OSTWIND (EASTWIND)

Director: Katja Von Garnier

Country : Germany

Duration: 105 minutes.

Language: German
Age: No Age restrictions

1 pattemఈ సినిమా అసలు పేరు”East Wind” (తూర్పుగాలి) . దీన్నే”Together We Are Free” (మేమిద్దరం కలిస్తే పూర్తి స్వేచ్చ) అని కూడా పిలుస్తారు జర్మన్లు. గుర్రానికీ మనిషికీ మధ్య ఉండే లోతైన సంబంధం మీద దృష్టి పెట్టి జర్మనీ లో తీసిన ఒక గొప్ప గుర్రం చిత్రం. “ఆస్విండ్” అనే పేరు గల గుర్రమే టైటిల్ రోల్ పోషిస్తుంది!

“మిక” అనే 14 ఏళ్ళ అమ్మాయి వేసవి కాలం గడపడానికి తన అమ్మమ్మ దగ్గరకి వస్తుంది.అక్కడ తనకి తెలియకుండానే తనలో దాగున్న “గుర్రాలతో సంభాషించగల “ఒక అమోఘమైన నేర్పరితనాన్నిగుర్తిస్తుంది.అమ్మమ్మ గుర్రాల శాలలో ఉన్న ఒక భయంకరమైన మగ గుర్రాన్ని తన స్నేహంతో మాలిమి చేసుకోవడమే ఈ చిత్ర కధాంశం.

అసలు సంగతేమిటంటే మిక తన సంవత్సరాంతపు పరిక్షలలో ఫెయిలవుతుంది.అమ్మా-నాన్నా నిరంతరం తమ పరిశోధనలో మునిగి పోయి, పిల్లల గురించి బొత్తిగా ఎకడమిక్ గా ఆలోచించే శాస్త్రవేత్తలు. తమ మాట వినని మిక దారికి రావాలంటే క్రమ శిక్షణ కోసం వాళ్ళమ్మమ్మ ఊరికి పంపాలని నిర్ణయిస్తారు. పరిక్షలో ఫెయిలయినఫ్ఫటికీ మిక మిగిలిన విషయాల్లో చాలా చురుకైనది,తెలివయింది కూడా.లౌక్యంగా ఉపాధ్యాయులతో మాట్లాడి తన విధ్యా సంవత్సరం వృధా కాకుండా స్కూల్లో మేనేజ్ చేస్తుంది.కాకపోతే వాళ్ళొక షరతు పెడతారు.సెలవుల్లో పాసై పోయిన మిగిలిన విద్యార్ధులందరూ వెళ్తున్న కేంప్ కి మిక వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని బాగా చదువుకోవాలి.ఇదే ఒక బాధాకరమైన సంగతనుకుంటే జంతువుల్నీ,మనుషుల్నీ కూడా కఠినాతి కఠినంగా క్రమశిక్షణలో పెట్టే అమ్మమ్మ ఊరికి వెళ్ళడం మిక కు అత్యంత విషాద కరమైన విషయం!

ఆమె జంతువులతో పాటు నుండి కూడా క్రమశిక్షణ డిమాండ్ చేస్తుంది. మిక కు ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఆమె అమ్మమ్మ “మరియా” ఒక ప్రతిష్టాత్మక గుర్రపు స్వారీ పాఠశాల నడుపుతుంది. ఆమె జంతువులతో పాటు విద్యార్ధుల నుండి కూడా క్రమశిక్షణ డిమాండ్ చేస్తుంది. తర్వాత క్లాస్ కి పాస్ కానందుకు మిక ను అమ్మమ్మ ఇంట్లోకి రానివ్వదు వెంటనే ఆమె అమ్మమ్మ. తో ఘర్షణ పడుతుంది. పెద్దవాళ్ళు మిక కు ఏమీ రాదు,ఎందుకూ పనికి రావని చెప్పిచెప్పి ఊదరగొట్టి మానసికంగా ఒప్పుకునేలా చేస్తారు. మిక చిన్నవయసులోనే స్వశక్తితో బతకడానికిష్టపడదు. తల్లిదండ్రుల ఖర్చు మీదే ఆధారపడాలనుకుంటుంది. మిక అమ్మమ్మఇంటికొచ్చాక చదవడం మానేసి గుర్రపు శాలకు కాపలాదారు గా పనిచేస్తున్న “సామ్” అనే ఒక టీనేజ్ బాలుడితో గడుపుతూ కాలక్షేపం చేస్తుంటుంది. సామ్ మాటల్లో తనకున్న “ఒకే ఒక సమస్య అడవి మృగం లాంటి గుర్రం ‘ఆస్విండ్’ ని దారిలో పెట్టడం అనీ, అది తనవల్ల కాదనీ,తను చెప్పే ఏ కమాండ్ నీ ఆస్విండ్ ఖాతరు చెయ్యదనీ సామ్ మిక తో చెప్తాడు.

ఇంకో రోజు మిక యధాలాపంగా అటూ ఇటూ తిరుగుతూ పరిసరాలను గమనిస్తున్నప్పుడు గుర్రపు శాల లోని కటిక చీకటి గానున్న ఒక కొట్టంలో తిరస్కార భావంతో, ఉడుకుబోతుగా కనిపిస్తున్న ఒక భయంకరమైన మగ గుర్రం ఆస్విండ్ ని చూస్తుంది.దాని చేష్టలు అతి ప్రమాదకరంగా, అనూహ్యంగా ఉంటాయనీ, అశ్వ శిక్షకురాలైన ఒక్క అమ్మమ్మ తప్ప అత్యుత్తమ షో జంపర్ అయిన మిచెల్ కూడా దాన్ని మచ్చిక చేసుకోలేడనీ సామ్ చెప్తాడు. అంతేకాదు! అమ్మమ్మ ‘మరియా కాల్టెన్ బాక్’ ఒకప్పుడు గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొనేది. పాల్గొన్న ప్రతిసారీ గొప్ప విజయాన్ని స్వంతం చేసుకోవడంలో ప్రప్రధమురాలు. ఒక ప్రమాదంలో చేదు అనుభవం ఎదురై, జంపర్ స్వారీ ప్రదర్శన నుండి దూరమై, ఆమె కెరీర్ ఓటమి పాలైంది. అందుకు కారణమైన ఆస్విండ్ అంటే మరియాకు అంతులేని కోపం అని కూడా తెలుసుకుంటుంది
ఈ విషయాలన్నీ ముందే తెలిసినా,ఎన్ని సలహాలు చెప్పినా, భయం గొలిపే హెచ్చరికలు చేసినా అవేమీ పట్టించుకోదు మిక. ఒకరోజు చీకటి పశుశాల లోకి నిర్భయంగా, రహస్యంగా కాలు పెడుతుంది. ఏరకమైన తొట్రుపాటూ లేకుండా చాలా ఇష్టంగా ఆస్విండ్ దగ్గరకెళ్తుంది. విపరీతమైన భయం, ఆకలి బాధలతో అల్లాడిపోతూ, తల్లడిల్లి పోతున్నట్లున్న ఆస్విండ్ ని పలకరించి ప్రేమతో తల నిమురుతూ,ఆదరంగా మాట్లాడటం మొదలెడుతుంది. “ఆకలేస్తుందా”, నీకెవరూ ఏమీ పెట్టలేదు కదా?” అని అడిగి తను తింటున్న యాపిల్ పండుని ఆస్విండ్ నోట్లో పెట్టి తినిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే ఆస్విండ్ కీ మిక కీ మధ్య అసాధారణమైన స్నేహానికి బీజం పడుతుంది. అప్పటివరకూ తనలో ఏ రకమైన ప్రతిభ గానీ, సామర్థ్యము గానీ లేదని నమ్ముతూ వచ్చిన మికకి తనకే తెలియకుండా గుర్రాలతో సంభాషించగల శక్తి తో పాటు ఆస్విండ్ లాంటి భీతి గొలిపే జంతువుని మచ్చిక చేసుకోగలననే ప్రజ్ఞ దాగుందని తెలిసి విపరీతమైన ఉద్వేగానికి లోనవుతుంది.ప్రమాదానికి కారణ మైనందువల్లా, భవిష్యత్తులో గుర్రపు స్వారీ ని వదిలెయ్యవల్సినందువల్లా మరియా దృష్టిలో ఆస్విండ్ ఎందుకూ పనికిరానిదైపోయింది. మిక మాత్రం అమ్మమ్మకి తెలియకుండా ఆస్విండ్ తో రహస్య బంధాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. పట్టుదల,మొండితనం,నిలకడ, తెగువా,సాహసం మొదలైన గుణాల్లో ఆస్విండ్ కీ అమ్మాయికీ పోలికలున్నాయి. అందువల్ల ఇద్దరి మధ్య ఒక గూఢమైన, బలమైన అనుబంధం పెనవేసుకుంటుంది. ఈ బలమైన సంబంధం వల్ల తనమీద తనకి విశ్వాసం కలగడమే కాక తనేమిటో అమ్మమ్మకి, తల్లిదండ్రులకి నిరూపించి చూపించాలనుకుంటుంది.

2. pattemరోజులు గడిచేకొద్దీ ఒకరికొకరు విడదీయరాని ప్రాణస్నేహితులవుతారు. తుఫాను ముందు ప్రశాంతత లా శాంత గంభీర వదనంతో తనలో తాను ముడుచుకుని ఉన్న ఆస్విండ్ ని కలిశాకే మిక కూడా తన గురించి తాను అర్ధం చేసుకోవడం మొదలు పెడుతుంది. మిక తన మనసు చెప్పినట్లే చేసే స్వతంత్ర ఆలోచనలు గల అమ్మాయి.తిరుగుబాటు మనస్తత్వం కూడా. ఆమె తల్లిదండ్రులు ప్రముఖ శాస్త్రవేత్తలైనప్పటికీ, అమ్మమ్మ ప్రతిష్టాత్మక అశ్వ శిక్షక ఫాఠశాల నడుపుతున్నప్పటికీ ఆమె వాళ్ళు చెప్పేవన్నీ పెడచెవిన పెట్టి తన ఆలోచన ప్రకారమే నడుచుకుంటుంది.

సామ్ తాత “లార్డ్ కాన్” గొప్ప అశ్వశిక్షకుడు.ఆయన ప్రతి జంతువుకీ శిక్షణా పద్ధతులు వేరువేరుగా ఉంటాయనీ ,అది గమనించి అభ్యాసం చేయిస్తే ఆస్విండ్ రాణిస్తుందనీ చెప్పబోతే మరియా వినదు. వారిద్దరి మధ్యా ఆస్విండ్ గురించి పెద్ద వివాదం తలెత్తుతుంది. సామ్ తాత నుండి వేరుపడి గుర్రపు శాల సంరక్షణ బాధ్యతల్ని చేపడతాడు. కానీ సామ్ మిక – ఆస్విండ్ ల నిగూఢమైన అనుబంధాన్ని గుర్తిస్తాడు. అమ్మమ్మ మరియా ఆస్విండ్ ని అమ్మేయాలనుకుంటుంది. రాబోయే “హంగేరి”అమ్మకాల నుంచి గుర్ర్రాన్ని ఎలాగైనా కాపాడాలని దృఢంగా నిశ్చయించుకుంటుంది మిక. వచ్ఛే వసంత కాలపు టోర్నమెంట్లో ఆస్విండ్ తో పాల్గొనేందుకు మిక ప్రయత్నాలు మొదలుపెడుతుంది. లార్డ్ కాన్ బోధనతో, సామ్ సహకారంతో నాలుగు వారాల్లో స్వారీ శిక్షణ పూర్తి చేసుకుని రికార్డు సృష్టిస్తుంది మిక. అమ్మమ్మ అనుకుంటున్నట్లు ఆస్విండ్ “పనికిరానిది ” కాదు అని నిరూపించడానికి మిక శత విధాలుగా అహర్నిశలూ శ్రమిస్తూఉంటుంది.

3 .pattem

అమ్మమ్మ మరియా కి ఆస్విండ్ తో టోర్నమెంట్ అంటేనే అసలు అంగీకరించే పరిస్థితే లేదు. ఆమెకు లోలోపల ప్రత్యర్ధి మిచెల్ ని ఎవరైనా ఓడించి ‘కాల్టెన్ బాక్’ కి ఒక విజయం సాధించి పెడితే బాగుంటుందని ఒక కోరిక. తన కూతురు ఎలిజబెత్ కి ఎలాగూ తన వారసత్వం రాలేదు. అందుకు బదులుగా తన వారసత్వం తన మనుమరాలు మిక పొందితే తనకంటే ఆనందించేవారెవరూ ఉండరని ఆమె అంతరాంతరాల్లో గత కొద్దిరోజులుగా బలంగా రెండో కోరిక గూడు కట్టుకుని ఉంది. కానీ ఆమెకు ఆస్విండ్ మీద నమ్మకం లేదు. మిక కు సామ్ మానిటర్ గా ఉన్నందున ఎట్టకేలకు ఆస్విండ్ తో టోర్నమెంట్ కి అనుమతిస్తుంది మరియా.

టోర్నమెంట్ కి ముందే మిచెల్ ఈర్ష్య తో గుర్రం లెగ్గింగ్స్ ని పూర్తిగా విధ్వంసం చేస్తాడు. టోర్నమెంట్ లో గాయాలపాలైన ఆస్విండ్ భీకరంగా అరుస్తూ నొప్పి భరించలేని స్థితిలో హఠాత్తుగా పడిపోతుంది.దానితో సామ్ తలకి గుర్రం గిట్ట తగిలి ప్రమాదం బారిన పడటంతో హాస్పటల్ లో చేర్పిస్తారు. మిక వెనకనుండి తప్పించుకుని సమ్మర్ కేంప్ లో ఉన్న ఆమె స్నేహితురాలి వద్ద తలదాచుకుంటుంది. తర్వాత అక్కడ ఒక పక్కన దీనంగా హృదయవిదారకంగా పడున్న ఆస్విండ్ ని చూచి మిక షాక్ కి గురౌతుంది. అప్పటికే కొంచెం కోలుకున్న సామ్ సహాయంతో ఆస్విండ్ ని హాస్పటల్ కి తీసికెళ్తుంది. మిచెల్ చేసిన దుర్మార్గాన్ని అందరికీ తెలిసేట్లు చేస్తుంది. లార్డ్ కాన్ మళ్ళీ కోర్టుకి వస్తాడు. న్యాయనిర్ణేతలు మిచెల్ ని కోర్టు నుంచి బహిష్కరిస్తారు. ఈ లోపల ఎలిజబెత్ మరియా కలుసుకుంటారు. టోర్నమెంట్ లో విజయం సాధించి, కాల్టెన్ బాక్ కి ఘన కీర్తి తెచ్చి అమ్మమ్మ వారసత్వాన్ని నిలబెడుతుంది మిక. అమ్మమ్మ ఇంతకుముందే గుర్తించిన ఎన్నో సుగుణాలను, కొత్తగా మిక లోని ఈ అసాధారణ నైపుణ్యాలను తలి-దండ్రులు చూసి, మిక అంటే ఏమిటో గ్రహించి, ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బౌతారు.

ఇది కథ.కథ చదివితే దాని గొప్పతనం తెలియదు.సినిమా దృశ్య కావ్యం.చూస్తే అద్భుతంగా ఉంటుంది.
దర్శకురాలు “కట్జ వాన్ గార్నియర్” చలన చిత్ర రంగం నుండి తప్పుకుని ఐదు సంవత్సరాల తర్వాత ఒక ప్రతిఘటనా పోరాట రూపంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తెచ్చారు. పురుష స్వామ్య ప్రపంచాన్ని సవాల్ చేస్తూ బాండిట్స్, అబ్గీష్మింట్, ఐరన్ జావేద్, ఏంజిల్స్ అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక మన సినిమా “ఆస్విండ్” లోఅయితే హీరోయిన్ – ఒక టీనేజ్ బాలిక. ఆమె తల్లిదండ్రులు శాస్త్రవేత్తలైనప్పటికీ పాప పెంపకంలో “శాస్త్రీయ విధాన” మనేదే లేదు! చిన్నప్పటినుంచీ ప్రతి విషయంలోనూ మిక – తల్లిదండ్రుల మధ్య ఘర్షణ వాతావరణమే తప్ప సయోధ్య అనేది లేదు!! తమ ఒక్కగానొక్క బిడ్డ ఇష్టాయిష్టాలు,అభిరుచుల గురించి అసలు ఖాతరు చేయ్యరు. పాఠశాల చదువులో వెనక బడిందని ఏదో అక్కసు వెళ్ళబోసుకుంటున్నట్లే,ఈసడిస్తూ కోపంగా రుసరుసలాడుతుంటారు. అమ్మమ్మ చూస్తే పాప పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేకుండా క్రమశిక్షణ పేరిట ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఒక విలన్ లాగే ప్రవర్తిస్తుంది.మూడోది ఒక అడవి కౄరమృగం. పురుషాధిక్య సమాజంలో ఈ మూడు అడ్డంకుల్నీ ఎదురొడ్డి,పోరాడుతూ, సమర్ధవంతంగా అధిగమించి బాలికల ప్రపంచానికి గొప్ప ధీమా నీ భరోసానీ కలిగిస్తుంది మిక.

ఈ థీమ్ ద్వారా ఒక టీనేజ్ బాలుడు చేయగలిగిన పనిని అంతే ధీటుగా ఒక టీనేజ్ బాలిక కూడా చేయగలదని ప్రతిభావంతంగా నిరూపించి చూపించారు దర్శకురాలు కట్జ వాన్ గార్నియర్.ఇంకా చెఫ్ఫాలంటే సామ్ చెయ్యలేని పనిని మిక బ్రహ్మాండంగా చేసి చూపించింది. గాలి తుఫాన్ లాంటి గుర్రపు శక్తి తో పోలిస్తే ఒక టీనేజ్ బాలిక శక్తి గురించి అంచనా వేయడం కష్టమే! సాధారణమనిపించినా,ఇంకెవరూ చేయలేని పనిని పరిక్షకు నిలబెట్టి, ప్రయత్నించి, నిజమని నిరూపించారు దర్శకురాలు. 4 .pattem

ఫొటోగ్రాఫర్ “ టోస్టెన్ బ్రూవర్” ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ని సుందరమిన ప్రకృతి దృశ్యాలు మనసు నాహ్లాదపరుస్తూ కన్నుల పండుగ చేస్తాయి. బ్రూవర్ వాటిని కెమెరాలో బంధించిన తీరు అబ్బుర పరుస్తాయి. దట్టమైన అడవి గుండా మిక ఆస్విండ్ మీద స్వారీ చేయడాన్ని కనురెప్పవేయకుండా చూస్తున్నప్పటికీ చూపు చెదిరి పోతుందేమో నన్నంత మాయలో పడిపోతాం.అంత గొప్ప వేగాన్ని తన కెమెరాలో బంధిస్తారు. 1877 ప్రాంతాల్లో మేధావుల,శాస్త్రవేత్తల చర్చల్లో తేల్చిన సారాంశం ఏమిటంటే “గుర్రం పరిగెత్తేటప్పుడు నాలుగు కాళ్ళు ఒకేశారి పైకి లేపుతుంది” అని. అమెరికా ఫొటోగ్రాఫర్ ఈడ్ వేడ్ మైబ్రిడ్జ్ ఈవిషయాన్ని తన ప్రయోగానికి గుర్రం వేగాన్ని చిత్రించడం ద్వారా నిరూపించాడు.ప్రపంచంలో ప్రాణి చలనాన్ని అందులోనూ గుర్రపు వేగాన్ని దృశ్యీకరించిన మొదటి వ్యక్తి మైబ్రిడ్జ్. మైబ్రిడ్జ్ తర్వాత అంత వాయువేగంతో గుర్రన్ని స్వారీని చేస్తున్న ఒక చిన్నారి బాలికనూ చిత్రీకరించి ప్రేక్షలను అద్భుతమైన భ్రాంతికి గురి చేస్తాడు టోస్టెన్ బ్రూవర్.

అమ్మమ్మ-తాతయ్య/నాన్నమ్మ-తాతయ్య ల తరం,తలిదండ్రుల తరం తమ ఇష్టాయిష్టాలను పిల్లతరం మీద రుద్దడం,క్రమ శిక్షణ పేరిట అదుపులో పెట్టాలనుకోవడం ఒకవైపైతే – ఇంకోవైపు తమ అభిరుచుల కోసం మనసు చెప్పినట్లు శ్రమించడం,తమ అభిమాన రంగంలో తమదైన నైపుణ్యాలను సాధించి వారేమిటో ప్రపంచానికి నిరూపించి చూపించడం- పెద్దతరం నిర్లిప్తత చిన్నతరం స్వీయ ఆవిష్కరణలను సమర్ధవంతంగా చర్చకు పెట్టింది డైరెక్టర్. అందులోనూ అది బాలికలైతే, సమాజం నిర్దేశించిన మూసల్లో ఒదిగిపొమ్మని ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో కంటికి బొమ్మ కట్టి చూపించారు దర్శకురాలు.
ప్రధాన పాత్ర తన కెదురయ్యే అడ్డంకుల మీద అడ్డంకుల నెదుర్కొంటూ చివరికి గమ్యం చేరడానికి గొప్ప నాటకీయ మలుపులతో ప్రేక్షకులను దృష్టి మరల్చనీయకుండా ఉంచడమే మంచి సినిమా ముఖ్య లక్షణమని సినీవిజ్ఞులు చెప్తారు. ఈ చిత్రంలో ఆ లక్షణాలన్నీ ఒదిగి ఉన్నాయి.
మిక గా నటించిన ప్రధాన పాత్రధారి హాన హోప్నర్ నటన గురించి ఎవరికి వారు చూడాలే తప్ప ఎంత రాసినా,ఏమి రాసినా తక్కువే! శరత్ అంటారు”ఒక్కోసారి మనం చెప్పదల్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికి మనకొచ్చిన భాష సరిపోదు”అని.అలాగే పాత్రలో జీవించింది అని మనం వాడే భాష ఏమాత్రమూ పనికిరాదు.సినిమా చూడకపోతే 14 ఏళ్ళ బాలిక అంత అమోఘంగా నటిస్తుందని ఒప్పుకోవడం కష్టమే!

జంతు ప్రేమికులకందరికీ నచ్చుతుంది. మానవులు- జంతువుల మధ్య ఈ స్నేహం కథ వారి వారి జీవితాలలో వారి సొంత అనుభవం నుండి అనుభూతి చెందిన వారింకా బాగా మెచ్చుకుంటారు! మిక- ఆస్విండ్ ల మధ్య స్నేహం చాలా సహజంగా అల్లుకోవడం పట్ల బాలలందరూ బాగా ఆకర్షితులవుతారు. మిక-ఎప్పుడూ ఆస్విండ్ ని ఒక జంతువు లా చూడదు. ఒక అద్దంలో తన ప్రతిరూపాన్ని చూసుకుంటున్నట్లు,తన ప్రియమైన స్నేహితునితో ఎలా ప్రవర్తిస్తుందో అచ్చు అలాగే ఉంటుందామె ప్రవర్తన. అద్భుతమైన స్వారి దృశ్యాల్లో ఇద్దరిమధ్య సమన్వయం, సహకారం, సహనం, సంయమనం,లయ, శక్తి, ఓర్పు అన్నీ సమ్మిళితమై ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తాయి.

సృష్టిలో తరాల అంతరం నిరంతరం కొనసాగుతూ ఉంటుందేమో! మరియా కోరుకున్నట్లు ఆమె కూతురు ఎలిజబెత్
గుర్రపు స్వారీ నేర్చుకోలేదు. ఎలిజబెత్ ఆకాక్షించినట్లు ఆమె కూతురు మిక చదువుల్లో రాణించలేదు.ఇది పెద్దవాళ్ళు అర్ధం చేసుకుని పిల్లల్ని వాళ్ళ ఇష్టప్రకారం పోనివ్వాలని సందేశం. 2013 మార్చి 21 న ఈ చిత్రం కి విడదలయింది.కొద్ది రోజుల్లోనే 750,000 ప్రేక్షకులు వీక్షించారు. అదే సంవత్సరం మే చివరి కి సందర్శకుల సంఖ్య 820.121 కి పెరిగింది. జర్మన్ ఫెడరల్ ఫిల్మ్ బోర్డ్ అధ్యయనం ప్రకారం గోథీ తో సమానంగా ఉత్తమ రేటింగ్ 1.31 పొందింది.

FESTIVALS & AWARDS INCLUDE:
GIFFONI International Film festival – Italy
Cinekid Amsterdam International Film Festival – Holland
LOLA Festival – Germany
Chicago International Film Festival – USA
Stockholm International Film Festival – Sweden
Kindermedienpreis – Germany
Oulu Children’s & Youth Film Festival – Finland

The film received from the German Film and Media Review the title “extremely valuable”.
In the Munich Film Festival 2013 was easterly wind with the Children’s Media Award “The white elephant “in the categories” Best Film Director “and” Best Young Actress “(Hanna Binke) excellent.
The film was also awarded the Guild Film Award of the Film Art Fair Leipzig for the best children’s film, Gilde Filmpreis – Germany, 2013
and the German Film Award 2014 for the best children’s film.

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సినిమా సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో