కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

1- లల్లేశ్వరి

కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి వేదాంత ధోరణిలో కవిత్వం రాసినా పరమత సహనం బోధించి గుర్తింపు పొందింది .14 వ శతాబ్ది మధ్యలో చ్నాష్టియన్ యుగం లో జన్మించింది .ఆకాలం లో కాశ్మీర్ రాజకీయ మత సంఘర్షణలతో అట్టుడికి పోతోంది .కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు అయిదు కిలో మీటర్ల దూరం లో ఉన్న పండ్రెంధాన్ శాంపూర్ లో ఆమె తలిదండ్రులు ఉండేవారు .లల్లేశ్వరికి బాల్యం లోనే వివాహం జరిగింది.పామ్పూర్ లోని అత్త వారింటికి కాపురానికి వెళ్ళింది .అక్కడ అత్తగారు విపరీతం గా ఆరళ్ళు పెట్టెది . మనిషికిచ్చేకనీస మర్యాదకూడా ఇవ్వక అత్తగారు కర్కోటకురాలై ఎన్నో ఇబ్బందులు పెట్టింది అవన్నీ సహనం తో భరించింది . తిండి పెట్ట్టకుండా మాడ్చింది కొత్త కోడలిని. .అన్నీ తట్టుకోన్నది ఆ మహా సహన శీలి .ఎన్నడూ అత్తను ఎదిరించలేదు .

ఒక రోజు అత్తగారింట్లో గొప్ప విందు ఏర్పాటు చేశారు .ఊరందరిని భోజనాలకు పిలిచారు .ఈమె నదికి వెళ్లి కడవలతో నీళ్ళు మోసింది . అక్కడ ఆడంగులు ఆమెతో ‘’ఈ రోజున మీ ఇంట్లో గొప్ప విందు కదా .రాత్రికి నీకు కడుపునిండా షడ్ర సోపేత భోజన పదార్ధాలు పెడతారులే ‘’అన్నారు .నిజమే నని నమ్మింది లల్లేశ్వరి’.మా ఇంట్లో ఎంతపెద్ద విందు జరిగినా నాకు పెట్టేది పెద్ద రాయి మాత్రమే ‘’అని జవాబు చెప్పింది .రోజూ ఆమె భోజన పళ్ళెం లో ఒక పెద్ద రాయి పెట్టి ,దానిపై కొద్దిగా బియ్యం ‘’ధాలి ‘’వేసి కప్పి ఏంతో పెద్ద భోజనం పెడుతున్నట్లు అత్తగారు అందరినీ భ్రమింప జేసేది .

ఇక అత్త వారింట్లో తట్టుకొనే ఓపిక లేక ఇల్లు వదిలి సన్యాసిని గా మారింది .గొప్ప సంస్కృత విద్వాంసుడైన ‘’సీదా బాయు ‘’శిష్యురాలైనది ‘గురువు వద్ద యోగా ,ధ్యానం నేర్చుకొని గురువును మించిన శిష్యురాలని పించుకొంది.ఇలా ఉండగా ఇరాక్ నుండి వచ్చిన సయ్యద్ లతో పరిచయం ఏర్పడింది .వారితో సుదీర్ఘం గా మత విషయాలపై చర్చించేది .అన్ని వేదాంత గ్రంధాలలోని మంచి విషయాలను సేకరించి బోధించేది . మతాలన్నీ ఒకే భగ వంతుని చేరే వేరు వేరు మార్గాలు అని నమ్మింది .హిందూ ముస్లిం ల మధ్య భేదాన్ని ఆమె పాటించ లేదు .సమానం గా సమాదరించింది .అన్నిమతాలు ఒకే సత్యాన్ని బోధిస్తాయని తెలియ జెప్పేది .

ఆహార పానీయాల విషయం లో నియమాలు పాటించాలని ఉద్బోధించింది .మితిమీరి ఏదీ చేయరాదని హితవు చెప్పింది .ప్రతి వ్యక్తీ ఆత్మ జ్ఞాన సంపన్నుడు కావాలని అదే అసలైన భగవంతుని కి చెందిన జ్ఞానమని చెప్పేది .మనిషి దుఖాలకు, బాధలకు కారణం అహంకారమే నని దాన్ని వదలించుకొంటే ముక్తి పొందటం తేలిక అని తెలియ జెప్పేది .అతి తిండి అనర్ధ దాయకం అన్నది .నిరాహారమూ మంచిదికాదని సరిపడా దేహ పోషణకోసం తినాలని హితవు చెప్పింది. మనిషి జీవించి ఉండగానే దైవాన్ని గురించి తెలుసుకోలేక పొతే మరణించాక ఎలా సాధ్యం అని ప్రశ్నించింది.ఆమె జీవితం లో ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినట్లు కధనాలున్నాయి .అవన్నీ ఆమెపై హిందూ ముస్లిం లకు ఏర్పడిన వీర అభిమానమే కారణం .కాశ్మీర్ ప్రసిద్ధ రుషికవి ,చార్ ఏ –షరీఫ్ కు చెందిన నంద రుషి కి లల్లేశ్వరి అంటే విపరీత మైన గౌరవం, ఆరాధనా భావం ఉన్నాయి .ఆమె కాశ్మీరీ భాషలో రచించిన పదాలు(వాక్స్ ) పాడుతూ తరలాలకు వ్యాప్తి చెందారు కాశ్మీరీ ప్రజలు .ఈనాటికీ ఆమె పాటలు పాడుకొంటూ స్మరిస్తారు .కృతజ్ఞతను ప్రకటిస్తారు . ఆమె ను హిందూ ముస్లిం లు సమానం గా ఆదరించి సోదరభావాన్ని చాటుకొన్నారు .

2. రూపా భవానీ
1624లో సంస్కృత మహా పండితుడు మాధవ జూదార్ కు రూపా భవానీ కుమార్తె .పండిట్జీ కుటుంబం కాశ్మీర్ లో సఫా కదార్ దగ్గరున్న మొహల్లా ఖానాఖి సోక్తలో నివాసం ఉండేది .తండ్రి నిత్యం హరి పర్బాత్ సేవలో శారికాదేవి పూజలో ఉండేవాడు .ఆ దేవతానుగ్రహం లో రూప జన్మించటం తో ఆమెలో దైవీ లక్షణాలు చిన్నప్పటి నుండే కనిపించేవి .యుక్త వయసులో ఆమెను సప్రూ కుటుంబ యువకునికిచ్చివివాహం చేశారు .పెళ్లి ఆమె పాలిటి వరం కాకుండా శాపమే అయింది అత్తా ,భర్తా ఆమెను విపరీతం గా బాధ పెట్టేవారు .ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక భావాలను వారిద్దరూ అర్ధం చేసుకోలేక పోయారు .ఈ సంసారలంపటం లో కూరుకు పోవటం ఇష్టం లేని రూప బయటికి వచ్చి సన్యాసినిగా మారిపోయింది .

వేదాంతాన్ని, యోగ శాస్త్రాన్ని మిగిలిన ఆధ్యాత్మ గ్రంధాలన్నీ చదివి విజ్ఞానం పెంచుకొన్నది .ఆమె గురువు తండ్రి అవటం బాగా కలిసి వచ్చింది .కాశ్మీర్ లోయ అంతటా పర్య తీస్తూ సాధువులతో ,సన్యాసులతో ,దర్వేష్ లతో ఆధ్యాత్మిక చర్చలు చేసేది .నిరంతర సాధన వల్లఆమెలో అలౌకిక దివ్య శక్తులెన్నో ఏర్పడ్డాయి .వాటిని సద్వినియోగంచేసింది అందులకు దృష్టిని ప్రసాదించింది .మనిగాం గ్రామం లో అగ్ని ప్రమాద౦ సంభవిస్తే కంటి చూపు తో ఆర్పి వేసింది ఈ నాటి కాశ్మీర్ రాజ భవన్ వద్ద ఉన్న అద్భుత ప్రక్రుతి సౌందర్యం మధ్య వాస్కూరా లోను ,చాష్మా సాహిలోను ధ్యానం లో కాలం గడిపింది .అక్కడికి చేరే భక్త జనాలకు ఆధ్యాత్మిక ప్రబోధం చేసేది .దీనితో హిందువులే కాక ముస్లిములు కూడా రూపా భవానీ కి భక్తులైపోయారు .కులమత భేదాలు లేకుండా అందరిని కన్న పిల్లలలాగా ఆదరించి వారి యోగ క్షేమాలను చూసేది .ఆమెను శారికా దేవి అవతారం గా కాశ్మీరీ ప్రజలు భావించి ఆరాధించేవారు .ఈ ప్రపంచానికి ఏకైక ప్రభువు భగవంతుడే నని నమ్మి అందరికి ఆ విషయాన్ని ప్రబోధించింది .

రూపా భవాని కి సంస్కృత ,పర్షియన్ భాషలలో అపార పాండిత్యం ఉన్నా కాశ్మీరీ భాషలోనే సరళం గా రాసేది ప్రసంగించేది . .ఆ నాటి ముస్లిం ఫకీర్ షా షాదిక్ కలందార్ కు రూపా భవానీ అంటే విపరీత మైన గౌరవం, భక్తీ ఉండేవి .ఆయనే ఆమె జీవిత చరిత్రను ,మరణం జరిగిన తేదీలను రాసి భద్రపరచాడు .మాఘమాసం కృష్ణ పక్ష సప్తమి నాడు-జనవరి నెలలో రూపా భవానీ భౌతిక శరీరాన్ని97 ఏడేళ్ళ వయసు లో విసర్జించి పరమాత్మ సన్నిధానం చేరింది .ఆమె మరణించిన సప్తమి తిధిని ఆనాటి నుండి ఈ నాటివరకు సుమారు 370 ఏళ్ళుగా ‘’సాహిబ్ సప్తమి ‘’పేరిట సంస్మరణ దినోత్సవం జరుపుతూ ఉండటం విశేషం .

రూపా భవానీ పేరిట వాస్కూరా ,మనిగాం,సఫా కదల్ మొదలైన చోట్ల ఆశ్రమాలను నిర్మించారు .’’రూపా భవనీఅలక్ సాహిబా ట్రస్ట్ ‘’ను ఏర్పరచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఈ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆమె వర్ధంతిని మహా వైభవం గాయజ్ఞం చేసి నిర్వహిస్తున్నారు .ముస్లిములందరూ పూలు ,పళ్ళు పాలు స్వీట్లు ఆ రోజున భక్తులకు అమ్మి తమ వంతు భక్తిని ప్రకటించుకొంటారు. కాని ఉగ్రవాదుల దాడులతో అల్లాడిపోతున్న కాశ్మీర్ లో ఈ ఉత్సవం 1989-90నుండి ప్రజాక్షేమ దృష్ట్యా రద్దు చేశారు .ఉగ్రవాదుల దాడులకు అనేక ఇబ్బందులకు లోనైనా కాశ్మీరీ పండిట్స్ 1990 ఫిబ్రవరి –మార్చి నెలలలో కాశ్మీర్ నుండి భారీగా జమ్మూ కు వలసపోయారు .ఆమె జ్ఞాపకార్ధం జమ్మూ లో తాలాబ్ తిల్లో అనే ప్రదేశం లో రూపా భవానీ ఆశ్రమం నిర్మించుకొని పూజలు ఉత్సవాలు చేస్తున్నారు .ఇక్కడే ఆమె వర్ధంతిని యజ్న౦ తో నిర్వహిస్తున్నారు .వేలాది కాశ్మీరీ పండిట్ లు ఈ కార్యక్రమం లోపాల్గొని రూపా భవానీ ని సంస్మరిస్తారు .

కాశ్మీర్ లో హిందూ ముస్లిం సఖ్యత కోసం లల్లేశ్వరి ,రూపా భవానీ చేసిన సేవలు చిరస్మరణీయం ఆదర్శ ప్రాయం .నేటి కల్లోల కాశ్మీర్ కు వారిద్దరి స్మరణ .మార్గ దర్శనం చేస్తాయి .

– గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో