలో పాడేందుకు చాలా భయపడింది జానకి. బట్టలగుండు నుంచి వచ్చిన మగవారు అక్కడ వుండడంకకూడా ఆమె భయానికి ఒక కారణం. కానీ నాగరత్నమ్మ ఆమెకి ధైర్యం చెప్పి ప్రోత్సహించింది. శంభుమామి, అభయం, విశాలం లాంటి మహిళా సంఘంలో చురుకైన సభ్యులు నాగరత్నమ్మ చిటికె వేస్తే చాలు వచ్చివాలేవారు.68 సి.వి. రాజగోపాలా చారి నాగరత్నమ్మ పురమాయించే పనులు చెయ్యడానికి సిద్ధంగా వుండేవాడు. ఆరాధన పూర్తయ్యాక బ్రాహ్మణులు తిన్న ఎంగిలి విస్తరాకులు కూడా ఎత్తి పారేసేవాడు. ఆయన అంకితభావం, సేవా తత్పరతలని మెచ్చుకుంటూ అతన్ని త్యాగరాజగోపాలచారి అనేది నాగరత్నమ్మ, సరదాగా. టి.ఏ. రామచంద్రరావు కూడా ఆరాధనకి చాలా సాయం చేసేవాడు. కచేరీలు ఏర్పాటు చెయ్యడం, వాటికి సంబంధించిన పనులు ఆయన చూసేవాడు.

తిరువయ్యారులో ఇలా స్థిరపడ్డాక నాగరత్నమ్మ ఎక్కువగా వేరే ప్రాంతాలకి వెళ్ళేదికాదు. వెంకటగిరి రాజా ఆహ్వానాన్ని మాత్రం ఆజ్ఞలాగా భావించి అక్కడికి తప్పకుండా వెళ్ళేది. ఆ కుటుంబంతో ఆమెకి సన్నిహిత సంబంధాలుండేవి. వాళ్ళింట్లో ఏ శుభకార్యానికైనా ఆమె కచేరి వుండాల్సిందే. ఏనాడో ఆమె వెంకటగిరి ఆస్థాన విద్వాంసురాలయ్యింది. సంవత్సరానికి 1500/- ఇచ్చేవారు. అదికాక అక్కడికి వెళ్ళినప్పుడల్లా విలువైన బహుమతులు ఎన్నో ఇచ్చేవారు. మిగతా శుభకార్యాలకే కాక విజయథమికి ఆమె కచేరి తప్పకుండా వుండేది. వెంకటగిరి వెళ్ళేదారిలో మద్రాసులో ఆగి, బన్నీ బాయితో కొద్ది రోజులు ఆనందంగా గడిపి వెళ్ళేది. వెంకటగిరి నుంచి వచ్చిన కారు ఆమెని జార్జిటౌన్‌లో వున్న బన్నీబాయి ఇంటికి తీసుకువెళ్ళేది. అక్కణ్ణుంచీ వెంకటగిరికి. తనతో వైలిన్‌ విద్వాంసుడు శివసుబ్రమణ్య అయ్యర్‌ని కూడా తీసుకెళ్ళేది.

వెంకటగిరి రాజా మెచ్చిన పాటల్లో, అఠాణారాగంలో మైసూరు సదాశివరావు కృతి ‘వాచామగోచర’ తప్పకుండా పాడేది. వీణ ధనం పాడినట్టుగా దాన్ని విళంబలయలో నెమ్మదిగా పాడేది. కచేరి అయిపోయాక, తన జీవితంలోని ఘట్టాలు చెప్తూ, వినోదాత్మంగా మాట్లాడి అందర్నీ అలరించేది. ఒకసారి పూర్వికల్యాణిరాగంలో ‘నీమాటలేమాయెనురా’-పట్టాభిరామయ్య జావళిని ఇంగ్లీషులో తర్జుమా చేసి పాడి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. ఆనందభైరవి రాగంలో చిత్తూరు సుబ్రమణ్య పిళ్ళై పాట ‘మధురానగరిలో’ కూడ తప్పని సరిగా పాడేది. టైగర్‌ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్‌ లాంటి ప్రసిద్ధ విద్వాంసులని వాళ్ళ హావభావాలతో సహా అనుకరించేది. చివరికి ‘ఈ మహావిద్వాంసుల విద్వత్తుని మాత్రం తక్కువ అంచనా వెయ్యకూడదని’ హితబోధ చేసేది. తమిళుల తెలుగు ఉచ్చారణని ఎగతాళి చేస్తూ ఎప్పుడన్నాపాడేది. దేశికతోడిరాగంలో ‘నే పొగడ కుంటే’ అనే త్యాగరాజకృతిని ‘నే పకోడ తింటే నీకేమి కొదవ’ అని వాళ్ళు ఎలా పాడతారో అలా పాడి వినిపించేది. చివరికి జనానాలో వున్న ఆడవాళ్ళు ఇచ్చిన బోలెడు వెంకటగిరి చీరెలతో ఇల్లు చేరేది.

మద్రాసులో రాయపేటలో ‘కేసరికుటీరం’ లో డా|| కె.ఎన్‌. కేసరిని నాగరత్నమ్మ తప్పకుండా కలుసుకునేది. ఆమె కున్న జబ్బులు వివరించి వాటికి మందులు తీసుకున్నాక ఇద్దరూ తెలుగు సాహిత్య సంబంధమైన చర్చలు సాగించేవారు. కేసరి డాక్టరేకాక, సాహిత్య పరిజ్ఞానం కలవాడు కూడ. నాగరత్నమ్మ చేపట్టిన పని ఏదైనా శుభప్రద మవుతుందని కేసరి గాఢనమ్మకం. ‘కేసరికుటీరం’ గృహ ప్రవేశానికీ, తన కూతురు శేషగిరి పెళ్ళికి నాగరత్నమ్మ కచేరీలు ఏర్పాటు చేశాడుకేసరి. ఆమె నిర్వహించే ఆరాధనకి తప్పకుండా విరాళమిచ్చేవాడు. తన స్నేహితుడు బెంగుళూరులో ‘శాస్త్రి హోటల్‌’ కడితే ప్రారంభోత్సవం ఆమెచేత చేయించాడు. ఆమె కచేరికూడా ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌ యజమానికి తర్వాత లక్షలకొద్దీ లాభాలొచ్చాయని కేసరి గొప్పగా చెప్పేవాడు.

తిరువయ్యారులోని పల్లె వాతావరణంలో సాయంత్రాలు కృష్ణన్‌ అనే బండివాని సాయంతో సమాధి దగ్గరకి చేరేది. నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ కూర్చునేది. ఒకోసారి తెలుగులో మాట్లాడుతూండేది. నాగరత్నమ్మ ఎవరితోనో మాట్లాడుతూన్నట్టనిపించేది. ‘ఎవరితో మాట్లాడుతున్నారని’ అడిగితే ‘త్యాగరాజు సంభాషిస్తున్నాడు’ అని చెప్పి ఆయనకి పాడి కూడా వినిపించేది. ముద్దుగా మాట్లాడేది. నైవేద్యం పెట్టేది. ఒకోసారి త్యాగరాజు కోసం అభినయం చేస్తూ అలరించేది. నాగరత్నమ్మకి ఎప్పుడూ త్యాగరాజు ధ్యాసే. తన సర్వస్వం ఆయనకి అర్పించింది. గొప్ప దేెవదాసీల్లో ఆఖరిదైన నాగరత్నమ్మకి తన జీవిత చరమాంకంలో త్యాగరాజే పోషకుడయ్యాడు.

– వి.శ్రీరాం
అనువాదం:టి.పద్మిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి , గీతా రామస్వామి గారికి కృతజ్ఞతలు .
Gita Ramaswamy,
Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,
Hyderabad 500 006

108

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో