నర్తన కేళి -24

శాస్త్రీయ నృత్యానికి అంతగా ఆదరణలేని రోజుల్లో భారతీయ నాట్య వైభవాన్ని ప్రపంచానికి చాతిని ఘనత ఆమెది . కనుమరుగవుతున్న యక్షగానానికి సరికొత్త ఊపిరిని ఇచ్చారు . నాట్యకళా కారిణిగా , పరిశోధకురాలిగా , ఆచార్యులుగా పలు రకాలుగా సేవలందించిన డా . ఉమా రామారావు తో ఈ నెల నర్తన కేళి ………

*నమస్కారం అమ్మా , మీ స్వస్థలం ?
నమస్కారం , మా సొంత ఊరు విశాఖ పట్నం .

*మీ తల్లిదండ్రుల గురించి ?
మా నాన్న గారి పేరు v .v కృష్ణా రావు , అమ్మ పేరు సౌభాగ్యం .

*నాట్యం నేర్చుకోవాలి అనిపించినప్పుడు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ?
1950 ప్రాంతంలో నాట్యానికి ఇప్పుడు ఉన్నంత ఆదరణ లేదు . నాకు బాల్యం నుంచి ఆసక్తి ఉంది . నా తల్లిదండ్రుల పోత్సాహంతో నేర్చుకోగలిగాను .

*మీ విద్యాభ్యాసం ఎంత వరుకు సాగింది ?
నేను ఎకనామిక్స్ లో ఎం .ఎ చేసాను .

*మీరు ఎవరి వద్ద భరత నాట్యం లో శిక్షణ పొందారు ?
పి .వి . నరసింహారావు గారి వద్ద , కె .ఎన్ . పక్కిరి స్వామి పిళ్ళై గారి వద్ద అభ్యసించాను .

*మరి కూచిపూడి నాట్యంలో ఎవరి వద్ద శిక్షణ పొందారు ?
వేదాంతం లక్ష్మి నారాయణ , c .r . ఆచార్యవద్ద కూచిపూడిలో శిక్షణ పొందాను .

*ఆలయ నాట్యం ఎవరి పర్యవేక్షణ లో అభ్యసించారు ?
పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి వద్ద నేర్చుకున్నాను .

*మీరు రూపొందించిన నృత్య రూపకాలు గురించి చెప్పండి ?
త్యాగరాజు రచించిన నౌకా చరిత్ర , అన్నమయ్య రాసిన అలిమేలు మంగ విలాసం , నారాయణ తీర్ధులు రాసిన సాధ్వి రుక్మిణి , షాహాజి రాసిన పల్లకి సేవా ప్రబంధం , , తెలుగు వెలుగులు , విశ్వదీయం , హర విలాసం .

*తెలుగు వెలుగు నృత్య రూపకం గురించి చెప్పండి ?
మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ నందమూరు తారక రామారావు గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు టాంక్ బండ్ మీద తెలుగు తల్లి విగ్రహం ఆవిష్కరణకు తెలుగు వెలుగులు చేసాము .

*స్వర రాగ నర్తనం నృత్య రూపకం ఏ అంశానికి సంబంధించినది ?
స్వరాలు అన్ని పాడుతుండగా ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ముద్ర తో ప్రదర్శించాము . విశ్వంభర లోని కొన్ని రాగాలను తీసుకుని చేయడం జరిగింది .

*మీ పి .హెచ్ .డి పరిశోధన దేశంలోనే యక్షగానలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి కదా మీరు? మీ పరిశోధన గురించి ?
అవునమ్మా , “షాహాజి రాజు యక్షగాన ప్రబంధాలు” అనేది నా అంశం . ఆయన రాసిన 22 యక్షగానాలపై పరిశోధన చేసాను . దానికి స్వర్ణ పతకం కూడా వచ్చింది .

*వీరలక్ష్మి విలాస వైభవం యక్షగానం గురించి చెప్పండి ?
తరిగొండ వెంగమాంబ రచించిన 18 గ్రంధాలలో శ్రీ వెంకటేశ్వ స్వామి అవతార కథా ఘట్టాలను తీసుకుని ఈ గ్రంధాన్ని రాసాను .

*మీరు అందుకున్న పురస్కారాలు ?
2004 లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సంగీత నాటక అకాడమి అవార్డు , పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళా నీరాజనం , దక్షిణ అమెరికా అన్నమా చార్య ప్రాజెక్టు వారి నుంచి శ్రీ కళా పూర్ణ , కేంద్ర ప్రభుత్వం  నుంచి సీనియర్ ఫెలోషిప్ అందుకున్నాను .

*మా విహంగ చదువరులకు మీరిచ్చే సలహా ?
నాట్యం ,  సంగీతం వంటి కళలు కొంత కాలం నేర్చుకుని వదిలేస్తున్నారు . అలా కాకుండా మన పిల్లలకి బాల్యం నుంచి వీటిలో శిక్షణ ఇస్తే పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు . ఈ రోజుల్లో ఐ ఐ టి లో నాట్యం , సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు . విద్యార్ధుల సమగ్ర వికాసానికి కళలు అవసరం .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

 

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=13226#sthash.DJXa3yJf.dpuf

ముఖాముఖి, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో