జాతస్య మరణం ధృవమ్!!!

కృష్ణ వేణి

కృష్ణ వేణి

పుట్టిన ప్రతీ మనిషీ మరణించక తప్పదు. కానీ ఆ మరణం ఎవరి చేతుల్లో ఉండాలి? మనని సృష్టించిన దేవుని చేతుల్లోనా లేకపోతే మనం దాన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చా/తీసుకోగలమా? మూడు నెల్ల కిందట మరణించిన బ్రిటనీ మేనార్డ్ కాలిఫోర్నియాలో జన్మించింది. 2014 లో ఆమెకి కాన్సర్ ఉందన్న సంగతి బయటపడింది. బ్రిటనీ ఆరునెల్లకన్నా ఎక్కువ బతకదని ధృవీకరించేరు డాక్టర్లు. ఆమెకి జీవించాలన్న కోరిక ఉన్నా, విధి లేక నవంబర్ 1న, 2014 లో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన నిద్రమాత్రలు మింగి, తన 29 సంవత్సరాన్న తన జీవితాన్ని అంతం చేసుకుంది. ఆ సమయాన్న ఆమె కుటుంబం, ఆమె స్నేహితులూ అందరూ ఆమె చుట్టూ ఉన్నారప్పుడు. బ్రిటనీ మైనార్డ్ అనుభవించినది డెత్ విత్ డిగ్నిటీ(గౌరవ మరణం). తమకి సంభవించబోయే మరణం అతి బాధాకరమైనదని తెలిసిన రోగులకి తమ ప్రాణాలని తామే తీసుకునే అవకాశాన్ని కలిపిస్తుంది ఈ చట్టం. ఈ వెసులుబాటు అమెరికాలో ఆరెగాన్, వాషింగ్టన్ మరియు వెర్మాంట్ రాష్ట్రాలలో మట్టుకే ఉంది. కానీ రోగి తన ప్రాణాలు తానే తీసుకోవాలి. ఇంకెవరూ మందులు కలిపిచ్చి సహాయపడే ఆస్కారం ఉండదు. తన మరణానికి వారాలముందు బ్రిటనీ “మరణించే హక్కు” కోసం పోరాడి తన తరంవారిలో జాగృతిని కలిపించి తనవంటి ఇతరులకోసమని ఒక ఫండ్ స్థాపించింది.
4

యుథెనేషియా(మంచి మరణం) అంటే-పడే నొప్పినీ, బాధనీ బుద్ధిపూర్వకంగా అంతం చేస్తూ, స్వాధీనం కాని వ్యాధినుంచి ఉపశమనం కలిగించేలా జీవితాన్ని అంతం చేయడం. రోగి అభ్యర్థనని పాటిస్తూ డాక్టర్లు రోగి జీవితాన్ని అంతం చేసే వీలుంటుంది. యుథెనేషియాలో రెండు రకాలు. ఐచ్ఛికమైనది, ఐచ్ఛికమైనది కానిది. ఐచ్చికమైన యుథెనేషియాని కొన్ని దేశాల్లో చట్టబద్ధం చేసేరు.

దీనికి విరుద్ధంగా ఉన్న అరుణా షౌన్‌బాగ్ కేసుని చూద్దాం. అరుణా రామచంద్రా షాన్‌బౌగ్ ముంబైలో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పని చేసేది. 1973లో నవెంబర్ 27 సాయంత్రాన్న ఆమెమీద హాస్పిటల్లో పని చేసే ఒక వార్డ్‌బోయ్ దాడి చేసి కుక్కల గొలుసుని ఆమె మెడచుట్టూ వేసి ఆమెని సొడొమైస్ చేసేడు. దానివల్ల ఆమె మెదడుకి సరఫరా కావలిసిన రక్తం ఆగిపోయింది. 37 సంవత్సరాలు గడిచేయి. ఆమెకి 60 ఏళ్ళు వచ్చేక 2011లో ఆమె జర్నలిస్ట్ స్నేహితురాలైన పింకీ విరానీ, అరుణకోసం అభ్యర్థించిన కారుణ్య మరణపు అభ్యర్థనని సుప్రీమ్ కోర్ట్ మొదట నిరాకరించింది. తరువాత కోర్ట్ ఇచ్చిన తీర్పు ఈ విధంగా ఉంది.
“ఈమెకి 60 సంవత్సరాలు. పక్షి ఈకకన్నా తక్కువ బరువున్నది. పెళుసుగా ఉన్న ఆమె ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది. ఆమె మెన్స్ట్రుయేటింగ్ సైకిల్స్ ఆగిపోయేయి. ఆమె చర్మం అస్థిపంజరం మీద సాగతీసి పెట్టిన కాగితం గుజ్జులా తయారయింది. ఆమె మణికట్లు లోపలకి తిరిగి ఉన్నాయి. పళ్ళు పుచ్చిపోయేయి. శవంకన్నా భిన్నంగా ఏమీ లేదామె పరిస్థితి. ఆమెకి చూపు ఆనదు, వినలేదు, మాట్లాడలేదు. ఆమె మలమూత్రాలన్నీ మంచంమీదే. ఏ కొలమానంతోనైనా కానీ ఆమె ఊపిరిపీలుస్తూ జీవిస్తున్న మనిషి అని అనలేం. ఆమె నోట్లోకి వెళ్ళిన ఆహారపు గుజ్జు సహాయంతో మాత్రమే ఆమె ఊపిరి పీల్చుకుంటోంది. ఆమె పరిస్థితి మెరుగయే అవకాశాలేవీ లేవు. ఆమె శరీరం ముంబైలో కెయీఎమ్ హాస్పిటల్లో ఒక మృత జంతువులా 36 సంవత్సరాలుగా పడి ఉంది.”
ఆమెకి చికిత్స చేస్తున్న డాక్టర్లు మరియు ఆ ఆస్పత్రి డీన్, ఆమె బతికుండడానికి సహాయపడుతున్న వెంటిలేటర్ని, ఆహారాన్నీ ఆపివేసి ఆమె శాంతిగా మరణించేలా తగు చర్యలు తీసుకోదలచుకుంటే కనుక వారలా చేయడానికి అనుమతి ఉందనీ వారి చర్యలు చట్టవిరుద్ధమైనవిగా పరిగణించబడవనీ సుప్రీమ్ కోర్ట్ తీర్పిచ్చింది.
1

కారుణ్య మరణానికి ప్రతిపక్ష వాదనలూ, విరోధమైన వాదనలూ ఉన్నాయి. దీనికి అనుకూలంగా, కిందటి శతాబ్దంలోనే కొన్ని సంస్థలు నెలకొల్పబడ్డాయి. యుథెనేషియాని చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెథర్ లాండ్స్. ఇప్పుడు బెల్జియమ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ మరియు అమెరికాలో ఉన్న మూడు రాష్ట్రాలు కూడా.
కానీ ఇదెంతవరకు సమంజసం? పేషెంటు కోరుకున్నంత మాత్రాన్న చంపేయవచ్చా? ‘తీవ్రమైన బాధ’ అన్న మాటని నిర్వచించేది ఎవరు? పరీక్షల్లో తప్పడం, గర్ల్ ఫ్రెండ్/ బోయ్ ఫ్రెండ్ మోసం చేయడం, ఆర్థిక సమస్యలు, అత్తామామల ఆరడి- ఇవన్నీ కూడా భరించజాలనివే. ఆత్మహత్యకి పురిగొలిపే పరిస్థితులే. వాటి నెపంగా చావుని కోరుకున్నప్పుడు- కారుణ్య మరణం చట్టబద్ధం అయిన పరిస్థితిలో డబ్బు తీసుకుని ఎవరినైనా సులభంగా చంపేసే హక్కు డాక్టర్లకి ఉంటుంది.
7 మార్చిన, 2011లో భారతదేశంలో పాసివ్ యుథెనేషియాని చట్టబద్ధం చేసి యుథనేషియాపై తొలిసారి మార్గదర్శకాలు విడుదల చేసింది సుప్రీమ్ కోర్ట్. యాక్టివ్ యుథనేసియా, పాసివ్ యుథనేసియాపై స్పష్టమైన విభజన రేఖను గీసింది. అచేతనావస్థలో దీర్ఘకాలంగా ఉన్న రోగులకి ఇస్తున్న మందులూ, లైఫ్ సపోర్ట్ ఆపివేయడం-ఇదే మెర్సీకిల్లింగ్ లేక కారుణ్య మరణం.
కేరళాలో రిటైర్ అయిన ధామస్ తను ఎప్పుడు ఎలా మరణించాలో అని నిర్ణయించుకోవడం తన హక్కని హైకోర్టుకి అపీల్ చేసేరు. అలాగే అదే రాష్ట్రానికి చెందిన చిట్టిల పిళ్ళై కూడా చనిపోడానికి అనుమతి మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఆంధ్రదేశానికి చెందిన వెంకటేష్ డైస్ట్రోఫీతో బాధపడుతూ 2004లో తను చనిపోవడానికి అనుమతి కోరేరు. 2005లో పాట్నా హైకోర్టుని, ఆ రాష్ట్ర గవర్నర్‌ని, కోమాలో ఉన్న ఒక మహిళ, ఆమె భర్త, ఆమె కొడుకూ- కోమాలోంచి ఆమె తిరిగిరాని పరిస్థితి ఉండడంతో మెర్సీ కిల్లింగ్‌కి అనుమతి ఇవ్వాలంటూ కోరారు. కానీ వీరెవరి విషయంలోనూ అభ్యర్థన అంగీకరించబడలేదు.
జీవితమంతా ఎలా గడిచినా కానీ మరణం మట్టుకు డిగ్నిఫైడ్‌గా ఉండాలన్న ఆలోచనతో డిగ్నిటాస్ అనే సంస్థని స్విట్జర్లాండ్లో నెలకొలిపేరు. కానీ ఇది విమర్శలకి గురయింది. ఈ సంస్థ స్విట్జర్లాండ్‌ని సూసైడ్ టూరిజమ్ కేంద్రంగా మార్చిందన్న వాదాలు కూడా వున్నాయి. దాదాపు 7 వేల మంది సభ్యులు ఈ సంస్థ కింద పనిచేస్తున్నారు. 1998లో ఏర్పాటైన డిగ్నిటాస్, ఇంతవరకు దాదాపు 1800 కారుణ్య మరణాలకి సహాయం అందించింది.
స్కాట్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి దేశాలు యుథనేషియాను వ్యతిరేకిస్తాయి. డచ్ దేశంలో 2004వ సంవత్సరంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే వారి కోసం గ్రోనింజెన్ గైడ్-లైన్స్ జారీ అయ్యేయి . అయితే అనారోగ్యంగా పుడుతున్న పిల్లలను చంపేస్తున్నారన్న ఆరోపణలతో 2006లో అక్కడ కొత్త నియమాలని విధించేరు.
మన దేశంలో కూడా స్చచ్చంద మరణాల ప్రస్తావన వుంది. సబర్మతి ఆశ్రమంలో ఓ ఆవు జబ్బు పడి, వైద్యులు దాన్ని నయం చేయలేకపోవడంతో తన సమక్షంలోనే ఆవుకి పాయిజన్ ఇంజక్షన్ ఇప్పించేరు గాంధీజీ. తను కూడా ఆ ఆవువంటి పరిస్థితి ఎదురుకున్నప్పుడు తనకీ ఇదే వర్తించాలని వివరించేరు. ఆచార్య వినోబా భావే 1982లో అనారోగ్యానికి గురై, చివరి రోజుల్లో ఇంక వైద్యంకానీ ఆహారం కానీ తీసుకోకుండా మరణాన్ని ఆశ్రయించారు. శ్వేతాంబర జైనులు కూడా ఈ విధంగానే ప్రశాంత మరణాన్ని కోరుకున్న ఉదంతాలున్నాయి.
టోనీ నిక్లిన్సన్ అన్న 58 ఏళ్ల వ్యక్తి సంవత్సరాలుగా లాక్డ్-సిండ్రోమ్ అన్న వ్యాధితో బాధపడుతూ, పక్షవాతంతో కదలలేని పరిస్థితి వచ్చింది. ఇంక తన బతుకుకి అర్థం లేదనుకున్న టోనీ ఎవరైనా వైద్యుడు తన్ని న్యాయబద్ధంగా చంపగల అనుమతిని కోరుకుంటూ ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరం సాయంతో వాదించి కోర్టుని ఆశ్రయించారు. కానీ దీన్ని ఇంగ్లేండ్ వ్యతిరేకించింది. 2012లో తీర్పు వెలువడిన తరువాత తరువాత టోనీ మరణించేరు.
2
”నా అంతట నేను గానీ, రోగి కోరినా గానీ, మరెవరైనా సలహా ఇచ్చినా గానీ నేను ఎవరికీ ప్రాణాంతకమైన మందును ఇవ్వను” అన్న హిపోక్రిటికల్ ఓథ్ తీసుకుంటాడు ప్రతి వైద్యుడూ. క్రీస్తుకు పూర్వం 400 ఏళ్ల క్రితమే వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రటీస్‌ రూపొందించిన ప్రతిజ్ఞ ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు వారి బాధ్యతలను గుర్తుచేసే దిక్సూచి.
కారుణ్య మరణానికి అనుకూలమైన వాటికన్నా ప్రతికూలమైన వాదనలే ఎక్కువ ఉన్నాయి. మచ్చుకిః
*కారుణ్య మరణం అన్నది మానవజీవితం యొక్క పవిత్రత పట్ల సమాజానికి ఉన్న గౌరవాన్ని బలహీనపరుస్తుంది.*కారుణ్య మరణాన్ని అంగీకరించడం కొంతమంది జీవితాలకి (అశక్తుల లేక బలహీనుల) తక్కువ విలువని ఆపాదించడం.*కారుణ్య మరణాన్ని అనుమతించడం వల్ల దీర్ఘరోగాలకి కొత్త చికిత్స కనిపెట్టడం తక్కువ అవుతుంది.*మరణించబోయే రోగులకి మంచి చికిత్స అందించడం అన్న డాక్టర్ల ప్రేరణని తగ్గిస్తుంది.*స్వార్థపూరిత కుటుంబాలు వయస్సులో పెద్దవారైన రోగుల మీద డబ్బుకోసం ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది.*ఇది డాక్టర్ల చేతుల్లో ఎక్కువ అధికారాన్ని పెడుతుంది.*కారుణ్య మరణం దేవుని సృష్టికి వ్యతిరేకమైనది.*ప్రతి మనిషీ దేవుని సృష్టే కనుక మన జీవితాలని ఏమి చేసుకోవాలన్నా మనకి అధికారం ఉండకూడదు.*అది దేవుడిని అవమానపరచడం.*ప్రాణం పోయలేని మనిషికి ప్రాణం తీసే హక్కు కూడా ఉండకూడదు.
ఇలాంటి వాదాలెన్నో ఉన్నాకానీ ఆధునిక జీవితాల్లో, ప్రస్థుత ఆర్ధిక పరిస్థుతుల్లో, దీర్ఘకాలంగా బాధని అనుభవిస్తున్న కేసుల్లో దేవునిమీదే భారం వేసి, ఏమీ చేయకుండా వదిలేయగలమా!మందులు మింగి మనం రోగాలని అదుపులో పెట్టుకోవడం లేదా? అందరికీ బ్రిటనీలా అంత పెద్ద నిర్ణయం త్రీసుకునే ధైర్యం ఉంటుందా?
ఎలాగైతే ప్రతీ జీవితం భిన్నమైనదో అలాగే ప్రతీ నిర్ణయమూ కూడా భిన్నమైనదే కదా!

-కృష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

4 Responses to జాతస్య మరణం ధృవమ్!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో