వాస్తవాలను వెళ్లగక్కిన “ కొండచిలువ”

వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన శాంతినారాయణ . తిరుపతి ఓరియంటల్ కళాశాలలో విద్యను అభ్యసించి తెలుగు పండితునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు . 1970 అష్టావధానాలు చేయడం మొదలైన ఆయన సాహిత్య ప్రయాణం కవితలు ,కథలు , నవలలు ప్రక్రియలలో రచనలు చేస్తూ సంపుటాలను వెలువరించారు . ఆయన ఏ ప్రక్రియలో రచనలు చేసిన వాటిని చదువుతుంటే ఆనంతపురం జిల్లాలోని మారుమూల పల్లెల వాసన మనసును తట్టి లేపుతుంది .చదివే చదువరుని ముందు ఆ పల్లె వాతావరణాన్ని దృశ్య కావ్యంలో సంభాషణలు , యాస తో కళ్ళ ముందు నిలుపుతుంది .

ఈ సంవత్సరం వెలువరించి కథానిక సంపుటి “ కొండ చిలువ” . ఈ సంపుటిలో పది కథానికలున్నాయి . ‘ బ్రతుకు వేదం’తో మొదలైన కథానికలు ‘కేసు వాయిదా పడింది’ చివరి కథానిక .బస్ స్టాప్ లో సోడాలు అమ్ముకుంటూ తిరిగే చిన్న పిల్లల కథే బ్రతుకు వేదం . రకరకాల మనస్తత్వాల వాళ్లు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు . వారి ఆలోచన ధోరణికి , ఆ పిల్లవాడి మీద ఆ ప్రయాణికుల తీరుని వ్యక్తం చేసే కథే ఇది . పట్టణ వాసుల జీవన విధానానికి , పల్లె ప్రజల ఆలోచనలకి ఈ కథ అద్దం పడుతుంది . ఆరోగ్యం కోసం , జాగింగ్ పేరుతో ఇంట్లో ఏ పని పట్టించుకోని వ్యక్తులకు , పల్లె వాసులకు కథయే “శ్రమ రస యోగం” .

ఈ కథ చదివితే ఓడలు బళ్లవుతాయి , బండ్లు ఓడలయితాయి అన్న సామెత గుర్తుకు వస్తుంది . ఈ కథ మొత్తం ఉత్తమ పురుషలోనే సాగుతుంది . ఎంతటి వారైనా కాలానికి అతీతం కాదని నిరూపించే కథే ‘కాలాధీనులు’ . అనుకోకుండా మిత్రులతో కలిసి విశాంధ్ర బుక్ స్టాల్ లో మాట్లాడుతున్న తనకి ఒక వ్యక్తి వచ్చి పది రూపాయలు ఇమ్మని అడగడం , అతనిని ఎక్కడో చూసినట్లు అనిపించి , అసలు విషయం తెలుసుకుని ఎవరు కాలానికి ఆధీనులు కారని తెలుసుకుంటాడు . అసలు కన్పించిన వ్యక్తి ఎవరు అనేది కథ చదివితే మీకే అర్ధమవుతుంది .
పిల్లల్ని కనగలము కాని , వారి రాతల్ని కాదు అంటారు . అలాగే వారి ప్రవర్తన చేయి దాటిపోయినప్పుడు తల్లిదండ్రులు పడే వేదన అంతా ఇంతా కాదు . కాని తల్లిదండ్రుల ఆశయాలను గౌరవించే పిల్లలు అక్కడక్కడ ఉంటారు . అలాంటి వారిని చూస్తుంటే ఎడారిలో “ ఒయాసిస్సు” లాంటి అనుభూతి కలుగుతుంది .ఇక కొండ చిలువ కథ అనంతపురం కరువుకి ప్రత్యక్ష నిదర్శనం . రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న రైతులు , చివరకి బహుళ జాతి కంపెనీలలో కూలీలుగా మారిన వైనం ఈ కథలో కన్పిస్తుంది .

ఆనంతపురానికి చుట్టూ ప్రక్కలున్న మిగతా పల్లెల మాదిరే కక్కలపల్లి కూడా . ఈ మధ్య కాలంలో పట్టణానికి దగ్గరగా ఉన్న పల్లెలు ఏ విధంగా మారిపోతున్నాయో , అలాగే అక్కడ గ్రామ ప్రజలు కూడా వ్యవసాయం వదిలి పెట్టి తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే ఆరాటంలో రియల్ ఎస్టేట్ వైపు ఆకర్షితులు అవుతున్నారు . అక్కడ జరిగే మోసం , దగ , కుట్ర , ఆ రైతుల జీవితాలు ఏ విధంగా బలైపోతున్నారో అనడానికి రామకృష్ణ కుటుంబమే నిదర్శనం ఈ “ మోహినీ మోహనం ” కథ .

అమలిన రాగాలు ఒక ప్రేమకథ . ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇస్తూ , ఆర్ధిక , సంస్కారాలను సున్నితంగా చూపించారు రచయిత . ధనికులకు , అభాగ్యులు ఎలా బలైపోతున్నారో అనడానికి రేవతి పాత్రే నిదర్శనం .
ప్రాంతీయత అనేది శాంతి నారాయణ రచనలో కన్పిస్తాయి అనడానికి నిదర్శనం ఈ మూడు కథలు చదివితే అర్ధమవుతుంది . పది మందికి అన్నం పెట్టే రైతులు కరువు కాటకాలకు తట్టుకోలేక చివరకి తిండి కోసం దారి దోపిడీలుగా మారిన వాస్తవ కథనాల రూపం “ కేసు వాయిదా పడింది” కథ . ‘ కాలం వెంట’ , ‘దేవుడా రక్షించు నా దేశాన్ని’ ఈ రెండు కథల్లోనూ హిందువుల పండగలు గురించి , పెట్టుబడి దారులు రాజకీయంగా మారినప్పుడు జరిగే మోసం కథ నడుస్తుంది . ఆనంతపురం లోని కరువు వల్ల అక్కడి రైతులు ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకున్న వాళ్లు చివరకి చిల్లర వ్యాపారులుగా మారడాన్ని ఎంతో హృద్యంగా కథ రూపంలో ఆవిష్కరించారు రచయిత .

ఈ కధానిక సంపుటి చదువుతున్నంత సేపు ఒకవైపు రాయలసీమ ప్రాంతంలోని సంఘటనలు కళ్ళ ముందు కన్పిస్తుంటే , వాటికి అంతే సహజంగా ప్రాణం పోసింది మాత్రం రాయలసీమ యాస అనే చెప్పాలి . ఈ సంపుటిలో మాండలిక పదాలు వొల్ల గుడ్డ , అక్కిడి , తట్ట , గబ్బుబట్టి పాయనని , వొగేల , గదప్పా , దుడ్లు , పలకువే ,న్యాస్తుడు వంటి ప్రయోగాలు ఉన్నాయి . కొన్ని కథల్లో గ్రామీణ వాతావరణంతో పాటు వారి సంభాషణలు కూడా అత్యంత సహజంగా సాగుతాయి . రేయ్ , నారిగా అక్కగా సూడ్రా ! యెవురో సచ్చి పోయినట్లుంది , నువ్వు నోర్ముసుకోరా తబ్బిర్నాబట్టా ,రొంత అట్ల ఒయ్యొ త్తాం పదండర్రా ! ఇలాంటి సంభాషణలు ఆనంతపురం జిల్లా పల్లె వాసులను కళ్ళ ముందు నిలుపుతుంది .

ఈ విధంగా కొండచిలువ కథానిక సంపుటిలో చుట్టూ ఉన్న పరిస్థితులు , స్థితిగతులు అన్ని కోణాల నుంచి పరిశీలించి , ఆధునికంగా మారుతున్న మనుషుల మనస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు శాంతి నారాయణ . మొదటి కథ నుంచి చివరి వరకు చదివించే కథనం ఈ కొండ చిలువ కథా సంపుటికి ఉన్న ప్రత్యేకత .

ప్రతులకు :
రచయిత : డా . శాంతి నారాయణ
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోను
వెల :100 /-

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో