బోయ్‌ ఫ్రెండ్‌

001ప్రయాణం మర్నాటి ఉదయానికి నిర్ణయమరుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ సర్దుకోవడంలో లీనమరుపోయారు. చైతన్య ముఖ్యంగా మరిచిపోనిది కెమెరా. ఆ సంధ్యా సమయంలో చల్లగా వీచే గాలుల మధ్యగా వైజాగ్‌కి కొన్ని మైళ్ళ దూరాన, చింతపల్లి కెళ్ళే కొండ మార్గాన ‘ఎంబాసిడర్‌’ కారు మెత్తగా దూసుకుపోతోంది. దట్టమైన అరణ్యాలు లోయల మధ్యగా అందమైన అమ్మారు నడకలా వయ్యారంగా మెలికలు తిరిగిపోతోంది తారురోడ్డు. డ్రైవరు సీటులో ప్రసాదరావు ఫ్రెండ్‌ డాక్టర్‌ యదునందన్‌, అతని ఒడిలో ప్రసాదరావు, నిర్మలల కలలపంట మురళి కూర్చున్నాడు. ఆడవాళ్ళు ముగ్గురూ వెనక సీట్లో కూర్చున్నారు. మొదట నిర్మల వైజాగ్‌లో వుండిపోతానంది. కానీ అందుకు కృష్ణ ఏ మాత్రం ఒప్పుకోనందువల్ల ఆమెకు వీళ్ళతో రాక తప్పలేదు. వెనక సీట్లో తలుపు ప్రక్కగా కూర్చున్న కృష్ణ చూపులన్నీ తమను దాటుకుపోతున్న అందమైన ప్రకృతి మిద వున్నారు.

పొగడపూల పరిమళంతో పారిజాతాల సౌరభంతో విలక్షణమైన అడవిపూల సువాసనలతో సర్వం మరచిపోరు, క్రొత్త లోకాలు సృష్టించుకుని అందులోకి పాదం మోపింది కృష్ణ. ఎక్కడో దూరాన కోకిల స్వరం… మామిడి చిగుళ్ళు మెత్తగా మెక్కి మత్తుగా కూసిన మనోహరమైన స్వరం.’ప్రకృతికి దూరంగా బ్రతుకుతూ జీవితంలో ఎంత వికాసాన్ని పోగొట్టుకున్నాము!’ ఆనందంతో భావావేశంతో చెమ్మగిల్లిన ఆమె కళ్ళకెదురుగా చిక్కగా మల్బరీ చెట్లు, అడవి చీపురు మొక్కలు, అందమైన అడవిపూల తీగలు కదలిపోతున్నారు.దూరాన ఒళ్ళంతా ఎఱ్ఱటి చిగురు టాకులతో ముగ్థమనోహరంగా వున్న మామిడి చెట్టును తనివితీరా చూస్తున్న కృష్ణ ఉలిక్కిపడింది.

”చలిగా వుంది. కాస్త అద్దం పైకెత్తేయరూ!” మృదువైన అరుణ కంఠస్వరానికి విస్తుపోరుంది కృష్ణ. ”సువాసనాపూరితమైన ఈ సంధ్యా గాలులు ఈమెకు చలిగా మాత్రమే వున్నాయా?’లోభనీయమైన గాలుల నుండి దూరమైపోవడానికి ఇష్టం లేకపోరునా, అరుణ మనసు బాధపెట్టడం ఇష్టంలేక గ్లాసు ఎత్తేసింది కృష్ణ. ప్రసాదరావు కొద్దిగా మెడ త్రిప్పి అన్నాడు.  ”సీలేరులో ఏముంది అరుణా చూడడానికి? చూడాల్సిందల్లా ఇక్కడే వుంది. అడవిపూల వాసనలు సీలేరులో కావాలన్నా దొరకవు. ”అరుణ జవాబేం చెప్పలేదు. కళ్ళు మూసుకుని సీటు కానుకుని పడుకుంది. ”మనం ఇప్పుడు వెళ్తున్న మార్గమంతా బ్రిటిష్‌ ప్రభుత్వకాలంలో అల్లూరి సీతారామరాజును పట్టుకోడానికి వేసిన మార్గం.”

”అంటే?” అన్నట్టు తనవైపు తిరిగిన చైతన్య ప్రశ్నార్థకపు చూపులకు జవాబుగా ప్రసాదరావుగారు చెప్పసాగారు.
”ఆ కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వాళ్ళలో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఏ మంత్ర శక్తులు లేని అతనిలో ఎంతశక్తో! ఒక్కక్షణం ఇక్కడుంటె మరోక్షణం మరోచోట వుండేవారట. ఆయన ఎక్కువగా చింతపల్లి కొండ ప్రాంతాలలో కాలిబాటన తిరిగేవారట. ఆయన్ని పట్టుకోవడానికి ‘స్పెషల్‌’గా పోలీసుల సౌకర్యార్ధం బ్రిటిష్‌ వాళ్ళు నిర్మించిన రోడ్డు ఇది.” ఒక్క మనిషిని పట్టుకోవడానికి ఎంత శ్రమ తీసుకున్నారు! అంత డబ్బు వ్యయపరిచారా!! మారుమూల అడవి ప్రాంతంలో కూర్చుని బ్రిటిషు ప్రభుత్వాన్నే గజగజలాడించిన అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వం ఎంత గొప్పది!’ అలా ఆలోచిస్తున్న కృష్ణ మేధస్సులో మారుమూల వార్ధాలో వెదురు పుల్లల కుటీరంలో కూర్చుని బోసినవ్వులు చిందిస్తూ ఆంగ్లేయులకు సింహస్వప్నమైన పూజ్య బాపూజీ మెదిలారు. వాళ్ళిద్దరికీ మనస్సులోనే నమస్కరించకుండా వుండలేకపోరుంది కృష్ణ. 

ఉన్నట్టుండి కారు ఆపాడు ప్రసాదరావు. ”ఇక్కడ వాగు వుంది. ఆ నీళ్ళు చాల చల్లగా వుంటారు. వెళ్ళిచూసి రండి”
కారులో నుండి దిగిన కృష్ణకు ఆ వాగును ఒక్కక్షణం చూచి కదిలి వెళ్ళిపోవాలనిపించలేదు. ”మిరూ రండి బాబాయ్‌. కాసేపు అక్కడ కూర్చుందాము.” తమతో తెచ్చుకున్న బెడ్‌షీట్సు, తినుబండారాలు తీసుకుని వెళ్ళి వాగు ప్రక్కగా మామిడి చెట్టు క్రిందగా, చల్లని గాలుల మధ్యగా కూర్చున్నారు. అరుణ ఎవ్వరితో కలవకుండా ఒక మూల వెళ్ళి బెరుగ్గా మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని కూర్చుంది. ఆమెకు కాస్త దూరంలో ప్రసాదరావు నిర్మల కూర్చున్నారు. భానుమూర్తి మురళితో కబుర్లలోకి దిగిపోయాడు. కృష్ణ చైతన్య చేపలు పట్టే సరదాలో పడిపోయాడు. అరుణకెదురుగా దూరాన వాగులో ఒక చిన్న బండ మిద కూర్చుని నీళ్ళను చెల్లాచెదురు చేస్తోంది కృష్ణ. ఆ అందమైన ప్రకృతి మధ్య ఆకుపచ్చని చీరలో వనకన్యలా వున్న అరుణను తదేకంగా చూస్తోంది కృష్ణ.
మహాశిల్పి ప్రత్యేకంగా, తీరిగ్గా మలచిన శిల్పంలా వుంది ఆమె. తెల్లటి శరీరఛాయ, నునుపైన చర్మం, శ్రద్ధగా గంటల తరబడి ఒక్కొక్క అణువునే పరిశీలనగా దిద్దిన ముఖం, సోగదేరిన పెద్ద కళ్ళు, నల్లగా మెరిసే కనుపాపలు, దట్టమైన కనురెప్పలు, ధనస్సులా వంగిన సన్నటి కనుబొమ్మలు, కోటేరేసినట్టున్న ముక్కు, చిన్న నోరు, మామిడి చిగురు రంగు పెదాలు, నవ్వితే అందంగా సొట్టలు పడే బుగ్గలు, చక్కని పలువరసలు, ముంగురులను మాటి మాటికి ముద్దులాడే ముచ్చటైన నుదురు, బ్రష్‌లాగా ఒత్తుగా పొట్టి జడ, తీర్చిదిద్దినట్టున్న వంపులు తిరిగిన శరీర సౌష్టవం.

నడకలో ప్రతి ఒక్క భాగంలోనూ ఆమె అందం పొర్లిపోతోంది. పరిశీలిస్తున్న కృష్ణ మనసులో అనుకుంది.
అదే సమయంలో బాగా ఎత్తుగా, ఎత్తుకు తగ్గ లావుతో చామనఛాయ కంటె ఒక ఛాయ తక్కువైన శరీర ఛాయతో, మెరిసే కళ్ళతో, సదానవ్వే పెదాలతో, మన్ననగా మాట్లాడే పెదవి కదలికలో చిలిపిగా ఆదరంగానూ కూడా చూడ గలిగే కళ్ళతో ఉత్తేజంతో ఉత్సాహంతో గలగలపారే- గోదారిలాటి కృష్ణను చూచి కించిత్‌ అసూయ చెందింది అరుణ.
ప్రకృతిలో ప్రకృతిగా కూర్చున్న అరుణను ఆరాధనగా చూస్తున్న కృష్ణ తన ప్రక్కనే పడ్డ నీడను చూచి ఉలిక్కిపడింది. ”చూచారా ఈ చేప ఎంత బాగుందో ! ఒక చిన్న చేపపిల్లను అరచేతిలో వుంచుకుని, దాన్నే పరిశీలిస్తూ అన్నాడు చైతన్య. ”అబ్బ ఎంత అందంగా వుందో !” ఆ రంగురంగుల చేపను అతని చేతుల్లోనుండి తీసుకుంటూ అంది. ఆ చేపను తన్మయత్వంతో చూస్తున్న కృష్ణను కళ్ళార్పకుండా చూస్తూ నిల్చున్నాడు చైతన్య. కొద్ది సేపయ్యాక అతని చేప పిల్లను తిరిగి ఇచ్చేస్తూ తలెత్తిన కృష్ణ అతని చూపులు వాడిగా అర్థవంతంగా కన్పించడంతో కళ్ళు వాల్చేసుకుంది.

”థాంక్స్‌” చేపను అందుకుంటూ అన్నాడతను. ”అదేమిటి? థాంక్సెందుకు?” ”మిరు దాన్ని ఇస్తారో లేదో అని ఈ ఐదు నిముషాలు తెగ గాభరా పడిపోయాను నేను. మి తీరు చూస్తే అలా వుంది.” అతను చెప్పిన మాటలకంటె చెప్పేతీరుకు నవ్వొచ్చింది కృష్ణకు. ”మికభ్యంతరం లేకపోతే మి ఈ ఫోజులో ఒక స్నాప్‌ తీసుకుంటాను” అలా అనేసి ఆమె కళ్ళల్లోకి ప్రాథేయపూర్వకంగా చూసాడు. అతని స్వరానికి కొద్దిగా చలించినా వెంటనే సర్దుకుని నవ్వేసింది కృష్ణ. ”అభ్యంతరమేమి లేదుగాని, అసలే చీకటి పడబోతోంది. నేనా శ్రీకృష్ణుని తోబుట్టువుని. ఆ చీకటిలో ఈ చీకటి పడదు. మి ఫిల్మ్‌ వేస్టయ్యే ప్రమాదం వుంది.” ”పాడవదు. నాకా నమ్మకముంది” అని అతను కెమెరా సర్దుకునే లోపలే వాగుదాటి మనష్యుల్లో కలిసిపోరుందామె. మురళితో నీళ్ళు విసురుకుంటూ ఆడుకుంటున్న భానుకు దూరాన ఒంటరిగా కాళ్ళు ముడుచుకుని కూర్చొనున్న అరుణను చూస్తే సానుభూతి కలిగింది. తన పెదనాన్న కొడుకు ప్రసాద్‌, వదిన నిర్మల తప్ప ఆమె కిందులో మరెవ్వరూ తెలియదు. చప్పున స్నేహం కలుపుకునే అమ్మారులా లేదు అనుకుంటూ మురళితో పాటు ఆమెకు కొద్ది దూరంలో వచ్చి కూర్చుంటూ అన్నాడు- ”మా రాకవల్ల ఈ ప్రయాణం మికు విసుగ్గా లేదు కదా !”

లేదన్నట్టు తలూపింది. భానుమూర్తి పలకరింపుతో ఆమె కళ్ళు ఉత్సాహాన్ని తేజస్సును నింపుకున్నారు. ఆమెను మాటల్లోకి దింపుతూ అన్నాడు భానుమూర్తి, ”ఇంటర్‌ అయ్యాక ఏం చేస్తారు?” ”పాసవ్వాలి కదా !” కళ్ళు దించుకునే జవాబిచ్చిందామె. ”పాసరుతే…” అని సన్నగా నవ్వాడు భానుమూర్తి. గలగల మాట్లాడే అందమైన చైతన్య కంటె మురళితో కబుర్లు చెప్పుకుంటూ తన లోకంలో తనున్న భానుమూర్తి అంటె అరుణకు ఆకర్షణ కలిగింది. అతని నవ్వును చూడాలనే ప్రలోభాన్ని చంపుకోలేక తలెత్తిన అరుణ భానుమూర్తి కూడా ఆమె వైపే చూస్తుండడంతో గాభరాగా కళ్ళు దించేసుకుంది. ”మిరు జవాబు చెప్పనే లేదు.”

ఆమెకు అతనితో మాటలు కలపాలనే వుంది. కానీ సిగ్గుతోనూ భయంతోనూ ఆమె చెప్పలేకపోతోంది. తను వచ్చి ఆమెను మరీ ఇబ్బంది పెడ్తున్నాడేమో అనుకుని అక్కడ నుండి లేచి ప్రసాదరావు ప్రక్కగా వచ్చి కూర్చున్నాడు . అరుణ ముఖం చిన్నబోవడం అతను గమనించలేదు. ”ఈ వాగు శబ్దానికి లయగా ఎవరైనా పాటపాడితే బాగుణ్ణు” తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్న కృష్ణకు జవాబుగా చైతన్య అన్నాడు. ”మిరు పాడండి వింటాము.”
”వినగలరా?” అంటూ పకపక నవ్వింది కృష్ణ. ”అరుణ బాగా పాడ్తుంది.” అంతవరకు మౌనంగా, చిరునవ్వుతో చూస్తున్న నిర్మల చెప్పింది. ”అహ నా చేతకాదు” అరుణ సిగ్గుపడింది. మొదట సిగ్గుపడినా, అందరి బలవంతం మిద బాగా బ్రతిమలాడించుకుని ఒక భావగీతం పాడింది.

”పాడకే నారాణి పాడకే పాట
పాట మాధుర్యాన ప్రాణాలు సులిగేనే…
రాగ మాలాపించి, వాగులా ప్రవహించి
తుది తుట్టు గీతాల నులిగి పోనీయకే…
కల్హార ముకుళములు కదలినవి పెదవులు.
ప్రణయ పధమంతాన బంధించి జీవము…
శృతిలేని నా మదికి, చతుర గీతాలేల?
గతిరాని పాదాల గతుల సోద్యమ్మాటే- పాడకే నారాణి…
పాట సాగిపోతోంది. సుతారంగా, మధురంగా వింటున్న శ్రోతలు పాట అరుపోవడంతో ఉలిక్కిపడ్డారు.
చాలా బాగా పాడారు. మమ్మల్ని మరో ప్రపంచంలోకి లాగేసారు. భానుమూర్తి ప్రశంశతో ఆమె కళ్ళు మొదటి మారుగా మెరిసారు. ఆమె పెదాలు, సంతోషాన్ని బలవంతంగా దాచుకున్నారు. ”చాలా భావయుక్తంగా వుంది. ఆ భావానికి మి గొంతు సరిగ్గా సరిపోరుంది.” అని రచరుతను, గాయకురాలినీ కూడా మెచ్చుకుంది కృష్ణ. ”ఇంత బాగా పాడగలిగీ, అంతసేపు బ్రతిమలాడించుకున్నారేం? నన్ను అడగలేదు కాని మికన్న బాగా పాడేద్దును కదన్నయ్యా ! చైతన్య హాస్యానికి భానుమూర్తి నవ్వేసాడు.

”ఒకటి పాడండి. మా అరుణ లాగ పాడగలిగిందీ లేందీ మేము జడ్జ్‌ చేస్తాం.” అంది కృష్ణ. ముందుకు వంగి, కృష్ణ ముఖానికి దగ్గరగా వచ్చి తగ్గు స్వరాన అన్నాడు చైతన్య. ”ఇప్పుడు కాదు. ఏదో ఒకరోజు మికు మాత్రమే విన్పిస్తాను.” కృష్ణలో రక్తం ఒక్కక్షణం గడ్డ కట్టుకుని, వెంటనే వేగంగా ప్రవహించ నారంభించింది.

(ఇంకా ఉంది )

– డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

36
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో