‘‘స్నేహితా! ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఒక్క నీ భర్తలో శుక్రకణాలు తప్ప….’’ అంది డాక్టర్. ‘‘సరే! మేడమ్! నేను ఆలోచించుకుంటాను. నాకు కొంత టైం కావాలి.’’ అంది స్నేహిత. ‘‘ఓ.కె. ఆల్ ద బెస్ట్. ఇది నా ఫోన్ నెంబర్! ఈ విషయంపై ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్ చెయ్యి…’’ అంది డాక్టర్. ‘‘ అలాగే’’ అంటూ సెలవు తీసుకుంది స్నేహిత. హాస్పిటల్ నుండి ఇంటికెళ్లింది స్నేహిత. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారు. ఆమె నేరుగా తన గదిలోకి వెళ్లి ఆ రిపోర్టును బీరువా అడుగున దాచిపెట్టింది. ఈ సమాజం ఏ రహస్యాన్ని దాచుకోలేని తాగుబోతులాంటిదని ఆమెకు తెలుసు. అందుకే ఆ రిపోర్టును దాచాక ఒక రహస్యాన్ని గొయ్యి తీసి పాతిపెట్టినట్లు ఊపిరి పీల్చుకొంది. తలుపుపెట్టుకొని బోరున ఏడ్చింది. ఇదే ఆఖరి ఏడుపు అన్నట్లు తనివితీరా ఏడ్చింది. ముఖం కడుక్కొని బయటకొచ్చింది.
అత్తగారితో, తోడికోడళ్లతో తన భర్తలో శుక్రకణాలు లేవని చెప్పదలచుకోలేదు. అది నలుగురుకి తెలిసి ఇంకో రకమైన అవమానాన్ని భరించలేక…. ‘‘మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేదన్నారు డాక్టర్లు’’ అని అబద్దం చెప్పింది. వాళ్లు సంతోషించారు…. ఆ సంతోష సమయంలో ‘‘స్నేహితా! ఇలారా!’’ అంటూ పక్కకి పిలిచింది నీలవేణి….అత్తగారికి దగ్గరగా వెళ్లి నిలబడిరది స్నేహిత. ‘‘… నేను అనుకున్నది నిజం కానందుకు అంటే నీకు గర్బసంచి వుందని ఋజువైనందుకు నాకు ఆనందంగా వుంది స్నేహితా! ఎందుకైనా మంచిది. నీకింకా త్వరగా పిల్లలు పుట్టాలీ అంటే ఈ రోజు నుండి నువ్వోపని చెయ్యి…. వీర్య పుష్టి కోసం పాలు, నువ్వులు, బెల్లం, మినపసున్ని, మినుపగారెలు వాడి చేత తినిపించు…..’’అంది మనస్పూర్తిగా.
స్నేహిత తనలో తనే ఓ వెర్రి నవ్వు నవ్వుకొని…. ‘‘ఆయన అవి తినరు అత్తయ్యా! ఆయన టేస్ట్ నాకు తెలుసు… మెడిటేషన్ చేసుకోమని నిద్ర లేపితే వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఇలాంటివన్నీ ఆయన దృష్టిలో వేస్ట్…. అయినా ఇంకో రిపోర్టు రావలసివుంది. అందులో వచ్చే దాన్ని బట్టి డాక్టర్ గారు ఏ విషయం తర్వాత చెబుతానన్నారు. బహుశా మందులు వాడవలసి వస్తుందేమోనని నా అనుమానం….’’ అంది స్నేహిత అపద్ధర్మంలో అబద్దం చెబుతూ….. అలా అబద్దం చెప్పినందుకు ఆమె బాధ పడటం లేదు. భవిష్యత్తులో కూడా బాధ పడతాననుకోవటం లేదు. తను ఆడిన అబద్దం వల్ల తన కుటుంబంలో చాలా మంది మనశ్శాంతిగా వుంటారని నమ్ముతోంది.
…. నీలవేణి ఆప్యాయంగా స్నేహిత భుజాన్ని పట్టుకొని ‘‘ద్రాక్ష చెట్టు నీడ వీర్యవృధ్ధిని, బలాన్ని ఇస్తుందట. వాడిని మా అన్నయ్య గారి ద్రాక్ష తోటలోకి తీసికెళ్లు కొద్దిసేపు కూర్చుని రండి! అలాగే మందులు కూడా వాడుకో.’’ అంది. నిజం తెలిస్తే తన అత్తగారు ఇంత ప్రశాంతంగా వుండదు… పొగిలి, పొగిలి ఏడుస్తుంది. తన కొడుకు కష్టపడి సంపాయించే డబ్బుకి వారసులు లేకుండా పోతున్నారని …. తన వంశవృక్షం అంతరించిపోతుందని అల్లాడిపోతుంది.
అందుకే అక్కడ నుండి కదిలి తన గదిలోకి వెళ్లి పడుకొంది స్నేహిత. నుదుటి మిాద చేయి పెట్టుకొని ఆలోచిస్తోంది స్నేహిత భువనేష్ కంప్యూటర్ ముందు కూర్చుని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాడు. అతను ఆమె వుండే గదిలోకి అప్పుడే రాడు.చేస్తున్న వర్క్ పూర్తయ్యాకే వస్తాడు. దానికి ఒక టైమంటూ వుండదు. గదిలోకి వచ్చాక అవసరం అన్పిస్తే ఆమెను లేపుతాడు. లేకుంటే అది కూడా లేదు. ఎ.సి. వల్ల గదంతా చల్లగా వుంది. నిశ్శబ్ధంగా వుంది. అప్పుడప్పుడు ఎ.సి. సౌండ్ చెవులకి రొదగా వుంది. లేచి దాన్ని ఆపగలదు. మనసులో రొదను ఆపలేదు….. ఎందుకంటే ఇంటి నిండా మనుషులువున్నా ఇప్పుడు తను ఒంటరి. ఎంత ఒంటరి అంటే మనసులో కలిగే ఏ చిన్న అలజడిని కూడా పైకి చెప్పుకోలేని ఒంటరి. ఏ స్త్రీకి అయినా తను ఒకరికి భార్యనన్న భావం ఎంత తృప్తినిస్తుందో ఒక బిడ్డకు తల్లినన్నది. ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది. ఇవి రెండూ కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ముఖ్యంగా మాతృత్వంలోని మాధుర్యం, అమ్మతనంలోని రుచిని ఎప్పుడెప్పుడు చవి చూద్దామా అని తాపత్రయపడ్తుంది. ఇప్పుడు తను అదే స్థితిలో వుంది.
…. మరి భువనేష్ పిల్లలు పుట్టించలేడని అందుకు తగిన ఆధారాలు తన దగ్గర వున్నాయని ఎవరితో చెప్పుకోలగదు? బామ్మతోనా? తల్లిదండ్రుల్తోనా? అత్తమామల్తోనా? భర్తతోనా? మిగిలిన కుటుంబ సభ్యులతోనా? చెప్తే వింటారా? విన్నా కొందరు నోరుమూసుకోమంటారు. ఇంకొందరు ఇలాంటివి పైకి చెప్పుకోకూడదని నోరు మూస్తారు…. చేతనకి, ప్రభాత్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగూ వాళ్లు ఇచ్చే సలహాలు వాళ్లిచ్చారు. వాళ్లుండే బిజీలో అంతకన్నా ఎక్కువగా తన గురించి ఆలోచించలేరు. ‘‘…..స్నేహితా! నీ భర్తలో ఆ యోగ్యత లేదు. నీకు పిల్లలు కావాలంటే నీకు నచ్చిన డోనర్ని తెచ్చుకో. లేదంటే మా స్టోరేజ్ బ్యాంక్‌లో నుండి తీసుకొని వేస్తాము. చాయిస్ నీకే.. చాన్సెస్ అనేవి అదృష్టంలా ఒకసారే తలుపు తడతాయి.’’ అనటం మరచిపోలేదు స్నేహిత. వెంటనే బద్రి తల్లి ఆ రోజు ‘‘మొక్క వచ్చేది భూమిలోంచే అయినా విత్తనాన్ని బట్టే ఆ మొక్క ప్రకాశవంతంగా వికశిస్తుంది స్నేహితా!’’ అని తన భుజాన్ని ఆప్యాయంగా నిమురుతూ చెప్పటం గుర్తొచ్చింది…
అవి గుర్తొస్తుంటే తనకు తెలియకుండానే దు:ఖం పొంగుకొస్తోంది. ఎందుకు తనలో ఇంత వేదన? ఆందోళన? వెలితి? మెదడును పురుగులా తొలచి, బలంగా నలుపుతున్నాయి…..వాటిని పక్కకి నెట్టి పైకి చెప్పుకోలేని అన్వేషణతో, లక్ష్యంతో ఆమెలో ఓ ఆలోచన పెరిగి మనసు కాంతి బిందువులా మారి శోధించుకుంటూ, ఛేదించుకుంటూ ప్రయాణం చేస్తుంటే అక్కడో పెద్ద మార్పు కన్పించింది. అది పెనుమార్పు….తను మారాలి. అంతేకాదు….2554 సంవత్సరాల క్రితం పుట్టిన గౌతమబుద్ధుడు తాత్విక చింతనలోనూ, మనోవిజ్ఞాన శాస్త్రంలోనూ, సమాజ సంక్షేమంలోనూ, మూలాలకు వెళ్లి అంతకముందు ఎవరూ చూడని, ఆలోచించని ఎన్నో విషయాలను మావన కళ్యాణం కోసం అందించినట్లే తను కూడా తన కోసం, తన తృప్తి కోసమే కాక, ఈ ప్రపంచానికి పనికొచ్చే విధంగా ఓ బిడ్డను కనాలి, కంటే తప్పేంటి? దానితో గొడ్రాలినన్న పేరు కూడా పోతుంది. అయినా ఈ ప్రపపంచంలో ఎవరికి ఏంకావాలో అది అందుకోవటం లేదా? ఇది కూడా అంతే!
గయలో బోధివృక్షం కింద సిద్ధార్థ గౌతమునికి జ్ఞానోదయం అయినట్లు ఆ క్షణంలో ఆమె మనసులో ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపే ఆదిత్య తన రహస్యాన్ని పంచుకొని, దాన్ని రహస్యంగా వుంచగలిగే వ్యక్తి అతనొక్కడే…. వెంటనే లేచి ఆదిత్యకి కాల్ చేసింది స్నేహిత. అతను ‘హలో’ అనగానే ఏడ్చింది. … ఎప్పుడైనా దొంగనవ్వు వుంటుంది కాని, దొంగ ఏడుపు వుండదని నమ్ముతాడు ఆదిత్య. అందుకే ఆమెను ఓదార్చాడు. తండ్రిలా, అన్నలా, స్నేహితునిలా, అంతకన్నా ఎక్కువగా… కొద్ది నిముషాలు గడిచాక నెమ్మదిగా అడిగాడు విషయం ఏమిటని? … చెప్పింది స్నేహిత ఉద్వేగంగా, ఉద్విగ్నంగా…. అతను ఉత్కంఠతో విని, ఆర్థ్రతతో అర్థం చేసుకొని మాట్లాడటం మొదలు పెట్టాడు. అతని మాటలు కొండల మధ్యన ప్రశాంతంగా పారే నదిలా అన్పించి, స్నేహిత మనసు ఆనది ఒడ్డున అలాగే కూర్చుంది.
…. ఆదిత్య గొప్ప లిటరరీ ట్రెజర్. స్పోర్ట్స్ మైండెడ్, హెల్త్ కాన్షియస్, అంతేకాదు ఆమెకు మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అంతకుమించి జీవితంలో అత్యవసర విలువల్ని పాటించే వ్యక్తి. అందుకే అతను చెప్పే మాటల్ని అమూల్యంగా భావించి శ్రద్దగా వింటోంది… ఎవరి ప్రశంసలకి లొంగని అతను ఒకప్పుడు ఆమె మాటలకి పొంగిపోయి, ఆమె ఇచ్చిన ఇన్సిపిరేషనతో ఉదృతంగా రాస్తూ ‘‘ప్రతిభ దైవదత్తం స్నేహితా! వినయంగా ఉండాలనేవాడు. ప్రఖ్యాతి ఇతరులు ఇచ్చేది` కృతజ్ఞత చూపాలనేవాడు. ఆహంకారం మన స్వంత వికారం` జాగ్రత్త పడాలి అనేవాడు. ఏ విషయంలోనైనా సలహా అడిగితే అందులోని మంచి, చెడు చెప్పి నీకు నచ్చిందే చెయ్! అనేవాడు. ఎమోషన్స్‌కి రూల్స్, పరిదులు పెట్టలేం కాని, క్రియేటివిటీ చాల కష్టం!’’ అనేవాడు…. ఈరోజు అదే క్రియేటివిటీ గురించి మరో రూపంలో మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి రిలేషన్ తామిద్దరి మధ్యన ఏర్పడుతుందని ఏరోజు ఊహించలేదు. ‘‘సర్ ! హాండ్‌సమ్, గుడ్ లుకింగ్, గుడ్‌కలర్, అండ్ హైలీ ఇంటలిజెంట్ లిటరరీ యాటిట్యూడ్ వుండేవాళ్లు అరుదుగా వుంటారు. అలాంటి అరుదైన వాళ్లలో మిారొకరు. కానీ అంతకు మించిన మహోజ్వల వ్యక్తిత్వ సౌందర్యం వుంది మిాకు…అందుకే అడుగుతున్నాను. మిారు నాకు డోనర్‌గా వుండగలరా?’’ అంది.
అతను వెంటనే ‘‘నీకు డోనర్‌గా వుండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. రేపే హైదరాబాద్ వస్తాను. నువ్వు వెళ్లిన హాస్పిటల్ పేరు చెప్పు!’’ అన్నాడు. హాస్పిటల్ పేరు చెప్పి ‘‘థ్యాంక్యూ సర్!’’ అంది స్నేహిత. ‘‘ఇట్స్ ఓ.కె.’’ అంటూ కాల్ కట్ చేశాడు ఆదిత్య. …. వాళ్లు ఒక బిడ్డను భూమి మిాదకి తేవటం వరకు ఆలోచించారు. కాని ఆతర్వాత దాని పర్యవసానం ఏమిటన్నది వాళ్లు ఆ క్షణంలో ఆలోచించలేదు. డాక్టర్‌తో మాట్లాడబోయేముందు స్నేహిత మనసు మహా సముద్రంలా అల్లకల్లోలంగా వుంది. గంభీరంగా వుంది. ఎవరూ లేని ఏకాంతంలో సెల్‌ఫోన్ పట్టుకొని ఆలోచిస్తోంది. చుట్టూ నిశ్శబ్దం…. ఆ నిశ్శబ్దం ఆమెను ఒకవైపు భయపెడ్తుంటే ఇంకోవైపు ఓదారుస్తోంది. ….తను చేస్తున్న పని పూర్తిగా తప్పు కాదని నిర్ధారణ చేసుకొని డాక్టర్ గారి నెంబర్‌కి డయల్ చేసి…. డాక్టర్ గారు ‘హలో’ అనగానే ‘‘మేడమ్, నమస్తే! స్నేహితను మాట్లాడుతున్నా…. నాకు డోనర్ రెడీగా వున్నారు. రేపొచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు. అయితే ఓ చిన్న రిక్వెస్ట్ …’’ అంది స్నేహిత.
‘‘ఏమిటది? చెప్పు స్నేహితా!’’ అంది డాక్టర్. ‘‘మా ఇంట్లో వాళ్లకి, నా భర్తకి పిల్లలంటే చాలా ఇష్టం… కానీ నేను డోనర్ని తెచ్చుకున్నట్టు వాళ్లకు తెలియకూడదు. తన వల్లనే నాకు బిడ్డ పుట్టినట్లు నా భర్త నమ్మాలి….’’ అంది. ‘‘అది మోసమవుతుంది. పైగా నీ భర్తకి తెలియకుండా ఏదీ చెయ్యటానికి లేదు….’’ అంది డాక్టరు. ‘‘లోకంలో జరిగే మోసాలకంటే ఇది పెద్ద మోసమా మేడమ్! నైతిక విలువలను, నీతి నియమాలను, ధర్మా ధర్మాలను, న్యాయాన్యాయాలను ప్రతి ఒక్కరు పాటించి నేనొక్క దాన్నే పాటించడం లేదా? అయినా నా భర్త సంతోషం కోసం, నా కుటుంబ సభ్యుల ఆనందం కోసం, నేను నలుగురిలో గొడ్రాలిలా తిరగలేక చేస్తున్న పని ఇది…. ఒక్కసారి ఆలోచించండి’’ అంది స్నేహిత. డాక్టర్ ఆలోచించి ‘‘నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి… పైగా నీకు అంతా మంచే జరుగుందని అంటున్నావు కాబట్టి నువ్వు అడిగినట్లే నీ భర్తను నమ్మిస్తాను. ఈ పని చెయ్యటంలో నాక్కూడా తృప్తి వుంది. మొన్న సెమెన్ ఎనాలసిస్ కోసం నీ భర్త దగ్గర తీసుకున్న సెమెన్‌ను స్టోరేజ్ బ్యాంక్‌లో పెట్టామని, అది నీలోకి ప్రవేపింపచేస్తున్నామని నీ భర్తతో చెబుతాము. రేపు మిా డోనర్ వచ్చి వెళ్లిన తర్వాత నీ భర్తతో కలిసి నువ్వు హాస్పిటల్‌కి రావలసివుంటుంది.’’ అంది డాక్టర్.
‘‘ఓ.కె. మేడమ్! థ్యాంక్యూ!’’ అంది స్నేహిత. అప్పుడే భువనేష్ లోపలికి వస్తూ ‘‘ఎవరితో మాట్లాడుతున్నావ్?’’ అంటూ వెళ్లి సోఫాలో రిలాక్స్‌గా కూర్చున్నాడు. భర్తను చూడగానే కలిగిన కంగారును అణచుకుంటూ కాల్ కట్ చేసి,.. ‘‘డాక్టర్ గారితో మాట్లాడుతున్నానండి! మనకి పిల్లలు పుడతారట. చాలా నమ్మకంగా చెప్పిందావిడ…’’ అంది అతని పక్కన కూర్చుంటూ… ‘‘నీకు లేదా నమ్మకం! ఆవిడ చెబితేనే కల్గిందా?’’ అన్నాడు విసుగ్గా చూస్తూ… ‘‘ ఆహా… నాకుంది… కానీ, కానీ…’’అంటూ అతనితో ఎలా చెప్పాలో, ఎలా చెబితే కన్విన్స్ అవుతాడో ఆలోచిస్తోంది. ‘‘కానీ,,. ఏంటీ?’ అన్నాడు అసహనంగా. అతనెక్కువగా అలాగే వుంటాడు. మెల్లగా అతని భుజంపై తలపెట్టి, చేతిపై వేలితో తడుముతూ ప్రేమగా, మార్థవంగా
‘‘ ఏమండీ? నేను నిద్రమత్తులో మిాతో సరిగా సహకరించనని, పిచ్చి మొద్దునని మిారు నన్ను విసుక్కోవటం కరెక్టే! అందుకే మనకి పిల్లలు పుట్టటం, లేదట ఆ రహస్యాన్ని ఇప్పుడే డాక్టర్‌గారు నాతో చెప్పారు. మిారునాతో హాస్పిటల్‌కి వచ్చి ఐ.వి.ఎఫ్. కి సహకరిస్తేచాలన్నారు. అన్ని విషయాలు డాక్టర్ గారు మిాతో మాట్లాడతానన్నారు.’’ అంది స్నేహిత. భువనేష్ చిరాగ్గా చూస్తూ ‘‘నీకు ఎప్పుడూ ఇదే గోలనా? మరిచిపోవా దీన్ని?’’ అన్నాడు ఇలాంటి అంశంపై చర్చ అతనికి నచ్చదు. అతను చిన్న వయసు నుండి కొన్ని ప్రత్యేకమైన పద్దతుల్లో తన జీవితాన్ని నడుపుకుంటూవస్తున్నాడు… సినిమాలు చూసి, బయట ఎంజాయ్ చేసి, సెక్స్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు ` జవాబుల్లాంటివి చదివి, ఫ్రెండ్స్ చెప్పే సొల్లు కబుర్లు విని టైం వేస్ట్ చేసుకోకుండా ఓ చోట కూర్చుని ఐ.ఎ.యస్.కి చదువుతున్నట్లే చదివేవాడు… మంచి చదువు చదవాలి. మంచి వుద్యోగం చెయ్యాలి. తరతరాలకు సరిపోయ్యేంతగా డబ్బు సంపాయించాలి. ఇదే అతని ధ్యేయం. ఇది తప్ప ఇంకేం చెప్పినా సీరియస్‌గా పట్టించుకోడు…
‘‘…లోకం దృష్టిలో మిారు ఓ.కె. నేనే గొడ్రాలిని. మరిదాన్ని పోగొట్టుకోవాలి. పిల్లల్ని కనాలి. నాకు మాత్రం తల్లిని కావాలని వుండదా? అర్థం చేసుకోండి!’’ అంది స్నేహిత. ‘‘సరే ! హాస్పిటల్‌కి వెళ్దాంలే!’’ అన్నాడు వరం ఇస్తున్న దేవుడిలా. స్నేహిత ‘హమ్మయ్యా’ అనుకొంది…. రెండు రోజుల తర్వాత ఆదిత్య హైదరాబాద్ వచ్చి డాక్టర్ని కలిశాడు. వైద్య పరీక్షల అనంతరం అతను అన్ని విధాల అర్హుడని రిపోర్ట్స్ రావటంలో స్టోరేజ్ బ్యాంక్‌లో వీర్యం ఇచ్చి వెళ్లిపోయాడు. మూడు రోజులు గడిచాక. డాక్టర్ గారు స్నేహితకి ఫోన్ చేసి విషయం చెప్పి ‘‘నీ భర్తను హాస్పిటల్‌కి తీసుకురా స్నేహితా!’’ అంటూ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. భువనేష్‌ని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లింది స్నేహిత. భువనేష్‌ని డాక్టర్‌గారి రూంలో కూర్చోబెట్టి, స్నేహితను ఎగ్జామినేషన్ రూంకి తీసికెళ్లి ఎంబ్రియోను స్నేహిత గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫ్లాంటేషన్ చేసింది డాక్టర్. ఒక గంటరెస్ట్ తీసుకోమని స్నేహితను అక్కడే పడుకోబెట్టింది. ఈలోపల డాక్టర్ గారు భువనేష్‌తో ‘‘డైరెక్ట్‌గా పిల్లలు పుట్టే చాన్సెస్ తక్కువగా వున్నాయి మిాకు. అందుకే ఈ ప్రాసెస్‌ను యూజ్ చేస్తున్నాము.’’ అని అనగానే అతనికి వాళ్లు ఆ రోజు తన దగ్గర ఎనాలసిస్ కోసం సెమెన్ తీసుకోవటం గుర్తొచ్చి ‘‘ఇట్స్ ఓ.కె.’’ అన్నాడు.
‘‘స్నేహితను ఈ రోజు నుండి జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆహారం ఇవ్వాలి. ఎక్సర్‌సైజులు చేయించాలి. రెగ్యులర్‌గా హాస్పిటల్ చెకప్‌కి తీసుకురావాలి. దూర ప్రయాణాలు చెయ్యొద్దు.’’ అని చెప్పింది డాక్టర్. అతను ‘‘అలాగే’’ అన్నాడు. ఓ గంట తర్వాత స్నేహితను తీసుకొని తన కారులో ఇంటికెళ్లాడు భువనేష్. తల్లితో చెప్పాడు. ఆమె సంతోషించింది. ఇంట్లో అందరు ఆ క్షణం నుండి ‘‘స్నేహితను పువ్వులా చూసుకోవాలి’’ అని ఎవరికి వాళ్లే మనసులో అనుకున్నారు. రోజులు సంధించిన బాణంలా దూసుకుపోతున్నాయి. హేమేంద్ర సరైన టైంలో సరైన కృషి చేసి తనకున్న ఒకే ఒక్క మందుల షాపును అభివృద్ధిలోకి తెచ్చుకున్నాడు. దాన్ని ఆధారం చేసుకొని వరంగల్ ఏరియాలోనే ఇంకో రెండు బ్రాంచీలను ఓపెన్ చేసుకున్నాడు. అవి వేర్వేరు ప్రాంతాల్లో వుంటాయి. వాటిలో మంచి కెమిస్ట్రీలను పెట్టాడు.
తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశాడు. తను షాపు పెట్టేటప్పుడు అమ్మిన పొలాన్ని తిరిగి కొని తండ్రికి ఇచ్చాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ఆ పొలాన్ని పండిరచుకుంటూ అదే పల్లెటూరులో వుంటున్నారు. ఈ మధ్యన వాళ్లకి వయసు పెరగటం వల్ల పొలం వెళ్లలేక, పైకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు…. ‘చివరి దశలో అదే మాకు ఆధారమన్నారు. అదే మాటపై వుండండి’ అన్నట్లు హేమేంద్ర తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు.
spring league football tryouts, carolina hurricanes mascot seizure, bloody accidents caught on camera, frances glessner lee dollhouses solutions, does an … Continue reading →
ఆమె ముఖారవిందం నా ముందు ఒక గ్రంధమైంది దాన్నెంతో అందంగా నా చేత చదివించింది -బషీర్ బద్ర్ మోసం చేసి తాగించాను ముల్లాకి రెండు గుక్కలు మునుపు … Continue reading →
నైజీరియా దేశం లోని ప్లాటువా రాష్ట్రం ప్లాటువాలో లూయీస్ ఆబా 29-4-1980 న జన్మించింది .ఆమె ది కుకుం గ్రీడ కగారో కుటుంబం .చిన్న తనంలోనే పోలియో … Continue reading →
ఊహతెలిసినప్పటి నుండి తనని ‘అది’ ‘దాన్ని’ అంటూ వస్తువాచకంగా తప్ప మనిషిగా చూడరెందుకు అంటూ ఒక ప్రశ్న ! అభిప్రాయం చెబుతుంటే ఆరిందానిలా మాట్లాడకు అంటుంటే అవమానంలోనుంచి … Continue reading →
వరిమడిలో నాట్లు వేసేవేళ… పంటను కోత కోసే వేళ… ఒక చేతితో ముంగురులను వెనక్కి తోస్తూ… స్వేదపు చినుకులలో తడుస్తూ… శ్రద్ధతో పని చేసే శ్రామిక స్త్రీ … Continue reading →
spring league football tryouts, carolina hurricanes mascot seizure, bloody accidents caught on camera, frances glessner lee dollhouses solutions, does an … Continue reading →
ఆమె ముఖారవిందం నా ముందు ఒక గ్రంధమైంది దాన్నెంతో అందంగా నా చేత చదివించింది -బషీర్ బద్ర్ మోసం చేసి తాగించాను ముల్లాకి రెండు గుక్కలు మునుపు … Continue reading →
నైజీరియా దేశం లోని ప్లాటువా రాష్ట్రం ప్లాటువాలో లూయీస్ ఆబా 29-4-1980 న జన్మించింది .ఆమె ది కుకుం గ్రీడ కగారో కుటుంబం .చిన్న తనంలోనే పోలియో … Continue reading →
ఊహతెలిసినప్పటి నుండి తనని ‘అది’ ‘దాన్ని’ అంటూ వస్తువాచకంగా తప్ప మనిషిగా చూడరెందుకు అంటూ ఒక ప్రశ్న ! అభిప్రాయం చెబుతుంటే ఆరిందానిలా మాట్లాడకు అంటుంటే అవమానంలోనుంచి … Continue reading →
వరిమడిలో నాట్లు వేసేవేళ… పంటను కోత కోసే వేళ… ఒక చేతితో ముంగురులను వెనక్కి తోస్తూ… స్వేదపు చినుకులలో తడుస్తూ… శ్రద్ధతో పని చేసే శ్రామిక స్త్రీ … Continue reading →