సంపాదకీయం


unnamed (1)HIV /ఎయిడ్స్ సోకిందనగానే ఒకప్పుడు మరణం అతి సమీపంలో ఉందనే భావనలో సమాజం ఉండేది . HIV బాధితుల పట్ల అతిహినంగా ప్రవర్తించడం , సాంఘిక బహిష్కరణ గురి చేయటం జరుగుతూ ఉండేది . కాని క్రమంగా ఈ వ్యాధి ప్రజల్లో అవగాహన పెరిగింది . ఇదంతా సాధించడానికి దాదాపుగా ఒక 25 ఏళ్ల కాలం పట్టిందనే చెప్పుకోవాలి . ఈ కృషికి కారణం స్వచ్చంద సేవా సంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి సంస్థ . ఈ సంస్థ తరుపున C.పార్ధసారధి సెక్రటరీ చేసిన కృషి , వారి సిబ్బంది సమిష్టి కృషి వల్ల ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన పెరిగింది . HIV రోగుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు వారికి అందించాల్సిన చేయూత , నైతిక మద్దతు ఏమిటో అవగతమయ్యాయి .

HIV ఒక పెద్ద సమస్యకాదు అని దీన్ని నియంత్రించొచ్చని భావన ప్రజల్లో కలిగింది . అంతేకాకుండా HIV సోకిన వారికి సైతం తాము కూడా మిగతా వారిలాగే జీవితాన్ని గడప వచ్చు అనే భరోసా కలిగింది . తమ పనులు తాము చేసుకుంటూనే తమ తోటి HIV రోగులకు కౌన్సలింగ్ కార్యక్రమాలను నిర్వహించే స్థాయికి ఉఎ\\ఎదగడం ఈ సంస్థల కృషి ఫలితమనే చెప్పవచ్చు . ఈ నేపథ్యంలో 20 1 3 HLFPPT (Hindustan Latex Family Planing Promatoin Trust ) సంస్థలు కలిసి సాహితీ సమరోహణం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది .

ఈ  కార్యక్రమాన్ని స్త్రీల కోసం , రచయిత్రులు , కవియిత్రుల కోసమే ఉద్దేశించబడింది . స్త్రీల కోసమే ఎందుకు అనే ప్రశ్నకు IAS పార్ధసారధి గారు ఇలా అంటారు “ సాంస్కృతిక వారసత్వం అందజేసే గొప్ప లక్షణం స్త్రీలలోనే ఉంది . ఏదైనా ఒక జ్ఞానాన్ని ఒక స్త్రీకి అందిస్తే అది కేవలం ఆమెకు మాత్రమే కాక , ఆమె కుటుంబానికి , సంతానానికి , ఆమె తర్వాత తరానికి కూడా ఉపయోగ పడుతుంది “ అంటారు . మహిళల బాధల్ని మహిళలలు అందులోను రచయిత్రులు , కవియిత్రులే పూర్తిగా అర్ధం చేసుకోగలిగి వారి గురించి తమ రచనల్లో లోకానికి చాటి చెప్పగలరు అనే భావనతో రచయిత్రుల కోసం నిర్వహించిన ఈ వర్క్ షాప్ కి ఫలితం “ ఆశాదీపం “ అనే 5 9 కథల సంకలనం .
ఆంద్ర దేశం నలుమూల నుంచి రచయిత్రులను ఆహ్వానించి HIV బాధితుల అనుభవాలను వరి చేత చెప్పించి , ఆ స్ఫూర్తి ద్వారా ఎంతో మంది రచయిత్రుల మెదళ్ల కు పదును పెట్టారు . ఈ పుస్తకంలో రచయిత్రులంతా తమ తమ ఆలోచనల్ని , వారి అవగాహనని తమ సొంత ధోరణిలో కథలుగా , కవితలుగా ప్రకటించారు .70 కవితలతో వచ్చిన ‘చిగురంత ఆశ’ ,, ‘ఆశా దీపం’ కథా సంకలనంలోని 59 కథలు , 59 కోణాలను ఎత్తి చూపించాయి

           unnamedఒకే అంశం పై ఇంతమంది రచయిత్రులు స్పందించిన రాసిన సందర్భం ఇదొక్కటే కావటం వల్ల ఈ రెండు సంకలనాలు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాయి. . ఈ పుస్తకాన్ని అచ్చు వేసే బాధ్యత HLFPPT సంస్థ నెత్తికి ఎత్తుకుంది . అందమైన ముఖ చిత్రం , ఛాయా చిత్రాలతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకాలు చదువరులకే కాకుండా HIV బాధితులకు కూడా కొత్త్ర ఆశగా ఒక “ఆశా దీపం “ వెలిగించిందని చెప్పుకోవాలి .ఆ కార్య క్రమం మొదటి నుంచి , పుస్తకం చదువరుల చేతికి అందే వరకు బాధ్యతలను స్వీకరించి , సంపాదకత్వం వహించిన అయినం పూడి శ్రీలక్ష్మి , మామిడి హరికృష్ణ , మమతా రఘు వీర్ లను ప్రత్యేకంగా అభినందించాలి .

 

 – హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో