బోయ్‌ ఫ్రెండ్‌

001”అసలు వస్తుందో రాదో!” అని గబగబ నవ్వుతూ వెళ్ళిపోయే కృష్ణకాంతి వంక అలా చూస్తూ వుండిపోయాడు భానుమూర్తి.
ఆ రోజు అలా అతి సామాన్యంగా అరున పరిచయం ఇంత గాఢంగా అల్లుకుంటుందనీ, కష్టాలలోనూ, సుఖాలలోనూ ఒకరి కొకరు తోడు అవుతారని అతనుగాని ఆమెగాని అనుకోలేదు.

”అదేమిటి భానూ! ఇల్లు వచ్చేసింది.” అని కృష్ణ గుర్తు చేసేవరకు అతను తన స్మృతుల నుండి బయట పడలేకపోయాడు. స్నేహితురాల్ని వాకిట వరకు దింపి వెనక్కు తిరిగి వెళ్ళబోతున్న భానుతో అంది కృష్ణ-
”లోపలికిరా నిన్న ఎందుకో అమ్మ నీగురించి అడిగింది.”
”పద”
కృష్ణతో భానుమూర్తి పరిచయం ఆ పరిధిలోనే నిల్చిపోలేదు. కృష్ణ ఇంట్లో కూడా ఇతను ప్రత్యేకమైన అభిమానాన్ని దాని తాలూకు స్ధానాన్ని పొందగలిగాడు. భానుమూర్తి ఇంట్లోని వ్యక్తులతో ముఖాముఖి పరిచయం కృష్ణకు కలగలేదు కాని భానుమూర్తి ద్వారా ఆమె కందరూ పరిచితులూ, ఆత్మీయులే.

కృష్ణ తండ్రి మాధవరావుగారు ఒక పెద్ద ప్రరువేట్‌ కంపెనీలో మేనేజరుగా వుంటూ మంచి నమ్మకస్తుడుగా సమర్థుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన సహధర్మచారిణి వర్థనమ్మ. ఆమె పల్లెటూరిలోనే పుట్టింది. ఆమె ఇరవై వసంతాల జీవితం ఆ పల్లెటూరిలోనే ఆ పచ్చని ప్రకృతి మధ్యే గడచిపోరుంది. ఆమెకు ఆ ఊరికవతలగా మరో అందమైన ప్రపంచముందనీ, అది తను పెరిగిన వాతావరణం కంటే చాలా భిన్నంగా వుంటుందనీ ఆమె రావుగారి అర్థాంగి అయ్యే వరకు తెలియదు. ఆయన పెళ్ళి అర్యుూఅవ్వకముందే- ఆమెను తనతో బాంబే తీసికెళ్ళినప్పుడు- ఆ వాతావరణంలో ఇమిడిపోలేక ఉక్కిరి బిక్కిరి అర్యుంది. తన భార్య తన హోదాకి సరిపోలేదనీ, తనతో సోషల్‌గా తిరగలేదనీ ఆయన ఏనాడూ బాధపడలేదు. సంసార జీవితంలో ఆయన ఆశించిన తృప్తి, శాంతి ఆమె దగ్గర నుండి ఆయనకు సంపూర్ణంగా లభించారు.

ఎప్పుడూ క్లబ్బుల ముఖమైనా చూడని ఆ ఛాందసురాలికి తన కుమార్తె భానుమూర్తితో చేస్తున్న స్నేహం మొదట్లో విడ్డూరంగా అన్పించినా, వాళ్ళిద్దరి ముఖాల్లో కన్పిస్తున్న నిర్మలత్వం వాళ్ళ స్నేహాన్ని అపార్థం చేసుకునేలా చెయ్యలేదు. పైగా భానుమూర్తి అంటే ఆమెకు ఒక విధమైన ఆప్యాయత కూడా కలిగింది. తను కూతురి ఎడల బాధ్యతల్ని విస్మరిస్తున్నానేమో అని ఒక్కొక్కక్షణం బాధపడినా ”నా తరం వేరు. వీళ్ళ తరం వేరు. ఎదిగిన పిల్లలు వీళ్ళు. చెప్పించుకోతగ్గ వయసు కాదు. ఈ కాలపు మంచి చెడ్డల గురించి నా కంటె వీళ్ళకే ఎక్కువ తెలుసు.” అని సరిపెట్టుకునేది.

ఆ దంపతులకు చాలా కాలందాకా పిల్లలు కలగలేదు. సైన్సు ప్రయోగాలు ఫలించి పది సంవత్సరాల తర్వాత వంశోద్ధారకుణ్ణి ఆమె ఒడిలో వేసారు. తమ తలలకింత కొఱివి పెట్టి తమను పున్నామ నరకాన్నుండి రక్షిస్తాడన్న కొడుకు తలకే మరో పాతిక సంవత్సరాల తర్వాత కొఱివి పెట్టవలసినప్పుడు ఆ దంపతుల్లోని ఆశలు కలలు ఆ మంటల్లోనే ఆహుతి అరుపోయారు. వాళ్ళు మాత్రం జీవచ్చవాల్లా మిగిలి పోయారు. రోజులు గడిచే కొలదీ ఒకే ఒక ఆశతో జీవించడం నేర్చుకున్నారు వాళ్ళు. అది కొడుకు తర్వాత ఐదారు సంవత్సరాలకి కలిగిన కృష్ణ ఉనికి.

భానుమూర్తిది మధ్య తరగతి కుటుంబం. తండ్రి వృత్తి వ్యవసాయం. తాతల నుండి సంక్రమించిన ఆస్థి పొలాలుగా బాగానే వుంది. కాకపోతే దానిని విస్తరింప జేయడానికి ఆయన జీవిత కాలం చాలలేదు. సంతానం జాస్తి. దాంతో వాళ్ళది మొత్తానికి మధ్య తరగతి కుటుంబం క్రిందకే వచ్చింది. భానుమూర్తికి తన తండ్రి రూప మెలాగుంటుందో తెలియదు. తను తన తల్లి గర్భంలో వుండగానే ఆయన జీవితం పరి సమాప్తమరుపోరుంది. ఏటా కాన్పుల వల్ల నీరసించిపోరున రాజేశ్వరమ్మకు ఇది పెద్ద అఘాతమే అరునా ఆమె జీవితంలో నిర్భయంగా నిలబడింది. ఆమె విజ్ఞురాలు. ఒక్క చేతిమిదుగా ఆర్థిక విషయాలన్నీ చూచుకుంటూ ఏడుగురు కొడుకుల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసింది. తన మొదటి సంతానం ఆడపిల్లకు ధనికుణ్ణి భర్తగా తేలేక పోరునందుకు ఆమె చింతించలేదు. తన అల్లుడి గుణగణాలే ఆస్థి అనుకుందామె. ఆరుగురు కొడుకుల్ని ఆరుగురు కోడళ్ళని ఆమె ఎప్పుడూ విడివిడిగా చూడలేదు. ఆమెకు మిగిలిపోరున బాధ్యతల్లా లోకం దృష్టిలో తండ్రిని మింగిన కొడుకుగా పరిగణించబడ్తున్న భానుమూర్తి ఒక్కడే.

కృష్ణతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన భానుమూర్తి నేరుగా వంటింట్లోకి వెళ్ళాడు. కృష్ణ మేడమిద కెళ్ళి పోరుంది. భానుమూర్తి ఎప్పుడు ఆ ఇంటికొచ్చినా ఎక్కువ కాలం వర్థనమ్మతోనే గడుపుతాడు. అలా ఆమెతో చాల చనువుగా మాట్లాడుతుంటే కొన్ని వందల మైళ్ళ దూరాన వున్న తన తల్లి ఒడిలో వున్నట్లే వుంటుందతనికి. తన తల్లిలాగే ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి కొసరి కొసరి తినిపించేది వర్థనమ్మ.

ఒకరోజు తన కొచ్చిన మార్కులు చూచుకొని పగలబడి నవ్వుకుంటున్న కృష్ణ భానుమూర్తి రాకతో టక్కున నవ్వాపేసి అతని వైపు భయంగా చూసింది. ఈ మార్కులు చూచి భానుమూర్తి కోప్పడ్తాడని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. అందుకే ముందుగానే భయాన్ని నటించి అతని కోపాన్ని ఒక్కమెట్టు తగ్గించాలనుకుందామె.
”అరె ! మార్కులిలా వచ్చాయెందుకు?” ఆమె చేతిలో పేపర్‌ లాక్కుని మార్కుల వైపొకమారు చూచి తలెత్తి కృష్ణ కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడతను.

అతని ఆశ్చర్యానికి నవ్వొచ్చింది కృష్ణకు.
”అరె! నీ కెందుకన్నన్ని మార్కులొస్తుంటారు !” అతని కళ్ళల్లో ఆశ్చర్యాన్ని అనుకరిస్తూ కొంటెగా అంది కృష్ణ.
అదేమీ పట్టించుకోలేదతను.
”చదువుతున్నానని చెప్పావు కదా కృష్ణా !” అతని గొంతు చాలా తగ్గు స్థారులో పలికింది.
ఈ మారు అతనిని ఆటపట్టించడానికి ధైర్యం లేకపోరుందామెకు.
”చదివాను భానూ” అంది వినీ విన్పించనట్టు.
”చదివితే ఇలా ఎందుకొచ్చారు మార్కులు? నువ్వు నన్ను మోసం చేస్తున్నావంతే” అతనలా అనుమానంగా ఆమె వైపు చూస్తుంటే విసుగ్గా అంది కృష్ణ-
”అబ్బ! చదివానని చెప్తే విన్పించుకోవుగా! అరునా నేను ‘ఎగ్జామ్‌’లో బాగా వ్రాసాను కూడా.”
”ఆ! బాగా వ్రాస్తే పేపర్లు కరెక్ట్‌ చేసే వాళ్ళకి నీ మిద కోపమా? అందుకని తక్కువ మార్కులు వేసారా?”
అతని కోపం చూస్తే ఆమెకు సరదా వేసింది.
”ఆ! అదే అయ్యుంటుంది భానూ. లేకపోతే కృష్ణకాంతి కేమిటి, ఇన్ని తక్కువ మార్కులు రావడమేమిటి?”
”చాల్లే మాట్లాడకు.”
గురువుగారి ఎదురుగా బుద్ధిమంతురాలైన శిష్యురాలిలా ముఖం పెట్టి నిశ్శబ్దంగా కూర్చుంది. చాలాసేపయ్యాక భాను అన్నాడు-
”పోనీ నీకు తెలియందేదో నన్నడగ కూడదా ! రోజూ ఇలా నీ ఎదురుగ్గా కూర్చుని ‘టైమ్‌ వేస్ట్‌’ చెయ్యకపోతే నిన్ను ‘పాస్‌’ చేరుంచాననే తృప్తి అన్నా నాకు మిగుల్తుంది కదా !”
కృష్ణ వెంటనే జవాబు చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా వుండి పోరుంది. కాసేపటికి తలెత్తి అంది-
”మరి క్లాసులో లెస్సన్స్‌ చెప్తూనే వున్నారు కదా !”
”నువ్వు వింటే కదా రావడానికి?”
”నీ దగ్గర మాత్రం వింటానని గ్యారంటీ ఏమిటి? వింటే మాత్రం వస్తుందని నమ్మకమేమిటి?” అసలు నీకు టైమెక్కడుందీ?”
”సాయంత్రం వచ్చాక వుండేది టైమ్‌ కాదా !” ఆ టైమ్‌లో ఏం చేయాలి?”
”నీ ‘స్టడీస్‌’కి ‘డిస్టర్బెన్స్‌’ లేద్దూ !”
ఇలాటి ఆమె సవాలక్ష అభ్యంతరాలేవీ అతని దగ్గర పని చెయ్యలేదు. ఆఖరికి ఆరోజు బలవంతంగా భానుమూర్తి ముందు కూర్చుని బుద్థిగా రోజుకో గంట పాఠం వినడానికి కృష్ణ అంగీకరించాల్సి వచ్చింది.

అబ్బ పిన్నీ ! ఎన్ని రోజులరుంది నిన్ను చూసి !” కారు దిగి లోపలికొస్తున్న ముప్ఫై సంవత్సరాల యువతిని ఆనందంగా పలకరించింది కృష్ణకాంతి. ఆమె ఆప్యాయంగా నవ్వి
”బాగున్నావా కృష్ణా” అంది సన్నటి స్వరాన.

ఓ! బ్రహ్మాండంగా వున్నాను పిన్నీ. అసలు ఆరోగ్యం ఎంత బాగుందంటే, రేపో మాపో ఈ అద్దె ఇంటి ద్వారబంధాలు స్వంత ఖర్చుతో వెడల్పు చేరుంచుకోకపోతే లాభం లేని – పరిస్థితుల్లో వుంది……నా గోలకేం గాని లోపలికెళ్దాంరా” అని ఒక్కడుగు ముందుకు వేసిన కృష్ణ వెనగ్గా వస్తున్న – అపరిచితమూ, మృదువూ అరున పాదాల శబ్దానికి వెనక్కు తిరిగింది. అపూర్వమైన కళాఖండాన్ని చూస్తున్నట్టు ఒక్కక్షణం సర్వం మరచి కళ్ళు విప్పార్చుకుని చూస్తూ వుండి పోరుంది. మరోక్షణానికి తేరుకుని కళాఖండమని పొరపాటుపడిన ఆ అమ్మారుని లోపలికి సాదరంగా ఆహ్వానించింది. పిన్ని లోపలకెళ్ళిపోతే బెరుగ్గా దిక్కులు చూస్తున్న ఆమెను చెర్యు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి లోపలికి కేక వేసింది.
”అక్కా చెల్లెళ్ళకు వంటింట్లో కబుర్లేసుకుంటే గాని, అవి ఒంట బట్టవు గాబోలు.”

ఐదు నిముషాల తర్వాత హాల్లో అడుగుబెట్టిన ఆ అక్కాచెల్లెళ్ళ కళ్ళల్లో చాలా కాలం తర్వాత ఒకరి నొకరు చూచుకున్నామన్న తృప్తి సృష్టంగా కన్పిస్తోంది. అక్కడికి వస్తూనే వర్థనమ్మ ఆ అమ్మారుని పలకరించింది.

”అమ్మావాళ్ళు అంతా బాగున్నారా అమ్మా!”
బాగున్నారన్నట్టు చాలా సున్నితంగా తల వూపిందా అమ్మారు.
కూతురి ప్రశ్నార్థకపు చూపులకు జవాబుగా అంది ఆమె మరలా!
”ఏమిటే అలా చూస్తావు? ఆ అమ్మారు తెలీదూ నీకు? మి పిన్ని పెద్దమామ కూతురు. పేరు అరుణనుకుంటా. కదమ్మా?”
అవునన్నట్లు కనురెప్పలతో జవాబిచ్చిందామె.
”నాకెలా తెలుస్తుందేమిటి? అసలీ పిన్నికి వాళ్ళక్కను చూస్తే చాలు ప్రపంచాన్నంతా మర్చిపోతుంది. చుట్టాన్ని తీసుకొచ్చి నట్టింట్లో వదిలేసి, వంటింట్లో దూరింది.”
కృష్ణ మాటల్లో తన రాక వాళ్ళ కిబ్బందిగా వున్నట్లు స్ఫురించి చిన్న బుచ్చుకుంది అరుణ.

”ఏమిటి మరీ నీ అఘారుత్యం ! ఎన్ని రోజులరుంది దాన్ని చూచి ! ఈ రోజుకైనా అక్క గుర్తు కొచ్చి వచ్చింది అది.” అని ప్రేమగా చెల్లెలి వైపు చూసిందామె. ఆమెకు చెల్లెలు నిర్మలకు ఇరవై సంవత్సరాల తేడా వుంది. వీళ్ళిద్దరి మధ్య నలుగురు మగపిల్లలున్నారు.మరో నాలుగు గర్భాలు పోయారు. రెండు గర్భశోకాలు కూడా వర్థనమ్మ తల్లి ఈ మధ్యకాలంలో భరించింది. వర్థనమ్మకు పిల్లలు కలగలేదని అందరూ బాధపడ్తున్న కాలంలో, నిర్మల గర్భాన పడినందుకు సిగ్గుతో చితికిపోరుంది వర్థనమ్మ తల్లి. పుట్టడం చెల్లెలిగానే పుట్టినా పెరగడం కూతురుగా వర్థనమ్మ చేతుల్లోనే పెరిగింది నిర్మల. ఆ తర్వాత పెళ్ళరుపోరు దూరం వెళ్ళిపోయాక రాకపోకలు తగ్గినా మమకారాలు మాత్రం చెక్కు చెదరలేదు.

”అదేమిటి మరిది రాలేదా?” అప్పుడే గుర్తు వచ్చినట్టు అడిగింది వర్థనమ్మ.
”వచ్చారక్కా. మమ్మల్ని దింపేసి వెళ్ళారు. ఇప్పుడే వస్తానని చెప్పమన్నారు.”
కృష్ణ అరుణను మాటల్లోకి దింపాలని చూచింది గాని, ఆమె బెరుగ్గా చూస్తూ ముక్తసరిగా జవాబివ్వడంతో, లేచి నిల్చుంటూ అంది-

”రండి అలసిపోరునట్లున్నారు. బాత్‌ చేసాక మేడమిదికెళ్దాము. చల్లగా వుంటుందక్కడ.
ఆమె సుతారంగా లేచి భూమికి దెబ్బ తగుల్తుందేమోనన్నట్లుగా మృదువుగా అడుగులు వేస్తూ కృష్ణ ననుసరించింది.
మేడమిద చల్లగాలిలో కూర్చున్నాక అడిగింది కృష్ణ-
”ఏం చదువుతున్నారు?”
”ఇంటర్‌” అని ”మిరూ?” అని ఆగిపోరుంది.

”నా పేరు కృష్ణకాంతి. సెకెండ్‌ ఇయర్‌ బి.ఏ. చేస్తున్నాను. పాస్‌ అవుతాననేదే సందేహం” అని నవ్వింది కృష్ణ. ఆమె తిరిగి నవ్వలేదు. అందమైన ఆ అమ్మారు నవ్వితే ఇంకెంత అందంగా వుంటుందో!” అనుకుంది మనసులో కృష్ణ.
”వీళ్ళలా ఒకటీ అరా మాట్లాడుకుంటూ వుండగా క్రింద హాలులో అక్కాచెల్లెళ్ళు తెగ కబుర్లు చెప్పేసుకుంటున్నారు.

”నిర్మల భర్త ప్రసాదరావు డివిజనల్‌ ఇంజినీరుగా సీలేరు డామ్‌’ లో పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు అక్కడే సూపరింటెండెంట్‌ ఇంజినీరు. కాపురం విశాఖపట్టణంలో గవర్నమెంటు బంగళాలో. ప్రసాదరావు స్నేహితుడి పెళ్ళికి హైదరాబాద్‌ వస్తుంటే అక్కను చూడాలనే ఆరాటం ఆమెను కూడా ఇక్కడకు తీసుకొచ్చింది. తిరుగు ప్రయాణం మర్నాడే. చెల్లెలు రేపే వెళ్ళిపోతుందనే నిరాశలో వుండగా ప్రసాదరావు తిరిగివచ్చాడు పెళ్ళి నుండి.

మధ్యాహ్నం భోజనాలయి, పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా భానుమూర్తి వచ్చాడు. వస్తూనే ఎదురుగుండా కన్పించిన వర్థనమ్మ గారి నుద్దేశించి అన్నాడు. ”రావుగారు లేరామ్మా” జవాబు చెప్పే లోపలే కృష్ణ అందుకుంది.
”నాన్నగారు లేరు గాని ఇంతమంది ఇక్కడున్నా, చూపు ఆనడం లేదేమిటి? కూర్చో కాస్త” అతను కూర్చుంటున్నపుడు అతని వెనక మరొక వ్యక్తి వున్నట్లు గుర్తించింది.

”మిరు భోంచేసి వచ్చుంటారనుకుంటా” అని సన్నగా నవ్వి, ఫ్రూట్స్‌ ట్రేని వాళ్ళ దగ్గరగా జరుపుతూ పరిచయాల్ని మొదలెట్టింది.

”ఈమె మా నిర్మల పిన్ని, ఆయన బాబాయ్‌. సీలేరులో డివిజనల్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఈమె మా బాబారు చెల్లెలు. పేరు అరుణ… ఈయన మిస్టర్‌ భానుమూర్తి యం.యస్‌.సి. ఫస్ట్‌రుయర్‌.” అందరికి చిరునవ్వుతో విష్‌ చేసాడు భానుమూర్తి. ప్రక్కనున్న వ్యక్తి వైపు తిరిగి అన్నాడు. ”నా తమ్ముడు కృష్ణ. ఇంటి పేరు చైతన్య. కాని వాణ్ణి అందరూ ‘చైతన్య అనే పిలుస్తారు.” అని ఒక్కక్షణం ఆగి కృష్ణ వైపు తిరిగి ”ఈమె కృష్ణకాంతి.” అని పరిచయం చేసాడు. చైతన్యకు, భానుమూర్తికి దూరపు చుట్టరికం, కానీ స్నేహం వాళ్ళను దగ్గర చేసింది. మాట్లాడుతున్నట్లుండే కళ్ళతో, విరిసీ విరియని చిరునవ్వుతో ‘నమస్తే’ అన్నాడు చైతన్య. తిరిగి చేతులు జోడిస్తూ అనుకుంది కృష్ణ.”

‘ఈ రోజేమిటి ఇంత అందమైన వ్యక్తుల్ని చూస్తున్నాను నేను !’ అని.
వాళ్ళందరిలో మొదట చైతన్య సంభాషణ ప్రారంభించాడు. ప్రసాదరావు వైపు చూస్తూ-
మిమ్మల్ని కలుసుకోవడం చాల సంతోషంగా వుంది. నాకు చాలా కాలంగా సీలేరు చింతలూరు ప్రాంతాల్ని చూడాలనివుంది. ఎప్పుడో ఒకరోజు తప్పకుండా వస్తాను. మిమ్మల్ని కలుస్తాను.
”తప్పకుండా” అని చిరునవ్వు నవ్వి ”మిరేమి అనుకోకపోతే మిరేం చేస్తుంటారు?” అన్నాడు ఇంగ్లీషులో ప్రసాదరావు.
”వైజాగ్‌లో సెకెండ్‌యర్‌ మెడిసిన్‌ చదువుతున్నాను.”

”అరుతే దగ్గరే. మిరు తప్పకుండ సీలేరు రావచ్చు. మిరు రావాలను కున్నప్పుడు నాకు ముందుగా ఫోన్‌ చెయ్యండి” అని ఫోన్‌ నంబరిస్తున్న బాబారు వైపు ఆసక్తిగా చూస్తూ అంది కృష్ణ-
”అదంత చూడదగ్గ స్థలమా బాబాయ్‌.!”
”అందమైన ప్రదేశాలు చూడాలని ‘ఇంటరెస్ట్‌’ వున్న వాళ్ళంతా చూడదగ్గ స్థలాలు అవి. ఇన్ని ఏళ్ళుగా అక్కడున్నాను కదా నేను ఎటువంటి సౌకర్యాలు లేని ఆ మారుమూల పల్లెలో నాకెప్పుడూ విసుగనిపించదు.”
”నాకూ చూడాలని వుంది బాబాయ్‌.”

”పోనీ రాకూడదే కృష్ణా మాతో! సెలవలే కదా !” అంది వెంటనే సంతోషంగా నిర్మల. వర్థనమ్మ కూతుర్ని., చెల్లెలితో పంపడానికి ఎలాటి అభ్యంతరమూ చెప్పలేదు కానీ నిర్మల తనను గూడా రమ్మని బలవంతం చేస్తే తను లేకపోతే ఆయనకు ఒక్కక్షణమైనా గడవదని చెప్పి నిరాకరించింది.
”నువ్వూ రాకూడదా భానూ!” స్నేహితుణ్ణి కూడా ఆహ్వానించింది కృష్ణ.

”అంత దూరం ఇప్పుడెందుకులే, నువ్వు వెళ్ళివచ్చి ఎలావుందో చెప్పు.”
”కారులో వెళ్ళడానికి దూరమేముంది ! మి తమ్ముడూ చూడాలని సరదా పడ్తున్నాడు కదా ! రండి వెళ్దాం జాలీగా” అనిబలపర్చాడు ప్రసాదరావు. అరుణ అందరిలో శ్రోత మాత్రమే అరుంది.
”ఏరా చైతన్యా వెళ్దామా?” అన్నాడు భానుమూర్తి సంశయంగా.
”వెళ్దాం” చాలా ఉత్సాహంగా జవాబిచ్చాడు చైతన్య.

”మరి హైదరాబాద్‌ చూడాలని వస్తివే! తీరా చూడకుండానే వెళ్ళిపోతావా?”
”మర్లా వస్తానులే నీతో”
”ఏం, ఈ సంవత్సరం ఎగ్జామ్స్‌ వ్రాయాలని లేదా?”
”పరీక్షలు ఎప్పుడూ వచ్చేవే! ఇటువంటి ఛాన్సులు అనుకున్నప్పుడల్లా రావు.” అని భానుమూర్తి తాలూకు అభ్యంతరాలన్నింటినీ కొట్టిపారేసాడు.
”నా పాలసీ కూడా అదే. మనం ఎన్ని మార్లు వెళ్తేమటుకు పరీక్షలు రావద్దంటాయా?” అని నవ్వబోరున కృష్ణ చురుకైన భానుమూర్తి చూపులకు ఆగిపోరుంది.

(ఇంకా ఉంది )

– డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29
Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో