సమాజం పై మీ మనసులో మొలకెత్తిన ఊహలను ఆవేదనతో , ఆక్రోశంతో కలం సాక్షిగా అక్షర రూపంలో రూపింప చేసి ఆవిష్కరించినందుకు ములుగు లక్ష్మీ మైథిలి గారికి నా అభినందనలు .ఉన్నతమైన చదువును అభ్యసించి , ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తూ , తమ తల్లి ప్రేమతో “ పుస్తకాభిషేకం చేసిన తీరు హర్షణీయం .
తెలుగింటి వాణి /ములుగింటి అలివేణి ‘సత్యవతమ్మ ‘/మాయని మమతల పూబోణి
ప్రియమగు పతి హృదయ రాణి /ఆకలి వేళ అన్నపూర్ణవై / అందరినీ చేరదీసిన మహా సాధ్వివై /కోర్కెల తీర్చిన కల్ప వల్లి “ అంటూ తల్లి ప్రేమకు తనదైన శైలిలో “నీరాజనం” అందించారు రచయిత్రి . వీరు పేరుకే లక్ష్మి కాదు … రాతకు సైతం లక్ష్మియే .సమాజంలోని బాహ్య పోకడలు , రాకడలు , వెలుగుచు సాయన్నా , వ్యక్తి మొక్క జీవన చిత్రణ బాహ్య ప్రపంచానికి తెలిసిందన్నా అది ఒక కవిత్వం ద్వారానే అంటే అతిశయోక్తి అనిపించక మానదు . ఈ కోవలోకి చెందినదే “ బతుకు మగ్గం “.వలువలు లేని శరీరం / విలువలు లేని సత్తు పైసాతో సమానం .అటువంటి వస్తానని మనకు ఐదించే “మగ్గం “ కార్మికుడు , పడుగు , పేకలతో బట్టను నేసి , దానికి రంగుల్ని అద్ది తన జీవితాన్ని మాత్రం ‘ రంగుల మయం ‘ చేసుకోలేక పోతున్నదని “ బ్రతుకు మగ్గం “లో చితికి పోతున్న తీరును అక్షరీకరించారు .
ఒంటిపై జానెడు పోగులోని నేత గాడు /అతని శ్రమ ఫలితాన్ని దోచే వారికి తలవంచి /చేతిలో దారపు ఉండలేకాని /అన్నం ముద్దా లెరుగడంటూ “ నేతగాడి జీవనాన్ని ఆవిష్కరించారు .న్యాయదేవత ఆక్రోశాన్ని తన దిన శైలిలో తెలిపారు . కళ్ళు ఉన్నది చూడడానికే కాదు చూసిన సన్నివేశాన్ని బట్టి మనసు కూడా స్పదించాలని న్యాయ దేవత మాటలను నా కళ్లకు గంతలు కట్టారు /కానీ చెవులకు కట్టలేదు . నేను సంఘంలో సంఘటనలను చూడలేక పోవచ్చు . చెవుల ద్వార మాత్రం న్యాయ న్యాయ విచారణ చేయగలను కానీ నేడు డబ్బున్న వాడి చేతిలో చట్టం ఏవిధంగా బందీ మైపోయిందో .. న్యాయం అనేది ఏ రీతిలో అంగడిలో అమ్మే వస్తువులా తయారయ్యిందో కళ్లకు కనువిప్పు కలిగేలా చూపించారు .
పచ్చని రంగు పులుముకుని కళ కళ లాడే పాలే తల్లి ఏ విధంగా కాంక్రీటు కోరల్లో చిక్కుకుందో “ ప్రతీకలు “ అనే కవితలో కళ్లకు కట్టారు . దీనిలో “మొక్కలే కదా అని పీకేస్తే /…ముక్కంటి మూడోకన్నుకు పృథ్వి బ్రద్దలవుతుంది /మొక్కలన్నీ విచ్చు కత్తులై / వీరంగం చేస్తాయి …/కడలి నాలుక చాస్తుంది / నెల నెర్రెలు చీలుతున్దనిమోక్కలు యొక్క ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు .
కఠిన శిలల మనసుల మధ్య /మాతృత్వ మధురిమను చూడలేక /రాలోపోతున్న అంకురాన్ని నేను / అర్పణ ను కాను … అంకురార్పణ ను నేను . కులం లేదు మతం లేదు , ధనిక ,బీద తేడా అసలే లేదు … ఎవ్వరు మురికి చేసిన బట్టలనైనా సంఘ సేవకులవలే ఉతికి ఆరేయడం మురికిని తరిమేయడం రజక సోదరుల పని కానీ ఈ కులమత ధనిక బీద తేడాలే అడ్డుగోడలై గాడిద చాకిరి చేస్తున్న వీరిని రాజకులను మనుషుల్లో దేవుళ్ళలా చూపెతట్లు చేసింది . యంత్రాలు పూర్తిగా మురికిని వదల గోట్టలేవు కానీ బట్టలు ఉతికి నీట్ గా ఇస్త్రీ చేసి పట్టుకొచ్చే రజకుని పై ఈ చిన్న చూపెందుకో …..
మనం ఎంత కాలం ఈ భూమి పై జీవించినా, అది కొద్దీ కాలంయానా చాలా కాలమిన మనకు అవసరమైన నిధి శాంతినిధి అని దాని కోసం అన్వేషించడంలో తప్పులేదని .
శాంతి పరిమణం ప్రజల మధ్య ఇమడ లేకపోతుందని
ఎవరికైనా కనిపిస్తే చెప్పమని
మనం దాచుకోవాల్సింది …. పంచుకోవాల్సింది
ఒక్క ‘శాంతి’ ని మాత్రమేనని తన నిధి లో అన్వేషించారు .
పండగలకు , పబ్బాలకు కొత్త బట్టలు , రకరకాల వంటకాలతో ఇంటికి వచ్చే అతిధులకి మనకు ఎంతో సంబరంగా ఉంటుంది . యంతో ఆనందంగా , ఎటువంటి భయాలులేకుండా గడుపుతాం . కానీ మన ఆనందం వెనుక దేశ రక్షకుల వెన్ను చూపని ధైర్యం ఉంది . ఎంతటి కష్టాన్నైనా సైతం అడ్డుపెట్టి పోరాడే సైనికుడి తోడు ఉంది . మంచు కొండ సరిహద్దుల్లో నిలబెట్టిన త్రివర్ణ పతాకం గౌఅరవాన్ని నిలబెట్టడానికి సైనికులు పడే తాపత్రయం . తన రక్తాన్ని భరతావని నుదుటి సిన్దూరంగా మార్చడానికి సైతం వెరవని మొండితనం . సైనికుడి దేశ పొలిమేర దేవుడుగా నిలబెట్టాయి .“గ్లోబలైజేషన్ “ అంటూ పల్లె నేలని గుల్ల బారేతట్లు చేసి పంట విత్తనాలు చల్లాల్సిన చోట , కాంక్రీటు మొక్కల్ని పెంచుతున్నారంటూ తన ఆవేదనని వెళ్ళ గక్కింది . నాడు పక్షుల కిల కిల రావాలతో పరవశించిపోయిన పల్లెటూళ్ళు నేడు రింగ్ టోన్స్ మాయ జాలంలో మోసగింప బడుతున్నాయని .
అతిగా నాగరికతను ప్రేమించడం వల్ల కల్గే పరిణామాలు ఈ విధంగా సమాజ వినాశనానికి దారి తీస్తాయని సూటిగా ప్రశ్నించారు .
తినడానికి తిండి లేని బడుగు జీవులకు / నాల్గు దిక్కులున్నా ,దిక్కులేని పేదవాడికి /అణగారిన జీవాలకు “ నేనున్నానంటూ అక్షర రూపంలో అభయ హస్తం ఇచ్చిన జాషువా . అతడే తెలుగు పద జాళువా అని తనదైన తీతిలో చెప్పారు . జాషువా కవితలో సాఘిక దురాచారాలను రూపుమాపి / మత మౌడ్యాలను ఎండగట్టి / దేశ ఆమంటే అంతటి కాదు దేశమంటే మనుషులు “ గురజాడ అడుగుజాడలో మనల్ని నడిపించారు . మధురమైన మాలకట్టారు స్నేహంలో స్నేహంలోని కొత్త కోణాలను ఆవిష్కరించారు . ఒక ఐడియా జీవితాని సైతం మార్చగలదని అక్షర రూపంలో మాలకట్టారు .
ఈ రీతిగా ఒక చదువరుడుకి కావలిసిన , తెలుసుకోవలిసిన అంశాలను శ్రద్ధగా కూర్చి , చదివిన తరవాత ఆలోచించే విధంగా ఈ “ఊహలు గుసగుసలాడే” మాకు అందించినందుకు ధన్యవాదాలు .
ప్రతులకు :
రచయిత్రి : ములుగు లక్ష్మీ మైథలి
ఇంటి సంఖ్య :26 – 3-2050 ,చంద్ర మౌళి నగర్ ,
తపాలా కార్యాలయం ఎదురుగా ,
వేదాయపాలెం , నెల్లూరు .
సంచార వాణి : 9441685293
– రవికిరణ్ జొన్నకూటి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~